• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవ‌న భాష్యం

III. భాషాంశాలు

పదజాలం
1. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
మబ్బు: మొగులు, మేఘం
గుండె: హృదయం, డెందము
శిరసు: తల, మస్తకం

 

2. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ముసరడం: ఆకాశంలో మేఘాలు ముసరడంతో ఉరుములు మొదలయ్యాయి.
జంకని అడుగులు: విజయం సాధించాలంటే జంకని అడుగులు ఉండాలని గుర్తుంచుకోవాలి.
ఎడారి దిబ్బలు: అగస్త్యుడు కాశీలోని ఎడారి దిబ్బల లాంటి వాటిపైన బోటనవేలిపై నిలబడి తపస్సు చేశాడు.
చెరగని త్యాగం: చెరగని త్యాగం చేసిన గాంధీజీ జాతిపిత అయ్యారు.

 

వ్యాకరణాంశాలు


1. కింది పదాలు కలిపి, సంధిని గుర్తించి రాయండి.
అ) నీరు + అవుతుంది = నీరవుతుంది (ఉత్వ సంధి)
   
  సూత్రం: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం.
ఆ) ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన (ఉత్వ సంధి)
     
సూత్రం: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం.
ఇ) పేరు + అవుతుంది = పేరవుతుంది (ఉత్వ సంధి)
 
    సూత్రం: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం.

 

2. కింది పంక్తుల్లోని సమాస పదాలు గుర్తించి, విగ్రహవాక్యలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.
అ) ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
జ: ఎడారి దిబ్బలు - ఎడారిలో దిబ్బలు (షష్ఠీ తత్పురుష సమాసం)
ఆ) ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది.
జ: ఇసుక గుండెలు - ఇసుక యొక్క గుండెలు (షష్ఠీ తత్పురుష సమాసం)

 

3. కిందివాటిని చదివి ఏ అలంకారాలో గుర్తించండి.
అ) నీకు వంద వందనాలు
జ: పై వాక్యంలో ఛేకానుప్రాస అలంకారం ఉంది. ఒక వాక్యంలో ఒక పదం అర్థ భేదంతో వెనువెంటనే వస్తే ఛేకానుప్రాస అలంకారం అంటారు. పై వాక్యాన్ని గమనిస్తే వంద అనే పదం వెంటవెంటనే అర్థభేదంతో వచ్చింది.

 

ఆ) తెలుగు జాతికి అభ్యుదయం
      నవ భారతికే నవోదయం
      భావిపౌరులం మనం మనం
      భారత జనులకు జయం జయం

జ: ఈ కవితలో అంత్యానుప్రాస అలంకారం ఉంది. వాక్యాంతంలో లేదా పాదాంతంలో ఒకే అక్షరం మిగిలిన వాక్యాంతంలో లేదా పాదాంతంలో పునరావృతం అయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. పై వాక్యాలను గమనిస్తే అభ్యుదయం, నవోదయం, మనం, జయంలను చూడవచ్చు.

 

ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్
జ: పైవాక్యంలో వృత్యాను ప్రాస అలంకారం ఉంది.
         ఒక వాక్యంలో ఒక హల్లు అనేకసార్లు పునరావృతమైతే 'వృత్యానుప్రాస అలంకారం అంటారు. పై వాక్యంలో జ అనే హల్లు మళ్లీ మళ్లీ వచ్చింది.

 

ఈ) అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.
జ: పై వాక్యంలో రూపక అలంకారం ఉంది. ఉపమేయ ఉపమానాలకు భేదం ఉన్నా లేనట్లు చెబితే దాన్ని రూపక అలంకారం అంటారు. అజ్ఞానం అనే ఉపమేయానికి అంధకారం అనే ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెప్పారు. కాబట్టి రూపక అలంకారంగా పైవాక్యం ఉంది.

 


రచయిత: జి. అంజాగౌడ్

 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం