• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోలకొండ పట్టణము

భాషాంశాలు

 పదజాలం
1. కిందివాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
అ) పుట్టినిల్లు
జ: సంస్కృతి, సంప్రదాయలకు పుట్టినిల్లు మనదేశం.
ఆ) పాటుపడటం
జ:
ఎంతోమంది పాటుపడటం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
ఇ) పీడవదలడం
జ:
నిరక్షరాస్యత అనే పీడ వదిలితేనే దేశఖ్యాతి రెట్టింపు అవుతుంది.
ఈ) తలదాచుకోవడం
జ: బంగ్లాదేశ్ శరణార్థులు భారత్‌లో తలదాచుకున్నారు.

 

2. కిందిపదాలను వివరించి రాయండి.
అ) జలాశయం: జలం/జలాలు నిల్వ ఉండే చోటును 'జలాశయం' అంటారు. ఇవి ప్రజానీకానికి జీవనాధారాలు.
ఆ)
అగ్రహారం: బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు, భూములను అగ్రహారం అంటారు. అగ్రహారాలపై ఆ బ్రాహ్మణ పండితులకే సర్వహక్కులు ఉంటాయి.
ఇ)
బంజారా దర్వాజా: బంజారాలు అనే లంబాడీలు ధాన్యం, ఉప్పు లాంటివి గోలకొండ పట్టణంలోని ఒక ప్రవేశ ద్వారం ద్వారా తెస్తుండేవారు. ఈ ద్వారానికి 'బంజారా దర్వాజా' అని పేరు వచ్చింది.
ఈ)
ద్రాక్షాసవము: ద్రాక్షపండ్ల నుంచి తీసిన రసాన్ని 'ద్రాక్షాసవము' అంటారు. గోలకొండ పట్టణంలో దీన్ని తయారుచేసి తాగేవారు.
 

వ్యాకరణాంశాలు


1) కింది వాక్యాల్లోని సంధులను విడదీసి అవి ఏ సంధులో రాయండి.
అ) పండగ దినాల్లో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి.
జ: దేవాలయాలు: దేవ + ఆలయాలు (సవర్ణదీర్ఘ సంధి)
సమన్వయం: పూర్వపదంలో 'అ' పరపదంలో 'ఆ' కు పరమై 'ఆ' గా మారి దీర్ఘంగా(వా) వచ్చింది.
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది.

 

ఆ) మధురలోని రమ్యోద్యానములు చూపరుల మనసులను ఆకట్టుకుంటాయి.
జ: రమ్యోద్యానములు - రమ్య + ఉద్యానములు (గుణసంధి)
సూత్రం: 'అ' కారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే క్రమంగా ఏ, వో, అర్‌లు ఆదేశంగా వస్తాయి.
సమన్వయం: పూర్వపదంలో (రమ్య) 'అ' కారానికి పరపదంలో 'ఉ' పరమైనపుడు 'ఓ'(రమ్యో) ఆదేశంగా వచ్చింది.

 

ఇ) ఛత్రపతి శివాజీ అశ్వారూఢుడు అయి శత్రువులను సంహరించాడు.
జ: అశ్వారూఢుడు: అశ్వ + ఆరూఢుడు (సవర్ణదీర్ఘసంధి)
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది.
సమన్వయం: పూర్వపద్వంలోని 'అ' (అశ్వ) పరపదంలోని 'ఆ' పరమై (అశ్వా) దీర్ఘంగా మారింది.

 

ఈ) రాజాజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరుపరు.
జ: రాజాజ్ఞ - రాజ + ఆజ్ఞ (సవర్ణదీర్ఘసంధి)
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది.
సమన్వయం: పూర్వపదంలోని 'అ'(రాజ)కు పరపదంలో 'ఆ' పరమై (రాజా) దీర్ఘంగా మారింది.

 

2. కింది సమాస పదాలను, వాటి విగ్రహవాక్యాలను, వాటి ద్వారా కలిగే అర్థ స్పురణను పరిశీలించండి.
అ) ఆజానుబాహుడు - జానువుల వరకు బాహువులు గలవాడు
ఆ) ముక్కంటి - మూడు కన్నులు గలవాడు
ఇ) గరుడ వాహనుడు - గరుడిని వాహనంగా గలవాడు
ఈ) చతుర్ముఖుడు - నాలుగు ముఖాలు ఉన్నవాడు
ఉ) పద్మాక్షి - పద్మం లాంటి కన్నులు ఉన్నది.
పై పదాల్లో మొదటి పదానికి లేదా రెండో పదానికి ప్రాధాన్యం లేదు. రెండు పదాలు మరోపదం అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి. ఇలా మరో పదం అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని 'బహవ్రీహి సమాసం' అంటారు.
                                                           
   ''అన్యపదార్థ ప్రధానం బహువ్రీహి"
ఉదా: 'చక్రపాణి' అనే సమాస పదంలో 'చక్రం' అనే పదానికి ప్రాధాన్యం లేదు. పాణి(చేయి) అనే పదానికి కూడా ప్రాధాన్యం లేదు. చక్రం పాణియందు కలిగిన వానికి ప్రాధాన్యం ఉంది. ఇలా సమాసంలో పదాల ద్వారా వచ్చే మరో పదం అర్థానికి ప్రాధాన్యం ఉంది. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం.

 

3. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి, సమాసాలు రాయండి.
ఉదా: యయాతి చరిత్ర - యయాతి యొక్క చరిత్ర - షష్ఠీ తత్పురుష సమాసం.


 

4) కింది వాక్యాలను వ్యవహార భాషలోకి మార్చండి.
ఉదా:
 పట్టణం అలంకారముగా నుండుటకు అందరును ఉత్సాహముతో పాటుపడిరి
జ: పట్టణం అలంకారంగా ఉండటానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. (వ్యవహారం)
అ) ఈ మందిరము నందే పారశీకపు రాయబారికిని, అతని అనుచర వర్గమునకును బస ఏర్పాటు చేసిరి.
జ: ఈ మందిరంలో పారశీక రాయబారికి, అతడి అనుచర వర్గానికీ బస ఏర్పాటు చేశారు.
ఆ) నీటి కాలువలు, జలాశయములు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను.
జ: నీటి కాలువలూ, జలాశయాలూ, జలపాతాలూ ఆశ్చర్యం కలిగిస్తుండేవి.
ఇ) పెద్దఅధికారుల యొక్కయు, మందిరములన్నియు లోపలికోటలో నుండుచుండును.
జ: పెద్ద అధికారుల మందిరాలన్నీ లోపలి కోటలో ఉన్నాయి.
ఈ) వజ్రములకు గోలకొండ పుట్టినిల్లే గదా!
జ: ఈ వజ్రాలకు గోల్కొండ పుట్టిల్లే కదా!
ఉ) పట్టణములోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును.
జ: పట్టణంలోకి సరుకంతా బంజారా దర్వాజా నుంచే వస్తుండేది.

 


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