• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మూలకాల వర్గీకరణ - ఆవర్తన పట్టిక

1. ఎ) కింది సమూహం డాబరీనర్ త్రికం అవునో కాదో కారణం తెలపండి.
        Na, Si, Cl (Na, Si, Cl పరమాణు భారాలు వరుసగా 23, 28, 35.5)
   బి) S, Se, Te డాబరీనర్ త్రికమైతే Se పరమాణు భారం ఎంత?
        (S, Te పరమాణు భారాలు వరుసగా 32, 125)     (AS1) 4 మార్కులు
జ: ఎ) Na(23), Si(28), Cl(35.5) ఇది డాబరీనర్ త్రికం కాదు. ఎందుకంటే త్రికంలో మధ్య మూలకాల పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సగటుకు సమానంగా ఉండాలి.
   
కానీ, Si పరమాణుభారం 28 కాబట్టి Na, Si, Cl డాబరీనర్ త్రికం కాదు.

 

బి) ఇచ్చిన సమూహం డాబరీనర్ త్రికం
     S - పరమాణు భారం = 32
     Te - పరమాణు భారం = 125
     S, Se, Te డాబరీనర్ త్రికమైతే
     

 

2. మెండలీవ్ ఆవర్తన నియమాన్ని నిర్వచించండి. మెండలీవ్ ఆవర్తన పట్టికలోని ముఖ్యాంశాలను పేర్కొనండి. (AS1) 4 మార్కులు
జ: మెండలీవ్ ఆవర్తన నియమం: ''మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు". దీన్నే మెండలీవ్ ఆవర్తన నియమం అంటారు.
మెండలీవ్ ఆవర్తన పట్టికలోని ముఖ్యాంశాలు:
1. గ్రూపులు, ఉపగ్రూపులు: మెండలీవ్ ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలున్నాయి. వీటిని గ్రూపులు అని అంటారు. వీటిని I నుంచి VIII వరకు రోమన్ సంఖ్యల్లో సూచిస్తారు. ఒక గ్రూపులో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయి. ప్రతి గ్రూపు A, B అనే రెండు ఉపగ్రూపులుగా విభజితమై ఉంటుంది. ఏదైనా ఉపగ్రూపులో ఉన్న మూలకాలకు ఒక దానికొకటి రసాయన ధర్మాల్లో దగ్గరి సంబంధం ఉంటుంది.
2. పీరియడ్లు: మెండలీవ్ ఆవర్తన పట్టికలోని అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. పట్టికలో ఉన్న పీరియడ్లను 1 నుంచి 7 వరకు అరబిక్ సంఖ్యలతో సూచిస్తారు. ఒక పీరియడ్‌లో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలను ప్రదర్శించవు.
3. అప్పటి వరకు తెలియని మూలకాల ధర్మాలను ఊహించడం: ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక ఆధారంగా మెండలీవ్ కొన్ని మూలకాలు లభ్యమవలేదని గుర్తించాడు. వాటి కోసం పట్టికలో నిర్దిష్ట స్థానాల్లో ఖాళీ గడులను విడిచిపెట్టాడు. ఆ మూలకాలకు తాత్కాలికంగా పేర్లు నిర్ధారించాడు. ఉదాహరణకు ఎకా-బోరాన్, ఎకా-అల్యూమినియం, ఎకా-సిలికాన్.
4. పరమాణు ద్రవ్యరాశి సరిచేయడం: మెండలీవ్ ఆవర్తన పట్టికలో మూలకాలను సరైన స్థానాల్లో ఉంచడం ద్వారా బెరీలియం, ఇండియం, బంగారం లాంటి కొన్ని మూలకాల ద్రవ్యరాశులను సరిచేయడానికి వీలు కలిగింది.
5. అసంగత శ్రేణులు: టెలూరియం (Te), అయోడిన్ (I) లాంటి కొన్ని అసంగత శ్రేణులను మెండలీవ్ పట్టికలో గమనించవచ్చు. ఎక్కువ పరమాణు భారం ఉన్న Te ని తక్కువ పరమాణు భారం ఉన్న I కంటే ముందు ఉంచారు.

 

3. నవీన ఆవర్తన పట్టిక ప్రత్యేకతలను తెలియజేయండి.
                                (లేదా)
''మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు అనే నియమాన్ని అనుసరించి విస్తృత ఆవర్తన పట్టిక లక్షణాలను వివరించండి. దాని ప్రత్యేకతలను తెలియజేయండి.  (AS1) 4 మార్కులు
జ: నవీన ఆవర్తన నియమం: మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు.
నవీన ఆవర్తన పట్టిక ప్రత్యేకతలు:
* నవీన ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు (గ్రూపులు), 7 అడ్డు వరుసలు (పీరియడ్లు) ఉంటాయి.
* మూలక పరమాణువుల బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం (వేలన్సీ స్థాయి) ఒకేలా ఉండే మూలకాలన్నీ ఒకే నిలువు వరుసలో అమరి ఉంటాయి. వీటినే గ్రూపులు అంటారు. సంప్రదాయబద్దంగా వీటిని I నుంచి VIII వరకు రోమన్ సంఖ్యలను ఉపయోగించి సూచిస్తూ వాటికి A, B అక్షరాలను జోడించి చూపుతారు. ప్రస్తుతం IUPAC నిర్ణయం ప్రకారం వీటిని 1 నుంచి 18 వరకు అరబిక్ అంకెలతో సూచిస్తున్నారు.
* మూలకానికి చెందిన పరమాణువులో చిట్టచివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్, ఏ ఉప కక్ష్యలో చేరుతుందో దాని ఆధారంగా చేసుకుని మూలకాలను s, p, d, f బ్లాక్ మూలకాలుగా వర్గీకరించారు.
* ఏదైనా మూలకపు పరమాణువులో ఎన్ని ప్రధాన కక్ష్యలున్నాయో ఆ సంఖ్య ఆ మూలకం ఏ పీరియడ్‌కు చెందుతుందనే విషయాన్ని నిర్ణయిస్తుంది. ఒక పీరియడ్‌లో ఉండే మూలకాల సంఖ్య... మూలక పరమాణువుల వివిధ కక్ష్యల్లో ఎలక్ట్రాన్లు నిండే విధానంపై ఆధారపడి ఉంటుంది.
* మొదటి పీరియడ్ K కక్ష్యతో మొదలవుతుంది. మొదటి ప్రధాన కక్ష్య (K) 1s ఒకే ఒక ఉప కక్ష్యను కలిగి ఉంటుంది. మొదటి పీరియడ్‌లో రెండు మూలకాలు (H, He)మాత్రమే ఉంటాయి.
* రెండో పీరియడ్ 2వ ప్రధాన కక్ష్య (L)తో మొదలవుతుంది. L కక్ష్యలో 2s, 2pలనే రెండు ఉపకక్ష్యలు ఉంటాయి. కాబట్టి 8 రకాల విన్యాసాలు దీనిలో సాధ్యపడతాయి. అవి 2s1, 2s2, 2p1 నుంచి 2p6. కాబట్టి రెండోపీరియడ్‌లో Li, Be, B, C, N, O, F, Ne అనే 8 మూలకాలుంటాయి. అంటే రెండో పీరియడ్‌లో రెండు s-బ్లాకు మూలకాలు ఆరు p-బ్లాకు మూలకాలు ఉంటాయి.
* మూడో పీరియడ్ మూడో ప్రధాన కక్ష్యతో (M) మొదలవుతుంది. ఈ కక్ష్య 3s, 3p, 3d లనే ఉపకక్ష్యలను కలిగి ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్లు నిండుతున్నపుడు '4s' నిండిన తర్వాతే 3d నిండుతుంది. కాబట్టి 3వ పీరియడ్ 8 మూలకాలను మాత్రమే కలిగి ఉంటుంది. దానిలో రెండు s-బ్లాకు మూలకాలు (Na, Mg), ఆరు p-బ్లాకు మూలకాలు (Al నుంచి Ar) ఉంటాయి.
* నాలుగో పీరియడ్ 4వ ప్రధాన కక్ష్య (N)తో మొదలవుతుంది. ఈ కక్ష్యలో 4s, 4p, 4d, 4f ఉప కక్ష్యలు ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్లు నిండుతున్నప్పుడు 4s, 3d, 4p క్రమాన్ని పాటిస్తాయి కాబట్టి నాలుగో పీరియడ్ 18 మూలకాలను కలిగి ఉంటుంది. ఇదేవిధంగా అయిదో పీరియడ్‌లో 18 మూలకాలు ఉంటాయి.
* ఆరో పీరియడ్‌లో Cs నుంచి Rn వరకు 32 మూలకాలుంటాయి, అందులో 2 మూలకాలు s-బ్లాకుకు (6s), 14 మూలకాలు f-బ్లాకుకు (4f), 10 మూలకాలు d-బ్లాకుకు (5d), 6 మూలకాలు p-బ్లాకుకు (6p) చెందుతాయి.
* ఏడో పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంటుంది. అందులో 2 మూలకాలు s-బ్లాకుకు (7s), 14 మూలకాలు f-బ్లాకుకు (5f), 10 మూలకాలు d-బ్లాకుకు (6d), కొన్ని మూలకాలు p-బ్లాకుకు (7p) చెందుతాయి.
* 4f మూలకాలను లాంథనైడ్లు, 5f మూలకాలను ఆక్టినైడ్లు అంటారు. f-బ్లాకు మూలకాలైన లాంథనైడ్లు, ఆక్టినైడ్లను ఆవర్తన పట్టికకు అడుగు భాగాన అమర్చారు.

 

4. ఆవర్తన పట్టికలో పరమాణు వ్యాసార్ధం, అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటి, రుణవిద్యుదాత్మకత, లోహ, అలోహ ధర్మాలు.... పీరియడ్, గ్రూపుల్లో ఏ విధంగా మార్పు చెందుతాయో తెలపండి.  (AS1) 4 మార్కులు
జ: పరమాణు వ్యాసార్ధం:
పీరియడ్: పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వెళ్లేకొద్దీ పరమాణు వ్యాసార్ధం తగ్గుతుంది.
గ్రూపు: గ్రూపుల్లో పైనుంచి కిందికి వెళ్లే కొద్దీ పరమాణు వ్యాసార్ధం పెరుగుతుంది.
అయనీకరణ శక్తి:
పీరియడ్: పీరియడ్లలో ఎడమ నుంచి కుడివైపు వెళ్లేకొద్దీ మూలకాల అయనీకరణ శక్తి సాధారణంగా పెరుగుతుంది. అయితే క్రమ పద్ధతిని పాటించదు.
గ్రూపు: గ్రూపుల్లో పైనుంచి కిందికి వెళ్లేకొద్దీ మూలకాల అయనీకరణ శక్తి తగ్గుతుంది.
ఎలక్ట్రాన్ ఎఫినిటీ:
పీరియడ్: పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వెళ్లేకొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా పెరుగుతాయి.
గ్రూపు: గ్రూపుల్లో పై నుంచి కిందికి వెళ్లేకొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా తగ్గుతాయి.
రుణవిద్యుదాత్మకత:
పీరియడ్: పీరియడ్లలో ఎడమ నుంచి కుడివైపు వెళ్లేకొద్దీ మూలకాల రుణ విద్యుదాత్మకతలు క్రమంగా పెరుగుతాయి.
గ్రూపు: గ్రూపుల్లో పైనుంచి కిందికి వెళ్లేకొద్దీ మూలకాల రుణ విద్యుదాత్మకతలు క్రమంగా తగ్గుతాయి.
లోహ, అలోహ ధర్మాలు:
పీరియడ్: పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వెళ్లేకొద్దీ లోహ స్వభావం తగ్గుతూ అలోహ స్వభావం క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
గ్రూపు: గ్రూపుల్లో పైనుంచి కిందికి వెళ్లేకొద్దీ లోహ స్వభావం క్రమంగా పెరుగుతూ అలోహ స్వభావం తగ్గుతూ ఉంటుంది.

 

5. అయనీకరణ శక్మం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? వాటిని వివరించండి.  (AS1) 4 మార్కులు
జ: అయనీకరణ శక్మం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
i) కేంద్రక ఆవేశం: కేంద్రంలో ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు అయనీకరణ శక్తి విలువ పెరుగుతుంది.
ఉదా: సోడియంతో పోల్చినప్పుడు క్లోరిన్ అయనీకరణ శక్తి ఎక్కువ.
ii) స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం: కేంద్రకానికి, వేలన్సీ ఎలక్ట్రాన్లకు మధ్య కక్ష్యల సంఖ్య పెరిగితే అవి తెరల మాదిరిగా పనిచేస్తాయి. వేలన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణను అడ్డుకుంటాయి. దీన్నే స్క్రీనింగ్ ఫలితం అంటారు. ఈ ఫలితం విలువ పెరిగితే అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి.
ఉదా: Li తో పోలిస్తే Cs లో కక్ష్యల సంఖ్య ఎక్కువ కాబట్టి Li కంటే Cs అయనీకరణ శక్తి తక్కువ.
iii) ఆర్బిటాళ్ల చొచ్చుకుపోయే స్వభావం: ఒకే ప్రధాన కక్ష్యలో ఉండే ఆర్బిటాళ్లలో కేంద్రకం వైపునకు చొచ్చుకుపోయే స్వభావం వేర్వేరుగా ఉంటుంది.
ఉదా: నాలుగో కక్ష్యలో ఈ స్వభావం 4s > 4p > 4d > 4fగా ఉంటుంది. అందువల్లే 4s కంటే 4f నుంచి ఎలక్ట్రాన్లను సులభంగా తోలగించవచ్చు.
iv) స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం: ఏదైనా పరమాణువులో ఆర్బిటాళ్లు పూర్తిగా లేదా సగం నిండినట్లయితే వాటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు. ఇలా పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాళ్లు ఉన్న పరమాణువుల నుంచి ఎలక్ట్రాన్లు తొలగించడానికి అధికశక్తి అవసరమవుతుంది.
ఉదా: ఆక్సిజన్ ఎలక్ట్రాన్ విన్యాసం: 1s2 2s2 2p4
          నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం: 1s2 2s2 2p3
ఆక్సిజన్‌తో పోల్చినప్పుడు నైట్రోజన్‌లో సగం నిండిన ఆర్బిటాళ్లు ఉన్నాయి. కాబట్టి నైట్రోజన్ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ.
v) పరమాణు వ్యాసార్ధం: పరమాణు వ్యాసార్ధం పెరిగే కొద్దీ అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి.
ఉదా: ఫ్లోరిన్ అయనీకరణ శక్తి విలువ అయోడిన్ కంటే ఎక్కువ.

 

6. కింద ఇచ్చిన పటం మూలకాల ఆవర్తన పట్టికలోని కొంత భాగాన్ని సూచిస్తుంది. మొదటి మూడు పీరియడ్లలోని అయిదు మూలకాలను P, Q, R, S, T అనే అక్షరాలతో సూచించారు. (అయితే P, Q, R, S, Tలు మూలకాల వాస్తవ సంకేతాలు కాదు)

   
i) క్షార లోహాలను సూచించే అక్షరాన్ని రాయండి.
జ: S
ii) జడవాయువులను సూచించే అక్షరాన్ని రాయండి.
జ: R
iii) హాలోజన్లను సూచించే అక్షరాన్ని రాయండి.
జ: T
iv) P, Tల మధ్య ఏ రకమైన బంధం ఏర్పడుతుంది?
జ: సమయోజనీయ బంధం

 

7. రెండో పీరియడ్‌లోని కొన్ని మూలకాల పరమాణు పరిమాణాలను పట్టికలో ఇచ్చారు. పట్టికను గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. (AS4) 4 మార్కులు
    
i) మూలకాలను వాటి పరమాణు పరిమాణాల ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి.
జ: F, O, N, C, B, Be, Li
ii) 2వ పీరియడ్‌లో జడవాయువుల ఎలక్ట్రాన్ విన్యాసానికి దగ్గరగా ఉన్న మూలకం ఏది?
జ: Li, F
iii) ఈ మూలకాలన్నింటిలో బాహ్య కక్ష్య ఏమిటి?
జ: L - కక్ష్య
iv) బెరీలియం, కార్బన్‌లలో దేని పరిమాణం ఎక్కువ?
జ: Be

 

8.
    

పై పట్టికను గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.                     (AS4) 4 మార్కులు
i) ఏ మూలకానికి తక్కువ పరమాణు పరిమాణం ఉంది?
జ: Cl
ii) Al, Cl ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయండి.
జ: Al - 1s2 2s2 2p6 3s2 3p1
     Cl - 1s2 2s2 2p6 3s2 3p5
iii) పై పట్టికలో K కు సమాన భౌతిక, రసాయన ధర్మాలు ఉన్న మూలకాలను గుర్తించండి.
జ: Na, Rb
iv) పై పట్టికలో అధిక పరమాణు పరిమాణం ఉన్న మూలకం ఏది?
జ: Rb

 

9. 

గ్రూపు/ పీరియడ్ మూలకాల రుణ విద్యుదాత్మకత విలువలు
VII A హాలోజన్లు 
2వ పీరియడ్
F(4.0), Cl(3.0), Br(2.8), I(2.5)
Li(1.0), Be(1.4), B(2.0), C(2.5), N(3.0), O(3.5), F(4.0), Ne(0)

17వ గ్రూప్, 2వ పీరియడ్‌లకు సంబంధించిన కొన్ని మూలకాల రుణ విద్యుదాత్మకత విలువలను పట్టికలో ఇచ్చారు. పట్టికను గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.   (AS4) 4 మార్కులు
i) 17వ గ్రూప్‌లోని మూలకాలను వాటి రుణ విద్యుదాత్మకత విలువల ఆరోహణ క్రమంలో అమర్చండి.
జ: I(2.5), Br(2.8), Cl(3.0), F(4.0)
ii) అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?
జ: F(4.0)
iii) అత్యల్ప రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?
జ: Li(1.0)
iv) గ్రూపు, పీరియడ్‌లలో రుణ విద్యుదాత్మక విలువలు ఏవిధంగా మారతాయి?
జ: పీరియడ్లలో ఎడమ నుంచి కుడివైపునకు వెళ్లేకొద్దీ మూలకాల రుణ విద్యుదాత్మకతలు క్రమంగా పెరుగుతాయి. గ్రూపుల్లో పైనుంచి కిందికి వెళ్లేకొద్దీ మూలకాల రుణ విద్యుదాత్మకతలు క్రమంగా తగ్గుతాయి.


10. VIIA, VIA గ్రూప్ మూలకాలకు సంబంధించిన ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువలను కింది పట్టికలో ఇచ్చారు. పట్టికను గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (AS4) 4 మార్కులు

గ్రూపు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు (kJ/mole లలో)
VIIA (హాలోజన్లు)
VIA (చాల్కోజన్లు)
F(-328), Cl(-349), Br(-325), I(-295), At(-270)
O(-141), S(-200), Ge(-195), Te(-190), Po(-174)

i) ఎలక్ట్రాన్ ఎఫినిటీకి ప్రమాణాలు తెలపండి.
జ: kJ/ mole
ii) చాల్కోజన్ గ్రూప్‌లోని మూలకాలను వాటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువల అవరోహణ క్రమంలో అమర్చండి.
జ: O(-141), Po(-174), Te(-190), Ge(-195), S(-200)
iii) గ్రూపు, పీరియడ్లలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఏ విధంగా మారతాయి?
జ: పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వెళ్లేకొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా పెరుగుతాయి. గ్రూపుల్లో పైనుంచి కిందికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా తగ్గుతాయి.
iv) ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు రుణాత్మకంగా లేదా ధనాత్మకంగా ఉంటే శక్తి విలువ ఏమవుతుంది?
జ: ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు రుణాత్మకంగా ఉంటే శక్తి విడుదలవుతుంది. ధనాత్మకంగా ఉంటే శక్తి గ్రహించబడుతుంది.


11.

              
i) 2, 3 పీరియడ్లలో ఎడమ నుంచి కుడి వైపునకు కదిలినప్పుడు పరమాణు పరిమాణంలో కలిగే మార్పు ఏమిటి? మీ సమాధానాన్ని సమర్థించండి. (AS1) (AS4) 4 మార్కులు
జ: పీరియడ్లలో ఎడమ నుంచి కుడివైపునకు వెళ్లేకొద్దీ పరమాణు పరిమాణం తగ్గుతుంది. ఎందుకంటే ఒకే పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి వెళ్లేకొద్దీ కక్ష్యల సంఖ్య పెరగకపోగా, పీరియడ్ మొదట్లో ఉన్న కక్ష్యనే ఉండి, అదే కక్ష్యలోకి ఎలక్ట్రాన్‌లు ప్రవేశిస్తాయి. అదే సమయంలో పరమాణు సంఖ్య పెరగడం వల్ల కేంద్రక ఆకర్షణ చిట్టచివరి కక్ష్యపై ఎక్కువగా ఉండి పరమాణు పరిమాణం తగ్గుతుంది.
ii) పీరియడ్లలో ఎడమ నుంచి కుడివైపునకు కదిలినప్పుడు మూలకాల లోహస్వభావంలో ఎలాంటి మార్పులు మీరు గమనిస్తారు?
జ: పీరియడ్లలో ఎడమ నుంచి కుడివైపునకు కదిలేకొద్దీ మూలకాల లోహ స్వభావం తగ్గుతూ, అలోహ స్వభావం పెరుగుతుంది. పీరియడ్‌లో మొదటి రెండు లేదా మూడు మూలకాలు లోహాలుగా, ఆ తర్వాత ఒకటి లేదా రెండు మూలకాలు అర్ధలోహాలుగా, ఆ తర్వాత మిగిలిన అన్ని మూలకాలు అలోహాలుగా ఉంటాయి. కాబట్టి పీరియడ్లలో లోహ స్వభావం తగ్గి, అలోహ స్వభావం పెరుగుతుంది.


12. కొన్ని మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం  (AS4) 4 మార్కులు

i) పైన తెలిపిన ఎలక్ట్రాన్ విన్యాసాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.

ii) ఎలక్ట్రాన్ విన్యాసం తప్పుగా ఉన్న మూలకం పేరు తెలిపి దాని ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సరిచేయండి.

iii) పైవాటిలో క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గుర్తించండి. ఈ మూలకం ఏ పీరియడ్‌కు చెందిందో తెలపండి.

iv) పైవాటిలో ఉండే జడవాయువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గుర్తించండి. ఈ మూలకం ఏ పీరియడ్‌కు చెందిందో తెలపండి.
జ: ఆర్గాన్ (1s2 2s2 2p6 3s2 3p6)
        పీరియడ్ సంఖ్య - 3

 

13. పరమాణు సంఖ్య 12గా ఉన్న మూలకం కింది లక్షణాలను రాయండి.
     a) పీరియడ్ సంఖ్య
     b) గ్రూపు సంఖ్య
     c) సంయోజకత
     d) మూలక కుటుంబం     (AS1) 2 మార్కులు
జ: a) పీరియడ్ సంఖ్య - 3
     b) గ్రూపు సంఖ్య - IIA (2వ)
     c) సంయోజకత - 2
     d) మూలక కుటుంబం - క్షారమృత్తిక లోహాలు


14. ఇచ్చిన ఎలక్ట్రాన్ విన్యాసాలను పరిశీలించి ఆ మూలకాల గ్రూప్‌లు, పీరియడ్‌ల సంఖ్యలను రాయండి.  (AS1) 2 మార్కులు


జ: a) గ్రూపు సంఖ్య - VIA
          పీరియడ్ సంఖ్య - 2
      b) గ్రూప్ సంఖ్య - IVA
          పీరియడ్ సంఖ్య - 3


15. X, Y, Zల ఎలక్ట్రాన్ విన్యాసాలు కిందివిధంగా ఉన్నాయి. (AS1) 2 మార్కులు

a) మూడో గ్రూపునకు చెందిన మూలకం ఏది?
జ: Y మూలకం మూడో గ్రూపునకు చెందింది
b) VIIIA గ్రూపునకు చెందిన మూలకం ఏది?
జ: Z మూలకం VIIIA గ్రూపునకు చెందింది.

 

16. కింది మూలకాల సమూహం ఏదైనా గ్రూపు మూలకాలైతే G అని, పీరియడ్‌కు చెందిన మూలకాలైతే P అని, ఏదీ కాకపోతే N అని గుర్తించండి.  (AS1) 2 మార్కులు   

మూలకాలు O, S, Cl Li, Na, K K, Ca, Sc B, Al, Ga
G/P/N        

జ:   

మూలకాలు O, S, Cl Li, Na, K K, Ca, Sc B, Al, Ga
G/P/N N G P G

17. సాధారణంగా గ్రూపులో ఉండే మూలకాలు ఒకేరకమైన ధర్మాలు కలిగి ఉంటాయి. కానీ, పీరియడ్లలో ఇది విభిన్నం. ఎందుకో వివరించండి. (AS1) 2 మార్కులు
జ: నవీన ఆవర్తన నియమం ప్రకారం మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల గ్రూపులో ఉండే మూలకాలన్నింటి వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి అవి ఒకేరకమైన ధర్మాలు కలిగి ఉంటాయి. కానీ, పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి వెళ్లిన కొద్దీ పరమాణు సంఖ్య ఒక యూనిట్ చొప్పున పెరుగుతుంది. ఫలితంగా వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసంలో మార్పు వస్తుంది. అందువల్ల పీరియడ్‌లో మూలకాలు, భిన్నధర్మాలు కలిగి ఉంటాయి.

 

18. ఎలక్ట్రాన్ ఎఫినిటీని ప్రభావితం చేసే అంశాలను తెలపండి.  (AS1) 2 మార్కులు
జ: ఎలక్ట్రాన్ ఎఫినిటీని ప్రభావితం చేసే అంశాలు
    i) కేంద్రక ఆవేశం
    ii) స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం
    iii) ఆర్బిటాళ్ల చొచ్చుకుపోయే స్వభావం
    iv) స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం
    v) పరమాణు వ్యాసార్ధం


19. కింది పట్టికను పూర్తి చేయండి.  (AS4) 2 మార్కులు

జ:
 

20. కింది మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను గమనించండి. మూలకం ఏ బ్లాకుకు చెందుతుందో గుర్తించండి.  (AS1) 2 మార్కులు

 

21. కింది పట్టికను సరైన సమాధానాలతో పూర్తిచేయండి.  (AS4) 2 మార్కులు

 

22. కింది పట్టికను సరైన సమాధానాలతో పూర్తి చేయండి.   (AS4) 2 మార్కులు

23.  

మూలకం x y z
పరమాణు సంఖ్య 5 7 9

i) 17వ గ్రూపునకు చెందిన మూలక సంకేతం
ii) 15వ గ్రూపునకు చెందిన మూలక సంకేతం రాయండి.  (AS1) 2 మార్కులు
జ: x పరమాణు సంఖ్య 5. దీని ఎలక్ట్రాన్ విన్యాసం (2, 3)
      y పరమాణు సంఖ్య 7. దీని ఎలక్ట్రాన్ విన్యాసం (2, 5)
      z పరమాణు సంఖ్య 9. దీని ఎలక్ట్రాన్ విన్యాసం (2, 7)
i) 17వ గ్రూపునకు చెందిన మూలకం 'z'. దీని పరమాణు సంఖ్య 9 కాబట్టి ఇది ఫ్లోరిన్, దీని సంకేతం F.
ii) 15వ గ్రూపునకు చెందిన మూలకం 'y'. దీని పరమాణు సంఖ్య 7 కాబట్టి ఇది నైట్రోజన్. దీని సంకేతం N.


24. Cl, Cl- లలో దేనికి పరిమాణం ఎక్కువ, ఎందుకు? (AS1) 2 మార్కులు
జ: i) Cl ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p5
ii) Cl- అయాన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p6
iii) Cl, Cl- అయాన్‌లు రెండింటిలో 17 ప్రోటాన్‌లు ఉన్నప్పటికీ Clలో 17 ఎలక్ట్రాన్‌లు, Cl- అయాన్‌లో 18 ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.
iv) Cl-అయాన్‌లోని ప్రోటాన్‌లు ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్‌లను ఆకర్షిస్తున్నాయి. Clతో పోలిస్తే కేంద్రక ఆకర్షణలు తక్కువగా ఉండటం వల్ల Cl- అయాన్ Cl కంటే అధిక పరిమాణాన్ని కలిగి ఉంటుంది.

 

25. ఆధునిక ఆవర్తన పట్టికలోని మూలకాలను s, p, d, f బ్లాకులుగా ఎలా విభజించారు?    (AS1) 2 మార్కులు
జ: మూలకం యొక్క పరమాణువులో చిట్టచివరి ఎలక్ట్రాన్ ఏ ఉపకక్ష్యలో చేరుతుందో దాని ఆధారంగా చేసుకుని మూలకాలను s, p, d, f బ్లాకులుగా వర్గీకరించారు.
ఉదా: i) సోడియం (Na) ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s1 దీనిలో చిట్టచివరి ఎలక్ట్రాన్ 's' ఆర్బిటాల్‌లో ఉంది కాబట్టి ఇది 's' బ్లాకుకు చెందుతుంది. అదేవిధంగా
ii) Al ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p1కాబట్టి ఇది p - బ్లాకుకు, చెందుతుంది.
iii) Sc ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1కాబట్టి ఇది d - బ్లాకుకు చెందుతుంది.
iv) Ce ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 4d10 5s2 5p6 6s2 5d0 4f2 కాబట్టి ఇది 'f' - బ్లాకుకు చెందుతాయి.


26. మెండలీవ్ తన ఆవర్తన పట్టికలో దేని ఆధారంగా మూలకాలను అమర్చాడు?   (AS1) ఒకమార్కు
జ: పరమాణు భారాలు


27. ఆధునిక ఆవర్తన పట్టికలోని మొదటి పది మూలకాల్లోని లోహాలు ఏవి?  (AS1) ఒకమార్కు
జ: లిథియం, బెరీలియం


28. ఆవర్తన పట్టికలో ఏవైపున లోహాలను కనుక్కుంటావు?    (AS1) ఒకమార్కు
జ: ఎడమ వైపున

 

29. ఆవర్తన పట్టికలో ఏవైపున అలోహాలను కనుక్కుంటావు?  (AS1) ఒకమార్కు
జ: కుడివైపున


30. చివరి కక్ష్యలో ఎలక్ట్రాన్లతో పూర్తిగా నిండి ఉన్న రెండు మూలకాలను తెలపండి.  (AS1) ఒకమార్కు
జ: హీలియం, నియాన్


31. చివరి కక్ష్యలో ఒక ఎలక్ట్రాన్‌ను కలిగి ఉండే రెండు మూలకాలను తెలపండి.   (AS1) ఒకమార్కు
జ: హైడ్రోజన్, లిథియం


32. రెండు కక్ష్యలను కలిగి, ఆ రెండు కక్ష్యలు పూర్తిగా ఎలక్ట్రాన్‌లతో నిండి ఉన్న మూలకం ఏది? (AS1) ఒకమార్కు
జ: నియాన్ (2, 8)


33. Li, Na, K ఎలక్ట్రాన్ విన్యాసాల్లో గమనించే సాధారణ అంశం ఏమిటి?  (AS1) ఒకమార్కు
జ: Li, Na, K మూలకాలన్నీ 1 (IA) గ్రూప్‌నకు చెందినవి. ఆ మూలకాలన్నీ వేలన్సీ కక్ష్యలో ఒక ఎలక్ట్రాన్‌ను కలిగి ఉంటాయి.


34. ఆవర్తన పట్టికలో లోహాలు, అలోహాలను వేరుచేసే మూలకాలను ఏమని పిలుస్తారు?    (AS1) ఒకమార్కు
జ: అర్ధలోహాలు


35. Na, K, Mg, Al.... లాంటి మూలకాలను వాటి లోహధర్మం పెరిగే క్రమంలో అమర్చండి. (AS1) ఒకమార్కు
జ: Al < Mg < Na < K

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. Ca, Sr, Baలు డాబర్‌నీర్ త్రికాలు. Ca, Baల భారాలు వరుసగా 40.0, 137.0 అయితే స్ట్రాన్షియం భారాన్ని కనుక్కోండి. (AS 1) ఒక మార్కు

 

2. డాబర్‌నీర్ త్రిక సిద్ధాంతంలోని రెండు లోపాలను తెలపండి. (AS 1) ఒక మార్కు
జ: 1. డాబర్‌నీర్ కాలం నాటికి తెలిసిన మూలకాలన్నింటినీ త్రికాలుగా అమర్చలేక పోయాడు.
2. ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశులున్న మూలకాలకు వర్తించదు.


3. 'మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు వాటి ధర్మాలు నిర్ణీత వ్యవధుల్లో పునరావృతమవుతాయి' అని తెలిపిన నియమం ఏది? (AS 1) ఒక మార్కు
జ: న్యూలాండ్స్ అష్టక నియమం.


4. న్యూలాండ్స్ మూలకాల పట్టికలో ఏవైనా రెండు పరిమితులను తెలపండి. (AS 1) ఒక మార్కు
జ: 1. న్యూలాండ్స్ పట్టిక 56 మూలకాలకు మాత్రమే పరిమితమైంది.
     2. పూర్తిగా భిన్నమైన ధర్మాలను కలిగిన కొన్ని మూలకాలను ఒకే గ్రూపులో అమర్చారు.


5. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఎన్ని గ్రూపులు, పీరియడ్‌లు ఉన్నాయి? (AS1) ఒక మార్కు
జ: 8 గ్రూపులు, 7 పీరియడ్‌లు.

 

6. ఎకా - బోరాన్, ఎకా - అల్యూమినియం, ఎకా - సిలికాన్ స్థానాల్లో కనుక్కున్న మూలకాలు ఏవి? (AS1) ఒక మార్కు
జ: ఎకా - బోరాన్, ఎకా - అల్యూమినియం, ఎకా - సిలికాన్ స్థానాల్లో వరుసగా స్కాండియం, గాలియం, జెర్మేనియం మూలకాలను కనుక్కున్నారు.


7. ఏ ప్రతిపాదన ఆధారంగా నవీన ఆవర్తన పట్టికను నిర్మించారు? (AS 1)ఒక మార్కు
జ: మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు.


8. నవీన ఆవర్తన పట్టికలో మూలకాలను s, p, d, f బ్లాక్ మూలకాలుగా ఏ విధంగా వర్గీకరించారు? (AS 1) ఒక మార్కు
జ: మూలకం పరమాణువులో చిట్టచివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఏ ఉప కక్ష్యలో చేరుతుందో దాన్ని ఆధారంగా చేసుకుని మూలకాలను s, p, d, f బ్లాక్ మూలకాలుగా వర్గీకరించారు.


9. Sc ఏ బ్లాక్‌కు చెందిన మూలకం? (AS 1) ఒక మార్కు
జ: d - బ్లాక్ మూలకం (Sc ఎలక్ట్రాన్ విన్యాసం - 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1)


10. క్షార మృత్తిక లోహలు ఏ గ్రూపుకు చెందినవి? (AS 1) ఒక మార్కు
జ: 2 (II A)


11. VI A (16) గ్రూపు మూలకాల కుటుంబం పేరును తెలపండి?(AS 1) ఒక మార్కు
జ: చాల్కోజన్ కుటుంబం

 

12. I A గ్రూపు మూలకాల వేలన్సీ స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని తెలపండి.(AS 1) ఒక మార్కు
జ: ns1


13. కార్బన్ కుటుంబం సంయోజకత ఎంత? (AS 1) ఒక మార్కు
జ: 4


14. బోరాన్ కుటుంబంలోని మూలకాల వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?(AS 1) ఒక మార్కు
జ: 3 (ns2 np1)


15. విస్తృత ఆవర్తన పట్టికలో 6వ పీరియడ్‌లోని మూలకాల సంఖ్య ఎంత?(AS 1) ఒక మార్కు
జ: 32


16. Ca మూలకం సంయోజకత ఎంత?(AS 1) ఒక మార్కు
జ: 2


17. గ్రూపులో అలోహ, లోహ ధర్మాల్లో వచ్చే మార్పును తెలపండి. (AS 1) ఒక మార్కు
జ: గ్రూపులో పై నుంచి కిందకు అలోహ స్వభావం క్రమంగా తగ్గుతూ లోహ స్వభావం క్రమంగా పెరుగుతుంది.


18. ఆవర్తన పట్టికలోని ఏ బ్లాక్ లోహాలు, అర్ధలోహాలు, అలోహాలను కలిగి ఉంది?(AS 1) ఒక మార్కు
జ: p - బ్లాక్.


19. లాంథనైడ్‌లు, ఆక్టినైడ్‌లు ఆవర్తన పట్టికలో ఏ గ్రూపునకు చెందినవి?(AS 1) ఒక మార్కు
జ: 3 (III B)


20. పీరియడ్‌లో ఏ గ్రూపు మూలకాలు అధిక పరమాణు వ్యాసార్ధాన్ని కలిగి ఉంటాయి? (AS 1) ఒక మార్కు
జ: 1 (I A)


21. ఆవర్తన పట్టికలో ఏ మూలకానికి అధిక పరమాణు వ్యాసార్ధం ఉంది? (AS 1) ఒక మార్కు
జ: సిసియం (Cs)


22. ఆవర్తన పట్టికలో అతి తక్కువ పరమాణు పరిమాణం ఉన్న మూలకం ఏది?(AS 1) ఒక మార్కు
జ: హీలియం


23. Na+, Mg2+, Al3+లను అయానిక వ్యాసార్ధాలు పెరిగే క్రమంలో రాయండి?(AS 1) ఒక మార్కు
జ: Al3+ < Mg2+ < Na+


24. Na, Mg2+ లలో దేని వ్యాసార్థం తక్కువగా ఉంటుంది?(AS 1) ఒక మార్కు
జ: Mg2+


25. Cl, Cl-  లలో దేని వ్యాసార్ధం ఎక్కువగా ఉంటుంది?(AS 1) ఒక మార్కు
జ: Cl-  ఎక్కువ పరిమాణం కలిగి ఉంటుంది.


26. అయనీకరణ శక్మం గ్రూపుల్లో ఎలా మారుతుంది?(AS 1) ఒక మార్కు
జ: గ్రూపులో పై నుంచి కిందకి అయనీకరణ శక్మం విలువ క్రమంగా తగ్గుతుంది.


27. ఎలక్ట్రాన్ ఎఫినిటీ పీరియడ్‌ల్లో ఎలా మారుతుంది?(AS 1) ఒక మార్కు
జ: పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు పెరుగుతాయి.


28. ఆవర్తన పట్టికలో అత్యధిక అయనీకరణ శక్తి గల మూలకం ఏది? (AS 1) ఒక మార్కు
జ: హీలియం


29. ఆవర్తన పట్టికలో ఏ గ్రూపు మూలకాలు అత్యధిక రుణ విద్యుదాత్మకతని కలిగి ఉంటాయి? (AS 1) ఒక మార్కు
జ: హాలోజన్‌లు (VII A గ్రూపు)


30. ఆవర్తన పట్టికలో 21 పరమాణు సంఖ్య గల మూలకం ఏ గ్రూపు, ఏ పీరియడ్‌లో ఉంటుందో ఊహించండి?(AS 1) ఒక మార్కు
జ: పరమాణు సంఖ్య = 21
ఎలక్ట్రాన్ విన్యాసం = 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1
ఈ మూలకం ఆవర్తన పట్టికలో 4వ పీరియడ్‌లోని 3 (III B) గ్రూపుకు చెంది ఉంటుంది.

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం