• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Personality Development

B Reading: Every success story is also a story of great failures
 

అభ్యసనా లక్ష్యాలు: మీరు ఈ సెక్షన్‌లో కిందివాటి గురించి తెలుసుకుంటారు.
     1. ఒడుదొడుకులు జీవితంలో సహజం.
     2. జీవితంలో కలిగే ఒడుదొడుకుల వల్ల వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని, నమ్మకాన్ని పొందుతారు.
     3. అపజయాలు విజయాలకు మెట్లు.

 

పాఠం సారాంశం
   శివ ఖేరా రాసిన You can win అనే పుస్తకం నుంచి కొద్ది భాగాన్ని ఈ పాఠంగా తీసుకున్నారు. ఇతడు రాసిన పుస్తకాలు స్వయం సహాయకమైనవి. విద్య, న్యాయం ద్వారానే స్వేచ్ఛను పొందుతాం. ప్రతి విజయం ఎన్నో అపజయాల మూలం. వైఫల్యం విజయానికి దారి. టామ్ వాట్సన్ చెప్పినట్లుగా విజయం సాధించాలంటే రెండింతలు వైఫల్యాలు ఎదుర్కోవాలి. ఎన్నో అపజయాలు పొంది, కార్యదీక్షతో కృషిచేసి విజయం సాధించిన వారి గురించి ఈ పాఠంలో తెలుసుకుంటారు.

 

అబ్రహం లింకన్
   అబ్రహం లింకన్ 21వ ఏట వ్యాపారంలో విఫలమయ్యారు. 22 ఏళ్లకు లెజిస్లేటివ్ రేస్‌లో, 24వ ఏట మళ్లీ వ్యాపారంలో, 26 ఏళ్లకు భార్యను కోల్పోయారు. 27 సంవత్సరాల వయసులో మానసికంగా కుంగిపోయారు. 34 సంవత్సరాల వయసులో కంగ్రెషనల్ రేస్‌లో, 45 సంవత్సరాల వయసులో సెనటోరియల్ రేస్‌లో పాల్గొన్నారు. 45 సంవత్సరాల వయసులో వైస్ ప్రెసిడెంట్ అవ్వడంలో విఫలమయ్యారు. చివరకు 52వ ఏట అమెరికా అధ్యక్షుడు అయ్యారు.

 

లీ డి ఫారెస్ట్
   లీ డి ఫారెస్ట్ ట్రయాడ్స్ ట్యూబ్‌ను కనుగొన్నారు. ఇతడిని జిల్లా న్యాయాధికారులు ప్రజలను మోసం చేస్తున్నట్లుగా అభియోగం (Transmit human voice across the atlantee) మోపి అవమాన పరిచారు.

 

Wright Brothers
   వీరిని గాలి కంటే బరువైన యంత్రం గాలిలో ఎలా ఎగురుతుందని 1903, డిసెంబరు 10న న్యూయార్క్ టైమ్స్ ప్రతికా సంపాదకులు అడిగారు. కానీ వీరు విమానాన్ని కనుక్కున్నారు.

 

కల్నల్ శాండర్స్
   కల్నల్ శాండర్స్ 65 ఏళ్ల వయసులో 100 డాలర్లతో తన తల్లి చేసిన వంటకాన్ని తయారు చేసి అమ్మేందుకు ప్రయత్నించాడు. 1000 కంటే ఎక్కువ గడపలు తిరిగిన తర్వాత ఆయనకు మొదటి ఆర్డర్ లభించింది. అదే నేటి ప్రసిద్ధ కేఎఫ్‌సీ.

 

వాల్ట్ డిస్నీ
   వాల్ట్ డిస్నీ చిత్రకారుడు. ప్రతికా సంపాదకులు ఇతడిని వ్యతిరేకించారు. ఒక రోజు చర్చి ఫాదర్ అతడితో కొన్ని చిత్రాలు వేయిస్తున్నారు. ఆ సమయంలోనే పీడిస్తున్న చిట్టెలుక అతడికి కనిపించింది. దాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. అదే తన ప్రధాన పాత్ర మిక్కీ మౌస్ అయ్యింది. విజయం సాధించిన వారు గొప్ప పనులు చేయరు, చిన్న విషయాలను గొప్పగా చేస్తారు.

 

థామస్ ఎడిసన్
   నాలుగేళ్ల వయసున్న పాక్షిక చెవిటి బాలుడి గురించి టీచర్ 'Your tommy is too stupid to learn' అని నోట్ రాసి అతడి జేబులో పెట్టి ఇంటికి పంపింది. ఆ విషయం తెలుసుకొని వాళ్ల అమ్మ ఇంటి వద్ద చదువు చెప్పడం ప్రారంభించింది. ఆ పాక్షిక చెవిటి బాలుడే విద్యుత్ బల్బును తయారు చేసిన థామస్ ఎడిసన్. ఈ బల్బు తయారీలో ఎడిసన్ పదివేల సార్లు విఫలం అయ్యారు.

 

హెన్రీ ఫోర్డ్
   హెన్రీ ఫోర్డ్ మొదట తయారు చేసిన కారులో రివర్స్ గేర్ పెట్టడం మరచిపోయారు. కానీ తర్వాత కార్ల కంపెనీనే స్థాపించాడు (ఫోర్డ్).

 

యంగ్ బెత్‌వెన్
   సంగీతంలో ప్రావీణ్యం లేదని భావించిన బెత్‌వెన్ తర్వాత (యంగ్‌బితోవెన్) ప్రపంచానికి మంచి సంగీతాన్ని అందించాడు.

 

సోక్రటీస్
   సోక్రటీస్‌ను 'విజయ రహస్యం ఏమిటి అని అడిగిన యువకుడిని నీటిలో ముంచాడు. ఆ యువకుడు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ దీర్ఘశ్వాస తీసుకున్నాడు. కానీ సోక్రటీస్ బలంగా నీటిలో ముంచాడు. నీవు బయటకు వచ్చేందుకు దీర్ఘశ్వాస విజయ రహస్యం అన్నాడు. చిన్న అగ్నికణం వేడిని ఇవ్వదు, అలాగే బలహీనమైన కోరిక విజయాన్ని సాధించదు. బలమైన కోరికే విజయ రహస్యం అని తేల్చి చెప్పాడు.
   Bounced back (phr.v) = Recoverd quickly after a defeat or a failure
   The driving force (idiom) = A person or a thing that motivates or directs some one
   Furning blue (idiom) = Becoming exhausted

Discourser Targeted
   1. Biographical sketch of thomas editon
   2. Prepare a speech on 'failures are the stepping stones to success.

 

Assignment
I. Complete the following passage choosing the right words from those given in the box.

 

                                  
 

Setbacks are inevitable in life. A Setback can act as a driving force and also teach us humility. In grief you will find courage and faith ........... (1) overcome the setback. We need to learn to become victors not victims. Fear and doubt short - circuit the mind. Ask yourself after evrey setback. What did I. ........... (2) from this experience? Only then you will be able to turn a ........... (3) block into a stepping stone. The motivation to succeed ........... (4) from the burning desire to acheive a purpose. Napoleon Hill wrote, "Whatever the mind of man can ........... (5) and believe the mind can achieve".
 

II. The following passage contains some errors in the sentences that are numbered. Edit the passage and write the changes you have made.
(1) As a young cartoonist (2) Walt Disney faced many rejections with newspaper editors, (3) which said he had no talent. One day a minister at a church hired him to draw some cartoons. (4) Disney was working out of a small mouse infested shed near the church. (5) Seeing after a small mouse, he was inspired.

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం