* ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి, నీలి లిట్మస్‌ను ఎర్రగా మారుస్తాయి.
* క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉండి, ఎరుపు లిట్మస్‌ను నీలి రంగుకు మారుస్తాయి.
* సహజసిద్ధంగా లభించే లిట్మస్, ఎర్ర క్యాబేజీ రసం, పసుపు నీరు, రంగు పుష్పాల ఆకర్షక పత్రాల రసాలు లాంటివి బలహీన ఆమ్ల లేదా క్షార సంబంధమైన జీవ అణువులను కలిగి ఉంటాయి. వీటిని ద్రావణాల ఆమ్ల, క్షార స్వభావాన్ని పరీక్షించడానికి ఆమ్ల - క్షార సూచికలుగా ఉపయోగించుకోవచ్చు.
* మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్తలీన్ లాంటి రసాయనిక సూచికలు (కృత్రిమ సూచికలు) ఆమ్ల, క్షార స్వభావాన్ని పరీక్షించడానికి ఉపయోగపడతాయి.
* ఆమ్లాలు నారింజ రంగు ఉన్న మిథైల్ ఆరెంజ్ సూచికను ఎరుపు రంగుగా మారుస్తాయి. ఆమ్లాలు ఫినాఫ్తలీన్ సూచికను రంగు లేని ద్రవంగా మారుస్తుంది.
* క్షారాలు నారింజ రంగు ఉన్న మిథైల్ ఆరెంజ్ సూచికను పసుపు రంగుగా మారుస్తాయి. క్షారాలు ఫినాఫ్తలీన్‌లో గులాబి రంగుకు మారుతాయి.
* కొన్ని పదార్థాలు ఆమ్ల, క్షార యానకంలో వాసనలను ప్రదర్శిస్తాయి. వాటిని సువాసన (Olfactory) సూచికలు అంటారు.
ఉదా: ఉల్లిపాయ, వెనీలా ఎసెన్స్, లవంగ నూనెలు.
* ఆమ్లాలు Zn, Mg లాంటి లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
2 HCl + Zn ZnCl2 + H2
(జ.ద్రా.) (ఘ) (జ.ద్రా.) (వా)
2 HCl + Mg MgCl2 + H2
(జ.ద్రా.) (ఘ.) (జ.ద్రా.) (వా)
* సోడియం హైడ్రాక్సైడ్ జింక్ లోహంతో చర్య జరిపి సోడియం జింకేట్, హైడ్రోజన్ వాయువులను ఏర్పరుస్తుంది.
2 NaOH + Zn Na2ZnO2 + H2
(జ.ద్రా.) (ఘ) (జ.ద్రా.) (వా)
* అన్ని లోహ కార్బొనేట్లు, లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి ఆమ్ల లోహ లవణాలతో పాటు కార్బన్ డైఆక్సైడ్ వాయువు, నీటిని ఏర్పరుస్తాయి.
లోహ కార్బొనేట్ + ఆమ్లం లవణం + కార్బన్ డైఆక్సైడ్ + నీరు
లోహ హైడ్రోజన్ కార్బొనేట్ + ఆమ్లం లవణం + కార్బన్ డైఆక్సైడ్ + నీరు
Na2CO3 + 2 HCl 2 NaCl + H2O + CO2
(జ.ద్రా.) (ద్ర) (వా)
NaHCO3 + HCl NaCl + H2O + CO2
(ఘ) (జ.ద్రా.) (జ.ద్రా.) (ద్ర) (వా)
* కార్బన్ డై ఆక్సైడ్ వాయువును సున్నపు నీరు ద్వారా పంపినప్పుడు సున్నపు నీరు పాల వలె తెల్లగా మారుతుంది.
Ca(OH)2 + CO2 CaCO3 + H2O
తెల్లని అవక్షేపం
* ఆమ్లం క్షారంతో చర్య జరిపి లవణం, నీరు ఏర్పడే చర్యను తటస్థీకరణం అంటారు.
HCl + NaOH NaCl + H2O
ఆమ్లం + క్షారం లవణం + నీరు
* యాంటాసిడ్ బిళ్లల్లో క్షార పదార్థం ఉంటుంది. యాంటాసిడ్ బిళ్లను ఉపయోగించినప్పుడు ఉదరంలో తటస్థీకరణ చర్య జరుగుతుంది.
* లోహ ఆక్సైడ్‌లతో ఆమ్లాలు చర్య జరిపి లవణాలను, నీటిని ఏర్పరుస్తాయి.
CuO + 2 HCl CuCl2 + H2O
లోహ ఆక్సైడ్ + ఆమ్లం లవణం + నీరు
* క్షారాలు అలోహ ఆక్సైడ్‌లతో చర్య జరిపి లవణాలు, నీటిని ఏర్పరుస్తాయి.
CO2 + Ca(OH)2 CaCO3 + H2O
లోహ ఆక్సైడ్ + క్షారం లవణం + నీరు
* ఆమ్ల జల ద్రావణాలు విద్యుత్ వాహకాలుగా ప్రవర్తిస్తాయి. దీనికి కారణం H+ అయాన్‌లు కలిగి ఉండటమే.
* గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాల్లో బల్బు వెలగదు. దీనికి కారణం ద్రావణంలో H+ అయాన్‌లు ఉండవు.
* జల ద్రావణంలో H+ లేదా H3O+ అయాన్‌లను ఇచ్చే పదార్థాలను ఆమ్లాలు అంటారు.
* జల ద్రావణంలో OH- అయాన్‌లను ఇచ్చే పదార్థాలను క్షారాలు అంటారు.
* నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటారు.
* ఒక ఆమ్లం లేదా క్షారం నీటిలో కరిగించే ప్రక్రియ ఉష్ణమోచక చర్య అవుతుంది.
* ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటికి కలిపినప్పుడు యానిట్ ఘన పరిమాణంలో H+/ OH- అయాన్‌ల గాఢత తగ్గుతుంది. ఈ ప్రక్రియను విలీనం అంటారు. ఆ ఆమ్లం లేదా క్షారాన్ని విలీన ఆమ్లం లేదా విలీన క్షారం అంటారు.
* జల ద్రావణంలో ఎక్కువ సంఖ్యలో H+ అయాన్‌లను ఏర్పరిచే పదార్థాన్ని బలమైన ఆమ్లం అంటారు.
ఉదా: HCl, H2SO4
* జల ద్రావణంలో తక్కువ సంఖ్యలో H+ అయాన్‌లను ఏర్పరిచే పదార్థాన్ని బలహీన ఆమ్లం అంటారు.
ఉదా: CH3COOH, H2CO3
* జల ద్రావణంలో ఎక్కువ సంఖ్యలో OH- అయాన్‌లను ఏర్పరిచే పదార్థాన్ని బలమైన క్షారం అంటారు.
ఉదా: NaOH
* జల ద్రావణంలో తక్కువ సంఖ్యలో OH- అయాన్‌లను ఏర్పరిచే పదార్థాన్ని బలహీన క్షారం అంటారు.
ఉదా: NH4OH
* సార్వత్రిక సూచికను ఆమ్ల లేదా క్షారాల బలాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
* సార్వత్రిక సూచిక అనేక సూచికల మిశ్రమం.
* సార్వత్రిక సూచిక జల ద్రావణంలో హైడ్రోజన్ అయాన్‌ల వేర్వేరు గాఢతల వద్ద వేర్వేరు రంగులను సూచిస్తుంది.
* ద్రావణంలోని హైడ్రోజన్ అయాన్ గాఢతను సూచించడానికి సోరెన్‌సేన్ pH మానాన్ని ప్రవేశపెట్టాడు.
* ద్రావణంలోని హైడ్రోజన్ అయాన్ గాఢతను లెక్కించడానికి వాడే స్కేలును pH స్కేలు అంటారు.
* ఆమ్ల ద్రావణాలకు pH విలువ 0 నుంచి 7 వరకు ఉంటుంది. ఆమ్ల ద్రావణాలకు pH < 7
* క్షార ద్రావణాలకు pH విలువ 7 నుంచి 14 వరకు ఉంటుంది. క్షార ద్రావణాలకు pH > 7
* తటస్థ ద్రావణాల pH విలువ 7 కు సమానమవుతుంది. తటస్థ ద్రావణాలకు pH = 7
ఉదా: స్వేదన జలం pH విలువ 7
* జీవ సంబంధ ప్రాణులన్నీ pH విలువల్లోని అతి స్వల్ప మార్పులకు లోబడి మాత్రమే జీవించగలవు.
* వర్షపు నీటి pH విలువ 5.6 కంటే తక్కువైతే దాన్ని ఆమ్ల వర్షం అంటారు.
* ఆమ్ల వర్షపు నీరు నదీ జలాల్లో కలిసినప్పుడు నదీ జలాల pH విలువలు తగ్గుతాయి. ఈ తక్కువ pH విలువలు ఉండే నదీ జలాల్లోని జలచరాల జీవనం సంకటంలో పడుతుంది.
* pH విలువ 5.5 కంటే తక్కువ అయితే దంత క్షయం ప్రారంభమవుతుంది.
* దంతాలపై పింగాణి పొర కాల్షియం ఫాస్పేట్‌తో తయారవుతుంది.
* నోటిలో ఉన్న బ్యాక్టీరియా దంతాల మధ్య చిక్కుకుని చక్కెర లాంటి ఆహార కణాలను వియోగం చెందించి ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి pH విలువ తగ్గుతుంది.
* ఆహారం తిన్న తర్వాత నోటిని క్షార స్వభావం ఉండే టూత్‌పేస్టు ఉపయోగించి శుభ్రపరచడం వల్ల ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను తటస్థీకరించడం ద్వారా దంత క్షయాన్ని నివారించవచ్చు.
* జీర్ణక్రియలో మన జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణాశయానికి నష్టం కలగకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది.
* అజీర్తి సందర్భంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వల్ల కడుపులో మంట, అసహనం కలుగుతాయి.
* యాంటాసిడ్‌లు కడుపులో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లేదా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యాంటాసిడ్‌గా ఉపయోగపడుతుంది.
* మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి నిర్దిష్ట పరిమితిలో pHను కలిగియున్న మట్టి అవసరం.
* తేనెటీగ కుట్టినప్పుడు దాని కొండి ద్వారా ఆమ్లాన్ని పంపడం వల్ల తీవ్రమైన నొప్పి, దురద కలుగుతాయి. బేకింగ్ సోడా లాంటి బలహీన క్షారాన్ని తేనెటీగ కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పి తీవ్రత తగ్గుతుంది.
* ఆకులపై ముండ్లు (నూగు) ఉండే దూలగొండి మొక్క మనకు గుచ్చుకున్నప్పుడు అది మిథనోయిక్ ఆమ్లాన్ని శరీరంలోకి ప్రవేశపెడుతుంది. దానివల్ల తీవ్రమైన మంట కలుగుతుంది. దూలగొండి మొక్క గుచ్చుకున్న ప్రదేశంలో దుష్టిపాకు ఆకులతో రుద్దితే ఉపశమనం ఉంటుంది.
* ఆమ్లం క్షారంతో చర్య జరిపి లవణాన్ని ఏర్పరుస్తుంది.
* బలమైన ఆమ్లం, బలమైన క్షారాల మధ్య చర్య వల్ల ఏర్పడిన లవణాలు తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాటి pH విలువ 7కు సమానం.
ఉదా: NaCl, KCl
* బలమైన ఆమ్లం, బలహీనమైన క్షారాల నుంచి పొందే లవణాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాటి pH విలువ 7 కంటే తక్కువ.
ఉదా: NH4Cl, AlCl3.
* బలమైన క్షారం, బలహీనమైన ఆమ్లాల నుంచి పొందే లవణాలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటి pH విలువ 7 కంటే ఎక్కువ.
ఉదా: Na2CO3, NaHCO3
* బలహీన ఆమ్లం, బలహీన క్షారం నుంచి పొందే లవణాల స్వభావం ఆమ్లం, క్షారాల సాపేక్ష బలాల మీద ఆధారపడి ఉంటుంది.
* ఒకే విధమైన ధన అయాన్లను లేదా రుణావేశ రాడికల్స్‌ను కలిగి ఉన్న లవణాలను ఒకే కుటుంబానికి చెందినవిగా పరిగణిస్తారు.
ఉదా: NaCl, Na2SO4 లను సోడియం లవణాల కుటుంబానికి చెందినవిగా పరిగణిస్తారు.
* సోడియం క్లోరైడ్‌ను సామాన్య ఉప్పు లేదా టేబుల్ సాల్ట్ అంటారు. ఆహార పదార్థాల రుచిని పెంచడానికి సోడియం క్లోరైడ్ (NaCl)ను ఉపయోగిస్తారు.
* నిత్య జీవితంలో ఉపయోగించే సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా, బట్టల సోడా, బ్లీచింగ్ పౌడర్ లాంటి ఎన్నో రకాల పదార్థాల తయారీకి సాధారణ ఉప్పు ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది.
* సోడియం క్లోరైడ్ జల ద్రావణం (బ్రైన్ ద్రావణం) ద్వారా విద్యుత్‌ను ప్రవహింపజేసినప్పుడు అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. ఆనోడ్ వద్ద క్లోరిన్, కాథోడ్ వద్ద హైడ్రోజన్ ఏర్పడతాయి.
2 NaCl + 2 H2O 2 NaOH + Cl2 + H2
(జ.ద్రా.) (ద్ర) (జ.ద్రా.) (వా) (వా)
* సోడియం హైడ్రాక్సైడ్‌ను గ్రీజ్‌ను తొలగించడానికి; సబ్బులు, డిటర్జెంట్లు, పేపరు తయారీకి; కృత్రిమ దారాలకు ఉపయోగిస్తారు.
* కాల్షియం ఆక్సీక్లోరైడ్ (CaOCl2)ను సాధారణంగా బ్లీచింగ్ పౌడర్ అంటారు.
* తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా క్లోరిన్ వాయువును పంపినప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది.
Ca(OH)2 + Cl2 CaOCl2 + H2O
బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలు:
(i) వస్త్ర పరిశ్రమలో కాటన్, నారలను విరంజనం చేయడానికి; కాగితం పరిశ్రమలో కలప గుజ్జును విరంజనం చేయడానికి; దుస్తులను విరంజనం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.
