• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రసాయన సమీకరణాలు

బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. ఒక రసాయనిక చర్యలో వాయువు వెలువడటాన్ని చూపే గుర్తు


2. ఒక రసాయనిక చర్యలో అవక్షేపం ఏర్పడటాన్ని చూపే గుర్తు


3. కింది తుల్య సమీకరణాల్లో సరైనదాన్ని ఎన్నుకోండి.
A) N2 + 3 H2 2 NH3 
B) H2 + Cl2 HCl
C) AgCl  Ag + Cl2
D) CuO + H2

 2 Cu + H2O


4. కింది తుల్య సమీకరణాల్లో సరికానిదాన్ని ఎన్నుకోండి.
A) 4 NH3 + Cl2 N2H4 + 2 NH4Cl
B) NH3 + 3 Cl2 NCl3 + 3 HCl
C) 8 NH3 + 3 Cl2 6 NH4Cl + N2
D) 2 NH3 + 3 Cl2 2 NCl3 + 3 HCl


5. CaO నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడేది

A) CaCO3      B) CaOH      C) Ca(OH)2      D) CaCl2


6. సాధారణ ఉప్పు నీటి ద్రావణం దేనితో చర్య జరిపి తెల్లటి అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది?
A) Ba(NO3)2 జలద్రావణం         B) KNO3 జలద్రావణం
C) AgNO3 జలద్రావణం              D) Mg(NO3)2 జలద్రావణం


7. AgNO3 + NaCl  

..............
  A) AgCl + NaNO3    B) AgCl + Na2NO2    C) AgCl2 + NaNO2     D) Ag2Cl + NaNO3


8. గోడలకు సున్నం వేసిన కొద్దిసేపటికే కాల్షియం హైడ్రాక్సైడ్ గాలిలోని CO2 తో చర్య జరిపి ఈ పొరను ఏర్పరచడం వల్లే గోడలు తెల్లగా మెరుస్తుంటాయి.
A) జిప్సం      B) సున్నపురాయి      C) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్      D) బ్లీచింగ్ పౌడరు


9. పొడి సున్నానికి నీరు కలిపితే పాత్ర వేడెక్కుతుంది అయితే ఇది ఏ రకమైన చర్య?
A) కాంతి రసాయన చర్య      B) కాంతి చర్య      C) ఉష్ణమోచక చర్య      D) ఉష్ణగ్రాహక చర్య

10. రసాయన చర్య జరుగుతున్నప్పుడు కింది ఏ మార్పులు సంభవిస్తాయి?
A) క్రియాజన్యాలు, క్రియాజనకాలుగా మారతాయి
B) క్రియాజనకాలు, క్రియాజన్యాలను ఏర్పరుస్తాయి
C) ఒక మూలకం పరమాణువులు వేరొక మూలకం పరమాణువులుగా మార్పు చెందుతాయి
D) క్రియజన్యాల ధర్మాలు క్రియాజనకాల ధర్మాలకు దాదాపు సమానంగా ఉంటాయి

11. రసాయన చర్యలో జరగని ఘటన
A) పరమాణువుల పునరమరిక జరిగి క్రియాజన్యాలు ఏర్పడతాయి
B) నూతన ధర్మాలున్న కొత్త పదార్థాలు ఏర్పడతాయి
C) ఒక మూలక పరమాణువులు వేరొక మూలక పరమాణువులుగా మార్పు చెందుతాయి
D) పాతబంధాల విచ్ఛిత్తి, నూతన బంధాల ఆవిష్కరణ


12. గ్రాము మోలార్ ఘనపరిమాణం విలువ
A) 2.24 లీ.     B) 2.24 మి.లీ.     C) 22.4 లీ.     D) 22.4 మి.లీ.


13. అవగాడ్రో సంఖ్య
A) 6 × 1010        B) 6 × 1024        C) 6.02 × 1023        D) 6.02 × 1034


14. నైట్రోజన్, హైడ్రోజన్‌లు కలిసి అమ్మోనియాను ఇస్తాయి. ఈ చర్యకు తుల్య సమీకరణం
A) N2 + H2 NH3        B) N + H3 NH3
C) N2 + 3 H  NH3        D) N2 + 3 H2

 2 NH3


15. రసాయన సమీకరణంలో బాణం గుర్తుకు కుడివైపున ఉన్న పదార్థాలు
A) క్రియాజనకాలు            B) క్రియాజన్యాలు
C) ఆక్సీకరణులు              D) క్షయకరణులు

16. ఒక రసాయన చర్యలో సంయోగ పదార్థాలు, ఉత్పన్నాల మధ్య గీసిన బాణం గుర్తు ఆ రసాయన చర్య ....... ను గురించి తెలుపుతుంది.
A) సంయోగం        B) వియోగం        C) స్థానభ్రంశం        D) దిశ


17. 3 గ్రాముల Mg అధిక సజల HClతో చర్యనొందినప్పుడు విడుదలయ్యే H2 బరువు (Mg పరమాణు భారం 24)
A) 0.2 గ్రా.        B) 0.25 గ్రా.        C) 0.5 గ్రా.        D) 1 గ్రా.


18. 3 గ్రాముల కార్బన్ అధిక ఆక్సిజన్‌తో పూర్తిగా మండినప్పుడు ఏర్పడే CO2 బరువు
('O' పరమాణు భారం = 16, C పరమాణుభారం = 12)
A) 7 గ్రా.        B) 11 గ్రా.        C) 14 గ్రా.        D) 17 గ్రా.


19. Fe2O3 క్షయకరణంలో 1120 కి.గ్రా. ఇనుమును రాబట్టడానికి ఎంత పరిమాణం ఉన్న అల్యూమినియం అవసరమవుతుంది? (Al పరమాణు భారం = 27, Fe ప.భా. = 56)
A) 54 కి.గ్రా.        B) 104 కి.గ్రా.        C) 540 కి.గ్రా.        D) 560 కి.గ్రా.


20. 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య నొందినప్పుడు విడుదలయ్యే హైడ్రోజన్ బరువు (Na ప.భా. = 23)
A) 1 గ్రా.        B) 23 గ్రా.        C) 10 గ్రా.        D) 5 గ్రా.


21. 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్యనొందినప్పుడు STP వద్ద విడుదలయ్యే హైడ్రోజన్ ఘనపరిమాణం ఎంత? (Na ప.భా. = 23)
A) 22.4 లీ.        B) 44.8 లీ.        C) 112 లీ.        D) 224 లీ.

22. 230 గ్రాముల సోడియంను అధిక నీటితో చర్య జరిపినప్పుడు విడుదలైన హైడ్రోజన్ అణువుల సంఖ్యను కనుక్కోండి. (Na ప.భా. = 23)
A) 6.02 × 1023       B) 6.02 × 1024       C) 3.01 × 1023       D) 3.01 × 1024


23. CH4 + 2 O2

 CO2 + 2 H2O అనే సమీకరణంలో 4 గ్రాముల మీథేన్‌ను పూర్తిగా దహనం చేయడానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణం
A) 4 గ్రా.       B) 8 గ్రా.       C) 16 గ్రా.       D) 32 గ్రా.


24. రసాయనిక సమీకరణాన్ని రాసేటప్పుడు ఉష్ణమోచక చర్యలో శక్తి విడుదలవడాన్ని సూచించే గుర్తు
A) +          B) -          C) ×          D) ÷


25. రసాయనిక సమీకరణం రాసేటప్పుడు ఉష్ణగ్రాహక చర్యలో శక్తి గ్రహించడాన్ని సూచించే గుర్తు
A) +          B) -          C) ×          D) ÷


26. N2 + 3 H2 2 NH3 + 22.4 కిలో కేలరీలు. ఇది ...... చర్యకు ఉదాహరణ
A) ఉష్ణమోచక          B) ఉష్ణగ్రాహక          C) తటస్థ          D) ఏదీకాదు


27. N2 + O2 2 NO - 43.2 కిలో కేలరీలు. ఇది ..... చర్యకు ఉదాహరణ
A) ఉష్ణమోచక      B) ఉష్ణగ్రాహక       C) తటస్థ        D) ఏదీకాదు


28. రసాయనిక సమీకరణంలో () కిందికి చూపే బాణం గుర్తు దేన్ని తెలుపుతుంది?
A) అవక్షేపం       B) దిశ       C) వాయువు       D) ఏదీకాదు


29. బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్ ద్రావణాలు ..... గా కనిపిస్తాయి.
A) రెండూ రంగు లేకుండా          B) తెలుపు, రంగు లేకుండా 
C) రంగు లేకుండా, తెలుపు        D) ఆకుపచ్చ, పసుపు


30. బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్ జలద్రావణాలను కలపగా పరిశీలించిన విషయం .....
A) త్వరితంగా తెల్లటి అవక్షేపం ఏర్పడుతుంది
B) పారదర్శక ద్రావణం ఏర్పడుతుంది
C) రంగులేని వాయువు వెలువడుతుంది
D) ఒక ఘాటైన ఊపిరాడని వాయువు వెలువడుతుంది


31. కిందివాటిలో తుల్య సమీకరణాన్ని గుర్తించండి.
A) 2 Zn + H2SO4 2 ZnSO4 + H2
B) AgNO3 + 2 NaCl  AgCl2 + 2 NaNO3
C) 2 Na + 2 H2O  2 NaOH + H2
D) C3H8 + 6 O2 3 CO2 + 4 H2O


32. 2 NaCl + 2 H2O ........... + Cl2 + H2
A) Na2H2       B) Na2OH       C) 2 NaOH       D) Na(OH)2


33. Zn + 2 AgNO3 ....... + 2 Ag
A) Zn (NO3)4       B) ZnNO3       C) 2 ZnNO3       D) Zn(NO3)2


34. K2Cr2O7  K2CrO4 + Cr2O3 + O2 ఈ రసాయన సమీకరణాన్ని తుల్యం చేయగా
A) 2 K2Cr2O7

 2 K2CrO4 + 2 CrO3 + 2 O2
B) 4 K2Cr2O7 4 K2CrO4 + Cr2O3 + 3 O2
C) 2 K2Cr2O7 2 K2CrO4 + 3 Cr2O3 + 3 O2
D) 4 K2Cr2O7  4 K2CrO4 + 2 Cr2O3 + 3 O2


35. కింది తుల్య సమీకరణాల్లో సరైనదాన్ని ఎన్నుకోండి.
A) 2 NaOH + 2 Zn  Na2ZnO2 + H2
B) 2 Na2CO3 + 2 HCl  2 NaCl + H2O + CO2
C) 2 HCl + Zn  ZnCl2 + H2
D) C3H8 + 2 O2  3 CO2 + 4 H2O

జవాబులు: 1-D;   2-C;   3-A;   4-D  5-C;    6-C;    7-A;    8-B;    9-C;    10-B : 11-C;    12-C;    13-C;    14-D;    15-B; 16-D;    17-B;    18-B;    19-C;    20-C;    21-C,  22-D;    23-C;    24-A;    25-B;    26-A;    27-B:  28-A;    29-A;    30-A;    31-C: 32-C;  33-D;  34-D;  35-C

Posted Date : 26-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం