• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PERSONALITY DEVELOPMENT

C Reading : "I will do it"
 

అభ్యసనా లక్ష్యాలు:
మీరు ఈ సెక్షన్ చివరలో కిందివాటిని తెలుసుకుంటారు.
   1. 'I will do it' యొక్క థీమ్
   2. నారాయణ మూర్తి గురించి వివరంగా
   3. నారాయణ మూర్తి భారతీయ సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు అధిపతి ఎలా అయ్యాడు, ఆయన తీరు
   4. ఏ విలువలు నారాయణ మూర్తి విజయానికి తోడ్పడ్డాయి 
   5. ఇతరులకు అతడు ఒక మార్గదర్శిగా, స్ఫూర్తి ప్రదాతగా ఎలా ఎదిగాడు
ఈ పాఠాన్ని భారతీయ సాఫ్ట్‌వేర్ అధిపతి అయిన నారాయణ మూర్తి భార్య సుధామూర్తి వివరించారు. ఆమె కంప్యూటర్ ఇంజనీర్, పేరొందిన రచయిత, సంఘ సేవకురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్. అనాధాశ్రమాలను స్థాపించారు. ఎన్నో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌లను, గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. హార్‌వర్డ్ యూనివర్సిటీలో మూర్తి పేరు మీద 'క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా'ను స్థాపించారు. ప్రస్తుత పాఠ్యభాగాన్ని ఆమె రచించిన 'How I Taught my Grandmother to Read and Other Stories' నుంచి తీసుకున్నారు.

 

పాఠం సారాంశం
అతడు చురుకైన విద్యార్థి, తరగతిలో అందరి కంటే తెలివైనవాడు. సైన్స్ సిద్ధాంతాలను కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో గ్రహించేవాడు. సీనియర్ విద్యార్థులు కూడా సైన్స్‌లో ఏవైనా సందేహాలు వస్తే ఇతడిని అడిగి నివృత్తి చేసుకునేవారు.
  ఇతడి తండ్రి ఇంగ్లిషు భాషా పఠనంలో ప్రావీణ్యం ఉన్న ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు. ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలనేది అతడి కోరిక. ఆ సమయంలో మంచి పుస్తకాలు, ప్రత్యేక శిక్షణ అందుబాటులో లేవు.
   మైసూర్ చాముండేశ్వరి హిల్స్ దగ్గరలోని రాతి మండపం నీడలో ఐఐటీ చేయాలకునే వారందరూ కలిసి చదువుకునేవారు. వారికి ఇతడే మార్గదర్శి. ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ తండ్రి ఐఐటీలో చదివించే స్తోమత లేదన్నాడు. పెళ్లి చేయాల్సిన అయిదుగురు కూతుళ్లు, చదివించాల్సిన ముగ్గురు కుమారులు ఉన్నారని, నా ఒక్కడి వేతనం సరిపోదని అన్నాడు.
   అతడికి ఐఐటీలో చదవాలనే కోరిక కలగానే మిగిలింది. అయినా ప్రశాంతంగా, నిబ్బరంగా ఉన్నాడు. వ్యక్తి భవితను నిర్ణయించేది ఆ వ్యక్తే కానీ కాలేజి కాదని గుర్తించాడు. నిజానికి అతడి ఆలోచన భగవద్గీత తత్వాన్ని ప్రతిధ్వనించింది. ఇంకా అతడు శ్రమించడం కొనసాగిస్తూనే ఉన్నాడు. పనిపై ప్రేమతో, నిరంతర శ్రమతో భారతీయ సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు ఆద్యుడిగా ఎదిగాడు. నిరాడంబరతకు, నాణ్యతకు, మంచితనానికి, మానవ సేవకు చిహ్నంగా, చిరునామాగా మారాడు. మేధోశక్తితో విలువల పట్ల విశ్వాసంతో ముందుకు సాగడమే ఆయన సిద్ధాంతం. ప్రపంచానికి ఆయన నిరూపించి చూపిన గొప్ప సత్యం చట్ట బద్ధంగా, నిజాయతీగా సంపదను సమకూర్చుకోవడం. ఆయనే నాగావర రామారావు నారాయణ మూర్తి. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ స్థాపకులు.

 

Meanings
set in (phr.v) = begin/start
avid (adj) = keen
ethically (adv.) = morally
pioneer = a person who is the first to study and develop an area of knowledge

 

Expected discourses
I. You have read the lesson "I will do it", when the IIT entrance results came Murthy met his father and he said I cannot afford expenses at IIT.
Now imagine you are Narayana Murthy and how you convince your father write a possible conversation.
II. In the lesson "I will do it", you have read about Mr. Narayana Murthy, who is pioneer of India's software industry.
Now think that you are news reporter and got an opportunity to interview him.
Now write possible interview between you and Mr. Murthy.
III. Narayana Murthy passed IIT entrance with high rank. He was thrilled and said to his father. But his father said I cannot afford expenses at IIT. You can stay in Mysore and study as much you can.
Now imagine you are Narayana Murthy and make an entry in diary expressing your feelings.

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం