• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భిక్ష

భాషాంశాలు 

పదజాలం 
1. కిందివాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.

పర్యాయ పదాలు
1) ద్వాఃకవాటం: ద్వారబంధం, తలుపు
2) వనిత: మహిళ, స్త్రీ, పడతి

1) పసిడి = బంగారం, కాంచనం, పుత్తడి

1) పారాశర్యుండు = వ్యాసుడు, బాదరాయణుడు

1) ఆగ్రహం = కోపం, క్రోధం, అలుక


1) అహిమకరుడు = సూర్యుడు, భానుడు, రవి
 

2. కింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి.
 

అ) ద్వాఃకవాటము = ద్వారబంధం (తలుపు)
సొంత వాక్యం: నా మిత్రుడు మాధవ్ అందమైన ద్వాఃకవాటములను తన ఇంటికి బిగించుకున్నాడు.
 

ఆ) వీక్షించు = చూడటం
సొంత వాక్యం: నేడు అందరూ అంతర్జాలాన్ని వీక్షించుచున్నారు.
 

ఇ) అంగన = మహిళ
సొంత వాక్యం: నేడు అంగనలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలి
 

ఈ) మచ్చెకంటి = మీనాక్షి, (చేపల లాంటి కన్నులున్న స్త్రీ)
సొంత వాక్యం: మచ్చెకంటి స్త్రీలు అరుదుగా కనిపిస్తుంటారు.
 

ఉ) కుందాడుట = బాధపెట్టినట్లు మాట్లాడటం
సొంత వాక్యం: ఇతరులను కుందాడుట సరికాదు.
 

ఊ) భుక్తిశాల = భోజనశాల
సొంత వాక్యం: తిరుమలలోని భుక్తిశాలలో ఆహారం రుచిగా ఉంటుంది.
 

3. కింది వాక్యాల్లోని నానార్థాలను గుర్తించి రాయండి.
 

అ) వీడు ఏ వీడువాడోగాని దుష్కార్యమును వీడుచున్నాడు.
నానార్థాలు
వీడు = ఇతడు, పట్టణం, వదలడం
'వీడు' అనే పదాన్ని పైవాక్యంలో మూడువిధాలుగా ఉపయోగించారు.
 

ఆ) దేశభాషలందు తెలుగు లెస్సయని రాయలు లెస్సగా బలికెను.
జ: 'లెస్స' అనే పదాన్ని పైవాక్యంలో రెండు విధాలుగా వాడారు.
నానార్థాలు: లెస్స = శ్రేష్ఠం, యుక్తం
 

ఇ) గురుడి మాటలు విన్న ఇంద్రుడు కర్ణుడి గురుడైన సూర్యుడి గలిసి గురుయోజన చేయసాగాడు.
జ: 'గురు' అనే పదాన్ని పైవాక్యంలో మూడు విధాలుగా వాడారు.
నానార్థాలు: గురుడు = ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి
 

4. కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.
అ) విద్య                                                                           (ట)
క) విదియ       చ) విజ్జ                 ట) విద్దె              త) విధ్య
ఆ) భిక్షము                                                                      (త)
 క) బత్తెము      చ) బచ్చ               ట) బిచ్చ            త) బిచ్చము
ఇ) యాత్ర                                                                       (చ)
 క) యతర       చ) జాతర              ట) జైత్ర              త) మత్తము
ఈ) మత్స్యము                                                               (ట)
 క) మచ్ఛీ        చ) మత్తియము     ట) మచ్చెము     త) మత్తము
ఉ) రత్నము                                                                   (క)
క) రతనము    చ) రచ్చ               ట) రచ్చము        త) రత్తము
ఊ) పంక్తి                                                                      (ట)
క) పంతులు      చ) పత్తి              ట) బంతి              త) పంకు
 

వ్యాకరణాంశాలు
 

1. కింది పాదాల్లోని సంధులను గుర్తించి సంధి సూత్రాలను రాయండి.
అ)
పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా!
జ: సంధులు
1) పుణ్య + అంగన   పుణ్యాంగన (సవర్ణదీర్ఘసంధి)
సవర్ణదీర్ఘ సంధి సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.
2) ఇడదు + అయ్యె   ఇడదయ్యె (ఉత్వసంధి)
ఉత్వసంధి సూత్రం: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యంగా వస్తుంది.
3) యిడదయ్యెన్ + కటా   యిడదయ్యెఁగటా (సరళాదేశ సంధి)
సరళాదేశ సంధి సూత్రం: ధ్రుతము మీద పరుషాలు సరళాలుగా మారతాయి.

ఆ) కాశి, యివ్వీటిమీద నాగ్రహము దగునె
జ: పై వాక్యంలోని సంధులు
 

1) త్రికసంధి - ఇవ్వీటిమీద   ఈ + వీటిమీద
సూత్రం: * ఆ, ఈ, ఏ లను త్రికాలు అంటారు.
* త్రికం మీద అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
* ద్విరుక్తమైన హల్లుపరమైనప్పుడు దీర్ఘం హ్రస్వంగా మారుతుంది.
 

2) గసడదవాదేశ సంధి   ఆగ్రహము దగునె   ఆగ్రహము + తగునె
సూత్రం: ప్రథమ మీద పరుషాలు గసడదవలుగా మారతాయి.
 

3) ఉత్వసంధి   తగును + ఏ   తగునే
సూత్రం: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం.

ఇ) ఓ మునీశ్వర! వినవయ్య యున్నయూరు
జ: పైవాక్యంలోని సంధులు
1) సవర్ణదీర్ఘసంధి   మునీశ్వర   ముని + ఈశ్వర
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది.
2) ఉత్వసంధి - వినవయ్య  వినవు + అయ్య
సూత్రం: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం.
3) యడాగమ సంధి   ఉన్నయూరు   ఉన్న + ఊరు
సూత్రం: సంధిలేనిచోట అచ్చు కంటే పరమైన అచ్చు యడాగమం వస్తుంది.

2. కింది పద్యపాదాల్లో ఏయే ఛందాలున్నాయో గుర్తించి సమన్వయం చేయండి.

 

* పై పాదంలో 'న జ భ జ జ జ ర' అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇది 'చంపకమాల' కు చెందింది.
* యతి స్థానం 'ము' - 'ముం'నకు చెల్లింది. మొదటి అక్షరానికి 11వ అక్షరానికి యతి కుదిరింది.

 
* పై పాదంలో 'భ ర న భ భ ర వ' అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇది ఉత్పలమాలకు చెందింది.
* యతి స్థానం 'య్యా'కు పదో అక్షరం 'రా'కు చెల్లింది. 
* మొత్తం అక్షరాలు 20 ఉన్నాయి. 

 
* పై పాదంలో మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చింది. కాబట్టి ఇది 'ద్విపద'.
* యతి స్థానం మొదటి గణం 'వే' కు మూడో గణం మొదటి అక్షరం 'వి'కి చెల్లింది.
 

3. కింది వాక్యాలను చదవండి
అ)
శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు
   వీరులకు సాధ్యము కానిది లేదు కదా!
* పై వాక్యాల్లో ఒక విషయం మరొక విషయంతో సమర్థిస్తున్నట్లు ఉంది.
  దానిలో
   శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించడం - విశేష విషయం (జరిగిన విషయం)
   వీరులకు సాధ్యం కానిది లేదు కదా! - సామాన్య విషయం (అన్నింటికి వర్తించేది)
* పైన విశేష విషయమైన 'శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు'ను సామాన్య విషయమైన 'వీరులకు సాధ్యము కానిది లేదు కదా!'తో సమర్థించారు.
ఆ) గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు.
   పూవులతోపాటు దారాన్ని గూడ సిగనెక్కిస్తారు
* పై వాక్యాల్లో ఒక విషయం మరొక విషయంతో సమర్థిస్తున్నట్లు ఉంది.
  దానిలో
   గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు - సామాన్య విషయం (అన్నింటికి వర్తించేది) పూవులతోపాటు దారాన్ని గూడ సిగనెక్కిసాక్తరు - విశేష విషయం (జరిగిన విషయం కనిపించేది)
   పై వాక్యాల్లో సామాన్య విషయమైన 'గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు' ను విశేష విషయమైన 'పూవులతోపాటు దారాన్ని గూడ సిగనెక్కిస్తారు' తో సమర్థించారు.
 పైన తెలిపిన వాక్యాల్లో విశేష విషయాన్ని సామాన్య విషయంతో, సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించడం గమనించాం. అలా సమర్థించడాన్ని అర్థాంతరన్యాస అలంకారం అంటారు.

అర్థాంతరన్యాస అలంకారం
   విశేష విషయాన్ని సామాన్య విషయంతో లేదా సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించి చెప్పడాన్ని అర్థాంతరన్యాస అలంకారం అంటారు.

కింది లక్ష్యాలకు సమన్వయం రాయండి
 

అ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
   మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా!
జ: పై వాక్యాల్లో
ఒకటి -  హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు (విశేష విషయం)
రెండోది -  మహాత్ములకు సాధ్యంకానిది లేదు కదా! (సామాన్య విషయం)
  *  పై వాక్యాల్లో విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పారు. కాబట్టి 'అర్థాంతర న్యాస అలంకారం' వాటిలో ఉంది.

ఆ) మేఘుడంబుధికి పోయి జలంబు తెచ్చి ఇస్తాడు.
   లోకోపకర్తలకిది సహజగుణము.
జ: పై వాక్యాల్లో
మొదటిది - మేఘుడంబుధికి పోయి జలంబు తెచ్చి ఇస్తాడు. (విశేష విషయం)
రెండోది -  లోకోపకర్తలకిది సహజగుణము (సామాన్య విషయం)
* పై వాక్యాల్లో విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పారు. కాబట్టి 'అర్థాంతరన్యాస అలంకారం' వాటిలో ఉంది.
గమనిక: విశేష విషయం = జరిగిన విషయం, కంటికి కనిపించేది
   సామాన్య విషయం = లోకరీతిని తెలిపేది, కనిపించని స్వభావం

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం