• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం  

బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. ప్రతి కటకానికి ఉండే ప్రధాన నాభుల సంఖ్య                                                                        
A) 1     B) 2     C) 3     D) అనంతం

 

2. ఒక కటకానికి ఉండాల్సిన కనీస వక్రతలాల సంఖ్య                                                                  
A) 1     B) 2     C) 3     D) ఏదీకాదు

 

3. కటక నాభ్యంతరం ఆధారపడే అంశం                                                                                      
A) వక్రతావ్యాసార్థం     B) కటకం తయారైన పదార్థం     C) కటకం ఉంచిన యానకం     D) అన్నీ

 

4. కింది పదార్థాల్లో కటక తయారీకి పనికి రానిది                                                                       
A) నీరు     B) గాజు     C) ప్లాస్టిక్     D) మట్టి

 

5. కిందివాటిలో ఏ కటకాన్ని కేంద్రీకరణ కటకం అంటారు?                                                         
A) ద్వికుంభాకార    B) సమతల కుంభాకార    C) పుటాకార కుంభాకార    D) ద్విపుటాకార

 

6. కిందివాటిలో ఏ కటకాన్ని అపసరణ కటకం అంటారు?                                                           
A) కుంభాకార    B) పుటాకార    C) సమతల పుటాకార    D) సమతల కుంభాకార


7. కుంభాకార కటకాన్ని నీటిలో ఉంచితే దాని నాభ్యంతరం                                                       
A) మారదు     B) తగ్గుతుంది     C) పెరుగుతుంది     D) ఏదీకాదు

 

8. నీటిలో ఉంచిన గాలి బుడుగ ..... కటకంలా ప్రవర్తిస్తుంది                                                        
A) ద్వికుంభాకార    B) ద్విపుటాకార    C) సమతల కుంభాకార    D) సమతల పుటాకార

 

9. ద్వికుంభాకార కటకం   

                                                                                                     
   

10. ద్విపుటాకార కటకం     

                                                                                                   
    

11. కుంభాకార కటక సూత్రం     

                                                                                             
 

12. కిందివాటిలో కటక తయారీ సూత్రం ఏది?   

                                                                  
    

13. సంజ్ఞా సంప్రదాయం ప్రకారం కటక నాభ్యంతరం   

                                                      
 

 A) కుంభాకార కటకం  B) సమతల కుంభాకార కటకం  C) ద్వికుంభాకార కటకం  D) సమతల పుటాకార కటకం


 

A) పుటాకార కటకం  B) కుంభాకార కటకం C) సమతల పుటాకార కటకం D) సమతల కుంభాకార కటకం
 

16. మూడు వేర్వేరు పదార్థాలతో తయారు చేసిన కటకం ఏర్పరిచే ప్రతిబింబాల సంఖ్య                   
A) 1     B) 2     C) 3     D) 4

A) కుంభాకార, పుటాకార కటకాలు     B) పుటాకార, కుంభాకార కటకాలు
C) ద్వికుంభాకార కటకాలు           D) ద్విపుటాకార కటకాలు

   

A) కుంభాకార, పుటాకార కటకాలు         B) పుటాకార, కుంభాకార కటకాలు
C) ద్వికుంభాకార కటకాలు               D) ద్విపుటాకార కటకాలు

A) పుటాకార కటకం               B) కుంభాకార కటకం    
C) సమతల పుటాకార కటకం     D) పుటాకార కుంభాకార కటకం

19. పుటాకార కటకాన్ని సూచించే గుర్తు   

                                                                          
    

20. కుంభాకార కటకాన్ని సూచించే గుర్తు       

                                                                      
    

21. కటకం మధ్య బిందువును కిందివాటిలో దేనితో సూచిస్తారు?                                             
A) నాభి     B) వక్రతా కేంద్రం     C) కటకదృక్ కేంద్రం     D) ఏదీకాదు

 

22. కిందివాటిలో సరికాని జత.         

23. కిందివాటిలో సరికాని జత.
A) కాంతి కిరణాలు కేంద్రీకరణం - కుంభాకార కటకం    
B) కాంతి కిరణాలు విముఖీకరణం - పుటాకార కటకం
C) కాంతి కిరణాల కేంద్రీకరణ బిందువు - నాభి      
D) కాంతి కిరణాల విముఖీకరణ బిందువు - వక్రతా కేంద్రం


24. కిందివాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి.
A) కటకానికి రెండు వక్రతలాలు ఉంటాయి
B) కటక మధ్య బిందువును కటకదృక్ కేంద్రం అంటారు.
C) ప్రతి కటకానికి ఒక నాభి ఉంటుంది.
D) నాభి, దృక్ కేంద్రం మధ్య దూరాన్ని కటక నాభ్యంతరం అంటారు.


25. కుంభాకార కటకాన్ని సూక్ష్మదర్శిని తయారీలో ఉపయోగిస్తారు. ఎందుకంటే అది..?               (  )
A) వివర్తనం చెందిన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
B) ఆవర్తనం చెందిన మిథ్యా ప్రతిబింబాన్ని వస్తువువైపే ఏర్పరుస్తుంది.
C) వివర్తనం చెందిన నిజ ప్రతిబింబం తెరవెనుకాల ఏర్పరుస్తుంది.
D) ఆవర్తనం చెందిన నిజ ప్రతిబింబాన్ని, కటకం వైపున ఏర్పరుస్తుంది.
జవాబులు:  23-D;  24-C;  25-B
26. సూక్ష్మదర్శిని తయారీలో ఉపయోగించే కటకం?
A) పుటాకార     B) కుంభాకార     C) పుటాకార, కుంభాకార     D) సమతల కుంభాకార


27. పేపర్‌పై ఉన్న చిన్న అక్షరాలను చదివేందుకు ఉపయోగపడే కటకం?
A) ద్విపుటాకార కటకం         B) ద్వికుంభాకార కటకం   
C) సమతల పుటాకార కటకం    D) పుటాకార కుంభాకార కటకం


28. ఒక కుంభాకర కటకాన్ని నీటిలో ఉంచితే కటక నాభ్యంతరం.....
A) మారదు     B) తగ్గుతుంది     C) పెరుగుతుంది     D) ఏదీ కాదు


29. గాలిలో నిజ, మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకం?
A) కుంభాకార     B) పుటాకార     C) సమతల పుటాకార     D) సమతల కుంభాకార


30. మిథ్యా ప్రతిబింబం కటకానికి ఏ వైపున ఏర్పడుతుంది?
A) వెనుక     B) ముందు     C) మరోవైపు     D) వస్తువు ఉన్న వైపు


31. నిజ ప్రతిబింబం కటకానికి ...... వైపు ఏర్పడుతుంది.
A) ముందు     B) వెనుక     C) మరొక     D) వస్తువు ఉన్న వైపు


32. తెరపై పట్టలేని ప్రతిబింబం
A) తలకిందులు     B) నిటారైన     C) మిథ్యా ప్రతిబింబం     D) నిజ ప్రతిబింబం


33. కిందివాటిలో ఏ కటకం మిథ్యా, క్షీణించిన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది?
A) కుంభాకార     B) పుటాకార     C) ద్విపుటాకార     D) సమతల పుటాకార


34. ధృవానికి మరోపేరు
A) నాభి     B) నాభ్యంతరం     C) కటక కేంద్రం     D) వక్రతాకేంద్రం


35. లోపలికి వంగి ఉన్న రెండు గోళాకార భాగాలతో ఏర్పడిన కటకం?
A) ద్వికుంభాకార కటకం             B) ద్విపుటాకార కటకం
C) సమతల పుటాకార కటకం     D) సమతల కుంభాకార కటకం


36. వక్రతాకేంద్రం, ధృవాలను కలిపే రేఖ?
A) ప్రధానాక్షం     B) నాభ్యాంతరం     C) వక్రతా వ్యాసార్థం     D) పతన కిరణం


37. ప్రధానాక్షం ద్వారా పోయే కిరణం?
A) విచలనం చెందుతుంది        B) విచలనం చెందదు    
C) సమాంతర కిరణం        D) లంబంగా ఉండే కిరణం


38. వక్రతలాలపై పతనమైన కాంతి కిరణం విరళయానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణించినప్పుడు లంబానికి ........ గా విచలనం పొందుతుంది?
A) దగ్గర     B) దూరం     C) సమాంతరం     D) ఏదీకాదు

39. f నాభ్యంతరం ఉన్న కుంభాకార కటకాన్ని ప్రధాన అక్షానికి సమాంతరంగా రెండు భాగాలుగా కత్తిరిస్తే ప్రతి భాగం నాభ్యంతరం ఏమవుతుందో ఊహించండి?
A)          B) 2f         C) f             D) 4f 2

 


పై పటంలో చూపిన విధంగా కుంభాకార కటకాన్ని ప్రధాన అక్షానికి సమాంతరంగా ఏమవుతుందో ఊహించండి.
A) మారదు     B) రెట్టింపు అవుతుంది     C) సగం అవుతుంది     D) ఏదీకాదు

పై పటంలో చూపిన విధంగా f నాభ్యాంతరం ఉన్న కుంభాకార కటకాన్ని ప్రధాన అక్షానికి లంబంగా రెండు భాగాలుగా కత్తిరిస్తే ప్రతిభాగ నాభ్యంతరం ఏమవుతుందో ఊహించండి. 
A) మారదు     B) రెట్టింపు అవుతుంది     C) సగం అవుతుంది     D) ఏదీకాదు
జవాబులు:  39-C;  40-A;  41-B

42. 10.సెం.మీ. నాభ్యంతరం ఉన్న కటకాన్ని ప్రధాన అక్షానికి లంబంగా రెండు భాగాలుగా కత్తిరిస్తే ప్రతిభాగ నాభ్యంతరం ఏమవుతుందో ఊహించండి.
A) 5 సెం.మీ.     B) 10 సెం.మీ.     C) 20 సెం.మీ.     D) ఏదీకాదు


43. 12 సెం.మీ. నాభ్యంతరం ఉన్న ఒక కేంద్రీకరణ కటకం నుంచి 12 సెం.మీ. దూరంలో ఒక వస్తువును ఉంచితే ఏర్పడే ప్రతిబింబ దూరం ఎంత?
A) 6 సెం.మీ.     B) 12 సెం.మీ.     C) 36 సెం.మీ.     D) అనంత దూరంలో


44. ఒక ద్వికుంభాకార కటక వక్రతా వ్యాసార్థాలు 10 సెం.మీ. దాని వక్రీభవన గుణకం 1.5 అయితే కటక నాభ్యంతరం?
A) 0.1 సెం.మీ.     B) 0.01 సెం.మీ.     C) 10 సెం.మీ.     D) ఏదీకాదు


45. మిథ్యా ప్రతిబింబం విషయంలో కిందివాటిలో ఏది సరైంది?
A) తెరమీద పట్టుకోవచ్చు            B) ఎప్పుడూ తలకిందులుగా ఉంటుంది
C) ఎప్పుడూ నిట్టనిలువుగా ఉంటుంది     D) ఏదీకాదు


46. 10 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కేంద్రీకరణ కటకం ద్వారా మిథ్యా ప్రతిబింబం వృద్ధీకరణం 2 ఉండే విధంగా ప్రతిబింబం పొందేందుకు వస్తువును ఉంచే దూరం?
A) 5 సెం.మీ.     B) 10 సెం.మీ.     C) 20 సెం.మీ.     D) ఏదీకాదు

47. 8 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కుంభాకార కటకానికి 16 సెం.మీ. దూరంలో వస్తువు ఉంచితే ప్రతిబింబం ....... 
A) మిథ్యా, పెద్దది     B) చిన్నది, నిజమైంది     C) నిజమైన, వృద్ధీకరణ     D) అంతే పరిమాణం ఉన్న నిజమైంది


48. 15 సెం.మీ.ల నాభ్యంతరం ఉన్న ఒక కుంభాకార కటకానికి ముందున్న 45 సెం.మీ.ల దూరంలో 2 సెం.మీ.ల ఎత్తు ఉన్న ఒక వస్తువును ఉంచితే దాని ప్రతిబింబం ఎత్తు ......?
A) 1 సెం.మీ.     B) 2 సెం.మీ.     C) 4 సెం.మీ.     D) 5 సెం.మీ.


49. 10 సెం.మీ., 20 సెం.మీ.ల నాభ్యంతరాలు ఉన్న రెండు సమతల కుంభాకార కటకాలను ఒక దానితో ఒకటి కలపితే ఏర్పడే ఫలిత నాభ్యంతరం విలువ?
A) 3.52 సెం.మీ.     B) 6.66 సెం.మీ.     C) 13.22 సెం.మీ     D) 37. 44 సెం.మీ.


50. 15 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కుంభాకార కటకానికి ముందు వస్తువు ఉంచారు. ఏ దూరంలో ఉంచిన ఆ వస్తువు ప్రతిబింబం కటకపు వేరొక వైపు సమాన దూరంలో ఏర్పడుతుంది?
A) 15 సెం.మీ.     B) 20 సెం.మీ.     C) 25 సెం.మీ.     D) 30 సెం.మీ.


51. 20 సెం.మీ.ల నాభ్యంతరం ఉన్న ఒక ద్వికుంభాకార కటకాన్ని ప్రధానాక్షానికి లంబంగా రెండు భాగాలుగా కత్తిరిస్తే, సమతల కుంభాకార కటకాలు రెండు ఏర్పడితే, వాటి నాభ్యంతరం విలువ?
A) 10 సెం.మీ.     B) 20 సెం.మీ.     C) 40 సెం.మీ.     D) 60 సెం.మీ.


52. ఒక కటక నాభ్యంతరం విలువ ధనాత్మకమైతే, ఆ కటక రకం.....
A) కుంభాకార     B) పుటాకార     C) సమతల పుటాకార     D) ఏదీకాదు


53. నాభ్యంతరం విలువ రుణాత్మకమైతే ఆ కటకం ఏది?
A) కుంభాకార     B) పుటాకార     C) సమతల కుంభాకార     D) ఏదీకాదు


54. ప్రధానాక్షానికి కిందవైపుగా ఎత్తులను లెక్కిస్తే, వాటిని .........గా గుర్తిస్తారు?
A) ధనాత్మకం     B) రుణాత్మకం     C) తలకిందులు     D) నిటారుగా


55. పతన కిరణానికి వ్యతిరేక దిశలో ఉన్న దూరాన్ని లెక్కించేందుకు ....గుర్తును ఉపయోగిస్తారు?
A) ధన     B) ఋణ     C) ఏదీకాదు     D) ఏదైనా


56. కుంభాకార కటకానికి ఏ స్థానంలో వస్తువును ఉంచితే మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది?
A) f వద్ద     B) c వద్ద     C) c కి అవతల     D) p, fల మధ్య


57. కింది వాటిలో సత్యమైనది?
A) పుటాకార కటకంలో ఏర్పడే మిథ్యా ప్రతిబింబ దూరం వస్తు దూరం కన్నా ఎక్కువగా ఉండదు.
B) పుటాకార కటకం ఎప్పుడూ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
C) పుటాకార కటకం ఎప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
D) పుటాకార కటకంలో ఏప్పుడూ మిథ్యా ప్రతిబింబ దూరం వస్తు దూరం కన్నా ఎక్కువగా ఉంటుంది.

58. ఒక ప్రతిబింబ పరిమాణం పెరిగితే దాన్ని ........ ప్రతిబింబం అంటారు?
A) వృద్ధిచెందిన     B) తలకిందుల     C) క్షీణించిన     D) నిటారైన


59. కుంభాకార కటకం వల్ల నిజ, తలకిందులుగా వృద్ధీకరణ ప్రతిబింబాన్ని ఏర్పర్చేందుకు వస్తువును ఉంచాల్సిన స్థానం?
A) F వద్ద     B) 2F వద్ద     C) F, 2Fల మధ్య     D) 2Fకి అవతల


60. పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం?
A) నిజ ప్రతిబింబం     B) మిథ్యా, పెద్దది     C) ఎల్లప్పుడు మిథ్యా, చిన్నది     D) ఏదీకాదు


61. కుంభాకార కటకం వల్ల ఏర్పడే నిజ ప్రతిబింబం ఎలా ఉంటుంది?
A) నిలువుగా     B) తలకిందులుగా     C) వస్తువు కంటే చిన్నదిగా     D) వస్తువు ఉన్నవైపు


62. కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం మిథ్యా, నిలువు, వస్తువు కంటే పెద్దదిగా ఉండేందుకు వస్తువును ఉంచాల్సిన స్థానం.....?
A) F వద్ద     B) C వద్ద     C) F, Cల మధ్య     D) P, Fల మధ్య


63. ఒక కటకం సహాయంతో దినపత్రికను చూసినప్పుడు దానిలోని అక్షరాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయితే అది ఏ కటక స్వభావాన్ని సూచిస్తుంది?
A) కుంభాకార     B) పుటాకార     C) పుటాకార - కుంభాకార     D) ఏదీకాదు


64. 15 సెం.మీ. నాభ్యంతరం ఉన్న ఒక పుటాకార కటకం 10 సెం.మీ.ల దూరంలో ప్రతిబింబాన్ని ఏర్పరిచింది. అయితే వస్తు దూరం....
A) +45 సెం.మీ.     B) +30 సెం.మీ.     C) -30 సెం.మీ.     D) -45 సెం.మీ.


65. 15 సెం.మీ. నాభ్యంతరం ఉన్న ఒక కుంభాకార కటకానికి 10 సెం.మీ.ల దూరంలో వస్తువు ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబ దూరం?
A) -10 సెం.మీ.     B) +15 సెం.మీ.     C) +30 సెం.మీ.     D) -30 సెం.మీ.


66. ఒక కుంభాకార కటకానికి 10.సెం.మీ. దూరంలో వస్తువు ఉన్నప్పుడు కటకం నుంచి 30 సెం.మీ. దూరంలో నిజ, పెద్దదైన ప్రతిబింబం ఏర్పడింది. అయితే ఆ కటకం నాభ్యంతరం....
A) 1.5 సెం.మీ.     B) 7.25 సెం.మీ.     C) 10 సెం.మీ.     D) 14.5 సెం.మీ.


67. 8 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కేంద్రీకరణ కటకాన్ని ఉపయోగించి ఆవర్తనం - 1 ఉన్న ప్రతిబింబాన్ని పొందేందుకు వస్తువును ఎన్ని సెం.మీ. దూరంలో ఉంచాలి?
A) 8 సెం.మీ.     B) 12 సెం.మీ.     C) 16 సెం.మీ.     D) 24 సెం.మీ.

68. కింది పటంలో F1 దేన్ని సూచిస్తుంది? 

A) పుటాకార కటక కేంద్రం       B) కుంభాకార కటక కేంద్రం   
C) పుటాకార కటకనాభి          D) కుంభాకార కటకనాభి


69. కింది పటంలో F1 దేన్ని సూచిస్తుంది?


A) పుటాకార కటక కేంద్రం          B) కుంభాకార కటక కేంద్రం 
C) పుటాకార కటక నాభి             D) కుంభాకార కటక నాభి
జవాబులు:  68-D;  69-C

70. కిందివాటిలో ఏ కిరణ చిత్రం సరికాదు?


71. కిందివాటిలో ఏ కిరణ చిత్రం సరైంది? 

72. కిందివాటిలో ఏ కిరణ చిత్రం సరికాదు? 

జవాబులు:  1-B;  2-A;  3-D;  4-D;  5-A;  6-B; 7-C;  8-B;  9-C; 10-D; 11-C;  12-D;  13-D;  14-B;  15-C;  16-C;  17-A;  18-D;  19-C;  20-D;  21-C;  22-C; 26-B;  27-B;  28-C;  29-A;  30-D;  31-C;  32-C;  33-C;  34-C;  35-B;  36-A;  37-B;  38-A;  42-C;  43-D;  44-C;  45-C;  46-A;  47-D;  48-A;  49-B;  50-D;  51-C;  52-A;  53-B;  54-B;  55-B;  56-D;  57-A;  58-A;  59-C;  60-C;  61-D;  62-D;  63-B;  64-C;  65-D;  66-B;  67-C;  70-D;  71-D; 72-D  

Posted Date : 26-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం