• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆమ్లాలు - క్షారాలు - లవణాలు

1. నీటిలో కరిగిన క్షార ద్రావణం విద్యుత్ వాహకతను కలిగి ఉంటుందని చూపే ప్రయోగ పటాన్ని గీసి భాగాలను గుర్తించండి.  (AS - 5) 4 మార్కులు


2. విలీన HClతో జింక్ ముక్కల చర్య, మండుతున్న కొవ్వొత్తితో హైడ్రోజన్ వాయువును పరిరక్షించడానికి చూపే ప్రయోగ పటాన్ని గీసి భాగాలను గుర్తించండి.  (AS - 5) 4 మార్కులు


3. కార్బొనేట్లు, లోహ హైడ్రోజన్ కార్బొనేట్లతో ఆమ్లాల చర్యను సూచించే ప్రయోగ పటాన్ని గీసి భాగాలను గుర్తించండి.    (AS - 5) 4 మార్కులు


పై పట్టిక (pH స్కేలు)లో బలమైన, బలహీనమైన ఆమ్లాలు అలాగే క్షారాలు, తటస్థ పదార్థాల అవధులను గుర్తించండి. (AS - 5) 2 మార్కులు


5. పక్క పటంలో భాగాలను గుర్తించండి.  (AS - 5) 2 మార్కులు


6. 
   

a) పై పటం దేన్ని సూచిస్తుంది? రసాయన సమీకరణాన్ని రాయండి.
b) పై పటంలోని భాగాలను గుర్తించండి.    (AS - 5) 4 మార్కులు


7.
       
a) పై పటం దేన్ని సూచిస్తుంది. భాగాలను గుర్తించండి.
b) పటంలో జరిగే చర్యకు తుల్య సమీకరణాన్ని రాయండి. (AS - 5) 4 మార్కులు

 

8.
    
a) పై పటం దేన్ని సూచిస్తుంది?
b) భాగాలను గుర్తించండి. (AS - 5) 2 మార్కులు

 

9.

పై చిహ్నం ఏం సూచిస్తుంది? (AS - 1) ఒక మార్కు


10.
      

a) పక్క పటం దేన్ని సూచిస్తుంది?
b) భాగాలను గుర్తించండి. (AS - 5) 2 మార్కులు

 

11. మీకు ఒక్కోదానిలో వేర్వేరుగా స్వేదన జలం, ఆమ్లం, క్షారం ఉన్న మూడు పరీక్ష నాళికలు ఇచ్చారు. ఒకవేళ మీకు ఎరుపు లిట్మస్ కాగితం మాత్రమే ఇస్తే దాని సహాయంతో ఆ మూడు పరీక్ష నాళికల్లో ఉండే ద్రావణాలను ఎలా గుర్తిస్తారు?  (AS - 1) 2 మార్కులు
 

12. ఒక సోడియం సమ్మేళనం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు బుసబుస పొంగుతూ బుడగల రూపంలో వాయువు విడుదల అవుతుంది. ఈ చర్యలో విడుదలైన వాయువు మండుతున్న కొవ్వొత్తిని ఆర్పుతుంది. సున్నపు నీటిని పాలలా తెల్లగా మారుస్తుంది. ఈ చర్యలో ఏర్పడిన ఒక సమ్మేళనం సోడియం క్లోరైడ్. (AS - 4) 4 మార్కులు
i) వెలువడిన వాయువు పేరేమిటి?
ii) కొవ్వొత్తి ఎందుకు ఆరిపోతుంది?
iii) జరిగిన చర్యకు తుల్య సమీకరణాన్ని రాయండి.
iv) సున్నపు నీరు పాలలా మారినప్పుడు ఏర్పడిన అవక్షేపం ఏమిటి?


13. నీటితో కలిసిన ఆమ్ల ద్రావణం లేదా నీటితో కలిసిన క్షార ద్రావణం విద్యుత్ వాహకతను కలిగి ఉంటుందనే అంశాన్ని మీరెలా ప్రయోగ పూర్వకంగా సరిచూస్తారు?  (AS - 3) 4 మార్కులు


14. ఒక ఆమ్లం, క్షారంతో చర్య జరిపినప్పుడు సూచిక రంగులో జరిగే మార్పును సూచించే ప్రయోగాన్ని తెలపండి. (AS - 3) 2 మార్కులు


15. ఆమ్లాన్ని నీటిలో కరిగించడం ఒక ఉష్ణమోచక చర్య (లేదా) ఉష్ణగ్రాహక చర్య అని నిర్ధారించే ప్రయోగాన్ని రాయండి (AS - 3) 2 మార్కులు


16. మీ పెరటిలోని మట్టిని ఎలా పరీక్షిస్తారు?   (AS - 3) 2 మార్కులు


17. Zn ముక్కలను HClతో, NaOHతో విడివిడిగా జరిపిన చర్యల్లో ఏ ఉత్పన్నం రెండు చర్యల్లోనూ వస్తుంది? (AS - 3) ఒక మార్కు


18. ప్రయోగశాలలో గాఢ ఆమ్లాన్ని, సజల ఆమ్లంగా మార్చడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలపండి. (AS - 3) ఒక మార్కు


19. అందుబాటులో ఉండే వస్తువుల నుంచి మీరు లిట్మస్ కాగితాన్ని ఎలా తయారు చేస్తారు?   (AS - 3) ఒక మార్కు


20. ఒక ఆమ్లం లోహంతో చర్య జరిపినప్పుడు సాధారణంగా వెలువడే వాయువు ఏది? దాన్ని ఎలా గుర్తిస్తారు? (AS - 3) ఒక మార్కు


21. ఒక విద్యార్థి మూడు వేర్వేరు పరీక్ష నాళికలు A, B, Cల్లో రంగులేని మూడు వేర్వేరు ద్రావణాలను తీసుకుని వాటిలో కొన్ని చుక్కల సార్వత్రిక సూచిక ద్రావణ్నాన్నిను కలిపాడు. అతడి పరిశీలనలో Aలోని ద్రావణం ఆకుపచ్చ రంగు, Bలోని ద్రావణం ఎరుపు రంగు, Cలోని ద్రావణం వంగ పువ్వు రంగుకు మారాయి. A, B, Cల్లో ఉన్న ద్రావణాలను, వాటి pH విలువల ఆరోహణా క్రమంలో అమర్చండి.    (AS - 1) ఒక మార్కు


22. తాగేనీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమి సంహారిణిగా దేన్ని ఉపయోగిస్తారు? దాని ఫార్ములాను రాయండి.


23. మీ కుటుంబలో ఎవరైనా ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటే సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు? (AS - 6) ఒక మార్కు


24. యాంటాసిడ్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు కడుపులో జరిగే చర్యను ఏమంటారు? యాంటాసిడ్‌లో ఉండే పదార్థం పేరు తెలిపి ఫార్ములాను రాయండి. (AS - 1) 2 మార్కులు


25. వాసన సంబంధిత సూచికలుగా వేటిని ఉపయోగిస్తారు?  (AS - 1) ఒక మార్కు


26. భోజనానికి ముందు, తర్వాత లాలాజలం pH విలువల్లో తేడా వస్తుంది. ఎందువల్లో ఊహించండి. (AS - 2) ఒక మార్కు


27. క్షార స్వభావం ఉన్న టూత్‌పేస్ట్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?  (AS - 6) ఒక మార్కు


28. దూలగొండి మొక్క ఆకులు, కాయలపై ఉండే ముండ్లు మన చర్మాన్ని తాకితే తీవ్రమైన మంట కలుగుతుంది ఎందుకు? దానికి పరిష్కారం ఏమిటి?  (AS - 6) 2 మార్కులు


29. ఒక విద్యార్థిని ఇంట్లో కేకును తయారుచేస్తే అది గట్టిగా, చిన్నదిగా తయారైంది. ఆమె ఏ పదార్థాన్ని కలపకపోవడం వల్ల కేకు ఇలా తయారైంది. కారణం తెలిపి వివరించండి.  (AS - 1) 2 మార్కులు


30. స్ఫటిక జలం ఉన్న లవణాల్లోని నీటి అణువుల సంఖ్యను తెలపండి.
i) జిప్సం     ii) వాషింగ్ సోడా      iii) కాపర్ సల్ఫేట్    iv) ఎప్సమ్      v) లవణం   (AS - 1) 2 మార్కులు


31. Ca(OH)2 + Cl2 CaOCl2 + H2O
    i) పై రసాయన చర్యలో ఏర్పడిన ముఖ్య ఉత్పన్నమేది?
    ii) దాని ఉపయోగాలు రాయండి.   (AS - 4) 2 మార్కులు


32. కింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పదార్థం వర్షపు నీరు నిమ్మరసం లాలాజలం(తిన్నతర్వాత) రక్తం స్వేదన జలం
pH విలువ 5 2.4 5.8 7.3 7

i) వర్షపు నీరు ఆమ్లమా లేదా క్షారమా తెలపండి.
ii) లాలాజలం విలువ ఇంకా తగ్గితే ఏమవుతుంది, కారణం తెలపండి.  (AS - 4) 2 మార్కులు

 

33.

పై పట్టికలో సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.  (AS - 4) 4 మార్కులు
i) pH విలువ తక్కువగా ఉన్న పదార్థం ఏది? దాని pH విలువ ఎంత?
ii) H2O స్వభావం ఏమిటి? కారణం తెలపండి.
iii) pH సార్వత్రిక సూచికను H2SO4కి కలిపినప్పుడు అది ఏ రంగుకు మారుతుంది?
iv) పై పదార్థాల్లో బలహీన క్షారం ఏది? కారణం తెలపండి.


34. కింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. (AS - 4) 4 మార్కులు

i) పై పటం దేన్ని సూచిస్తుంది?
ii) NaOH ఏర్పడటాన్ని చూపే చర్య సమీకరణం రాయండి.
iii) P.V.C.ను విస్తరించండి.
iv) ఉక్కును శుభ్రపరచడానికి దేన్ని ఉపయోగిస్తారు?

 

35. pH విలువల ఆధారంగా లవణాలు ఎన్ని రకాలో తెలిపి ఉదాహరణలనివ్వండి.
      ఆ లవణాలు ఏ విధంగా ఏర్పడతాయో తెలపండి.   (AS - 1) 4 మార్కులు


36. జిప్సం లాంటి ఆర్ద్ర లవణం కనుక్కుని ఉండకపోతే ఏం జరిగేదో ఊహించండి.  (AS - 2)  2 మార్కులు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం