• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మానవుని కన్ను- రంగుల ప్రపంచం

1. సాధారణ మానవుడి దృష్టికోణం 60º అని ప్రయోగపూర్వకంగా కనుక్కోవాలంటే ఏయే పరికరాలు కావాలి? ప్రయోగంలో మీరు పరిశీలించిన అంశాలను పట సహాయంతో వివరించండి. (AS 3) 4 మార్కులు


2. వర్షం పడినప్పుడు కాంతి విక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనాల వల్ల ఇంద్రధనస్సు ఏర్పడటాన్ని చూపే పటాన్ని గీసి వివరించండి.  (AS 5) 4 మార్కులు


3. ఇద్దరు మిత్రులు పార్కులో ఆడుకుంటున్నారు. ఇంతలో కుమార్ ఆకాశంలో ఏడు రంగులను గమనించి తన మిత్రుడు శ్రీధర్‌కు చూపి "చాలా బావుంది ఏమిటది" అని ప్రశ్నించాడు? అప్పుడు శ్రీధర్ వివరణ ఇచ్చాడు.
i) ప్రకృతిలో దర్శనమిచ్చే ఈ సహజ దృగ్విషయాన్ని ఏమని పిలుస్తారు?
ii) ప్రయోగశాలలో ఏ పరికరాన్ని ఉపయోగించి ఈ సహజ దృగ్విషయాన్ని ఏర్పరచవచ్చు?
iii) కుమార్ రంగులు కనిపించే దిశకు అభిముఖంగా నిల్చొని ఉన్నాడు. ఆ సందర్భంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? వాన నీటి బిందువులతో విక్షేపణం చెందిన కాంతి కిరణాలను చూపే పటం గీయండి.  (AS 4) 4 మార్కులు


4. మానవుడికి సంబంధించిన దృష్టి దోషాల సవరణకు కటకాలను తయారుచేయకపోతే ఏం జరుగుతుందో ఊహించండి. (AS 2) 2 మార్కులు


5. సముద్రపు నీరు నీలిరంగులో కనిపిస్తుంది.. కారణమేమిటో ఊహించండి. (AS 2) 2 మార్కులు


6. ప్రమాద సూచికలు ఎరుపురంగులో ఎందుకుంటాయి?   (AS 6) 2 మార్కులు


7. విమానంలో ప్రయాణించే వ్యక్తికి ఇంద్రధనస్సు ఏ ఆకారంలో కనిపిస్తుందో ఊహించండి.   (AS 2) ఒక మార్కు


8. సైట్ పెరగడం లేదా తగ్గడం అంటే ఏమిటి?  (AS 1) ఒక మార్కు


9. సిలియరి కండరాలు క్రమంగా బలహీనపడితే ఏం జరుగుతుంది?  (AS 1) ఒక మార్కు


10. కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోలేకపోతే ఏం జరుగుతుంది? (AS 1) ఒక మార్కు


11. కంటి కటక నాభ్యంతరం పరిధి ఎంత? (AS 1) ఒక మార్కు


12. 2D కటకాన్ని వాడాలని వైద్యుడు సూచించారు. ఆ కటక నాభ్యంతరం ఎంత? (AS 1) ఒక మార్కు


13. ఒక వృద్ధుడు దగ్గరగానున్న వస్తువులను, అదేవిధంగా దూరంగా ఉన్న వస్తువులను బాగా చూడలేకపోతున్నాడు. అయితే
i) ఆ వృద్ధుడు ఏ రకమైన దృష్టి లోపంతో బాధపడుతున్నాడు?
ii) ఏ రకమైన కటకాలను ఉపయోగించి వృద్ధుడికి దగ్గర, దూరపు వస్తువులు బాగా కనిపించేలా చేయగలం? కారణాలను తెలపండి. (AS 1) 2 మార్కులు


14. 
    
    i) పై పటంలోని దృష్టి లోపాన్ని గుర్తించండి.
    ii) పై పటంలోని దృష్టి దోషాన్ని కటక సహాయంతో సరిచేయడానికి చూపే కిరణ చిత్రాన్ని గీయండి. (AS 5) 2 మార్కులు


15.
       
i) పై పటంలోని దృష్టి లోపాన్ని గుర్తించండి.
ii) పై పటంలోని దృష్టి దోషాన్ని కటక సహాయంతో సరిచేయడానికి చూపే కిరణ చిత్రాన్ని గీయండి. (AS 5) 2 మార్కులు

 

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం