• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం

1. క్వాంటం సంఖ్యల వల్ల మనం ఏం సమాచారం పొందగలం? నాలుగు క్వాంటం సంఖ్యలు దేన్ని వ్యక్తపరుస్తాయో తెలపండి.   (AS 1) 4 మార్కులు
2. పరమాణువులో ఎలక్ట్రాన్‌లు కేంద్రకం నుంచి నిర్దిష్ట దూరాల్లో ఉన్న నియమిత శక్తి స్థాయిలో ఉంటాయి అని తెలిపే పరమాణు నమూనా ఏది? ఆ పరమాణు నమూనా ప్రతిపాదనలు, దాని పరిమితులు రాయండి. (AS 1) 4 మార్కులు
3. ఒక పరమాణువులోని M - కర్పరంలో ఎలక్ట్రాన్‌లు K, L కర్పరాల్లోని ఎలక్ట్రాన్‌ల సంఖ్యకు సమానమైతే కిందివాటికి సమాధానాలు రాయండి.   (AS 4) 4 మార్కులు
      i) బాహ్య కర్పరం ఏది?
      ii) దాని బాహ్య కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్‌లు ఉన్నాయి?
      iii) ఆ పరమాణు సంఖ్య ఎంత?
      iv) ఆ మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
4. ఒక మూలకపు ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2p6 3s2 3p6. ఈ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసేటప్పుడు ఏ నియమాన్ని పాటించలేదు? వివరించండి.   (AS 1) 2 మార్కులు
5. 3p ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ 4s లోకి వెళుతుంది కానీ 3d లోకి వెళ్లదు. ఎందుకో ఊహించి రాయండి. (AS 2) 2 మార్కులు
6. ఒక మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p1. ఆ మూలకం బాహ్యకక్ష్యలోని 2p ఎలక్ట్రాన్ నాలుగు క్వాంటమ్ సంఖ్యలను రాయండి.  (AS 1) 2 మార్కులు
7. ఒక పరమాణువు చిట్టచివరి కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాన్ క్వాంటం సంఖ్యలు కింది విధంగా ఉన్నాయి. (AS 4) 2 మార్కులు

n l ml ms
3 2 0

    i) ఈ మూలకం బాహ్య కర్పరం ఏది?
    ii) ఈ మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
    iii) ఈ మూలకం పరమాణు సంఖ్య ఎంత?
    iv) ఈ మూలకం వేలెన్సీ ఎంత?

8. సోమర్ ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్ష్యలు ప్రవేశపెట్టడానికి కారణాలు ఏమిటో చర్చించండి.  (AS 1) 2 మార్కులు
9. (n = 2) రెండో శక్తిస్థాయిలో ఉన్న సోమర్ ఫెల్డ్ నమూనా పటాన్ని గీయండి.  (AS 5) 2 మార్కులు
10. బోర్ నాలుగో కక్ష్యకు సోమర్ ఫెల్డ్ ఎన్ని దీర్ఘ వృత్తాకార కక్ష్యలను జత చేశాడో పట సహాయంతో చూపండి. (AS 5) 2 మార్కులు
11. కింది పట్టికను పూర్తి చేయండి.  (AS 1) 2 మార్కులు

l 0 1 2 3
ఉప కర్పరం        
ఆర్బిటాళ్ల సంఖ్య        

12. కింది పట్టికను పూర్తి చేయండి. (AS 1)  2 మార్కులు

ఉపకర్పరం s(l = 0) p(l = 1) d(l = 2) f(l = 3)
ఆర్బిటాళ్ల సంఖ్య        
గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య        

13. కింద ఇచ్చిన మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయండి.  (AS 1) 2 మార్కులు

మూలకం పరమాణు సంఖ్య ఎలక్ట్రాన్ విన్యాసం
C 6  
Al 13  
Ar 18  
Ca 20  

14. విద్యుదయస్కాంత వికిరణాలకు ప్లాంక్ ప్రతిపాదించిన శక్తి సమీకరణం తెలిపి ప్లాంక్ స్థిరాంకం విలువను రాయండి.  (AS 1) 2 మార్కులు
15. హుండ్ నియమాన్ని తెలిపి, ఒక ఉదాహరణతో వివరించండి.  (AS 1) 2 మార్కులు
16. nlxలో n, l, xలు వేటిని సూచిస్తాయి?   (AS 1) ఒక మార్కు

18. 
          
పై పటాన్ని గమనించండి. ఇది ఏ ఆర్బిటాల్‌ను సూచిస్తుంది.  (AS 5) ఒక మార్కు
19. జ్వాలా పరీక్షలో స్ట్రాన్షియం క్లోరైడ్, క్యూప్రిక్ క్లోరైడ్‌లు ఏ రంగు జ్వాలను ఏర్పరుస్తాయి.  (AS 3) ఒక మార్కు
20.
        
పై పటం దేన్ని సూచిస్తుంది? (AS 5) ఒక మార్కు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం