• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భూమిక

III. భాషాంశాలు


పదజాలం
1. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
అ) రాజు ధ్యాస‌ అంతా క్రికెట్ ఆటపైనే ఉంది.
జ: ధ్యాస = దృష్టి
ఆ) ప్రజ్ఞ, మనోజ్ఞ ఇద్దరూ స‌ఖ్య‌త‌తో మెలుగుతారు.
జ: సఖ్యత = స్నేహం
ఇ)  హస్తవాసి చాలా మంచిది.
జ: వాస్తవాసి = చేతిగుణం
ఈ) తెలంగాణలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం  చెందింది.
జ: ప్రఖ్యాతి = ప్రసిద్ధి
ఉ) పూర్వ జమీందారుల  చర్చాగోష్టులు జరిగేవి.
జ: దేవీడీలు = భవంతులు

 

2) కింది పదాల గురించి వివరించి రాయండి.
అ) హృదయ సంస్కారం: ఏది మంచి, ఏది చెడు అనే ఇంగితంతో మంచివైపు ఆలోచనలు కలిగి ప్రవర్తించడాన్ని 'హృదయ సంస్కారం' అంటారు. జాలి, కరుణ, దయ, క్రమశిక్షణ, మంచి అనే గుణాలు కలిగి ఉంటాయి. హృదయ సంస్కారం కలిగినవారు కీర్తి పొందుతారు.
ఆ) సామాజిక పరిణామం: కాలం గడిచిన కొద్దీ మార్పులు అన్ని విషయాల్లో జరుగుతాయి. సమాజ స్థితిగతుల్లో మానవ, జీవన విధానాల్లో మార్పులు చేర్పులు జరగడాన్ని 'సామాజిక పరిణామం' అంటారు. కాలం ఉన్నంత వరకు పరిణామాలు జరుగుతూనే ఉంటాయి.
ఇ) భారతీయ సంస్కృతి: భారతీయ ఆచారాలు, శాస్త్రాలు, సంప్రదాయాలు, జీవన విధానం, ధర్మం, స్వతస్సిద్ధంగా ఈ భారతీయ భూమిలో గొప్పగా ఉన్నాయి. వీటన్నింటి సమ్మేళనమే 'భారతీయ సంస్కృతి.
ఈ) ఉన్నత శిఖరాలు: గొప్పదైన ఉన్నత స్థితిని చేరుకోవడాన్ని 'ఉన్నత శిఖరాలు' చేరుకోవడం అంటారు. ఎంతో కష్టపడి ఎవరికి అందని కీర్తిని సంపాదించడం ఉదాహరణగా చెప్పొచ్చు.

 

వ్యాకరణాంశాలు
 

1. కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి, సమాసాలు గుర్తించండి.
అ) దశకంఠుడు = దశ కంఠాలను గలవాడు - బహువ్రీహి సమాసం
ఆ) పీతాంబరుడు - పీతం అనే అంబరం గలవాడు - బహువ్రీహి సమాసం
ఇ) అరవిందానన - అరవిందం లాంటి ఆననం గలది - బహువ్రీహి సమాసం
ఈ) మృగనేత్ర - మృగం లాంటి నేత్రం గలది - బహువ్రీహి సమాసం
ఉ) చంచలాక్షి - చంచలములైన అక్షులు గలది - బహువ్రీహి సమాసం
ఊ) మానధనులు - మానమును ధనముగా గలవారు - బహువ్రీహి సమాసం
ఋ) రాజవదన - రాజు (చంద్రుడి) లాంటి వదనం గలది - బహువ్రీహి సమాసం
ౠ) నీరజభవుడు - నీరజం (పద్మం) పుట్టుక గలవాడు - బహువ్రీహి సమాసం

 

2. కింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి.
అ) ''హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది" అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు.
జ: హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు.
ఆ) ''తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి'' అని గూడూరి సీతారాం అన్నాడు.
జ: తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి అని గూడూరి సీతారం అన్నాడు
ఇ) ''చార్‌మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది'' అని డి.రామలింగం పేర్కొన్నాడు.
జ: చార్‌మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి. రామలింగం పేర్కొన్నాడు.

 

3. కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.
అ) పాకిస్థాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని 'తమస్' నవలలో చిత్రించాడు.
జ: పాకిస్థాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాని 'తమస్' నవలలో చిత్రింబపడ్డాయి.
ఆ) హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూలకు నెట్టివేశారు.
జ: హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూలకు నెట్టివేయబడింది.
ఇ) నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకరిగా కీర్తించారు.
జ: నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించబడ్డాడు.

 

 శ్లేషాలంకారం
కింది వాక్యాలను పరిశీలించండి.
అ) మిమ్ముమాధవుడు రక్షించుగాక!
అర్థం: 1) మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక!
      2) మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక!

 

ఆ) మానవ జీవనం సుకుమారం
అర్థం: 1) మా నవ (ఆధునిక) జీవనం సుకుమారమైంది.
      2) మానవ (మనిషి) జీవనం సుకుమారమైంది.
పై అర్థాలను గమనిస్తే ఒక వాక్యంలో రెండు అర్థాల వాక్యాలను తయారుచేశారు. ఒక శబ్దం రెండు వేర్వేరు అర్థాలను అందిస్తుంది. ఇలా విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దాన్ని 'శ్లేష' అలంకారం అంటారు.

లక్షణం: నానార్థాలను కలిగి ఉండే అలంకారమే శ్లేష.

 

కింది లక్ష్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.
1. రాజు కువలయానందకరుడు
జ: పై వాక్యంలో శ్లేష అలంకారం ఉంది.
సమన్వయం:
అర్థం: 1) రాజు (ప్రభువు) భూమిని ఆనందపరిచేవాడు.
      2) రాజు (చంద్రుడు) కలువలను ఆనందపరిచేవాడు.
* రాజు అనే పదానికి ప్రభువు, చంద్రుడు అనే అర్థాలు ఉన్నాయి.
* కువలయం అనే పదానికి భూమి, కలువ అనే అర్థాలు ఉన్నాయి. రెండు అర్థాల పదాలతో వాక్యాలు తయారయ్యాయి. కాబట్టి ఇది శ్లేష అలంకారం.

 

2. నీవేల వచ్చెదవు
జ: పై వాక్యంలో శ్లేష అలంకారం ఉంది.
అర్థం: 1) నీవు ఎలా వచ్చెదవు?
     2) నీవు ఏ వేల వచ్చెదవు?

సమన్వయం: నీవేల అనే పదంలో రెండు అర్థాలున్నాయి. ఎలా - ఏ వేల అనే అర్థాలతో వాక్యాలుగా తయారు చేశారు కాబట్టి ఇది శ్లేష అలంకారం.

 

అ) మా విడాకులు తెచ్చివ్వండి. .... శ్లేష అలంకారం ఉంది.
అర్థం: 1) మా విడాకులు తెచ్చివ్వండి.
     2) మావిడి ఆకులు తెచ్చివ్వండి.

సమన్వయం: మా విడాకులు అనే పదం రెండు అర్థాలతో ప్రయోగించినందున దీన్ని 'శ్లేష' అలంకారం అంటారు.

 

ఆ) వాడి కత్తి తీసుకోండి. - శ్లేష అలంకారం ఉంది
అర్థం: 1) వాడి (పదును) కత్తి తీసుకోండి.
      2) వాడి (ఎదుటి వ్యక్తి) కత్తి తీసుకోండి.

సమన్వయం: వాడి అనే పదాన్ని రెండు అర్థాలతో వాక్యాల్లో ప్రయోగించారు. అందువల్ల శ్లేష అలంకారం అయ్యింది.

 

ఇ) 1) ఆమె లత (మహిళ) పక్కన నిలుచున్నది - శ్లేష అలంకారం ఉంది.
   2) ఆమె లత (తీగ) పక్కన నిలుచున్నది

సమన్వయం: లత అనే పదం రెండు అర్థాలతో వాక్యాల్లో ప్రయోగించారు. అందువల్ల శ్లేష అలంకారం అయ్యింది.

 

ఈ) ఆవాన కోయిలను పూర్తిగా తడిపింది.
అర్థం: 1) ఆ వాన (వర్షం) కోయిలను పూర్తిగా తడిపింది.
     2) ఆ వానకోయిల (పాము)ను పూర్తిగా తడిపింది.

సమన్వయం: ఆ వానకోయిల అనే పదం రెండు అర్థాలతో ప్రయోగించడమైంది. కాబట్టి ఇది శ్లేష అలంకారం.

 


రచయిత: జి. అంజాగౌడ్
 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం