1. రసాయన సమీకరణం అంటే మీరేం అర్థం చేసుకున్నారు? (AS 1) 4 మార్కులు
జ: * ఒక రసాయనిక చర్యను క్లుప్తంగా, అర్థవంతంగా సూచించే సాంకేతిక సమీకరణాన్ని రసాయనిక సమీకరణం అంటారు.
* రసాయన మార్పులను రసాయన సమీకరణాల ద్వారా సూచిస్తారు.
* రసాయనిక చర్యలో పాల్గొనే రసాయనాలను (మూలకాలు లేదా సమ్మేళనాలు) క్రియాజనకాలు అంటారు. చర్య జరిగిన తర్వాత ఏర్పడే కొత్త పదార్థాలను క్రియాజన్యాలు అంటారు.
* క్రియాజన్యాలు, క్రియాజనకాలను బాణం గుర్తు '' తో వేరు చేసి రాస్తారు.
* క్రియాజనకాలను సమీకరణానికి ఎడమవైపు రాస్తారు. అవి ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాటిని '+' గుర్తుతో అనుసంధానం చేస్తారు.
* క్రియాజన్యాలను సమీకరణానికి కుడివైపు రాస్తారు. అవి ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని '+' గుర్తుతో అనుసంధానం చేసి రాస్తారు.
ఉదాహరణలు:
ఎ) జింక్ లోహం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు జింక్ క్లోరైడ్, హైడ్రోజన్ వాయువు ఏర్పడతాయి.
Zn + 2 HCl ZnCl2 + H2
బి) కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.
CaO + H2O Ca(OH)2
2. తుల్య సమీకరణం అంటే మీరేం అర్థం చేసుకున్నారు? ఎందుకు రసాయన సమీకరణాలను తుల్యం చేయాలి? (AS 1) 4 మార్కులు
జ: * ఏ రసాయన సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపు ఉండే మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు ఉండే మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అలాంటి రసాయన సమీకరణాన్ని తుల్య రసాయన సమీకరణం అంటారు.
ఉదా: ప్రొపేన్‌ను ఆక్సిజన్‌తో మండించినప్పుడు కార్బన్‌డైఆక్సైడ్, నీరు ఏర్పడతాయి.
C3H8 + 5 O2 3 CO2 + 4 H2O
* ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం, ఒక రసాయన చర్యలో పాల్గొనే పదార్థాల మొత్తం ద్రవ్యరాశి చర్యకు ముందు, తర్వాత సమానంగా ఉండాలి. ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం కావు. కాబట్టి ఒక రసాయన సమీకరణాన్ని కచ్చితంగా తుల్యం చేయాలి.
3. కింది రసాయన సమీకరణాలను వాటి భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి.
i) CO2 + H2O C6H12O6 + O2
ii) Fe2O3 + CO Fe + CO2
iii) NaCl + H2O NaOH + Cl2 + H2
iv) Na + H2O NaOH + H2 (AS 1) 4 మార్కులు
4. కింది రసాయన సమీకరణాన్ని ఏ విధంగా తుల్యం చేస్తారో వివరించండి. (AS 1) 4 మార్కులు
H2 + O2 H2O
జ: తుల్యం కాని రసాయన సమీకరణం H2 + O2 H2O
* ఇరువైపులా ఉండే మూలక పరమాణువుల సంఖ్యను పోల్చగా
* పై సమీకరణంలో ఎడమవైపు రెండు ఆక్సిజన్ పరమాణువులు, కుడివైపు ఒక ఆక్సిజన్ పరమాణువు ఉన్నాయి.
* ఆక్సిజన్ పరమాణువులను తుల్యం చేయడానికి కుడివైపున ఉండే H2Oను 2తో గుణించాలి.
H2 + O2 2 H2O
* హైడ్రోజన్ పరమాణువులను తుల్యం చేయడానికి ఎడమవైపున ఉండే H2ను 2తో గుణించాలి.
2 H2 + O2 2 H2O
* రెండు వైపులా మూలక పరమాణువులన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి సమీకరణం తుల్యం చేయబడింది.
* తుల్య సమీకరణం 2 H2 + O2 2 H2O
5. కింది రసాయన సమీకరణాన్ని ఏ విధంగా తుల్యం చేస్తారో వివరించండి. (AS 1) 4 మార్కులు
C3H8 + O2 CO2 + H2O
జ: * తుల్యం కాని రసాయన సమీకరణం C3H8 + O2 CO2 + H2O
* ఇరువైపులా ఉండే మూలక పరమాణువుల సంఖ్యను పోల్చగా
* 'C' పరమాణువులను తుల్యం చేయడానికి కుడివైపున ఉండే CO2ను 3తో గుణించాలి.
C3H8 + O2 3 CO2 + H2O
* 'H' పరమాణువులను తుల్యం చేయడానికి కుడివైపున ఉండే H2Oను 4తో గుణించాలి.
C3H8 + O2 3 CO2 + 4 H2O
* 'O' పరమాణువులను తుల్యం చేయడానికి ఎడమవైపున ఉండే O2ను 5తో గుణించాలి.
C3H8 + 5 O2 3 CO2 + 4 H2O
* రెండు వైపులా మూలక పరమాణువులన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి సమీకరణం తుల్యం చేయబడింది.
* తుల్య సమీకరణం C3H8 + 5 O2 3 CO2 + 4 H2O
6. ఒక రసాయనిక చర్య జరిగినప్పుడు జరిగే మార్పులను తెలపండి. (AS 1) 4 మార్కులు
జ: * తొలి పదార్థాలు వాటి గుణాత్మక ధర్మాలను కోల్పోతాయి. రంగు, స్థితిలో మార్పు చెందిన క్రియాజన్యాలు ఏర్పడతాయి.
* రసాయన చర్యలు ఉష్ణమోచక లేదా ఉష్ణగ్రాహక చర్యలు కావచ్చు. అంటే ఉష్ణం విడుదల కావచ్చు లేదా ఉష్ణం గ్రహించవచ్చు.
* కరగని అవక్షేపాన్ని ఏర్పరుస్తూ చర్య జరగవచ్చు.
* రసాయన మార్పులో కొన్ని సందర్భాల్లో వాయువు విడుదల కావచ్చు.
7. కింది రసాయన చర్యలకు తుల్య రసాయన సమీకరణాలు రాయండి.
i) కాల్షియం హైడ్రాక్సైడ్ + కార్బన్ డై ఆక్సైడ్ కాల్షియం కార్బొనేట్ + నీరు
ii) జింక్ + సోడియం హైడ్రాక్సైడ్ సోడియం జింకేట్ + హైడ్రోజన్
iii) మెగ్నీషియం + హైడ్రోక్లోరికామ్లం మెగ్నీషియం క్లోరైడ్ + హైడ్రోజన్
iv) సోడియం హైడ్రాక్సైడ్ + సల్ఫ్యూరికామ్లం సోడియం సల్ఫేట్ + నీరు (AS 1) 4 మార్కులు
జ: i) Ca(OH)2 + CO2 CaCO3 + H2O
ii) Zn + 2 NaOH Na2ZnO2 + H2
iii) Mg + 2 HCl MgCl2 + H2
iv) 2 NaOH + H2SO4 Na2SO4 + 2 H2O
8. రసాయన సమీకరణం ద్వారా మనం తెలుసుకోగలిగే అదనపు సమాచారం ఏమిటి? (AS 1) 4 మార్కులు
జ: రసాయన సమీకరణాల ద్వారా మరింత సమాచారం తెలుసుకోవడానికి క్రియాజనకాలు, క్రియాజన్యాలకు సంబంధించిన కింది లక్షణాలు ఉపయోగపడతాయి.
i) భౌతిక స్థితి
ii) ఉష్ణోగ్రతలో మార్పులు (ఉష్ణగ్రాహక లేదా ఉష్ణమోచక చర్యలు)
iii) ఏదైనా వాయువు వెలువడటం
iv) ఏదైనా అవక్షేపం ఏర్పడటం.
i) భౌతిక స్థితిని తెలియజేయడం: ఒక రసాయన సమీకరణంలో మరింత సమాచారం కోసం క్రియాజనకాల, క్రియాజన్యాల భౌతిక స్థితులను తెలియజేయాలి. పదార్థాలు ప్రధానంగా ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉంటాయి. వీటిని వరుసగా (ఘ), (ద్ర), (వా) లతో రసాయన సమీకరణాల్లో సూచిస్తాం. ఏదైనా పదార్థం నీటిలో కరిగి ఉన్నట్లయితే వాటిని 'జల ద్రావణాలు' అంటారు. వాటిని (జ.ద్రా.) తో సూచిస్తాం.
ii) ఉష్ణ మార్పులను తెలియజేయడం: ఉష్ణాన్ని విడుదల చేస్తూ జరిగే చర్యలను ఉష్ణమోచక చర్యలు, ఉష్ణాన్ని గ్రహిస్తూ జరిగే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు.
iii) వాయువు విడుదలను సూచించడం: ఒక రసాయన చర్యలో వాయువు విడుదలైతే దాన్ని పైకి చూపిస్తున్న ఒక బాణపు గుర్తు (↑ లేదా (వా))తో సూచిస్తాం (లేదా) అవక్షేపం చెందిన పదార్థం ఫార్ములాను (ఘ.) పాదాంకంగా ఇస్తాం.
iv) అవక్షేపం ఏర్పడటాన్ని సూచించడం: ఒక రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడితే దాన్ని కింద వైపునకు చూపిస్తున్న బాణపు గుర్తు (↓) తో సూచిస్తాం.
v) కొన్నిసార్లు చర్య జరగడానికి అవసరమైన ఉష్ణోగ్రత, పీడనం, ఉత్ప్రేరకం లాంటి వాటిని బాణపు గుర్తు కిందకు లేదా పైన సూచిస్తారు.
9. తుల్య రసాయన సమీకరణం తెలియజేసే అంశాలను తెలపండి. (AS 1) 4 మార్కులు
జ: * రసాయన సమీకరణం క్రియాజనకాలు, క్రియాజన్యాలకు సంబంధించిన గుర్తులు, సంకేతాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది.
* ఏయే మూలకాలకు చెందిన పరమాణువులు చర్యలో పాల్గొన్నాయో, ఏయే మూలకాలకు చెందిన క్రియాజన్యాలు ఏర్పడ్డాయో తెలుపుతుంది.
* క్రియాజనకాలు, క్రియాజన్యాలకు సంబంధించిన సాపేక్ష ద్రవ్యరాశుల గురించిన సమాచారాన్ని వివరిస్తుంది.
* ఒకవేళ సమీకరణంలో క్రియాజన్యాల, క్రియాజనకాల ద్రవ్యరాశులను గ్రాముల్లో వ్యక్తపరిస్తే అది వాటి మోలార్ నిష్పత్తులను తెలుపుతుంది.
* ఒకవేళ రసాయన చర్యలో వాయువులు వెలువడితే వాటి ద్రవ్యరాశులు, ఘనపరిమాణాలను సమానం చేసి వాటి ఘనపరిమాణాలను గణించాలి. లేదా స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద (STP) విడుదలైన వాయువుల మోలార్ ద్రవ్యరాశి, మోలార్ ఘనపరిమాణాల మధ్య ఉండే సంబంధం ద్వారా లెక్కించవచ్చు.
* మోలార్ ద్రవ్యరాశి, అవగాడ్రో సంఖ్యను ఉపయోగించి సమీకరణంలోని వివిధ పదార్థాల అణువుల, పరమాణువుల సంఖ్యను లెక్కించవచ్చు. ఇది క్రియాజనకాలు, క్రియాజన్యాల సాపేక్ష ద్రవ్యరాశుల గురించిన సమాచారం ఇస్తుంది. రసాయన సమీకరణం కింది సంబంధాలను తెలుపుతుంది.
ఎ) ద్రవ్యరాశి - ద్రవ్యరాశి సంబంధం
బి) ద్రవ్యరాశి - ఘనపరిమాణం సంబంధం
సి) ఘనపరిమాణం - ఘనపరిమాణం సంబంధం
డి) ద్రవ్యరాశి - ఘనపరిమాణం, అణువుల సంఖ్యల మధ్య సంబంధం
(పరమాణు ద్రవ్యరాశులు Al = 27 U, Fe = 56 U, O = 16 U)
అయితే 336 కి.గ్రా. ఇనుమును రాబట్టేందుకు ఎంత పరిమాణం ఉన్న అల్యూమినియం అవసరమవుతుందో పై సమీకరణం ఆధారంగా లెక్కించండి.
తుల్య సమీకరణం ప్రకారం
అల్యూమినియం ఇనుము
54 గ్రా. 112 గ్రా.
x గ్రా. (336 × 1000) గ్రా.
= (3 × 1000) × 54
= 162000 గ్రా. లేదా 162 కి.గ్రా.
336 కి.గ్రా. ఇనుము రాబట్టేందుకు 162 కి.గ్రా. అల్యూమినియం అవసరమవుతుంది
11. 16 గ్రా. కాల్షియం కార్బొనెట్‌ను వేడిచేస్తే విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ భారమెంత? (AS 1) 4 మార్కులు
(పరమాణు ద్రవ్యరాశులు = C = 12 U, Ca = 40 U, O = 16 U)
తుల్య సమీకరణం ప్రకారం
కాల్షియం కార్బొనేట్ కార్బన్ డై ఆక్సైడ్
100 గ్రా. 44 గ్రా.
16 గ్రా. CaCO3 ?
= 7.04 గ్రా.
... 16 గ్రా. CaCO3ను వేడిచేస్తే విడుదలైన CO2 భారం = 7.04 గ్రా.
12. 36 గ్రాముల బొగ్గును STP వద్ద పూర్తిగా దహనం చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ ఘనపరిమాణాన్ని కనుక్కోండి. (AS 1) 4 మార్కులు
(పరమాణు ద్రవ్యరాశులు O = 16 U, C = 12 U)
సోపానం - 1: 36 గ్రాముల కార్బన్‌ను మోల్స్‌లోనికి మార్చాలి.
= 3 మోల్స్.
సోపానం - 2: తుల్యసమీకరణం ద్వారా ఒక మోల్ కార్బన్‌ను ఒక మోల్ ఆక్సిజన్ సమక్షంలో దహనం చేయగా ఒక మోల్ CO2 వెలువడుతుంది.
సోపానం - 3: STP వద్ద ఒక మోల్ ఆక్సిజన్ ఆక్రమించే ఘ.ప. = 22.4 లీ.
STP వద్ద 3 మోల్‌ల ఆక్సిజన్ ఆక్రమించే ఘ.ప. = 22.4 × 3 లీ. = 67.2 లీ.
36 గ్రాముల కార్బన్‌ను మండించినప్పుడు కావాల్సిన ఆక్సిజన్ ఘనపరిమాణం = 67.2 లీ.
13. STP వద్ద 92 గ్రా. సోడియం అధిక నీటిలో చర్య పొందినప్పుడు విడుదలైన హైడ్రోజన్ ఘనపరిమాణం, ద్రవ్యరాశి, అణువుల సంఖ్యను గణించండి.
(Na పరమాణు ద్రవ్యరాశి 23 U, O పరమాణు ద్రవ్యరాశి 16 U, H పరమాణు ద్రవ్యరాశి 1 U) (AS 1) 4 మార్కులు
(2 × 23)U + 2(2 × 1 + 1 × 16)U 2(23 + 16 + 1)U + (2 × 1)U
46 U + 36 U 80 U + 2 U
46 గ్రా. + 36 గ్రా. 80 గ్రా. + 2 గ్రా.
తుల్య సమీకరణం ప్రకారం
46 గ్రా. సోడియం = 2 గ్రా. హైడ్రోజన్‌ను ఇస్తుంది.
92 గ్రా. సోడియం = ?
2 గ్రా. హైడ్రోజన్ 22.4 లీ. ఘ.ప. ఆక్రమిస్తుంది. (STP వద్ద)
4 గ్రా. హైడ్రోజన్ 44.8 లీ. ఘ.ప. ఆక్రమిస్తుంది (STP వద్ద)
2 గ్రా. హైడ్రోజన్ ఒక మోల్ హైడ్రోజన్ వాయువు 6.02 × 1023 అణువులను కలిగి ఉంటుంది.
4 గ్రా. హైడ్రోజన్ = ?
= 2 × 6.02 × 1023
= 12.04 × 1023
= 1.204 × 1024 అణువులు
14. 100 మి.లీ. ఎసిటిలీన్‌ను దహనం చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ ఘనపరిమాణాన్ని లెక్కగట్టండి. ఎసిటలీన్ అనేది ఒక అసంతృప్త హైడ్రో కార్బన్. ఈ చర్యలో వెలువడిన CO2 ఘనపరిమాణాన్ని కనుక్కోండి. (AS 1) 4 మార్కులు
సోపానం - 2: 2 ఘ.ప. (మి.లీ.) ఎసిటలీన్ + 5 ఘ.ప. (మి.లీ.) ఆక్సిజన్ 2 ఘ.ప. (మి.లీ) నీరు + 4 ఘ.ప. (మి.లీ.) కార్బన్‌డైఆక్సైడ్
సోపానం - 3: 2 మి.లీ. C2H2ను దహనం చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ = 5 మి.లీ.
1 మి.లీ. C2H2ను దహనం చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ = 2.5 మి.లీ.
100 మి.లీ. C2H2ను దహనం చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ = 100 × 2.5 = 250 మి.లీ.
సోపానం - 4: 2 మి.లీ. C2H2 దహనం చేయడం వల్ల వచ్చే CO2 = 4 మి.లీ.
1 మి.లీ. C2H2ను దహనం చేయడం వల్ల వచ్చే CO2 = 2 మి.లీ.
100 మి.లీ. C2H2ను దహనం చేయడం వల్ల వచ్చే CO2 = 100 × 2 = 200 మి.లీ.
100 మి.లీ. C2H2ను దహనం చేయడం వల్ల 200 మి.లీ. CO2 ఉత్పత్తి అవుతుంది.
15. నిత్యజీవితంలో కొన్ని రసాయన మార్పులకు ఉదాహరణలు ఇవ్వండి. (AS 1, AS 6) 2 మార్కులు
జ: * ఇంధనాలు మండటం
* ఇనుము తుప్పుపట్టడం
* ఆహారం జీర్ణమవడం
* బొగ్గును మండించడం
* టపాసులు పేల్చడం
* కాయలు పళ్లుగా మారడం
* పాలు పెరుగుగా మారడం
* ద్రాక్షరసం పులియడం
16. ఒక రసాయన చర్య ముఖ్య లక్షణాలేమిటి? (AS1) 2 మార్కులు
జ: రసాయన చర్యల ముఖ్య లక్షణాలు:
* స్థితిలో మార్పు
* వాయువులు వెలువడటం
* అవక్షేపం ఏర్పడటం
* రంగులో మార్పు
* ఉష్ణోగ్రతలో మార్పు
17. కింది రసాయన సమీకరణాలను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
a) Zn + HCl ZnCl2 + H2 ↑
b) AgNO3 + NaCl AgCl ↓ + NaNO3
i) సమీకరణం 'a' లో క్రియాజన్యాలను తెలపండి.
ii) సమీకరణం 'b' లోని అవక్షేపం ఏది? (AS 4) 2 మార్కులు
జ: i) ZnCl2, H2
ii) AgCl
18. సున్నంతో వేసిన గోడలు తెల్లగా మెరుస్తూ ఉండటానికి కారణమేమిటి? (AS 1, AS 6) 2 మార్కులు
జ: * పొడిసున్నానికి నీటిని కలపడం ద్వారా తడిసున్నాన్ని తయారు చేస్తారు.
CaO + H2O Ca(OH)2
* తడిసున్నాన్ని గోడలకు వెల్ల వేయడానికి ఉపయోగిస్తారు.
* తడిసున్నం గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌తో చర్య జరిపి, తెల్లని కాల్షియం కార్బొనేట్ పొరను ఏర్పరుస్తుంది. అందువల్లే సున్నంతో వెల్లవేసిన గోడలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి.
Ca(OH)2 + CO2 CaCO3 + H2O
19. కింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి.
i) NH3 + Cl2 N2H4 + NH4Cl
ii) NH3 + Cl2 NCl3 + HCl (AS1) 2 మార్కులు
జ: i) 4 NH3 + Cl2 N2H4 + 2 NH4Cl
ii) NH3 + 3 Cl2 NCl3 + 3 HCl
20. కింది రసాయన సమీకరణాల భౌతికస్థితి చూపుతూ సమీకరణాలను తుల్యం చేయండి. (AS 1) 2 మార్కులు
i) CaCO3 + HCl CaCl2 + H2O + CO2
ii) Fe2O3 + Al Fe + Al2O3
21. KMnO4 + H2SO4 K2SO4 + MnSO4 + H2O + O2 సమీకరణాన్ని తుల్యం చేయండి. (AS 1) ఒక మార్కు
జ: 4 KMnO4 + 6 H2SO4 2 K2SO4 + 4 MnSO4 + 6 H2O + 5 O2
22. Ca3(PO4)2 + SiO2 + C CaSiO3 + P + CO
సమీకరణాన్ని తుల్యం చేయండి. (AS 1) ఒక మార్కు
జ: Ca3(PO4)2 + 3 SiO2 + 5 C 3 CaSiO3 + 2 P + 5 CO
23. Zn(NO3)2 ZnO + NO2 + O2 సమీకరణాన్ని తుల్యం చేయండి. (AS 1) ఒక మార్కు
జ: 2 Zn(NO3)2 2 ZnO + 4 NO2 + O2
24. Cr2O3 + NaOH + O2 Na2CrO4 + H2O సమీకరణాన్ని తుల్యం చేయండి. (AS 1) ఒక మార్కు
జ: 2 Cr2O3 + 8 NaOH + 3 O2 4 Na2CrO4 + 4 H2O
25. FeCl3 + H2O Fe(OH)3 + HCl సమీకరణాన్ని తుల్యం చేయండి. (AS 1) ఒక మార్కు
జ: FeCl3 + 3 H2O Fe(OH)3 + 3 HCl
26. NH3 + Cl2 NH4Cl + N2 సమీకరణాన్ని తుల్యం చేయండి. (AS 1) ఒక మార్కు
జ: 8 NH3 + 3 Cl2 6 NH4Cl + N2
1. 'ఒక రసాయన చర్యలో పాల్గొనే పదార్థాల మొత్తం ద్రవ్యరాశి చర్యకు ముందు, తర్వాత సమానంగా ఉండాలి' అని తెలిపే నియమం ఏది? (AS1) ఒక మార్కు
జ: ద్రవ్య నిత్యత్వనియమం
2. సోడియం సల్ఫేట్ ద్రావణంలో బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని కలిపే ప్రయోగంలో ఏర్పడే అవక్షేపం ఏది?
జ: బేరియం సల్ఫేట్ అవక్షేపం ఏర్పడుతుంది. (AS3) 2 మార్కులు
Na2SO4 + BaCl2 BaSO4 + 2 NaCl
3. పొడి సున్నాన్ని నీటిలో కలిపినప్పుడు గుర్తించే ఉష్ణ రసాయన చర్య ఏమిటి? (AS3) ఒక మార్కు
జ: ఉష్ణమోచక చర్య
4. పొడి సున్నాన్ని నీటిలో కలిపే ప్రయోగంలో ఏర్పడే ఏ ఉత్పన్నం ఎరుపు లిట్మస్‌ను నీలిరంగుకు మారుస్తుంది? (AS3) ఒక మార్కు
జ: కాల్షియం హైడ్రాక్సైడ్
5. జింక్ ముక్కలు సజల HCl తో జరిపే చర్యకు రసాయన సమీకరణాన్ని రాయండి. (AS1) ఒక మార్కు
జ: Zn + 2 HCl ZnCl2 + H2
6. ప్రొపేన్‌ను గాలిలో దహనం చెందించే చర్యకు తుల్యరసాయన సమీకరణం రాయండి. (AS1) ఒక మార్కు
జ: C3H8 + 5 O2 3 CO2 + 4 H2O
7. Fe2O3 + 2 Al 2 Fe + Al2O3
పై రసాయన చర్యలో క్రియాజనకాలను గుర్తించండి. (AS4) ఒక మార్కు
జ: Fe2O3 మరియు Al
8. రసాయనిక సమీకరణం ఏ అదనపు సమాచారాన్ని సూచిస్తుంది? (AS1) 2 మార్కులు
జ: 1) భౌతిక స్థితి
2) ఉష్ణోగ్రత మార్పులు
3) ఏదైనా వాయువు వెలువడటం
4) ఏదైనా అవక్షేపం ఏర్పడటం
9. Fe2O3 + 2 Al 2 Fe + Al2O3
పై రసాయన చర్యలో Δ దేన్ని సూచిస్తుంది? (AS4) ఒక మార్కు
జ: Δ అనే గుర్తు వేడిచేయడాన్ని సూచిస్తుంది.
10. N2 + O2 + Q 2 NO
పై రసాయనిక చర్య అనేది ఉష్ణమోచక చర్యా లేదా ఉష్ణగ్రాహక చర్యా తెలపండి. (AS1) ఒక మార్కు
జ: ఉష్ణగ్రాహక చర్య
11. ఒక రసాయన చర్యలో వాయువు విడుదలైతే దాన్ని ఏ గుర్తు ఉపయోగించి సూచిస్తారు? (AS1) ఒక మార్కు
జ:
12. కింది చర్యలో ఏర్పడే అవక్షేపం పేరును తెలపండి.
జ: AgCl
13. కింది రసాయన సమీకరణంలో క్రియాజనకాల, క్రియాజన్యాల భౌతిక స్థితులను సూచించండి. (AS1) ఒక మార్కు
6 CO2 + 6 H2O C6H12O6 + 6 O2
14. S.T.P.వద్ద ఒక గ్రాము హైడ్రోజన్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణం ఎంత? (AS1) ఒక మార్కు
జ: 11.2 లీటర్లు
15. ఒక మోల్ హైడ్రోజన్ వాయువులో S.T.P. వద్ద ఉండే అణువుల సంఖ్య ఎంత? (AS1) ఒక మార్కు
జ: 6.023 × 1023 అణువులు
16. ఏ ఉష్ణోగ్రత, పీడనాలను S.T.P.గా వ్యవహరిస్తారు? (AS1) ఒక మార్కు
జ: 0°C లేదా 273 K ఉష్ణోగ్రత, 760 మిల్లీ లీటర్ల లేదా 1 బార్ పీడనం.
17. S.T.P. వద్ద ఒక మోల్ వాయువు ఎంత ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది? (AS1) ఒక మార్కు
జ: 22.4 లీటర్లు
17. S.T.P. వద్ద ఒక మోల్ వాయువు ఎంత ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది? (AS1) ఒక మార్కు
జ: 22.4 లీటర్లు
18. 0.5 మోల్‌ల ఆక్సిజన్ వాయువు S.T.P. వద్ద ఎన్ని మిల్లీ లీటర్ల ఘపపరిమాణాన్ని ఆక్రమిస్తుంది? (AS1) ఒక మార్కు
జ: 11200 మిల్లీ లీటర్లు
19. కింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి. (AS1) 2 మార్కులు
(i) BaCl2 + H2SO4 BaSO4 + HCl
(ii) Cu2S + O2 Cu2O + SO2
జ: (i) BaCl2 + H2SO4 BaSO4 + 2 HCl
(ii) 2 Cu2S + 3 O2 2 Cu2O + 2 SO2
20. కింది సమీకరణాలను పూర్తి చేసి తుల్యం చేయండి. (AS1) 2 మార్కులు
(i) C3H8 + O2 ......... + .........
(ii) Na + H2O ......... + .........
జ: (i) C3H8 + 5 O2 3 CO2 + 4 H2O
(ii) 2 Na + 2 H2O 2 NaOH + H2