బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. కిందివాటిలో త్రికసిద్ధాంతం దేనికి వర్తిస్తుంది?
A) Cl, Br, I B) H, O, N C) Na, Ne, Ca D) Cl, O, Br
2. కిందివాటిలో డాబరీనర్ త్రికాన్ని గుర్తించండి.
A) F, Cl, Br B) Ne, Ar, Kr C) Li, Na, K D) S, Sr, Ba
3. Ca, Sr, Ba దేనికి ఉదాహరణ?
A) పరివర్తన త్రికాలు B) న్యూలాండ్ త్రికం C) డాబరీనర్ త్రికం D) ఏదీకాదు
4. అష్టక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
A) మెండలీవ్ B) డాబరీనర్ C) మోస్లే D) న్యూలాండ్
5. పరమాణు భారానికి, దాని ధర్మాలకు సంబంధం ఉందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
A) మెండలీవ్ B) డాబరీనర్ C) మోస్లే D) న్యూలాండ్
6. ఎకా అల్యూమినియం అంటే
A) Ga B) Sc C) In D) Ti
7. నూతన ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
A) మెండలీవ్ B) మోస్లే C) డాబరీనర్ D) న్యూలాండ్
8. 'మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు' దీన్ని సూచించేది
A) నూతన ఆవర్తన నియమం B) త్రిక సిద్ధాంతం
C) అష్టక సిద్ధాంతం D) మెండలీవ్ ఆవర్తన నియమం
9. పరమాణు భారం కంటే పరమాణు సంఖ్యయే పరమాణువుకు ముఖ్యమైన ధర్మమని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు?
A) మోస్లే B) న్యూలాండ్ C) మెండలీవ్ D) డాబరీనర్
10. విస్తృత ఆవర్తన పట్టికను దేని ఆధారంగా ప్రవేశపెట్టారు?
A) పరమాణు భారాలు B) పరమాణు సంఖ్యలు C) ఎలక్ట్రాన్ విన్యాసాలు D) ఏదీకాదు
11. విస్తృత ఆవర్తన పట్టికలోని గ్రూపుల సంఖ్య
A) 8 B) 10 C) 18 D) 19
12. విస్తృత ఆవర్తన పట్టికలో మొదటి పీరియడ్‌లోని మూలకాల సంఖ్య
A) 2 B) 8 C) 18 D) 12
13. విస్తృత ఆవర్తన పట్టికలో నాలుగో పీరియడ్‌లో ఉండే మూలకాల సంఖ్య
A) 2 B) 8 C) 18 D) 32
14. విస్తృత ఆవర్తన పట్టికలో అధిక సంఖ్యలో మూలకాలు ఉన్న పీరియడ్
A) 3 B) 1 C) 6 D) 7
15. నూతన ఆవర్తన పట్టికలో మూలకాలను నాలుగు బ్లాకులుగా విభజించడానికి కారణం ఏమిటి?
A) పరమాణు సంఖ్య B) పరమాణు భారం
C) బాహ్య కర్పరంలోని ఎలక్ట్రాన్ విన్యాసం D) పరమాణు వ్యాసార్ధం
16. 1s2 2s2 2p5 ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న మూలకం ఏ బ్లాకుకు చెందింది?
A) s B) p C) d D) f
17. కిందివాటిలో ఏ జత పరమాణు సంఖ్యలు p - బ్లాకు మూలకాలకు చెందుతాయి?
A) 3, 5 B) 11, 12 C) 7, 8 D) 12, 13
18. 1s2 2s2 2p6 ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న మూలకం
A) క్షారలోహం B) క్షారమృత్తిక లోహం C) లాంథనైడ్ D) జడవాయువు
19. లాంథనైడ్‌లు, ఆక్టినైడ్‌లను ఏమంటారు?
A) ప్రాతినిధ్య మూలకాలు B) s - బ్లాకు మూలకాలు
C) పరివర్తన మూలకాలు D) అంతర పరివర్తన మూలకాలు
20. కింది ఏ ధర్మం పీరియడ్‌లో తగ్గుతుంది?
A) అయనీకరణ శక్తి B) రుణవిద్యుదాత్మకత
C) ధనవిద్యుదాత్మకత D) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
21. హలోజన్‌ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఏ క్రమంలో ఉంటాయి.
A) Cl > F > Br > l B) F > Cl > Br > l
C) I > Br > Cl > F D) Br > F > Cl > l
22. హలోజన్ కుంటుంబలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ గరిష్ఠంగా ఉన్న మూలకం ఏది?
A) F B) Cl C) Br D) I
23. 2, 8, 1; 2, 8, 7 విన్యాసాల X, Y మూలకాలు సంయోగం చెంది ఒక అణువుగా ఏర్పడినప్పుడు దాని అణుఫార్ములా
A) X2Y B) XY2 C) XY3 D) XY
24. X, Yల ఎలక్ట్రాన్ విన్యాసాలు వరుసగా 1s2 2s2 2p6 3s2; 1s2 2s2 2p5. ఈ రెండు మూలకాల కలయిక ద్వారా ఏర్పడే సమ్మేళనం ఫార్ములా
A) X2Y6 B) XY2 C) X2Y D) XY
25. జడ వాయువులు ఆవర్తన పట్టికలో ఏ గ్రూపునకు చెందుతాయి?
A) 18 B) 17 C) 16 D) 10
26. ఆవర్తన పట్టికలోని అసంపూర్తి పీరియడ్ ఏది?
A) 1 B) 2 C) 6 D) 7
27. జడవాయువుల సంయోజకత
A) 2 B) 8 C) 0 D) 1
28. ఆవర్తన పట్టికలోని ఒక గ్రూపులో పై నుంచి కిందకి వెళ్తున్నప్పుడు తగ్గేది
A) పరమాణు పరిమాణం B) లోహ స్వభావం
C) ధన విద్యుదాత్మకత D) రుణ విద్యుదాత్మకత
29. కిందివాటిలో s, p, d బ్లాకు మూలకాలున్న పీరియడ్ ఏది?
A) 2వ B) 3వ C) 4వ D) 1వ
30. కిందివాటిలో తేలికగా ఉన్న లోహం
A) Na B) Mg C) Be D) Ca
31. పరమాణు సంఖ్య 90 నుంచి 103 వరకు ఉన్న మూలకాలు
A) లాంథనైడ్‌లు B) ఆక్టినైడ్‌లు C) క్షారలోహాలు D) క్షారమృత్తిక లోహాలు
32. పరమాణు సంఖ్య 58 నుంచి 71 వరకు ఉన్న మూలకాలు
A) లాంథనైడ్‌లు B) ఆక్టినైడ్‌లు C) క్షారలోహాలు D) క్షారమృత్తిక లోహాలు
33. బాహ్యకర్పరం ఎలక్ట్రాన్ విన్యాసం ns2 np5 అయినప్పుడు ఆ మూలకం
A) జడవాయువు B) హాలోజన్ C) క్షారలోహం D) పరివర్తన మూలకం
34. కిందివాటిలో డాబరీనర్ త్రికం కానిదేది?
A) Li, Na, K B) S, Se, Te C) Cl, Br, I D) C, N, O
35. మెండలీవ్ ఊహించిన ఏకా - బోరాన్ మూలకం
A) గాలియం B) స్కాండియం C) జెర్మేనియం D) టెల్లూరియం
36. కిందివాటిలో క్షార మృత్తిక లోహం కానిది
A) Ge B) Ca C) Sr D) Ba
37. నవీన ఆవర్తన పట్టికలోని ఏ గ్రూపు మూలకాలకు అధిక ధనవిద్యుదాత్మకత స్వభావం ఉంటుంది?
A) IA B) IIA C) VIIA D) VIIIA
38. నవీన ఆవర్తన పట్టికలో నైట్రోజన్ ఏ గ్రూపునకు చెందింది?
A) IIIA B) IVA C) VA D) VIA
39. అతి తక్కువ పరమాణు వ్యాసార్ధం ఉన్న మూలకం ఏది?
A) H2 B) He C) Li D) Be
40. విస్తృత ఆవర్తన పట్టికలో అలోహాలు ఉన్న బ్లాకు ఏది?
A) s B) p C) d D) f
41. 3వ పీరియడ్‌కు చెందిన మూలకాలు ఎడమ నుంచి కుడికి వరుసగా కింది విధంగా ఇచ్చారు.
Na, Mg, Al, Si, P, S, Cl వీటిలో దేనికి ఎక్కువ అయనీకరణశక్తి ఉంది?
A) Na B) P C) S D) Cl
42. హాలోజన్‌లు అని వేటికి పేరు?
A) VA గ్రూపు B) VIA గ్రూపు C) VIIA గ్రూపు D) O గ్రూపు
43. లోహ స్వభావం పీరియడ్‌లలో ఏ విధంగా మారుతుంది?
A) తగ్గుతుంది B) పెరుగుతుంది C) పెరిగి తగ్గుతుంది D) ఏదీకాదు
44. X అనే మూలకం X2O5 అనే ఆక్సైడ్‌ను ఏర్పరుస్తుంది. ఆవర్తన పట్టికలో X అనే మూలకం ఏ గ్రూపునకు చెందుతుంది?
A) 3 B) 4 C) 5 D) 6
45. 2, 3, 10, 11, 18, 19, 26, 27, 36, 37 పరమాణు సంఖ్యల మూలకాల్లో క్షార లోహాల గ్రూపునకు చెందిన మూలకాలు ఏవి?
A) 3, 11, 19, 27 B) 3, 11, 19, 37 C) 2, 11, 18, 36 D) 2, 10, 18, 26
46. 3, 4, 10, 11, 12, 18, 20, 37, 38 పరమాణు సంఖ్యల మూలకాల్లో క్షారమృత్తిక లోహాల గ్రూపునకు చెందిన మూలకాలు ఏవి?
A) 4, 12, 20, 38 B) 3, 11, 19, 37 C) 3, 4, 10, 27 D) 3, 11, 19, 27
47. మొదటి గ్రూపు మూలకాలను ఏమని పిలుస్తారు?
A) క్షార లోహలు B) క్షారమృత్తిక లోహాలు C) హాలోజన్లు D) జడవాయువులు
48. పరమాణు సంఖ్య 15, ద్రవ్యరాశి సంఖ్య 31 ఉన్న మూలకం స్థానం
A) 15వ గ్రూపు, 4వ పీరియడ్ B) 15వ గ్రూపు, 3వ పీరియడ్
C) 5వ గ్రూపు, 3వ పీరియడ్ D) 5వ గ్రూపు, 4వ పీరియడ్
49. ఆవర్తన పట్టిక VIIవ గ్రూపునకు చెందిన మూలకాల సంఖ్య
A) 6 B) 7 C) 4 D) 5
50. ఆవర్తన పట్టికలో పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వెళ్లే కొద్దీ లోహధర్మం
A) పెరుగుతుంది B) తగ్గుతుంది C) మారదు D) మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది
51. ఆవర్తన పట్టికలో గ్రూపులో పై నుంచి కిందకు వెళ్లే కొద్దీ మారని ధర్మం
A) పరమాణు పరిమాణం B) లోహస్వభావం C) రుణవిద్యుదాత్మకత D) వేలన్సీ ఎలక్ట్రాన్‌లు
52. గ్రూపుల్లో ధనవిద్యుదాత్మకత స్వభావం పై నుంచి కిందకు వెళ్లే కొద్దీ
A) పెరుగుతుంది B) తగ్గుతుంది C) మారదు D) అసమానంగా మారుతూ ఉంటుంది
53. కిందివాటిలో అయనీకరణశక్తి దేంతో పెరుగుతుంది?
A) కేంద్రకావేశం పెరగడం వల్ల
B) కేంద్రకావేశం తగ్గడం వల్ల
C) పరమాణు పరిమాణం పెరగడం వల్ల
D) కేంద్రకావేశం పెరగడం వల్ల, పరమాణు పరిమాణం పెరగడం వల్ల
54. గ్రూపుల్లో పై నుంచి కిందికి వెళ్లే కొద్దీ అయనీకరణశక్తి తగ్గడానికి కారణం
A) స్క్రీనింగ్ ప్రభావంలో తగ్గుదల B) కేంద్రకావేశంలో తగ్గుదల
C) పరమాణు సంఖ్యలో పెరుగుదల D) స్క్రీనింగ్ ప్రభావంలో పెరుగుదల
55. అయనీకరణశక్తిని కొలిచే ప్రమాణాలు
A) డైనులు B) సెం.మీ. C) కి.జౌ./మోల్ D) వాట్‌లు
56. ఆవర్తన పట్టికలో పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి వెళ్లే కొద్దీ రుణవిద్యుదాత్మకత విలువ ఏమవుతుంది?
A) తగ్గుతుంది B) పెరుగుతుంది C) మారదు D) ఒక క్రమాన్ని పాటించదు
57. అయనీకరణ శక్తి ఆరోహణ క్రమం
A) IE1 > IE2 > IE3 B) IE1 < IE2 < IE3
C) IE2 < IE3 < IE1 D) IE1 < IE3 < IE2
58. కింది పరమాణు భారాల్లో డాబరీనర్ త్రికం కానిదేది?
A) 32, 78, 125 B) 55, 52, 56 C) 7, 23, 39 D) 47, 91, 173
59. పరమాణు సంఖ్యలు 2, 10, 18, 36, 54, 86 ఉన్న మూలకాలు
A) హాలోజన్‌లు B) ఉత్కృష్ట వాయువులు C) చాల్కోజన్లు D) క్షారలోహాలు
60. నవీన ఆవర్తన పట్టికలో సరైన స్థానం లేనివి
A) జడవాయువులు B) పరివర్తన మూలకాలు C) హాలోజన్లు D) అంతర పరివర్తన మూలకాలు
61. ఒకే ప్రధాన కక్ష్యలో ఉండే ఆర్బిటాళ్లలో కేంద్రకం వైపు చొచ్చుకుపోయే స్వభావం ఏ విధంగా ఉంటుంది?
A) 4s > 4p > 4d > 4f B) 4s < 4p < 4d < 4f
C) 4s < 4p > 3d > 4f D) 4s = 4p = 4d = 4f
62. Ce (58) నుంచి Lu (71) వరకు ఉన్న లాంథనాయిడ్‌లు ఏ పీరియడ్‌కు చెందుతాయి?
A) 6వ B) 7వ C) 8వ D) 5వ
63. Th (90) నుంచి Lr (103) వరకు ఉన్న ఆక్టినైడ్‌లు ఏ పీరియడ్‌కు చెందుతాయి?
A) 6వ B) 7వ C) 8వ D) 5వ
64. కిందివాటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?
A)F B) Cl C) Br D) I
65. కిందివాటిలో అత్యల్ప రుణవిద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?
A) F B) Cl C) Cs D) H
66. హైడ్రోజన్ పరంగా, ఫ్లోరిన్ రుణవిద్యుదాత్మకత విలువ
A) 4.0 B) 4.4 C) 4.2 D) 2.5
67. లాంథనైడ్‌లు, ఆక్టినైడ్‌లు ఏ గ్రూపునకు చెందినవి?
A) IIA B) IIIA C) IIIB D) IVB
68. ధన విద్యుదాత్మక మూలకాలు
A) అలోహాలు B) లోహాలు C) అర్ధలోహాలు D) హాలోజన్లు
69. Iవ గ్రూప్ మూలకాలను ఏమని పిలుస్తారు?
A) క్షారమృత్తిక లోహాలు B) చాల్కోజన్‌లు C) హాలోజన్‌లు D) క్షార లోహాలు
70. కిందివాటిలో '0' వేలన్సీ లేని మూలకం?
A) Ne B)Ar C) Al D) Kr
71. మొదటిసారి మూలకాలను వర్గీకరించినవారు
A) రాబర్ట్ బాయిల్ B) డాబరీనర్ C) న్యూలాండ్స్ D) మెండలీవ్
72. అష్టక నియమాన్ని ఎవరు రూపొందించారు?
A) డాబరీనర్ B) న్యూలాండ్స్ C) మెండలీవ్ D) లోథర్ మేయర్
73. మెండలీవ్ ఆవర్తన పట్టికలో మూలకాలను ఏ విధంగా అమర్చాడు?
A) అక్షర క్రమంలో B) పరమాణు భారం తగ్గే క్రమంలో
C) పరమాణు భారం పెరిగే క్రమంలో D) పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో
74. 2, 10, 18, 36, 54, 86 పరమాణు సంఖ్యలు గల మూలకాలు
A) జడవాయువులు B) హాలోజన్‌లు C) విరళ మృత్తికలు D) తేలిక లోహాలు
75. వేలన్సీ స్థాయిలో 7 ఎలక్ట్రాన్‌లున్న మూలకాలు
A) లాంథనైడ్‌లు B) జడవాయువులు C) హాలోజన్‌లు D) విరళ మృత్తికలు
76. d - బ్లాక్ మూలకాల విన్యాసం
A) (n − 1) s2 nd1 − 10 B) (n − 1)d1 − 10 ns2
C) (n − 1)d1 − 10 ns2 np4 D) (n − 1)p4 ns2
77. గ్రూప్‌లో పై నుంచి కిందకు పెరిగే ధర్మం
A) రుణ విద్యుదాత్మకత B) అయనీకరణ శక్మం
C) ఎలక్ట్రాన్ ఎఫినిటీ D) పరమాణు పరిమాణం
78. జడవాయువుల ఎలక్ట్రాన్ ఎఫినిటీ
A) సున్నా B) ధనాత్మకం C) రుణాత్మకం D) ఎక్కువ
79. కిందివాటిలో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న మూలకం
A) F B) Cl C) Br D) I
80. కిందివాటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత ఉన్న మూలకం
A) Na B) Ne C) F D) He
81. కిందివాటిలో అత్యల్ప రుణవిద్యుదాత్మకత ఉన్న మూలకం
A) Fr B) Li C) F D) Cl
82. ఆవర్తన పట్టికలో అలోహాలు ఎక్కడ ఉంటాయి?
A) కుడివైపున పైన B) ఎడమవైపున పైన
C) ఎడమవైపున కింద D) IIA, IIIAల మధ్య
83. పీరియడ్‌లో ఎడమ నుంచి కుడివైపుకు లోహ స్వభావం
A) పెరుగుతుంది B) తగ్గుతుంది
C) మారదు D) మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది
84. ఆవర్తన పట్టికలో సుమారు 2/3 వ వంతు మూలకాలు
A) అర్ధ లోహాలు B) అలోహాలు
C) లోహాలు D) రేడియోధార్మిక మూలకాలు
85. కిందివాటిలో మొదటి కృత్రిమ మూలకం
A) Fl B) Cn C) Rg D) Tc
86. కృత్రిమ మూలకాల సంఖ్య సుమారుగా
A) 63 B) 17 C) 91 D) 118
87. ఏ పీరియడ్‌లో అన్ని మూలకాలు వాయువులుగా ఉంటాయి?
A) 1వ B) 2వ C) 3వ D) 4వ
88. ఏ గ్రూపులో అన్ని మూలకాలు వాయువులుగా ఉంటాయి?
A) IA B) IIA C) IIIA D) O
89. స్క్రీనింగ్ ఫలితం వల్ల
A) అయనీకరణశక్తి పెరుగుతుంది B) కేంద్రక ఆవేశం పెరుగుతుంది
C) అయనీకరణ శక్తి తగ్గుతుంది D) పరమాణు పరిమాణం తగ్గుతుంది
90. ఆధునిక ఆవర్తన పట్టికలో నాలుగో పీరియడ్‌లోని d - బ్లాక్ మూలకాల సంఖ్య
A) 10 B) 18 C) 12 D) 32
91. ఆవర్తన పట్టికలోని గ్రూపులో పై నుంచి కిందకు వెళ్లేకొద్దీ
A) పరమాణు సంఖ్య పెరుగుతుంది B) కర్పరాల సంఖ్య పెరుగుతుంది
C) పరమాణు వ్యాసార్ధం పెరుగుతుంది D) అన్నీ
92. కిందివాటిలో ఏ మూలకం మిగతా వాటికంటే ఎక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటుంది?
A) B B) C C) Al D) K
93. నూతన ఆవర్తన పట్టికలోని గ్రూపు - 1(IA) మూలకాలను ఏమంటారు?
A) క్షార మృత్తిక లోహాలు B) క్షార లోహాలు C) హాలోజన్లు D) జడవాయువులు
94. ఆధునిక ఆవర్తన పట్టికలోని గ్రూపు - 2 (IIA) మూలకాలను ఏమంటారు?
A) క్షారమృత్తిక లోహాలు B) క్షార లోహలు C) హాలోజన్లు D) జడవాయువులు
95. ఆధునిక ఆవర్తన పట్టికలోని గ్రూపు - 17 (VIIA) మూలకాలను ఏమంటారు?
A) జడవాయువులు B) చాల్కోజన్‌లు C) హాలోజన్‌లు D) క్షార లోహాలు
96. నూతన ఆవర్తన పట్టికకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాలను ఎన్నుకోండి.
i) ఒక పీరియడ్‌లో ఉండే మూలకాల సంఖ్య మూలక పరమాణువుల వివిధ కక్ష్యల్లో ఎలక్ట్రాన్‌లు నిండే విధానంపై ఆధారపడదు.
ii) ఏదైనా మూలక పరమాణువులో ప్రధాన కక్ష్యల సంఖ్య ఆ మూలకం ఏ పీరియడ్‌కు చెందుతుందనే విషయాన్ని నిర్ణయిస్తుంది.
iii) రెండో పీరియడ్ రెండో ప్రధాన కక్ష్య (L) తో మొదలవుతుంది.
A) i, ii B) ii, iii C) i, iii D) i, ii, iii
97. ఆధునిక ఆవర్తన పట్టికకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
A) 2వ పీరియడ్‌లో 18 మూలకాలున్నాయి. B) 3వ పీరియడ్‌లో 18 మూలకాలున్నాయి.
C) 4వ పీరియడ్‌లో 18 మూలకాలున్నాయి. D) 6వ పీరియడ్‌లో 18 మూలకాలున్నాయి.
98. రుణ విద్యుదాత్మకత = EN, అయనీకరణశక్తి = IE, ఎలక్ట్రాన్ ఎఫినిటీ = EA అయితే
99. నూతన ఆవర్తన పట్టికకు సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
i) పరమాణు పరిమాణం గ్రూపులో పై నుంచి కిందకు పెరుగుతుంది, పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి తగ్గుతుంది.
ii) అయనీకరణ శక్తి విలువలు గ్రూపులో పై నుంచి కిందకు తగ్గుతాయి, పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి పెరుగుతాయి.
iii) ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు గ్రూపులో పై నుంచి కిందకు తగ్గుతాయి, పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి పెరుగుతాయి.
iv) రుణ విద్యుదాత్మకత విలువలు గ్రూపులో పై నుంచి కిందకు పెరుగుతాయి, పీరియడ్‌లలో ఎడమ నుంచి కుడికి తగ్గుతాయి.
A) i, ii B) iii, iv C) i, ii, iii D) i, ii, iii, iv
100. 1 పికోమీటర్ (Pm) = .........
A) 10-12 cm B) 10-21 cm C) 10-12 m D) 10-21 m
101. మెండలీవ్ ఆవర్తన పట్టికలోని అసంగత మూలకాల జత
A) Mn, Cl B) Te, I C) Na, K D) Cu, Zn
102. Li, Be, B ల అయనీకరణ శక్మ విలువల సరైన క్రమం
A) Li > Be > B B) Li < Be < B C) Li < B < Be D) Be < Li < B
103. ఆధునిక ఆవర్తన పట్టికలో 101వ మూలకం పేరు
A) స్కాండినీవియం B) మెండలీవియం C) బోరోలీనియం D) లాంతనివియం
104. కిందివాటిని జతపరచండి.
గ్రూపు సంఖ్య | మూలక కుటుంబం పేరు |
1) 1 (IA) | a) చాల్కోజన్ కుటుంబం |
2) 13 (IIIA) | b) ఉత్ర్కష్ట్ర వాయువులు |
3) 16 (VIA) | c) బోరాన్ కుటుంబం |
4) 18 (VIIIA) | d) క్షార లోహాలు |
A) 1-d, 2-a, 3-c, 4-b B) 1-b, 2-d, 3-a, 4-c
C) 1-c, 2-b, 3-a, 4-d D) 1-d, 2-c, 3-a, 4-b
105. కిందివాటిని జతపరచండి.
గ్రూపు సంఖ్య | వేలన్సీ స్థాయి విన్యాసం |
1) VIIIA | a) ns2 np4 |
2) VIA | b) ns1 |
3) IIIA | c) ns2 np6 |
4) IA | d) ns2 np1 |
A) 1-a, 2-c, 3-b, 4-d B) 1-d, 2-c, 3-a, 4-b
C) 1-c, 2-a, 3-d, 4-b D) 1-b, 2-a, 3-d, 4-c
106. కిందివాటిని జతపరచండి.
మూలక కుటుంబం పేరు | వేలన్సీ ఎలక్ట్రాన్లు |
1) క్షార లోహాలు | a) 6 |
2) కార్బన్ కుటుంబం | b) 1 |
3) ఆక్సిజన్ కుటుంబం | c) 8 |
4) ఉత్ర్కష్ట్ర వాయువులు | d) 4 |
A) 1-c, 2-a, 3-d, 4-b B) 1-b, 2-d, 3-a, 4-c
C) 1-b, 2-c, 3-a, 4-d D) 1-a, 2-b, 3-c, 4-d
107. కిందివాటిని జతపరచండి.
మూలక కుటుంబం పేరు | సంయోజకత వేలన్సీ |
1) హాలోజన్ కుటుంబం | a) 4 |
2) చాల్కోజన్ కుటుంబం | b) 3 |
3) బోరాన్ కుటుంబం | c) 2 |
4) కార్బన్ కుటుంబం | d) 1 |
A) 1-b, 2-c, 3-a, 4-d B) 1-a, 2-b, 3-c, 4-d
C) 1-c, 2-d, 3-a, 4-b D) 1-d, 2-c, 3-b, 4-a
108. కిందివాటిని జతపరచండి.
ఆవర్తన ధర్మం | మార్పు సరళి (గ్రూపులు) పై నుంచి కిందకు |
1) వేలన్సీ | a) తగ్గుతుంది |
2) పరమాణు వ్యాసార్ధం | b) మారదు |
3) ఎలక్ట్రాన్ ఎఫినిటీ | c) పెరుగుతుంది |
A) 1-a, 2-b, 3-c B) 1-c, 2-b, 3-a
C) 1-b, 2-a, 3-c D) 1-b, 2-c, 3-a
109. కిందివాటిని జతపరచండి.
1) క్షార లోహాలు | a) (n - 1)d1 - 10 ns1 - 2 |
2) జడవాయువులు | b) (n - 2)f1 - 14 (n - 1)d0 లేదా 1 ns2 |
3) పరివర్తన మూలకాలు | c) ns2 np6 |
4) అంతర పరివర్తన మూలకాలు | d) ns1 |
A) 1-b, 2-a, 3-c, 4-d B) 1-c, 2-d, 3-a, 4-b
C) 1-d, 2-c, 3-a, 4-b D) 1-a, 2-b, 3-c, 4-d
110. కిందివాటిని జతపరచండి.
1) Na | a) d - బ్లాక్ |
2) Al | b) f - బ్లాక్ |
3) Sc | c) p - బ్లాక్ |
4) Ce | d) s - బ్లాక్ |
A) 1-b, 2-a, 3-d, 4-c B) 1-d, 2-c, 3-b, 4-a
C) 1-a, 2-b, 3-c, 4-d D) 1-d, 2-c, 3-a, 4-b
జవాబులు: 1-A; 2-C; 3-C; 4-D; 5-A; 6-A; 7-B; 8-A; 9-A; 10-C; 11-C; 12-A; 13-C; 14-C; 15-C; 16-B; 17-C; 18-D; 19-D; 20-C; 21-A; 22-B; 23-D; 24-B; 25-A; 26-D; 27-C; 28-D; 29-C; 30-C; 31-B; 32-A; 33-B; 34-D; 35-B; 36-A; 37-A; 38-C; 39-A; 40-B; 41-D; 42-C; 43-A; 44-C; 45-B; 46-A; 47-A; 48-B; 49-D; 50-B; 51-D; 52-A; 53-A; 54-D; 55-C; 56-B; 57-B; 58-D; 59-B; 60-D; 61-A; 62-A; 63-B; 64-A; 65-C; 66-A; 67-C; 68-B; 69-D; 70-C; 71-B; 72-B; 73-C; 74-A; 75-C; 76-A; 77-D; 78-C; 79-B; 80-C; 81-A; 82-A; 83-B; 84-C; 85-D; 86-B; 87-A; 88-D; 89-C; 90-A; 91-D; 92-D; 93-B; 94-A; 95-C; 96-B; 97-C; 98-D; 99-C; 100-C; 101-B; 102-C; 103 -B; 104-D; 105-C; 106-B; 107-D; 108-D; 109-C; 110-D.