• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం

ప్రశ్నలు - జవాబులు 

1. బోర్ పరమాణు నమూనా ప్రతిపాదనలు, దాని పరిమితులు రాయండి.   (AS 1) 4 మార్కులు
: బోర్ ప్రతిపాదనలు: 
* పరమాణువులో ఎలక్ట్రాన్‌లు కేంద్రకం నుంచి నిర్దిష్ట దూరాల్లో ఉన్న నియమిత శక్తిస్థాయుల్లో లేదా స్థిర కర్పరాల్లో ఉంటాయి.
* ఎలక్ట్రాన్ తక్కువ శక్తిస్థాయి (భూస్థాయి) నుంచి ఎక్కువ శక్తిస్థాయి (ఉత్తేజిత స్థాయి)లోకి చేరినప్పుడు శక్తిని గ్రహిస్తుంది. అదేవిధంగా ఎక్కువ శక్తిస్థాయి నుంచి తక్కువ శక్తిస్థాయికి చేరినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది.
* పరమాణువులోని ఎలక్ట్రాన్‌లకు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి. అవి: E1, E2, E..., అంటే ఎలక్ట్రాన్‌ల శక్తి క్వాంటీకరణం చెంది ఉంటుంది. ఈ శక్తులకు సంబంధించిన స్థాయులను స్థిరస్థాయులు అని, వీటికి ఉండే శక్తి విలువలను శక్తిస్థాయులు అంటారు.
* ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయి నుంచి భూస్థాయికి చేరుకున్నప్పుడు ఎలక్ట్రాన్ కోల్పోయిన శక్తి విద్యుదయస్కాంత వికిరణం రూపంలో ఉండి నిర్దిష్ట తరంగదైర్ఘాన్ని కలిగి ఉంటుంది. అది వర్ణపటంలో ఉద్గార రేఖగా కనిపిస్తుంది.
* బోర్ నమూనా హైడ్రోజన్ వర్ణపటంలో కనిపించిన అన్ని రేఖలను వివరించగలిగింది.

లోపాలు:
* బోర్ నమూనా ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్‌లు ఉన్న పరమాణువుల వర్ణపటాలను వివరించలేకపోయింది.
* రేఖావర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవటాన్ని బోర్ నమూనా వివరించలేకపోయింది.


2. బోర్ - సోమర్‌ఫెల్డ్ పరమాణు నమూనాను వివరించండి.   (AS 1) 4 మార్కులు

జ:
  
      
* రేఖావర్ణటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించేందుకు సోమర్‌ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టారు.
* బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యలను అలాగే ఉంచుతూ ఇతడు రెండో కక్ష్యకు ఒక దీర్ఘవృత్తాకార కక్ష్యను, మూడో కక్ష్యకు రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలుపుతూ పరమాణు కేంద్రకం ఈ దీర్ఘ వృత్తాకార కక్ష్య రెండు ప్రధాన నాభుల్లో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు.

* ఒక కేంద్రబలం ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం దీర్ఘవృత్తాకార కక్ష్యల ఏర్పాటుకు దారితీస్తుందనే విషయం అతడు ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది.

లోపాలు:
* ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్‌లున్న పరమాణువుల పరమాణు వర్ణపటాలను వివరించడంలో ఈ నమూనా విఫలమైంది.


3. పరమాణు నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడానికి క్వాంటం సంఖ్యలు ఏ విధంగా ఉపయోగపడతాయి? వివరించండి.    (AS 1) 4 మార్కులు
జ: పరమాణు నిర్మాణంలో ఎలక్ట్రాన్‌ల స్థానం, శక్తుల గురించి తెలియజేయడంలో క్వాంటం సంఖ్యలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. క్వాంటం సంఖ్యలు ప్రధానంగా నాలుగు రకాలు.
అవి: 1) ప్రధాన క్వాంటం సంఖ్య (n)
        2) కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య (l)
        3) అయస్కాంత క్వాంటం సంఖ్య (ml)
        4) స్పిన్ క్వాంటం సంఖ్య (ms)


ప్రధాన క్వాంటం సంఖ్య (n):
* ఇది ఆర్బిట్ లేదా ప్రధాన కర్పర పరిమాణం, దాని శక్తిని గురించి తెలుపుతుంది. దీన్ని nతో సూచిస్తారు. 
* ప్రధాన క్వాంటం సంఖ్య (n) ధన పూర్ణాంక (n = 1, 2, 3, ...) విలువలను కలిగి ఉంటుంది.
* n విలువ పెరిగే కొద్దీ ఆర్బిట్ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అలాగే అందులో తిరుగుతున్న ఎలక్ట్రాన్‌లకు కేంద్రానికి మధ్య దూరం కూడా పెరుగుతుంది. n విలువలో పెరుగుదల శక్తిస్థాయిలో పెరుగుదలను సూచిస్తుంది.
* n = 1, 2, 3, ... విలువలున్న స్థాయులను K, L, M, ...లతో కూడా సూచిస్తారు. ప్రతి n విలువకు ఒక ప్రధాన కర్పరం ఉంటుంది.

కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య (l):
* ఈ క్వాంటం సంఖ్యను l అనే అక్షరంతో సూచిస్తారు.
* ప్రధాన క్వాంటం సంఖ్య nకు l విలువలు 0 నుంచి (n - 1) వరకూ ఉంటాయి.
* ప్రతి l విలువ కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఒక నిర్దిష్ట ఉపకర్పరాన్ని సూచిస్తుంది.
* ప్రతి l విలువ కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే ఒక నిర్దిష్ట ఉపకర్పరం ఆకృతిని గురించి తెలుపుతుంది.

* l = 0 అయితే s - ఆర్బిటాల్‌ను
l = 1 అయితే p - ఆర్బిటాల్‌ను
l = 2 అయితే d - ఆర్బిటాల్‌ను
l = 3 అయితే f - ఆర్బిటాల్‌ను సూచిస్తుంది.


అయస్కాంత క్వాంటం సంఖ్య (ml):
* అయస్కాంత క్వాంటం సంఖ్యను mlతో సూచిస్తారు. ఇది 0తో కలిపి -l నుంచి +l మధ్య పూర్ణవిలువలను కలిగి ఉంటుంది. ఇది పరమాణువులోని ఆర్బిటాల్ ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని తెలుపుతుంది. ml ఒక పరమాణువులో కలిగి ఉండే విలువల సంఖ్య ఒక నిర్దిష్ట l విలువకు, దానికి సంబంధించిన ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ల సంఖ్యను సూచిస్తుంది.
* l విలువకు ml విలువలు (2l + 1) గా ఉంటుంది. వాటిని కింది విధంగా సూచించవచ్చు.
     -l1, (-l + 1), .......... -1, 0, 1, .......... (+l - 1), + l

స్పిన్ క్వాంటం సంఖ్య (ms):
* దీన్ని msతో సూచిస్తారు. ఇది ఎలక్ట్రాన్ అభిలక్షణాలను వివరించడానికి తోడ్పడుతుంది. ఎలక్ట్రాన్ స్పిన్ దిగ్విన్యాస సవ్యదిశను   గా, అపసవ్య దిశను

గా సూచిస్తారు. ఎక్కువ ఎలక్ట్రాన్‌లు ఉన్న పరమాణువుల్లో ఒక నిర్దిష్ట ఆర్బిటాళ్లలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్‌లు ఉన్నప్పుడు వాటి దిగ్విన్యాసాన్ని స్పిన్ క్వాంటం సంఖ్య వివరిస్తుంది.


4. ఆర్బిట్, ఆర్బిటాల్‌లను పోల్చండి.   (AS 1) 4 మార్కులు

జ: 

 
  

5. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని వివరించడానికి దోహదపడే నియమాలను ఒక్కో ఉదాహరణతో వివరించండి.
                                                               (లేదా)
ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్‌లు ఉన్న పరమాణువుల్లో ఎలక్ట్రాన్‌ల అమరికను వివరించడానికి ఉపకరించే నియమాలేవి? వాటితో సమశక్తి ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌ల అమరిక ఏ నియమం ఆధారంగా జరుగుతుందో సోదాహరణంగా వివరించండి.  (AS 1) 4 మార్కులు
జ: పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని వివరించడానికి మూడు నియమాలు ఉపకరిస్తాయి.
అవి: 1) పౌలీవర్జన నియమం
        2) ఆఫ్‌బౌ నియమం
        3) హుండ్ నియమం


పౌలీవర్జన నియమం: ఒకే పరమాణువుకు చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్‌లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు.
ఉదా: హీలియం పరమాణువులో ఉన్న రెండు ఎలక్ట్రాన్‌లు 1s ఆర్బిటాల్‌లోనే ఉన్నాయి. కాబట్టి వాటి n, l, ml విలువలు సమానంగా ఉంటాయి. అంటే ms తప్పనిసరిగా వేరుగా ఉండాలి. He పరమాణువులో ఎలక్ట్రాన్‌ల స్పిన్‌లు జతకూడాలి.
జంట స్పిన్‌లు ఉన్న ఎలక్ట్రాన్‌లను తో సూచిస్తారు. ఒక ఎలక్ట్రాన్ ms = అయితే రెండో ఎలక్ట్రాన్
ms =

అవుతుంది. అంటే ఒకే ఆర్బిటాల్‌లో ఉన్న రెండు ఎలక్ట్రాన్‌ల స్పిన్‌లు వ్యతిరేక దిశలో ఉంటాయి. కాబట్టి హీలియం పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇలా సూచించవచ్చు. 
రెండు ఎలక్ట్రాన్‌ల నాలుగు క్వాంటం సంఖ్యల విలువలు


 

ఆఫ్‌బౌ నియమం (ఊర్థ్వ నిర్మాణ నియమం): పరమాణువు భూస్థాయిలో ఉప్నపుడు ఎలక్ట్రాన్‌లు అతి తక్కువ శక్తి ఉండే ఆర్బిటాల్‌లో చేరుతూ, అలా మొత్తం ఎలక్ట్రానుల సంఖ్య పరమాణువు సంఖ్యకు సమానం అయ్యే వరకు నిండేలా దాని ఎలక్ట్రాన్ విన్యాసం నిర్మితమవుతుంది. దీన్నే ఆఫ్‌బౌ నియమం అంటారు. ఈ నియమం ప్రకారం పరమాణువులోని ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌లు నిండే క్రమం ఆర్బిటాళ్ల ఆరోహణశక్తి క్రమంలో ఉంటుంది.
        ఎలక్ట్రాన్‌లు వివిధ ఆర్బిటాళ్లలో ఆయా ఆర్బిటాళ్ల (n + l) విలువలు పెరిగే క్రమంలో నిండుతాయి. ఒకవేళ (n + l) విలువలు సమానంగా ఉన్నట్లయితే n విలువ తక్కువగా ఉన్న ఉపకర్పరాన్ని ఎలక్ట్రాన్‌లు ముందుగా ఆక్రమిస్తాయి.
పరమాణు ఆర్బిటాళ్ల శక్తిస్థాయులు ఆరోహణ క్రమంలో కిందివిధంగా ఉంటాయి.
1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d < 4p < 5s < 4d < 5p < 6s < 4f < 5d < 6p < 7s < 5f ...........
 


హుండ్ నియమం: సమానశక్తి ఉన్న అన్ని ఖాళీ ఆర్బిటాళ్లు ఒక్కో ఎలక్ట్రాన్‌తో ఆక్రమణకు గురైన తర్వాతనే ఎలక్ట్రాన్‌లు జతగూడటం ప్రారంభిస్తాయి.
ఉదా: కార్బన్ (Z = 6) పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం 1s 2s 2p. ఇందులో మొదటి నాలుగు ఎలక్ట్రాన్‌లు 1s, 2s ఆర్బిటాళ్లలోకి చేరతాయి. తర్వాతి రెండు ఎలక్ట్రాన్‌లు వేర్వేరు p ఆర్బిటాళ్లను ఆక్రమిస్తాయి. ఆ రెండు ఎలక్ట్రాన్ల స్పిన్ ఒకే విధంగా ఉంటుంది. 

 


 6. s, p ఆర్బిటాళ్ల జ్యామితీయ ఆకృతులను గీయండి.  (AS 5) 4 మార్కులు
జ: s - ఆర్బిటాల్ గోళాకారంలో ఉంటుంది.
           
p - ఆర్బిటాళ్లు డంబెల్ (ముద్గర) ఆకారంలో ఉంటాయి.

 


7. d - ఆర్బిటాళ్ల ఆకృతులను గీయండి.   (AS 5) 4 మార్కులు
జ: d - ఆర్బిటాళ్లు డబుల్ డంబెల్ (ద్విముద్గర) ఆకారంలో ఉంటాయి.

  


8. (n + l) విలువలు పెరిగే క్రమాన్ని చూపే చిత్రాన్ని గీయండి.  (AS 5) 2 మార్కులు
జ: l = 0   l = 1   l = 2   l = 3

   


9. విద్యుదయస్కాంత తరంగం పటం గీసి భాగాలను గుర్తించండి.  (AS 5) 2 మార్కులు

జ:
 


   
10. (n = 4) నాలుగో శక్తి స్థాయిలో ఉన్న సోమర్ ఫెల్డ్ నమూనాలో ఉపకక్ష్యలను సూచించే పటాన్ని గీసి n, l విలువలు గుర్తించండి.  (AS 5)  2 మార్కులు

జ: 


11. ప్రకృతిలో దర్శనమిచ్చే దృగ్గోచర వర్ణపటానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. దృగ్గోచర వర్ణపటం అంటే ఏమిటో వివరించండి. (AS 1) (AS 6) 2 మార్కులు
జ: ప్రకృతిలో దృగ్గోచర వర్ణపటానికి ఇంద్రధనస్సు ఏర్పడటం ఒక చక్కటి ఉదాహరణ. ఇంద్రధనస్సులోని ప్రతిరంగు ఒక నిర్దిష్ట తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. వర్ణపటంలోని రంగులు ఎరుపు రంగు (ఎక్కువ తరంగదైర్ఘ్యం) నుంచి ఊదా రంగు (తక్కువ తరంగ దైర్ఘ్యం) వరకు విస్తరించి ఉంటాయి.
         మానవుడి కంటితో చూడగలిగే రంగుల (తరంగదైర్ఘ్యాల) సముదాయాన్ని దృశ్యకాంతి అంటారు. ఎరుపు రంగు నుంచి ఊదా రంగు వరకు ఉన్న తరంగదైర్ఘ్యాల సముదాయాన్ని దృగ్గోచర వర్ణపటం అంటారు.


12. ఒక పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం కింది విధంగా ఉంది.                 (AS 4) 2 మార్కులు 

 
       
i) ఇది ఏ మూలక పరమాణువును సూచిస్తుంది?
జ: కార్బన్
ii) చిట్టచివరి ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్‌లో ఉంది?
జ: 2p ఆర్బిటాల్

iii) ఉద్రిక్తస్థాయికి చేరినప్పుడు ఈ పరమాణువులో ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్‌లు ఉండటానికి అవకాశం ఉంది?

జ: ఉద్రిక్తస్థాయిలో 2s ఆర్బిటాల్‌లోని ఎలక్ట్రాన్ 2p ఆర్బిటాల్‌లోకి ప్రవేశించడం వల్ల 4 ఒంటరి ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.
iv) మొదటి డబ్బాలోని రెండు ఎలక్ట్రాన్‌ల ప్రధాన క్వాంటం సంఖ్య విలువ ఎంత?
జ: ప్రధాన క్వాంటం సంఖ్య విలువ 1


13.
i) ఒక పరమాణువులోని ఒక ఎలక్ట్రానుకు సంబంధించిన నాలుగు క్వాంటం సంఖ్యలు కింది పట్టికలో ఇచ్చారు. ఆ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్‌కు చెందిందో తెలపండి.

జ:
 
   ఆ ఎలక్ట్రాన్ 3s ఆర్బిటాల్‌కి చెందింది.
ii) 2s అనే సంక్షిప్త సంకేతంతో చూపిన ఎలక్ట్రాన్ నాలుగు క్వాంటం సంఖ్యలు రాయండి. 

జ: 


14.   1s2 2s2 2p6 3s2 3p6 4s0 3dఅనే ఎలక్ట్రాన్ విన్యాసం ఏ నియమాన్ని ఉల్లంఘించింది? ఎలా? (AS 1) 2 మార్కులు
జ: ఆఫ్‌బౌ నియమాన్ని ఉల్లంఘించింది. 3p ఆర్బిటాల్ నిండిన తర్వాత కొత్తగా వచ్చి చేరే ఎలక్ట్రాన్‌లకు 3d, 4s ఆర్బిటాల్‌లు రెండూ అందుబాటులో ఉంటాయి. కానీ 3d ఆర్బిటాల్ శక్తి (n + = 3 + 2 = 5), 4s ఆర్బిటాల్ శక్తి (n + l = 4 + 0 = 4) కంటే ఎక్కువ. అయితే ఆఫ్‌బౌ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్‌ను ముందుగా ఆక్రమించుకుంటుంది. ఆవిధంగా ఇచ్చిన ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2  2p6 3s2  3p6 4s1 ఉండాలి.


15. 1s2 2s1  2p2 అనే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో ఏ నియమాన్ని ఉల్లంఘించారు? కారణాలు తెలపండి.  (AS 1) ఒక మార్కు
                                                                                                                                 
జ: 1s2 2s1  2p2 అనే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో ఆఫ్‌బౌ నియమాన్ని ఉల్లంఘించారు. ఈ నియమం ప్రకారం 2s ఆర్బిటాల్ నిండిన తర్వాతే 2pని నింపాలి.


16. ఏ నియమాన్ని కింది ఎలక్ట్రాన్ విన్యాసం లోపింపజేస్తుంది?                 (AS 1) ఒక మార్కు
      


జ: హుండ్ నియమాన్ని ఉల్లంఘించారు.


17. కింద ఇచ్చిన మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయండి.                 (AS 1) ఒక మార్కు
       a) లిథియం       b) బోరాన్
జ: a) లిథియం (Z = 3) 1s 2s       
      b) బోరాన్ (Z = 5) 1s 2s 2p  


18. పరమాణు వర్ణపటాల్లోని రేఖల ఉపయోగమేమిటి?                        (AS 6) ఒక మార్కు
జ: వేలిముద్రలను బట్టి మనుషులను గుర్తించినట్లుగానే పరమాణు వర్ణపటాల్లోని రేఖలను బట్టి ఆయా పరమాణువులను తేలికగా గుర్తించవచ్చు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. దృశ్య కాంతిలో ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న రంగు ఏది? (AS1) ఒక మార్కు
జ: ఎరుపు రంగు


2. దృశ్య కాంతిలో ఎక్కువ పౌనఃపున్యం ఉన్న రంగు ఏది? (AS1) ఒక మార్కు
జ: ఊదా రంగు


3. విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న తరంగాలు ఏవి? (AS1) ఒక మార్కు
జ: రేడియో తరంగాలు


4. విద్యుదయస్కాంత వర్ణపటంలో తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న తరంగాలు ఏవి? (AS1) ఒక మార్కు
జ: గామా కిరణాలు


5. దృగ్గోచర కాంతి వర్ణపటంలోని తరంగదైర్ఘ్య అవధిని తెలపండి. (AS1) ఒక మార్కు
జ: 400 nm నుంచి 700 nm.


6. E = hυ (ప్లాంక్ స్థిరాంకం)లో h విలువ ఎంత? (AS1) ఒక మార్కు
జ: 6.625 × 10−34 JS


7. క్యూప్రిక్ క్లోరైడ్ జ్వాలా పరీక్షలో ఏర్పరిచే రంగు ఏది? (AS1) ఒక మార్కు
జ: ఆకుపచ్చ రంగు


8. వీధి దీపాల్లోని సోడియం ఆవిరులు ఏ రంగు కాంతిని ఉత్పత్తి చేస్తాయి? (AS1) ఒక మార్కు
జ: పసుపు రంగు


9. ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది? (AS1) ఒక మార్కు
జ: ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయికి చేరుతుంది.


10. ఎలక్ట్రాన్ గ్రహించే లేదా కోల్పోయే శక్తి ఏ రూపంలో ఉంటుంది? (AS1) ఒక మార్కు
జ: విద్యుదయస్కాంత వికిరణ రూపంలో ఉంటుంది.


11. దీర్ఘవృత్తాకార కక్ష్యల భావనను ప్రవేశపెట్టింది ఎవరు? (AS1) ఒక మార్కు
జ: సోమర్‌ఫెల్డ్


12. n = 2 అయినప్పుడు బోర్ - సోమర్‌ఫెల్డ్ పరమాణు నమూనా పటాన్ని గీయండి. (AS5) ఒక మార్కు

 

13. బోర్ సోమర్‌ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్ష్యల భావనను ఎలా సమర్థించాడు? (AS1) 2 మార్కులు
జ: రేఖా వర్ణపటంలోని రేఖలు మరికొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించేందుకు వృత్తాకార కక్ష్యలతోపాటు దీర్ఘ వృత్తాకార కక్ష్యలు కూడా ఉంటాయని గుర్తించాడు.
ఉదా: n = 3 అయినప్పుడు l విలువలు 0, 1, 2గా ఉంటాయి.
             

14. క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను ఎవరు ప్రవేశపెట్టారు? (AS1) ఒక మార్కు
జ: ఇర్విన్ ష్రోడింగర్


15. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌ను గుర్తించగలిగే సంభావ్యత గరిష్ఠంగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? (AS1) ఒక మార్కు
జ: ఆర్బిటాల్


16. ఆర్బిటాల్‌ల ప్రాదేశిక విన్యాసాన్ని వివరించే క్వాంటం సంఖ్య ఏది? (AS1) ఒక మార్కు
జ: అయస్కాంత క్వాంటం సంఖ్య ఆర్బిటాల్‌ల ప్రాదేశిక విన్యాసాన్ని వివరిస్తుంది.


17. ప్రధాన కక్ష్య శక్తి, పరిమాణాన్ని సూచించే క్వాంటం సంఖ్య ఏది? (AS1) ఒక మార్కు
జ: ప్రధాన క్వాంటం సంఖ్య


18. n = 3 అయితే l విలువలను తెలపండి. (AS1) ఒక మార్కు
జ: n = 3, l = 0, 1, 2


19. l = 3 అయితే ml విలువలను తెలపండి. (AS1) ఒక మార్కు
జ: -3, -2, -1, 0, +1, +2, +3


20. అల్యూమినియం (Al) పరమాణువులో చివరగా చేరే ఎలక్ట్రాన్ నాలుగు క్వాంటం సంఖ్యలను రాయండి. (AS4) 2 మార్కులు
జ: Al − 1s2 2s2 2p2 3s2 3p1


 

21. ఒక పరమాణువు చిట్టచివరి కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాన్ క్వాంటం సంఖ్యలు కింది విధంగా ఉన్నాయి.  (AS4) 2 మార్కులు

a) ఈ మూలకం బాహ్య కర్పరం ఏది?
b) ఈ మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
c) ఈ మూలకం పరమాణు సంఖ్య ఎంత?
d) ఈ మూలకం వేలన్సీ ఎంత?
జ: a) 3
     b) 1s2 2s2 2p6 3s2 3p3
     c) 15
     d) 5    

 

22. p ఆర్బిటాళ్ల ఆకృతిని తెలపండి. (AS1) ఒక మార్కు
జ: డంబెల్ ఆకృతి (ముద్గర ఆకృతి)
     

 
23. d - ఆర్బిటాళ్లలో రకాలను తెలపండి. (AS1) ఒక మార్కు

24. Ca ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసేటప్పుడు 3d కంటే ముందు 4s ఆర్బిటాల్ నిండుతుంది. ఎందుకో ఉహించండి? (AS2) 2 మార్కులు
జ: ఆఫ్ బౌ నియమం ప్రకారం 4s ఆర్బిటాల్ శక్తి 3d ఆర్బిటాల్ శక్తి కంటే తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్‌లు 4s నిండిన తర్వాతే 3d లోకి ప్రవేశిస్తాయి.
4s ఆర్బిటాల్ శక్తి (n + l) = 4 + 0 = 4
3d ఆర్బిటాల్ శక్తి (n + l) = 3 + 2 = 5


25. Li మూలకంలోని ఎలక్ట్రాన్‌ల (వితరణ) పంపిణీలో పౌలీ వర్జన నియమాన్ని వివరించే పట్టికను రూపొందించండి. (AS1) 2 మార్కులు
జ: Li − 1s 2s


 

26. కింది ఆర్బిటాల్ రేఖాచిత్రం ఆక్సిజన్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచిస్తుంది. ఇది ఏ నియమానికి వ్యతిరేకం?  (AS1) ఒక మార్కు

జ: హుండ్ నియమం


27. 1s 2s అనే ఎలక్ట్రాన్ విన్యాసం ఏ నియమాన్ని ఉల్లంఘించింది? (AS1) ఒక మార్కు
జ: ఆఫ్ బౌ నియమం


28. K ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి. (AS1) ఒక మార్కు
జ: 1s2 2s2 2p6 3s2 3p3 4s1 


29. n = 4 అయినప్పుడు బోర్ - సోమర్‌ఫెల్డ్ పరమాణు నమూనా పటాన్ని గీయండి. (AS5) 2 మార్కులు

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం