• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం

మాదిరి ప్రశ్నలు

1. ఏ దర్పణాన్ని కేంద్రీకరణ దర్పణం అంటారు? ఆ దర్పణానికి వివిధ స్థానాల్లో వస్తువును ఉంచడం వల్ల ఏర్పడే ప్రతిబింబ కిరణ చిత్రాలను గీయండి.  (AS 5) 4 మార్కులు
2. మానవ నాగరికత అభివృద్ధిలో పుటాకార, కుంభాకార దర్పణాల పాత్రను వివరించండి.  (AS 1) (AS 6) 4 మార్కులు
3. నిజ, మిథ్యా ప్రతిబింబాలు రెండింటినీ ఏర్పరచడానికి ఏ రకమైన దర్పణాన్ని వాడాలి? ఆ ప్రతిబింబాల మధ్య భేదాలను తెలపండి.  (AS 1) 4 మార్కులు
4.
  
పై పటం నుంచి కిందివాటికి సమాధానాలు రాయండి.
i) P దేన్ని సూచిస్తుంది?
ii) పతన కిరణాలను గుర్తించండి.
iii) ప్రతిబింబ లక్షణాలను తెలపండి.  (AS 4) 4 మార్కులు


5. దోషజ్ఞ కారుకు పక్క అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. దానిలో ఆమె ప్రతిబింబం చిన్నదిగా కనిపించింది. అయితే
a) అది ఏ దర్పణం? ఆమె చూసుకున్న ప్రతిబింబ స్వభావం ఏమిటి?
b) ఆ ప్రతిబింబాన్ని చూపే కిరణ చిత్రం గీయండి. ఆ దర్పణాన్ని నిత్య జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు?   (AS 1) 4 మార్కులు
6. పూర్వకాలంలో రాజులు శత్రువుల ఓడలను, శిబిరాలను అద్దాలను ఉపయోగించి యుద్ధ సమయంలో తగులబెట్టేవారట. అయితే
ఎ) వారు ఉపయోగించిన అద్దాలు ఏమిటో ఊహించండి. శత్రువులను ఓడించడంలో వారు ఉపయోగించిన శక్తి ఏమై ఉంటుంది?
బి) ఇందుకోసం వారు ఏ పద్ధతిని ఉపయోగించి ఉంటారో ఊహించండి. దీన్ని వివరించడానికి ఒక కిరణ చిత్రం గీయండి.  (AS 2) 4 మార్కులు


7. పుటాకార దర్పణాన్ని ఉపయోగించి ప్రధానాక్షంపై వివిధ స్థానాల్లో వస్తువును ఉంచితే ఏర్పడే ప్రతిబింబాల లక్షణాలను కింది పట్టికలో పూరించండి.(AS 4) 4 మార్కులు


8. ఇచ్చిన పట సమాచారం ఆధారంగా పట్టికను పూర్తి చేయండి.   (AS 4) 4 మార్కులు

9.

పై పటం నుంచి కిందివాటికి సమాధానాలు రాయండి. (AS 4) 4 మార్కులు
     i) ఏ రకమైన దర్పణాన్ని వాడారు?
     ii) ప్రతిబింబ లక్షణాలు ఏమిటి?
     iii) పై కిరణ చిత్రం ఆధారంగా ఈ దర్పణాన్ని ఎక్కడ ఉపయోగిస్తారో తెలపండి?
     iv) పతన కిరణాలను గుర్తించండి.


10. 40 సెం.మీ. నాభ్యంతరం ఉండే పుటాకార దర్పణానికి మిథ్యా ప్రతిబింబం వస్తువు కంటే రెండు రెట్లు ఏర్పడాలంటే ఆ వస్తువును ఎంత దూరంలో ఉంచాలి? (AS 1) 4 మార్కులు
11. వస్తువు దగ్గరే ప్రతిబింబం ఏర్పడాలంటే పుటాకార దర్పణం ముందు వస్తువును ఎలా ఉంచాలో సూచించే కిరణ చిత్రాన్ని గీయండి.  (AS 5) 2 మార్కులు

12. మీ పరిసరాల్లో మీరు గమనించిన కుంభాకార, పుటాకార తలాలున్న వస్తువులతో పట్టికను పూర్తి చేయండి.   (AS 4) 2 మార్కులు

పుటాకార తలం        
కుంభాకార తలం        

పై పటంలోని అక్షరాలు వేటిని తెలియజేస్తాయి?  
 

15. ఒక పుటాకార దర్పణం ముందువైపు 10 సెం.మీ. దూరంలో ఒక వస్తువును ఉంచితే, దాని ప్రతిబింబం వస్తువుకు 4 రెట్లుగా ఏర్పడింది. అయితే ప్రతిబింబ దూరం ఎంత?  (AS 1) 2 మార్కులు
16. సోలార్ కుక్కర్‌లు, కారు హెడ్‌లైట్లలో గోళాకార దర్పణాలు వాడతారు. ఎందుకు?   (AS 1) 2 మార్కులు
17. పుటాకార దర్పణ ఆవర్థనం -1 అయితే
ఎ) వస్తుస్థానం, ప్రతిబింబ స్థానాలను తెలపండి.
బి) ప్రతిబింబ లక్షణాలు తెలపండి.  (AS 1) 2 మార్కులు

 

19. మీరు ఒక పుటాకార దర్పణం సహాయంతో కాగితాన్ని మండించాలనుకుంటే ఆ కాగితాన్ని ఏ స్థానంలో ఉంచుతారు? (AS 2) ఒక మార్కు
20. తెరపై ఏర్పడని ప్రతిబింబం ఏది?  (AS 1) ఒక మార్కు
21. ప్రయోగశాలలోని వివిధ పుటాకార దర్పణాలకు సంబంధించి వాటి నాభ్యంతరాల విలువలను ఇవ్వలేదు. ఆయా పుటాకార దర్పణాల నాభ్యంతరాలను ప్రయోగశాలలోనే కనుక్కోవడానికి ఏయే పరికరాలు కావాలి? ఆ పరికరాల సహాయంతో దర్పణ నాభ్యంతరాన్ని ఎలా లెక్కగట్టాలి? (AS 3) 4 మార్కులు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం