బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. విద్యుదయస్కాంత వికిరణ శక్తికి, పౌనఃపున్యంకు మధ్య ఉండే నిష్పత్తిని ఏమంటారు?
A) బోర్ స్థిరాంకం B) ప్లాంక్ స్థిరాంకం C) అవగాడ్రో స్థిరాంకం D) ఏదీకాదు
2. ప్లాంక్ స్థిరాంకం విలువ (ఎర్గుల్లో)
A) 6.626 × 1027 ఎర్గ్ - సెకను B) 6.626 × 10-27 ఎర్గ్ - సెకను
C) 6.626 × 10-34 ఎర్గ్ - సెకను D) 6.626 × 1034 ఎర్గ్ - సెకను
3. ప్లాంక్ స్థిరాంక విలువ- (జౌళ్లలో)
A) 6.626 × 1027 జౌల్ - సెకను B) 6.626 × 1034 జౌల్ - సెకను
C) 6.626 × 10-34 జౌల్ - సెకను D) 6.626 × 10-27 జౌల్ - సెకను
4. n = 1, l = 0, m = 0, s = క్వాంటం సంఖ్యలున్న పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం
A) 1s1 B) 1s2 C) 2s1 D) 1s2 2s1
5. పరమాణువులోని ఏ ఎలక్ట్రాన్ 4 క్వాంటం సంఖ్యలు కింది విధంగా ఉంటాయి?
A) 2s1 B) 2s1 C) 1s2 D) 3s1
6. స్ట్రాన్షియం క్లోరైడ్ జ్వాలా పరీక్షలో ఏ రంగులో మండుతుంది?
A) ఎరుపు B) పసుపు C) నీలం D) ఆకుపచ్చ
7. కిందివాటిలో విద్యుదయస్కాంత వికిరణం కానివి-
A) IR - కిరణాలు B) X - కిరణాలు C) γ - కిరణాలు D) కాథోడ్ కిరణాలు
8. అన్ని విద్యుదయస్కాంత వికిరణాలకు ఒకే విధంగా ఉండేది-
A) శక్తి A) వేగం C) పౌనఃపున్యం D) తరంగదైర్ఘ్యం
9. ఒక కక్ష్య పరిమాణాన్ని తెలియజేసే క్వాంటం సంఖ్య
A) ప్రధాన క్వాంటం సంఖ్య B) ఎజిముతల్ క్వాంటం సంఖ్య
C) అయస్కాంత క్వాంటం సంఖ్య D) స్పిన్ క్వాంటం సంఖ్య
10. స్థిర కక్ష్య పరిమాణం, శక్తిని ఏ క్వాంటం సంఖ్య తెలియజేస్తుంది?
A) n B) l C) m D) s
11. కేంద్రకానికి దగ్గరగా ఉండే శక్తిస్థాయి -
A) K B) L C) M D) N
12. ఒక కక్ష్యలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య
A) 1n2 B) 2n2 C) 3n2 D) 4n2
13. n = 3 కక్ష్యలో ఉండే ఉపస్థాయుల సంఖ్య
A) 3 B) 2 C) 4 D) 1
14. n = 3, l = 2 అయితే ఆ శక్తిస్థాయి
A) 3s B) 3p C) 3d D) 3f
15. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య తెలియజేసేది-
A) కక్ష్య శక్తి B) కక్ష్య పరిమాణం C) ఉపకర్పరం D) ఏదీకాదు
16. n = 2, l = 1 అయితే ఆ శక్తిస్థాయి
A) 2s B) 2p C) 3s D) 3p
17. 3d ఆర్బిటాల్‌లో ఉండే ఎలక్ట్రాన్ క్వాంటం సంఖ్యలు
A) n = 2, l = 2, m = 0, s = + B) n = 1, l = 2, m = 1, s = +
C) n = 3, l = 3, m = 1, s = - D) n = 3, l = 2, m = 1, s = +
18. కిందివాటిలో సరైన క్వాంటం సంఖ్యల విలువలను చూపనిది-
A) n = 1, l = 1, m = -1, s = - B) n = 2, l = 1, m = -1, s = +
C) n = 2, l = 0, m = +1, s = - D) n = 1, l = 0, m = 0, s = +
19. బెరీలియం నాలుగు క్వాంటం సంఖ్యల సరైన n, l, m, s విలువలు
A) 1, 1, 1, + B) 2, 1, 0, +
C) 2, 0, 0, -
D) 1, 0, 0, +
20. కిందివాటిలో సరైన క్వాంటం సంఖ్యల విలువలను చూపనిది-
A) n = 2, l = 1, m = 0, s = + B) n = 2, l = 2, m = -1, s = -
C) n = 3, l = 2, m = +1, s = + D) n = 3, l = 0, m = 0, s = -
21. l విలువ 3 ఉన్న ఉపస్థాయిలో ఉండే అత్యధిక ఎలక్ట్రాన్‌ల సంఖ్య
A) 8 B) 10 C) 6 D) 14
22. 3f ఆర్బిటాల్‌కు (n + l) విలువ
A) 3 B) 4 C) 6 D) 7
23. పరమాణు సంఖ్య 17 ఉన్న మూలక పరమాణువులో మొత్తం p - ఆర్బిటాళ్లలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య
A) 9 B) 10 C) 11 D) 5
24. కింద ఇచ్చిన ఆర్బిటాళ్లలో ఎక్కువ శక్తి గలది
A) 4d B) 5d C) 6s D) 6d
25. కిందివాటిలో అయస్కాంత క్వాంటం సంఖ్యను నిర్దేశించేవి?
A) కక్ష్య ఆకృతి B) కక్ష్య పరిమాణం C) కక్ష్య దిగ్విన్యాసం D) ఏదీకాదు
26. హుండ్ నియమం ప్రకారం కార్బన్ పరమాణువులో ఎలక్ట్రాన్‌ల అమరిక ఏ విధంగా ఉంటుంది?
27. భూస్థాయిలోని ఆక్సిజన్ బాహ్యతమ ప్రధాన శక్తి స్థాయిని సరిగా సూచించే ఆర్బిటాల్ చిత్రం
28. కింది ఎలక్ట్రాన్‌ల అమరికలో హుండ్ నియమాన్ని ఉల్లంఘించనిది
29. కింది ఎలక్ట్రాన్‌ల అమరికలో హుండ్ నియమాన్ని ఉల్లంఘించింది ఏది?
30. కింది చిత్రం ఏ d ఆర్బిటాళ్ల ఉపరితల సరిహద్దు రేఖా చిత్రం?
A) dxy
B) dyz
C) dzx
D) dx2 - y2
31. కింది చిత్రం ఏ d ఆర్బిటాళ్ల ఉపరితల సరిహద్దు రేఖా చిత్రం?
A) dxy
B) dyz
C) dz2
D) dx2 - y2
32. కింది చిత్రంలో సూచించిన p - ఆర్బిటాళ్ల అమరిక
A) px
B) py
C) pz
D) pxy
33. కింది చిత్రంలో సూచించిన p - ఆర్బిటాళ్ల అమరిక
A) px
B) py
C) pz
D) pxz
34. (n + l) విలువల ప్రకారం ఆర్బిటాళ్ల సాపేక్ష శక్తుల క్రమం
A) 3s < 3p < 3d < 4s < 4p B) 3s < 4s < 3p < 4p < 3d
C) 3s < 3p < 4s < 3d < 4p D) 3s < 3p < 4s < 4p
35. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ఎలక్ట్రాన్ విన్యాసం ఏ మూలకానిది?
A) Ne B) Ar C) K D) Ca
36. తరంగ దైర్ఘ్యం (λ), పౌనఃపున్యం (υ), కాంతివేగం (V)ల మధ్య సంబంధం
A) V = νλ B) V = C) V =
D) ν = Vλ
37. ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడటం దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు?
A) పౌనఃపున్యానికి B) తరంగ దైర్ఘ్యానికి
C) దృగ్గోచర వర్ణపటానికి D) అయస్కాంత వర్ణ పటానికి
38. విద్యుదయస్కాంత వర్ణపటంలో తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కిరణాలు
A) గామా కిరణాలు B) పరారుణ కిరణాలు
C) రేడియో కిరణాలు D) X - కిరణాలు
39. విద్యుదయస్కాంత వర్ణపటంలో అధిక తరంగ దైర్ఘ్యం ఉన్న కిరణాలు
A) గామా కిరణాలు B) పరారుణ కిరణాలు C) రేడియో కిరణాలు D) X - కిరణాలు
40. ఒక నిర్దిష్ట పౌనఃపున్యానికి ఉన్న శక్తి (E) =
A) hν B) hλ C) hV D) h
41. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
A) థామ్సన్ B) బోర్ C) రూథర్‌ఫర్డ్ D) మాక్స్‌ప్లాంక్
42. E = hν సమీకరణంలో 'h' సూచించేది
A) ప్లాంక్ స్థిరాంకం B) జౌల్ స్థిరాంకం C) ఫారడే స్థిరాంకం D) ఏదీకాదు
43. వీధి దీపాలు పసుపు రంగులో ఉండటానికి కారణమేంటి?
A) నియాన్ ఆవిర్లు B) నైట్రోజన్ ఆవిర్లు
C) సోడియం ఆవిర్లు D) హీలియం ఆవిర్లు
44. బోర్ పరమాణు నమూనాలో ముఖ్యమైన లోపం ఏమిటి?
A) హీలియం వర్ణపటాన్ని వివరించలేకపోయింది
B) హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరించలేకపోయింది
C) హీలియం, హైడ్రోజన్ వర్ణపటాలు రెండింటినీ వివరించలేకపోయింది
D) ఏదీకాదు
45. అయస్కాంత క్యాంటం సంఖ్య అవధులు
A) o.... l B) +l... o....+l C) -l... o... +l D) (2l + 1) ... (2l - 1)
46. కిందివాటిలో ఒక ఎలక్ట్రాన్‌కు ఉండే స్పిన్ విలువలు
A) + , +
B) +
, -
C) -
, -
D) ఏదీకాదు
47. ఎలక్ట్రాన్ స్పిన్ ఏ దిశను సూచిస్తుంది?
A) సవ్య B) అపసవ్య C) సమాంతర D) ఏదీకాదు
48. ఎలక్ట్రాన్ భ్రమణాలను తెలిపే క్వాంటం సంఖ్య
A) స్పిన్ B) అయస్కాంత C) కోణీయ ద్రవ్యవేగ D) ప్రధాన
49. ఒక ఉపకర్పంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్యను సూచించేది
A) 2l + 1 B) 2(2l + 1) C) 2l - 1 D) 2(2l - 1)
50. పరమాణువులోని ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్‌లు నిండే క్రమాన్ని సూచించేది
A) ఎలక్ట్రాన్ స్పిన్ B) ఎలక్ట్రాన్ వేగం C) ఎలక్ట్రాన్ విన్యాసం D) ఏదీకాదు
51. 'ఎలక్ట్రాన్ తక్కువ శక్తి ఉండే ఆర్బిటాల్‌లోకి ముందుగా చేరుతుంది అని తెలిపే నియమం
A) ఆఫ్‌బౌ B) పౌలీవర్జన C) హుండ్ D) ఏదీకాదు
52. ఆఫ్‌బౌ అనే పదానికి అర్థం ఏమిటి?
A) అథో నిర్మాణం B) ఊర్థ్వ నిర్మాణం C) పార్శ్వ నిర్మాణం D) ఏదీకాదు
53. 'సమశక్తి ఆర్బిటాళ్లన్నీ నిండిన తర్వాతనే ఎలక్ట్రాన్‌లు జతకూడటం జరుగుతుంది' అని తెలిపే నియమం ఏది?
A) హుండ్ నియమం B) ఆఫ్‌బౌ నియమం C) పౌలీవర్జన నియమం D) ఏదీకాదు
54. కిందివాటిలో సరైన జత ఏది?
A) బోర్ పరమాణు నమూనా - నీల్స్‌బోర్
B) దీర్ఘవృత్తాకార కక్ష్యలు - సోమర్‌ఫెల్డ్
C) క్వాంటం సిద్ధాంతం - మాక్స్‌ప్లాంక్
D) అన్నీ
55. కిందివాటిలో సరికాని జత ఏది?
A) Ca - 1s2 2s2 2p6 3s2 3p6 4s2 B) N - 1s2 2s2 2p3
C) Ar - 1s2 2s2 2p6 3s2 3p5 D) Na - 1s2 2s2 2p6 3s1
56. కిందివాటిలో ఎలక్ట్రాన్‌లు నిండే సరైన క్రమం
a) 1s b) 3s c) 4s d) 2s e) 3p f) 4p
A) a, d, b, c, f, e B) a, d, b, e, c, f C) a, b, c, d, e, f D) c, d, b, a, e, f
57. ఆఫ్‌బౌ నియమాన్ని పాటించని ఆర్బిటాల్ క్రమం ఏది?
58. కిందివాటిలో క్వాంటం సంఖ్యల విలువలను తప్పుగా చూపేది
A) n = 1, l = 0, m = 0, s = - B) n = 2, l = 1, m = 0, s = +
C) n = 2, l = 2, m = 5, s = - D) n = 2, l = 1, m = 0, s = +
59. n = 4 లోని ఉపస్థాయులు
A) s, p B) s, p, d C) s, p, d, f D) p, d
60. ప్రధాన క్వాంటం సంఖ్య 'n' కిందివాటిలో దేన్ని తెలుపుతుంది?
A) ఎలక్ట్రాన్‌ల సంఖ్య B) ఆర్బిట్ ఆకారం
C) ఆర్బిట్ పరిమాణం D) కేంద్రకావేశం
61. ఒక తరంగంలో వరుస శృంగాల మధ్య దూరాన్ని కింది విధంగా పిలుస్తారు?
A) తరంగదైర్ఘ్యం B) పౌనఃపున్యం C) కంపన పరిమితి D) ఏదీకాదు
62. ఒక తరంగంలోని వరుస ద్రోణుల మధ్య దూరాన్ని ఏవిధంగా పిలుస్తారు?
A) పౌనఃపున్యం B) తరంగ దైర్ఘ్యం C) కంపన పరిమితి D) ఏదీకాదు
63. ఒక తరంగంలోని తరంగదైర్ఘ్యం పొడవు ఎంత?
A) λ B) C) D) 2λ
జవాబులు: 58-C; 59-C; 60-C; 61-A; 62-B; 63-A;
64. ఒక సెకను కాలంలో ప్రయాణించే తరంగాల సంఖ్యను ఏమని పిలుస్తారు?
A) పౌనఃపున్యం B) తరంగ దైర్ఘ్యం C) కంపన పరిమితి D) ఏదీకాదు
65. తరంగ దైర్ఘ్యం (λ), పౌనఃపున్యం (ν), కాంతివేగం (C) ల మధ్య సంబంధం ఏమిటి?
A) C = B) C =
C) C = νλ D) ν = Cλ
66. ఎలక్ట్రాన్ పైస్థాయి నుంచి లోపలి స్థాయిలోకి మారినప్పుడు
A) శక్తి శోషణం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది
B) శక్తి ఉద్గారం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది
C) శక్తి ఉద్గారం ఒక నిర్దిష్ట ప్రమాణం యొక్క పూర్ణ గుణకాల్లో ఉంటుంది
D) శక్తి శోషణం క్వాంటాల్లో జరుగుతుంది
67. బున్‌సెన్ జ్వాలకు సోడియం క్లోరైడ్ పసుపురంగును కలిగిస్తుంది. దీనికి కారణం?
A) సోడియం యొక్క అయనీకరణ శక్తి తక్కువగా ఉండటం
B) సోడియం లోహం ఉత్పతనం చెందడం
C) సోడియంకు గల కాంతి సునిశిత ధర్మం
D) శోషణం చెందించుకున్న అదనపు శక్తి దృగ్గోచర ప్రాంతంలో తిరిగి ఉద్గారమవుతుంది
68. ఇతర క్వాంటం సంఖ్యలపై ఆధారపడని క్వాంటం సంఖ్య
A) ప్రధాన B) కోణీయ ద్రవ్యవేగ C) అయస్కాంత D) స్పిన్
69. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను తెలిపేది
A) ఆర్బిటాల్ పరిమాణం B) ఆర్బిటాల్ ఆకృతి
C) ఆర్బిటాల్ పరిమాణం, ఆర్బిటాల్ ఆకృతి D) ఆర్బిటాల్ స్థాన నిర్దేశకత
70. ఏ క్వాంటం సంఖ్యకు ఉండని విలువ
A) సున్నా B) అనంతం C) రుణ విలువ D) ధన విలువ
71. 'K' కర్పరంలోని రెండు ఎలక్ట్రాన్‌లు దేనిలో భేదిస్తాయి?
A) ప్రధాన క్వాంటం సంఖ్య B) కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య
C) అయస్కాంత క్వాంటం సంఖ్య D) స్పిన్ క్వాంటం సంఖ్య
72. ఒక పరమాణువు యొక్క స్పిన్ క్వాంటం సంఖ్య దేనికి సంబంధించింది?
A) ఆర్బిటాల్ పరిమాణానికి B) ఆర్బిటాల్ కోణీయ ద్రవ్యవేగానికి
C) ఆర్బిటాల్ ప్రాదేశిక స్థితికి D) స్పిన్ యొక్క కోణీయ ద్రవ్యవేగానికి
73. ఒక పరమాణువులోని చివరి ఎలక్ట్రాన్ క్వాంటం సంఖ్యలు n = 3, l = 1, ml = 1, ms = ±. అయితే ఆ పరమాణువు
A) Mg B) Al C) Si D) P
74. బెరీలియంలో నాలుగో ఎలక్ట్రాన్ యొక్క నాలుగు క్వాంటం సంఖ్యలు
75. ఒక పరమాణువులో చివరి ఎలక్ట్రాన్ యొక్క క్వాంటం సంఖ్యలు 3, 2, -2, + అయితే దాని పరమాణు సంఖ్య
A) 19 B) 20 C) 21 D) 22
76. క్లోరిన్ పరమాణువులో ఒంటరి ఎలక్ట్రాన్‌కు సరైన క్వాంటం సంఖ్యల సమితి
n l ml n l ml
A) 2 0 0 B) 2 1 1
C) 3 0 0 D) 3 1 1
77. 3pz లోని ఎలక్ట్రాన్‌కు గల n, l, ml విలువల సమితి
A) n = 2, l = 1, ml = 2 B) n = 3, l = 2, ml = 1
C) n = 3, l = 0, ml = 0 D) n = 3, l = 1, ml = −1
78. సోడియం పరమాణువులో వేలెన్సీ ఎలక్ట్రాన్‌కు అయస్కాంత క్వాంటం సంఖ్య?
A) 0 B) 1 C) 2 D) 3
79. 'd' ఆర్బిటాళ్లలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య
A) 2 B) 6 C) 10 D) 18
80. 'f' ఆర్బిటాళ్లను కలిగి ఉండే మొదటి శక్తి స్థాయి
A) K B) L C) M D) N
81. ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని, శక్తిని ఏక కాలంలో గుర్తించడం
A) సాధ్యపడుతుంది B) కొన్ని సమయాల్లో సాధ్యపడుతుంది
C) అసాధ్యం D) ఏదీకాదు
82. పరమాణువు 'L' కర్పరంలో ఉండగల ఎలక్ట్రాన్‌ల గరిష్ఠ సంఖ్య
A) 2 B) 6 C) 8 D) 10
83. n = 4 గల శక్తి స్థాయిలో గరిష్ఠంగా ఎన్ని ఎలక్ట్రాన్‌లు ఉండవచ్చు?
A) 8 B) 10 C) 18 D) 32
84. n = 3 గల క్వాంటం స్థాయిలో ఉండేందుకు అవకాశం ఉన్న ఆర్బిటాళ్ల సంఖ్య
A) 3 B) 4 C) 8 D) 9
85. ఏ కర్పరంలోనైనా ఉండగల గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య
A) n B) 2n C) n2 D) 2n2
86. అత్యధిక రుణవిద్యుదాత్మకత గల మూలకం యొక్క బాహ్యత కర్పరంలోని ఎలక్ట్రాన్ విన్యాసం
A) ns2np3 B) ns2np4 C) ns2np5 D) ns2np6
87. నైట్రోజన్ పరమాణువులో మూడు ఒంటరి ఎలక్ట్రాన్‌లు ఉండటాన్ని ఏ నియమం వివరిస్తుంది?
A) పౌలివర్జన నియమం B) ఆఫ్‌బౌ నియమం C) హుండ్ నియమం D) ఏదీకాదు
88. కింది ఆర్బిటాల్ చిత్రాల్లో దేనిలో పౌలివర్జన నియమం, హుండ్ నియమం రెండూ అతిక్రమించాయి?
89. కిందివాటిలో పౌలివర్జన నియమాన్ని ఉల్లంఘించింది ఏది?
90. నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px1 2py1 2pz1 గా ఉంటుంది. అయితే 1s2 2s2 2px2 2py1 2pz0 కాదు. ఈ విషయాన్ని నిర్ధారించేది?
A) ఆఫ్‌బౌ నియమం B) పౌలివర్జన నియమం
C) హుండ్ నియమం D) ఏదీకాదు
జవాబులు: 1-B; 2-B; 3-C; 4-A; 5-C; 6-A; 7-D; 8-B; 9-A; 10-A; 11-A; 12-B; 13-A; 14-C; 15-C; 16-B; 17-D; 18-A; 19-C; 20-B; 21-D; 22-C; 23-C; 24-D; 25-C; 26-B; 27-D; 28-D; 29-C; 30-A; 31-D; 32-C; 33-C; 34-C; 35-D; 36-A; 37-C; 38-A; 39- C; 40-A; 41-D; 42-A; 43-C; 44-A; 45-C; 46-B; 47-A; 48-A; 49-B; 50-C; 51-A; 52-B; 53-A; 54-D; 55-C; 56-B; 57-B; 64-A; 65-C; 66-C; 67-D; 68-D; 69-B; 70-B; 71-D; 72-D; 73-B; 74-C; 75-C; 76-D; 77-D; 78-A; 79-C; 80-D; 81-C; 82-C; 83-D; 84-D; 85-D; 86-C; 87-C; 88-A; 89-C; 90-C.