(ii) రసాయన పరిశ్రమల్లో దీన్ని ఆక్సీకారిణిగా ఉపయోగిస్తారు.
(iii) తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమిసంహారిణిగా ఉపయోగిస్తారు.
(iv) క్లోరోఫామ్ తయారీలో కారకంగా ఉపయోగిస్తారు.
* బేకింగ్ సోడా లేదా వంటసోడా రసాయన నామం సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ లేదా సోడియం బైకార్బొనేట్ (NaHCO3). వంటసోడా ఒక క్షయం చెందని బలహీనమైన క్షారం.
* NaCl జల ద్రావణం, అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్ మిశ్రమాన్ని వేడిచేసినప్పుడు సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఏర్పడుతుంది.
NaCl + H2O + CO2 + NH3 NH4Cl + NaHCO3
బేకింగ్ సోడా ఉపయోగాలు
(i) బేకింగ్ పౌడర్‌లో ప్రధాన అనుఘటకం NaHCO3. దీంతోపాటు ఆమ్ల కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్ Ca(H2PO4)2, పిండి పదార్థాలు బేకింగ్ పౌడర్‌లో ఉంటాయి. సోడియం బై కార్బోనేట్ (NaHCO3) బేకింగ్‌లో, బ్రెడ్, కేక్ తయారీలో పిండి పొంగడానికి, మృదువుగా మారడానికి CO2ను విడుదల చేయడం ద్వారా ఉపయోగపడుతుంది.
NaHCO3 + H+ CO2 + H2O + Na- (ఆమ్లం యొక్క సోడియం లవణం)
(ii) ఇది ఉదరంలో అధికంగా ఉన్న ఆమ్లాన్ని తొలగించడానికి యాంటాసిడ్‌గా ఉపయోగపడుతుంది.
(iii) దీన్ని అగ్నిమాపక యంత్రాల్లో మంటలు ఆర్పడానికి సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు.
(iv) ఇది బలహీనమైన యాంటీసెప్టిక్‌గా ఉపయోగపడుతుంది.
* వాషింగ్ సోడా లేదా బట్టల సోడా ఫార్ములా Na2CO3 . 10 H2O
* బేకింగ్ సోడాను వేడి చేస్తే సోడియం కార్బొనేట్ ఏర్పడుతుంది.
2 NaHCO3 Na2CO3 + CO2 + H2O
* సోడియం కార్బొనేట్‌ను పునఃస్ఫటికీకరణం చేస్తే వాషింగ్ సోడా లభిస్తుంది.
Na2CO3 + 10 H2O Na2CO3 . 10 H2O
వాషింగ్ సోడా ఉపయోగాలు:
i) గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమల్లో సోడియం కార్బొనేట్‌ను (వాషింగ్ సోడా) ఉపయోగిస్తారు.
ii) బోరాక్స్ లాంటి సోడియం సమ్మేళనాల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు.
iii) గృహావసరాల్లో సోడియం కార్బొనేట్‌ను వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
iv) నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తారు.
* ఒక లవణం ఫార్ములా యూనిట్‌లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటారు.
* ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ రసాయన ఫార్ములా CuSO4. 5 H2O.
* ఆర్ద్ర లవణాలకు కొన్ని ఉదాహరణలు:
i) వాషింగ్ సోడా - Na2CO3 . 10 H2O
ii) జిప్సమ్ - CaSO4 . 2 H2O
* నీలి రంగులో ఉన్న ఆర్ద్ర కాపర్ సల్ఫేట్‌ను వేడి చేసినప్పుడు అది నీటి అణువులను కోల్పోయి తెల్లగా మారుతుంది.
* కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ (CaSO4 . H2O) ను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు.
* జిప్సమ్‌ను 373 K ఉష్ణోగ్రతకు వేడి చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏర్పడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఒక తెల్లని పొడి.
* శరీరంలో విరిగిన ఎముకలను తిరిగి సక్రమంగా అతికించడానికి వేసే కట్టులో డాక్టర్లు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఉపయోగిస్తారు.
* ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను నీటితో కలిపినప్పుడు జిప్సం ఏర్పడటం వల్ల అది ఒక దృఢమైన ఘన పదార్థంగా మారుతుంది.
CaSO4 . H2O + 1
H2O
CaSO4 . 2 H2O
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ జిప్సం
* ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను బొమ్మల తయారీలో; అలంకరణకు ఉపయోగించే పదార్థాల తయారీకి; గోడలు, ఇతర కట్టడాల ఉపరితలాలను నునుపు చేయడానికి ఉపయోగిస్తారు.
ఆమ్లాలు, క్షారాలు, లవణాలు
భావనల అమరిక చిత్రం: