• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం

బహుళైచ్ఛిక ప్రశ్నలు
 

1. గోళీయ దర్పణ కేంద్రాన్ని ఏమంటారు?
A) ధ్రువం       B) వక్రతావ్యాసార్ధం       C) నాభి       D) వక్రతాకేంద్రం

 

2. అపసరణ దర్పణానికి ఉదాహరణ-
A) సమతల దర్పణం      B) కుంభాకార దర్పణం     C) పుటాకార దర్పణం      D) అన్నీ

 

3. ఏ దర్పణానికి వక్రతాకేంద్రం దాని వెనక్కి ఉంటుంది?
A) పుటాకార      B) కుంభాకార     C) కుంభాకార లేదా పుటాకార      D) ఏదీకాదు

 

4. గోళీయ దర్పణాల్లో అన్ని దూరాలను ఎక్కడి నుంచి కొలుస్తారు?
A) ధ్రువం       B) నాభి       C) వక్రతాకేంద్రం       D) నాభ్యంతరం

 

5.  ఏ దర్పణాలకు వర్తిస్తుంది?
A) కుంభాకార       B) పుటాకార       C) సమతల       D) కుంభాకార, పుటాకార

 

6. మోటార్ బైక్‌కు సైడ్‌మిర్రర్‌గా వాడేది-
 A) కుంభాకార దర్పణం     B) పుటాకార దర్పణం      C) సమతల దర్పణం     D) ఏదీకాదు

 

7. సోలార్ వస్తువుల్లో ఉండే దర్పణం-
A) పుటాకార       B) కుంభాకార       C) సమతల       D) ఏదీకాదు

 

8. ENT వైద్యులు ఉపయోగించేది-
A) సమతల దర్పణం     B) పుటాకార దర్పణం     C) కుంభాకార దర్పణం     D) ఏదీకాదు

 

9. షేవింగ్‌కు ఉపయోగించే దర్పణం
A) సమతల      B) పుటాకార      C) కుంభాకార      D) ఏదీకాదు

 

10. వాహనాల హెడ్‌లైట్లకు ఉపయోగించే దర్పణం
A) కుంభాకార      B) పుటాకార      C) సమతల      D) ఏదీకాదు

 

11. సెర్చ్‌లైట్లలో ఉపయోగించే దర్పణం 
 A) సమతల      B) కుంభాకార      C) పుటాకార      D) ఏదీకాదు

 

12. వాహనాల్లో       రియర్ వ్యూమిర్రర్‌గా ఉపయోగించే దర్పణం
A) సమతల      B) పుటాకార      C) కుంభాకార       D) ఏదీకాదు

 

13. రియర్ వ్యూ మిర్రర్‌లో ఏ రకమైన ప్రతిబింబం ఏర్పడుతుంది?
A) తలకిందులు       B) నిజప్రతిబింబం       C) నిటారైన       D) ఏదీకాదు

 

14. రియర్ వ్యూ మిర్రర్ లో వాహనాలు ఏ దిశలో కదులుతున్నట్లుగా కనిపిస్తుంది?
A) వాహనం కదిలేదిశలో                        B) వ్యతిరేక దిశలో 
C) వాహనం కదిలేదిశలో, వ్యతిరేక దిశలో       D) ఏమీ కనపడదు

 

15. వాహనాల్లో ఉపయోగించే రియర్ వ్యూమిర్రర్‌లో ప్రతిబింబ పరిమాణం
A) చిన్నదిగా ఏర్పడుతుంది         B) పెద్దదిగా ఏర్పడుతుంది 
C) సమానంగా ఏర్పడుతుంది       D) ప్రతిబింబం ఏర్పడదు

 

16. కిందివాటిలో తప్పుగా జతపరిచింది-
A) సోలార్ కుక్కర్ - పుటాకార దర్పణం
B) ENT వైద్యుడు - పుటాకార దర్పణం
C) కారు హెడ్‌లైట్స్ - పుటాకార దర్పణం
D) రియర్ వ్యూ మిర్రర్ - పుటాకార దర్పణం

 

17. టార్చిలైట్లు, సెర్చ్‌లైట్లు, వాహనాల హెడ్‌లైట్లలో బల్బులు ఉండే స్థానం
      A) పరావర్తన వక్రతాకేంద్రం వద్ద
      B) పరావర్తన దర్పణ ధ్రువం, నాభి మధ్య
      C) పరావర్తన దర్పణ నాభికి దగ్గరగా
      D) పరావర్తన దర్పణ నాభి, వక్రతా కేంద్రం మధ్య

 

18. వస్తువు పరిమాణం కంటే చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరచడానికి పుటాకార దర్పణానికి ఎక్కడ వస్తువును ఉంచాలి?
 A) నాభి వద్ద     B) నాభి, ధ్రువం మధ్య     C) వక్రతాకేంద్రం వద్ద     D) వక్రతాకేంద్రం ఆవలివైపు

 

19. పుటాకార దర్పణం వక్రతాకేంద్రం ద్వారా ప్రయాణించే కాంతి కిరణం పతనకోణం విలువ -
A) 45°       B) 90°       C) 0°       D) 180°

 

20. ఒక పుటాకార దర్పణంతో ప్రతిబింబం మిథ్యా, నిటారుగా, పెద్దదిగా ఏర్పడటానికి ఎక్కడ వస్తువును ఉంచాలి?
A) F వద్ద       B) F, Cల మధ్య       C) P వద్ద       D) P, Fల మధ్య

 

21. కిందివాటిలో ఏ కిరణ చిత్రం సరికాదు?

 

22. కిందివాటిలో ఏ కిరణ చిత్రం సరైంది?

 

23. కిందివాటిలో ఏ కిరణ చిత్రం సరికాదు?

 

24. కిందివాటిలో ఏ కిరణ చిత్రం సరైంది?

 

25. పుటాకార దర్పణం బిందు ప్రతిబింబాన్ని ఏర్పరచాలంటే వస్తువు స్థానం-
A) వక్రతాకేంద్రం వద్ద      B) నాభి వద్ద      C) వక్రతాకేంద్రానికి ఆవల      D) అనంత దూరంలో

 

26. 6 మీ. ఎత్తు ఉన్న వ్యక్తి ప్రతిబింబం దర్పణంలో 2 మీ. ఎత్తుతో నిటారుగా ఉన్నట్లయితే ఆ దర్పణం
A) సమతల దర్పణం       B) పుటాకార దర్పణం       C) కుంభాకార దర్పణం       D) ఏదీకాదు

 

27. కుంభాకార దర్పణం ఇచ్చే ఆవర్థనం-
A) 1 కంటే తక్కువ      B) 1 కంటే ఎక్కువ      C) 1కి సమానం      D) 1 కంటే ఎక్కువ లేదా తక్కువ

 

28. పుటాకార దర్పణ ఆవర్థనం-
A) 1 కంటే తక్కువ 
B) 1 కంటే ఎక్కువ 
C) 1 కంటే తక్కువ లేదా 1 కంటే ఎక్కువ లేదా 1కి సమానం
D) 1 కంటే ఎక్కువ లేదా 1 కంటే తక్కువ

 

29. ఎల్లప్పుడూ ఒక దర్పణం మిథ్యా ప్రతిబింబాన్ని ఇస్తుంది అయితే ఆ దర్పణం-
A) పుటాకార దర్పణం      B) సమతల దర్పణం      C) కుంభాకార దర్పణం      D) ఏదీకాదు

 

30. 5 సెం.మీ. నాభ్యంతరం ఉన్న ఒక కుంభాకార దర్పణం ముందు 10 సెం.మీ. దూరంలో ఒక వస్తువును ఉంచితే ఏర్పడే ప్రతిబింబం
A) నిజ       B) మిథ్యా       C) నిజ, మిథ్యా       D) ఏర్పడదు

 

31. వస్తుస్థానంతో సంబంధం లేకుండా ఏర్పడిన ప్రతిబింబం మిథ్యా, నిటారు, చిన్నది అయితే అది ఏ దర్పణం ద్వారా సాధ్యమవుతుంది?
A) సమతల      B) పుటాకార      C) కుంభాకార      D) ఏదీకాదు

 

32. వస్తువు కంటే పెద్దదైన ప్రతిబింబాన్ని ఇచ్చే దర్పణం-
A) సమతల దర్పణం     B) పుటాకార దర్పణం     C) కుంభాకార దర్పణం      D) ఏదీకాదు

 

33. ఒక వస్తువుకు కేవలం నిజప్రతిబింబాన్ని రాబట్టాలంటే ఉపయోగించాల్సిన దర్పణం
 A) సమతల దర్పణం     B) పుటాకార దర్పణం     C) కుంభాకార     D) ఏదీకాదు

 

34. కుంభాకార దర్పణానికి సంబంధించి u, v, fలను ....... గుర్తులతో తీసుకోవాలి.
A) −, +, −       B) −, −, +       C) +, −, −       D) −, +, +

 

35. పుటాకార దర్పణం వస్తుదూరం 16 సెం.మీ. ప్రతిబింబ దూరం 8 సెం.మీ. అయితే దర్పణ ఆవర్థనం-
A) +0.5       B) −0.5       C) −2       D) +2

 

36. వాహనాల్లో అమర్చిన దర్పణాల ఆవర్థనం విలువ
A) > 1       B) < 1       C) 1కి సమానం       D) 1

 

37. తెరమీద పట్టలేని ప్రతిబింబం
A) నిజ ప్రతిబింబం       B) మిథ్యా ప్రతిబింబం     C) తలకిందుల ప్రతిబింబం      D) ఏదీకాదు

 

38. తెరమీద పట్టగలిగే ప్రతిబింబం
A) నిజ ప్రతిబింబం      B) మిథ్యా ప్రతిబింబం      C) నిటారు ప్రతిబింబం      D) ఏదీకాదు

 

39. ఒక గోళాకార దర్పణం వక్రతా వ్యాసార్ధం 18 సెం.మీ. అయితే దాని నాభ్యంతరం
A) 18 సెం.మీ.       B) 36 సెం.మీ.       C) 10 సెం.మీ.       D) 9 సెం.మీ.

 

40. u = -20 సెం.మీ., f = -15 సెం.మీ. అయితే v, h' విలువలు
A) 40 సెం.మీ., 3 సెం.మీ.          B) 60 సెం.మీ., 4.5 సెం.మీ.
C) 30 సెం.మీ., 4.5 సెం.మీ.       D) 50 సెం.మీ., 2.5 సెం.మీ.

 

జవాబులు: 1-D;    2-B;    3-B;    4-A;    5-D;   6-A; 7-A;     8-B;    9-B;    10-B;    11-C;    12-C;    13-C; 14-C;     15-A;    16-D;    17-C; 18-D;    19-B;    20-D;    21-D; 22-D;   23-D; 24-D;    25-D;    26-C; 27-A;    28-C;    29-C;    30-B;    31-C; 32-B;    33-B;    34-D;    35-B;   36-B;   37-B;   38-A; 39-D;    40-B.

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం