• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Wit and Humour

Concept Presentation:
'Our World Through English - Class X' లో Second Unitగా 'Wit and Humour' పాఠ్యాంశాన్ని ఇచ్చారు. హాస్యం, చతురత ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 'Theme'ని చేర్చారు.
There are three Readings in this unit.
Reading A: The Dear Departed Part - I
Reading B: The Dear Departed Part - II
Reading C: The Brave Potter

Reading A: The Dear Departed Part - I
'The Dear Departed' అనే ఆంగ్ల నాటకాన్ని సుప్రసిద్ధ ఆంగ్ల నాటక కర్త 'William Stanley Houghton' రచించారు. ఈ నాటకంలో వివిధ రకాల పాత్రల ద్వారా విద్యార్థులు బాగా హాస్యాన్ని ఆస్వాదించడంతోపాటు మధ్యతరగతి ఆంగ్లేయుల్లో ఉండే నైతిక పతనాన్ని గ్రహించగలుగుతారు. మొదటిభాగంలో Mrs. Amelia Slater, Mrs. Elizabeth Jordan అనే ఇద్దరు కూతుళ్లను వారి తండ్రి Abel Merryweather చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ, ఆప్యాయతలతో పెంచుతాడు. కానీ దురదృష్టంకొద్దీ వారిద్దరు తండ్రి కంటే ఆయన ఆస్తిపాస్తులను అధికంగా అభిమానిస్తారు.
   వారి స్వార్థ పు ఆలోచనలకు వారి భర్తలు Henry Slater, Ben Jordan వంతపాడటం దారుణంగా ఉంటుంది. నాటక గమనంలో Abel Merryweather ఒకరోజు అనారోగ్యం కారణంగా పూర్తి నిద్రావస్థలో ఉండగా Mrs. Amelia Slater తండ్రి చనిపోయినట్లుగా భావించి సమాచారం తన సోదరికి చేరవేస్తుంది. అయితే సోదరి వచ్చేలోగా తన తండ్రి సంపదలో కొంత భాగాన్ని దాచిపెట్టాలనే ఆలోచన ఆమెకు కలుగుతుంది. అందులో భాగంగా తండ్రి చెప్పులు, బీరువా, గోడ గడియారం దాచిపెడుతుంది. ఇక్కడ తండ్రి మరణం పట్ల ఏ మాత్రం బాధను వ్యక్తం చేయకుండా ఆయన సంపదపై ఆసక్తిచూపడం ఆమె తీవ్రమైన స్వార్థానికి నిదర్శనం. మరో కూతురు Elizabeth Jordan తండ్రి మరణవార్త విని ఆయన ఇంటికి వచ్చి కనీసం శవాన్ని కూడా చూడకుండా ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతూ తేనీరు తాగడంలో మునిగిపోతుంది. ఇక్కడ వారి భర్తలు కూడా వారిలాగే చాలా స్వార్థంగా మాట్లాడుతుంటారు.
 

Reading B: The Dear Departed Part - II
  నాటకం కొనసాగింపులో భాగంగా Mr. Abel Merryweather అనారోగ్యం నుంచి కోలుకుని కిందికి దిగివచ్చి కూతుళ్లు, అల్లుళ్లను చూసి ఆశ్చర్యానికి గురవుతాడు. వివరాలు రాబట్టాలని చూసిన కూతుళ్లు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. తర్వాత తన చెప్పులు, గోడ గడియారం, బీరువా అక్కడ ఉండక ఫోవడాన్నిగమనించి తన కూతుళ్ల దుష్టబుద్ధిని, వారి ఆలోచనలను అర్థం చేసుకుంటాడు. సాధారణ పరిస్థితుల్లో తనను బాగా చూసుకున్న కుమార్తెకు ఆస్తిని ఇవ్వాలనుకున్న ఆ తండ్రి వాళ్లకు బుద్ధి చెప్పాలనుకుంటాడు. యావదాస్తిని తనను బాగా చూసుకోగలదనే నమ్మకం ఉన్న Mrs. John Shorrocks ను వివాహం చేసుకుని తర్వాత తన ఆస్తిని ఆమె పేరుమీదకు మారుస్తున్నట్లు చెబుతాడు. చర్చిలో జరగబోయే తమ వివాహానికి రావాల్సిందిగా కూతుళ్లనుని ఆహ్వానిస్తాడు.
మొత్తానికి నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు కూతుళ్లు తమ స్వార్ధబుద్ధికి తగిన శిక్షను అనుభవించారని చెప్పవచ్చు.

Reading C: The Brave Potter
  'Wit and Humour' అనే themeలో భాగంగా Margueritc siek రచించిన 'The Brave Potter' కథ విద్యార్థులను బాగా ఆకట్టుకుంటుంది. కాల ప్రభావం వల్ల ఒక్కోసారి ఒక వ్యక్తి ధైర్యవంతుడు కానప్పటికీ, పరిస్థితుల అనుకూలత వల్ల ధైర్యవంతుడిగా చెలామణి కావచ్చు అనడానికి ఈ కథే నిదర్శనం.
చాలా సాధారణ వ్యక్తి అయిన ఒక 'కుమ్మరివాడు' తప్పిపోయిన తన గాడిదను వెతుక్కుంటూ ఒక వర్షపు రాత్రి అడవిలోకి వెళతాడు. అదే అడవిలో పూరి గుడిసెలో నివాసం ఉన్న ఒక వృద్ధురాలు ఆ గుడిసెలో తడుస్తూ గుడిసెకు ఉన్న రంధ్రాన్ని (Leak) తిడుతూ ఎంతటి భయంకరమైంది ఈ Leak అంటూ దాన్ని ఆశ్చర్యకరంగా వర్ణిస్తుంది. అదే సమయంలో అక్కడే వర్షానికి తలదాచుకున్న ఒక ముసలి పులి ఈ మాటలు విని 'Leak' అనేది తనకంటే భయంకరమైన, క్రూర జంతువుగా పొరపాటుగా అర్థం చేసుకుంటుంది. 'Leak'ను తలచుకుని పులి చాలా భయంగా అక్కడే ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి తాగిన మత్తులో రాత్రిపూట వర్షంలో తన గాడిదను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన కుమ్మరి ఆ పులిని తన గాడిదగా భావిస్తాడు. తర్వాత దాన్ని గొలుసుతో బంధించి ఇంటికి తీసుకుని వెళ్లి బయట కట్టేస్తాడు. పులి కూడా కుమ్మరిని భయంకరమైన 'Leak'గా భావించి ఆ చీకట్లో ప్రతిఘటించక భయంగా కుమ్మరికి సహకరిస్తుంది.
  తెల్లవారగానే ఈ విషయం అందరికీ తెలిసి పులిని బంధించి తెచ్చిన పరాక్రమవంతుడిగా కుమ్మరిని పొగుడుతారు.తర్వాత కొద్దిరోజులకే శత్రురాజు ఆ పట్టణంపై దండెత్తగా కుమ్మరి ధైర్యసాహసాలను మంత్రుల ద్వారా విన్న రాజు అతడిని సేనాధిపతిగా నియమిస్తాడు. కనీసం గుర్రం ఎక్కడం కూడా చేతకాని కుమ్మరి బలవంతంగా తనను గుర్రానికి కట్టుకుని స్వారీ నేర్చుకోవడానికి ప్రయత్నించగా గుర్రం అదుపుతప్పి శత్రుశిబిరం వైపు పరుగెత్తుతుంది. ఆ ప్రయత్నంలో కుమ్మరి ఒక చెట్టు కాండాన్ని పట్టుకోగా అది వేళ్లతో సహా పెకిలించబడి తన చేతుల్లోకి వస్తుంది. అతడు అలాగే ఒక చేత్తో పెద్దచెట్టు, మరో చేత్తో కళ్లెం పట్టుకుని శత్రువుల శిబిరం వైపు భయంకరంగా వస్తుండగా చూసిన శత్రుసైన్యం అంతా భయపడి పారిపోతుంది. శత్రుదేశ రాజు భయపడి రాజీకోసం ముందుకు వస్తాడు. శత్రువులను ఓడించిన పరాక్రమవంతుడిగా కుమ్మరి గుర్తింపబడతాడు. కాబట్టి రెండు పరిస్థితుల్లో అనుకూల కాలం వల్ల కుమ్మరి ఎలాంటి గొప్ప పనులు చేయకపోయినా, గొప్ప వీరుడిగా అందరితో ప్రశంసలు పొందడమే ఈ కథ మూల సారాంశం.

Writer: Md.Shafi.T

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం