• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రసాయన సమీకరణాలు

* రసాయన మార్పులను రసాయన సమీకరణాల ద్వారా సూచిస్తారు.
* ఒక రసాయనిక చర్యను క్లుప్తంగా, అర్థవంతంగా సూచించే సాంకేతిక సమీకరణాన్ని రసాయనిక సమీకరణం అంటారు.
* ఒక రసాయన చర్యలో ఏ పదార్థాలు రసాయన మార్పునకు గురవుతాయో వాటిని క్రియాజనకాలు అంటారు. కొత్తగా ఏర్పడిన పదార్థాలను క్రియాజన్యాలు అంటారు.
* క్రియాజనకాలను సమీకరణానికి ఎడమవైపు రాస్తారు. అవి ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాటిని '+' గుర్తుతో అనుసంధానం చేసి రాస్తారు.
* క్రియాజన్యాలను సమీకరణానికి కుడివైపు రాస్తారు. అవి ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని '+' గుర్తుతో అనుసంధానం చేసి రాస్తారు.
* క్రియాజన్యాలను, క్రియాజనకాలను బాణం గుర్తు ()తో వేరుచేసి రాస్తారు. బాణపు గుర్తు తల క్రియాజన్యాలవైపు ఉంటూ రసాయనిక చర్య దిశను తెలియజేస్తుంది.
* కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.
    CaO + H2O  Ca(OH)2


* సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్‌తో చర్య జరిపి తెల్లని అవక్షేపమైన‌ బేరియం సల్ఫేట్ ఏర్పడుతుంది.
    Na2SO4 + BaCl2 BaSO4 + NaCl


* జింక్ లోహం సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి జింక్ క్లోరైడ్, హైడ్రోజన్ వాయువును ఏర్పరుస్తుంది.
    Zn + 2 HCl  ZnCl2 + H2


* రసాయన చర్యలో క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి, క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశికి సమానం. దీన్నే ద్రవ్య నిత్యత్వ నియమం అంటారు.
* చర్య జరగక ముందు, చర్య జరిగిన తర్వాత మూలక పరమాణువుల సంఖ్య సమానంగా ఉంటుంది.
* రసాయన చర్యలో పరమాణువులను సృష్టించలేం లేదా నాశనం చేయలేం.


* ఏ రసాయన సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపు ఉండే మూలక పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాల వైపు ఉండే మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అలాంటి రసాయన సమీకరణాన్ని తుల్య రసాయన సమీకరణం అంటారు.
ఉదా: 2 H2 + O2  

2 H2O
         C3H8 + 5 O2   3 CO2 + 4 H2O
         Fe2O3 + 2 Al  2 Fe + Al2O3


* రసాయన సమీకరణాల ద్వారా మరింత సమాచారం తెలుసుకోవడానికి క్రియాజనకాలు, క్రియాజన్యాలకు సంబంధించిన కింది లక్షణాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
(i) భౌతిక స్థితి
(ii) ఉష్ణోగ్రతలో మార్పులు (ఉష్ణగ్రాహక లేదా ఉష్ణమోచక చర్యలు)
(iii) ఏదైనా వాయువు వెలువడటం
(iv) ఏదైనా అవక్షేపం ఏర్పడటం


* ఒక రసాయన సమీకరణంలో మరింత సమాచారం కోసం క్రియాజనకాల, క్రియాజన్యాల భౌతిక స్థితులను తెలియజేయాలి. పదార్థాలు ప్రధానంగా ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటాయి. వీటిని వరుసగా (ఘ), (ద్ర), (వా) లాంటి గుర్తులతో రసాయన సమీకరణాల్లో సూచిస్తారు. ఏదైనా పదార్థం నీటిలో కరిగి ఉన్నట్లయితే వాటిని జల ద్రావణాలు అంటారు. వాటిని (జ.ద్రా.)తో సూచిస్తారు.


* ఉష్ణాన్ని విడుదల చేస్తూ జరిగే చర్యలను ఉష్ణమోచక చర్యలు, ఉష్ణాన్ని గ్రహిస్తూ జరిగే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు.
ఉదా: C + O2 CO2 + Q (ఉష్ణమోచక చర్య)
       (ఘ)   (వా)           (వా)
          N2 + O2 2 NO - Q (ఉష్ణగ్రాహక చర్య)
        (వా)    (వా)              (వా)
* సమీకరణంలో 'Q' ఉష్ణశక్తిని సూచిస్తుంది. క్రియాజన్యాల వైపు ఉన్న కూడిక‌ గుర్తు (+) ఉష్ణమోచక చర్యలను, తీసివేత గుర్తు (-) ఉష్ణగ్రాహక చర్యలను సూచిస్తుంది.


* ఒక రసాయన చర్యలో వాయువు విడుదలైతే దాన్ని పైకి చూపిస్తున్న బాణపు గుర్తు () తో సూచిస్తాం.
ఉదా: Zn + H2SO4 ZnSO4 + H
          (ఘ) (జ.ద్రా.)           (జ.ద్రా.)    (వా)
* ఒక రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడితే దాన్ని కింది వైపు చూపిస్తున్న బాణపు గుర్తు ()తో సూచిస్తాం (లేదా) అవ‌క్షేపం చెందిన పదార్థం ఫార్ములాను (ఘ‌.) పాదాంకంగా ఇస్తాం.
ఉదా: AgNO3 + NaCl  AgCl  + NaNO3
            (జ.ద్రా.)    (జ.ద్రా.)          (ఘ)        (జ.ద్రా.)

* చర్య జరగడానికి అవసరమైన ఉష్ణోగ్రత, పీడనం, ఉత్ప్రేరకం లాంటి వాటిని బాణపు గుర్తు కింద లేదా పైన సూచిస్తాం.

తుల్య రసాయన సమీకరణం తెలియజేసే అంశాలు
(i) రసాయన సమీకరణం క్రియాజనకాలు, క్రియాజన్యాలకు సంబంధించిన గుర్తులు; ఫార్ములాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది.
(ii) ఏయే మూలకాలకు చెందిన పరమాణువులు చర్యలో పాల్గొన్నాయి, ఏయే మూలకాలకు చెందిన క్రియాజన్యాలు ఏర్పడ్డాయో తెలుపుతుంది.
(iii) క్రియాజనకాలు, క్రియాజన్యాలకు సంబంధించిన సాపేక్ష ద్రవ్యరాశుల సమాచారాన్ని తెలుపుతుంది.
(iv) క్రియాజనకాల, క్రియాజన్యాల మోలార్ నిష్పత్తులను తెలియజేస్తుంది.
(v) రసాయన చర్యలో వాయువులు పాల్గొన్నప్పుడు క్రియాజనకాల, క్రియాజన్యాల సాపేక్ష ఘనపరిమాణాలను తెలియజేస్తుంది.
(vi) మోలార్ ద్రవ్యరాశి, అవగాడ్రో సంఖ్యను ఉపయోగించి సమీకరణంలోని వివిధ పదార్థాల అణువులు, పరమాణువుల సంఖ్యను లెక్కించవచ్చు.
(vii) తుల్యం చేసిన రసాయన సమీకరణం నుంచి కింది సంబంధాలను తెలుసుకోవచ్చు.
ఎ) ద్రవ్యరాశి - ద్రవ్యరాశి సంబంధం
బి) ద్రవ్యరాశి - ఘనపరిమాణం సంబంధం
సి) ఘనపరిమాణం - ఘనపరిమాణం సంబంధం
డి) ద్రవ్యరాశి - ఘనపరిమాణం, అణువుల సంఖ్యల మధ్య సంబంధం మొదలైనవి.

 

 ర‌సాయ‌నిక  స‌మీక‌ర‌ణాలు

భావ‌న‌ల అమ‌రిక చిత్రం

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం