• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శ్రేఢులు

ఒక కచ్చితమైన (క్రమ) నియమాన్ని అనుసరించి ఉండే సంఖ్యల జాబితాను 'శ్రేఢి' అంటారు. శ్రేఢిలోని సంఖ్యలను 'పదాలు' అంటారు.
ఉదా: 1, 4, 7, 10, 13, .........
     2, 4, 8, 16, 32, .........
అంకశ్రేఢి: మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు, ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపడం లేదా తీసివేయడం వల్ల వచ్చే జాబితాను 'అంకశ్రేఢి' అంటారు.
* స్థిర సంఖ్యను సామాన్య భేదం లేదా పదాంతరం అంటారు. దీన్ని 'd' తో సూచిస్తారు.
* పదాంతరం ధనాత్మకం లేదా రుణాత్మకం లేదా సున్నా కావచ్చు.
ఉదా: 1, 3, 5, 7, 9, .........
* అంకశ్రేఢిలో మొదటిపదం a1, రెండో పదం a2, ...... nవ పదాన్ని an గా పిలుస్తారు. శ్రేఢి a1, a2, a3, ......... anగా ఉంటుంది.
* సామాన్య భేదం (d) = a2 - a1 = a3 - a2 ....... = an - an - 1 = ak + 1 - ak
* అంకశ్రేఢిలో మొదటిపదం a, సామాన్య భేదం d అయితే అంకశ్రేఢి కింది రూపంలో ఉంటుంది.
             a, a + d, a + 2d, a + 3d, .........
 

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం