• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం

1. పదార్థంలోని మౌలిక కణాల్లో పరమాణువు ఒకటి.
2. మన చుట్టూ ఉన్నదంతా పరమాణువులతో నిర్మితమైంది.
3. పరమాణువులో ఉన్న ఉప పరమాణు కణాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు.
4. మొదటి పరమాణు నమూనాను జె.జె. థామ్సన్ ప్రతిపాదించారు.
5. ఇంద్రధనస్సుల్లో వరుసగా ఊదా, నీలి మందు రంగు, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ రంగు, ఎరుపు అనే ఏడు రంగులు ఉంటాయి.
6. ఏదైనా విద్యుదావేశం కంపిస్తూ ఉంటే అది తన చుట్టూ ఉండే విద్యుత్ క్షేత్రంలో మార్పు కలిగిస్తుంది. మారుతున్న ఈ విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రంలో మార్పును తీసుకొస్తుంది. ప్రసార దిశకు లంబంగా, ఒకదానికొకటి లంబదిశలో ఉండేలా విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు ఏర్పడే ఈ ప్రక్రియను విద్యుదయస్కాంత తరంగం అంటారు.
7. మనం చూసే ధృగ్గోచర కాంతి కూడా ఒక విద్యుదయస్కాంత తరంగమే, అంతరాళంలో కాంతి (C) 3 × 108 మీ.సె.-1 వేగంతో ప్రయాణిస్తుంది.
8. ఒక తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య దూరం లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని ఆ తరంగం తరంగదైర్ఘ్యం (λ) అంటారు.
9. సెకను కాలంలో ఒక బిందువు నుంచి ప్రయాణించిన తరంగాల సంఖ్యను పౌనఃపున్యం (ν) అంటారు.
10. తరంగదైర్ఘ్యం (λ), పౌనఃపున్యం (ν) కాంతి వేగం (c)ల మధ్య సంబంధం c = νλ.
11. తరంగం పౌనఃపున్యం పెరిగే కొద్ది దాని తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది.
12. విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌనఃపున్యాల సముదాయాన్ని విద్యుదయస్కాంత వర్ణపటం అంటారు.
13. ప్రకృతిలో ధృగ్గోచర వర్ణపటానికి ఇంద్రధనస్సు ఏర్పడటం ఒక ఉదాహరణ.
14. మానవుడు కంటితో చూడగలిగే రంగుల సముదాయాన్ని దృశ్యకాంతి అంటారు.
15. ఎరుపు రంగు నుంచి ఊదా రంగు వరకు ఉన్న తరంగ దైర్ఘ్యాల సముదాయాన్ని దృగ్గోచర కాంతి వర్ణపటం అంటారు.
16. విద్యుదయస్కాంత వర్ణపటంలో తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న గామా కిరణాల నుంచి అధిక తరంగదైర్ఘ్యం ఉన్న రేడియో కిరణాల వరకు ఉంటాయి. కానీ మన కళ్లు దృగ్గోచర వర్ణపట తరంగదైర్ఘ్యాలను మాత్రమే గుర్తిస్తాయి.
17. పదార్థాలు శోషణం లేదా ఉద్గారం చేసే శక్తి చిన్న ప్యాకెట్ రూపంలో ఉంటుంది. వీటినే క్వాంటం అంటారని మాక్స్ ప్లాంక్ ప్రతిపాదించారు.
18. క్వాంటం శక్తి  E = hν
h = ప్లాంక్ స్థిరాంకం = 6.626 × 10-34 జౌ. సె.
ν = వికిరణం యొక్క పౌనఃపున్యం
19. విద్యుదయస్కాంత శక్తి శోషణం లేదా ఉద్గారం అనేది అవిచ్ఛిన్న రూపంలో కాకుండా నిర్దిష్ట విలువలున్న భాగాలుగా ఉంటుంది. అది ఎల్లప్పుడు కి పూర్ణాంక గుణిజాలుగా ఉంటుందని మాస్ ప్లాంక్ ప్రతిపాదించారు.
1 hν, 2 hν, 3 hν .......... n hν

20. వీధి దీపాల్లో సోడియం ఆవిరులు పసుపు రంగును ఉత్పత్తి చేస్తాయి. దీని మూలంగా అవి పసుపు రంగులో వెలుగుతాయి.
21. క్యూప్రిడ్ క్లోరైడ్ ఆకుపచ్చ రంగు మంటను, స్ట్రాన్షియం క్లోరైడ్ ఎరుపు రంగు మంటను ఏర్పరుస్తాయి.
22. ప్రతి మూలకం తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రంగులు కాంతి నిర్దిష్ట తరంగ దైర్ఘ్యాలకు అనురూపకంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వర్ణపటాన్ని రేఖా వర్ణపటం అంటారు.
23. వేలిముద్రను బట్టి మనుషులను గుర్తించినట్లుగా పరమాణు వర్ణపటాల్లోని రేఖలను బట్టి ఆయా పరమాణువులను గుర్తించవచ్చు. 


24. బోర్ పరమాణు నమూనా:
(i) పరమాణువులో ఎలక్ట్రాన్‌లు కేంద్రకం నుంచి నిర్దిష్ట దూరాల్లో ఉన్న నియమిత శక్తి స్థాయిలో లేదా స్థిర కర్పరాల్లో ఉంటాయి.
(ii) ఎలక్ట్రాన్ తక్కువ శక్తిస్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయిలోకి చేరినప్పుడు శక్తిని గ్రహిస్తుంది. అదేవిధంగా ఎక్కువ శక్తిస్థాయి నుంచి తక్కువ స్థాయికి దూకినప్పుడు శక్తి విడుదల చేస్తుంది.
(iii) పరమాణువులోని ఎలక్ట్రాన్‌లకు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి. అవి E1, E2, E3 ......... అంటే ఎలక్ట్రాన్‌ల శక్తి క్వాంటీకరణం చెందింది.
(iv) ఈ శక్తులకు సంబంధించిన అన్ని స్థాయిలను స్థిరస్థాయి, వీటికి ఉండే శక్తి విలువలను శక్తి స్థాయి అంటారు.
(v) బోర్ పరమాణు నమూనా హైడ్రోజన్ వర్ణపటంలో కనిపించే రేఖల గురించి వివరిస్తుంది.
(vi) బోర్ పరమాణు నమూనా రేఖావర్ణ పటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేకపోయింది.


25. బోర్ - సోమర్ ఫెల్డ్ పరమాణు నమూనా
(i) రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించేందుకు సోమర్ ఫెల్డ్ బోర్ నమూనాను స్వల్పంగా ఆధునీకరించాడు. దీర్ఘ వృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టాడు.
(ii) బోర్ ప్రథమ కక్ష్యలో ఒక వృత్తాకార కక్ష్య మాత్రమే ఉంటుంది. బోర్ రెండో కక్ష్యలో వృత్తాకార కక్ష్య, ఒక దీర్ఘ వృత్తాకార కక్ష్య ఉంటాయి. బోర్ మూడో కక్ష్యలో ఒక వృత్తాకార, రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలు ఉంటాయి.
(ii) ఇది హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని రేఖల విభజనను వివరించింది.
(iii) ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్‌లున్న పరమాణువుల పరమాణు వర్ణపటాలను వివరించడంలో ఈ నమూనా విఫలమైంది.
26. ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ స్థానాన్ని, వేగాన్ని ఒకేసారి కచ్చితంగా కనుక్కోవడం అసాధ్యం. దీన్నే హైసన్ బర్గ్ అనిశ్చితత్వ నియమం అంటారు.
27. డీబ్రోలీ సిద్ధాంతం ప్రకారం కదిలే కణాలన్నింటికి తరంగ ధర్మాలు ఉంటాయి.
28. ఇర్విన్ ష్రోడింగర్ క్యాంటం యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఈ పరమాణు నమూనా ప్రకారం బోర్ నమూనాలోని కక్ష్యలకు బదులుగా ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్‌లు పరమాణువులో కేంద్రకం చుట్టూ నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయి.
29. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌ను కనుక్కునే సంభావ్యత ఏ ప్రాంతంలో అయితే అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటారు.
30. ప్రధాన క్వాంటం సంఖ్యను (n) నీల్స్ బోర్ ప్రతిపాదించారు.
31. ప్రధాన క్వాంటం సంఖ్య n విలువలు 1, 2, 3, 4, 5...

33. ప్రధాన క్వాంటం సంఖ్య కక్ష్య పరిమాణాన్ని, శక్తిని తెలియజేస్తుంది.
34. ఎజిముతల్ క్వాంటం సంఖ్య (l)ను సోమర్ ఫెల్డ్ ప్రతిపాదించారు.
35. క్వాంటం సంఖ్య (l) కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను సూచిస్తుంది. ప్రతి n విలువకు 0 నుంచి (n - 1) వరకు l విలువలు ఉంటాయి.
36. ప్రతి l విలువ కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలోని ఒక నిర్దిష్ట ఉపకర్పరం ఆకృతిని గురించి తెలుపుతుంది.
37. l విలువలను సాధారణంగా s, p, d, f సంకేతాలతో సూచిస్తారు.

38. n = 1, అయినప్పుడు l = 0 తో ఒకే ఒక ఉపకర్పరం ఉంటుంది. అది 1s.
39. n = 2 అయిన‌ప్పుడు l = 0 తో 2s అనే ఒక ఉప‌క‌ర్పరం, అలాగే l = 1 తో 2p అనే మ‌రొక ఉప‌క‌ర్పరం క‌లిపి మొత్తం రెండు ఉప‌క‌ర్పరాలు ఉంటాయి.
40. అయస్కాంత క్వాంటం సంఖ్యను లాండే ప్రతిపాదించాడు.
41. అయస్కాంత క్వాంటం సంఖ్య ml 0తో కలిపి -l నుంచి +l మధ్య పూర్ణాంక విలువలను కలిగి ఉంటుంది.
42. m మొత్తం విలువలు 2l + 1. ఇది ఉపశక్తి స్థాయిలో ఉన్న మొత్తం ఆర్బిటాళ్ల సంఖ్యను తెలియజేస్తుంది.
43. ఒక ఉపశక్తి స్థాయిలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య 2(2l + 1)కు సమానమవుతుంది.
44. అయస్కాంత క్వాంటం సంఖ్య ఆర్బిటాళ్ల ప్రాదేశిక అమరికను తెలియజేస్తుంది.
45. స్పిన్ క్వాంటం సంఖ్య m విలువలు +, -
46. సవ్యదిశలో ఉండే స్పిన్‌ను + లేదా గుర్తుతో సూచిస్తారు. అపసవ్యదిశలో ఉండే స్పిన్‌ను -

లేదా  గుర్తుతో సూచిస్తారు.
47. స్పిన్ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్ భ్రమణ దిశను తెలియజేస్తుంది.
48. s - ఆర్బిటాళ్లు గోళాకారంగా ఉంటాయి.
49. p - ఆర్బిటాళ్లు డంబెల్ (ముద్గర) ఆకారంలో ఉంటాయి.
50. p - ఉపశక్తి స్థాయిలో px, py, pz అనే మూడు ఆర్బిటాళ్లు ఉంటాయి. ఇవి x, y, z అక్షాల మీద విస్తరించి ఉంటాయి.
51. d - ఆర్బిటాళ్లు డబుల్ డంబెల్ (ద్వి ముద్గర) ఆకారంలో ఉంటాయి.
52. d - ఉపశక్తి స్థాయిలో dxy, dyz, dzx, dx2 - y2, dz2 అనే అయిదు ఆర్బిటాళ్లు ఉంటాయి.
53. ఎలక్ట్రాన్‌లు తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాళ్లలో ప్రవేశిస్తాయి. దీన్నే ఆఫ్‌భౌ నియమం అంటారు. ఆర్బిటాళ్ల ఎలక్ట్రాన్‌లు శక్తి పెరిగే వరుస క్రమంలో ప్రవేశిస్తాయి.
54. ఆర్బిటాళ్ల శక్తి వరుసక్రమం
    1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d < 4p < 5s < 4d < 5p < 6s < 4f < 5d < 6p < 7s
55. (n + l) విలువ తక్కువగా ఉన్న ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది. (n + l) విలువ సమానంగా ఉన్న రెండు ఆర్బిటాళ్లలో, n విలువ తక్కువగా ఉన్న ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది.
56. ఒక పరమాణువులో ఏ రెండు ఎలక్ట్రాన్‌లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. దీన్నే పౌలీవర్జన నియమం అంటారు.
57. హుండ్ నియమం ప్రకారం సమశక్తి ఆర్బిటాళ్లలో ఒక్కో ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడటం జరుగుతుంది.
58. పరమాణువు కక్ష్యలు, ఉపకక్ష్యలు, ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌లు ప్రవేశించడాన్ని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు.

60. క్రోమియం (Cr) (z = 24) పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం
      1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5

పరమాణు నిర్మాణం


            

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం