• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మూల‌కాల వ‌ర్గీక‌ర‌ణ - ఆవ‌ర్తన ప‌ట్టిక‌

1. X, Y పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాలు వరుసగా 1s2 2s2 2p6 3s1, 1s2 2s2 2p4 అయితే
      i) ఏ పరమాణువు ఆనయాన్‌ను ఏర్పరుస్తుంది?
      ii) ఏ పరమాణువు కేటయాన్‌ను ఏర్పరుస్తుంది?
      iii) X, Y మూలకాలు ఆవర్తన పట్టికలో ఏయే బ్లాకుల్లోనివి?
      iv) X, Y మూలక పరమాణువులతో ఏర్పడే అణువు ఫార్ములా రాయండి.  (AS1) 4 మార్కులు


2. మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని లోపాలను నవీన ఆవర్తన పట్టిక ఏ విధంగా అధిరోహించిందో వివరించండి.  (AS1) 4 మార్కులు


3. మెండలీవ్ ఆవర్తన పట్టిక, ఆధునిక ఆవర్తన పట్టికల మధ్య భేదాలను తెలపండి.  (AS1) 4 మార్కులు


4. కింద ఇచ్చిన సరిహద్దు పటం మూలకాల ఆవర్తన పట్టికను సూచిస్తుంది. పట్టికలో A నుంచి K వరకు ఉన్న అక్షరాలు కొన్ని మూలకాలను సూచిస్తాయి. (A నుంచి K వరకు ఇచ్చిన అక్షరాలు మూలకాల వాస్తవ సంకేతాలు కాదు) ఆ అక్షరాలను ఉపయోగించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.  (AS1) 4 మార్కులు
             

కింది మూలకాలను సూచించే అక్షరాలను తెలపండి.
i) హాలోజన్
ii) చాల్కోజన్
iii) జడవాయువు
iv) క్షారలోహం
v) క్షారమృత్తిక లోహం
vi) పరివర్తన మూలకం
vii) అంతరపరివర్తన మూలకం
viii) లాంథనైడ్

 

5. ఆవర్తన పట్టిక ఆధారంగా కింది పట్టికను పూరించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (AS4) 4 మార్కులు

i) 4వ పీరియడ్‌లో మొదటి మూలకం ఏది?
ii) 6వ పీరియడ్‌లో మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయి?
iii) 7వ పీరియడ్‌లో క్షారలోహం ఏది?
iv) 5వ పీరియడ్‌లోని జడవాయు మూలకం ఏది?

6. X అనే మూలకం ఆవర్తన పట్టికలో 3వ పీరియడ్, 13వ గ్రూపునకు చెందుతుంది. దీని ఆధారంగా కిందివాటికి సమాధానాలు ఇవ్వండి.  (AS1) (AS4) 4 మార్కులు
      i) ఆ మూలకాన్ని, దాని ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి.
      ii) మూలకంలోని వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య
      iii) మూలకపు సంయోజకత విలువ
      iv) ఆ మూలకం లోహమా లేదా అలోహమా?


7. 'మూలకాల వర్గీకరణకు సంబంధించి మెండలీవ్ జరిపిన కృషి ఎన్నదగింది
పై వాక్యంతో మీరు ఏకీభవిస్తారా లేదా సరైన కారణాలతో వివరించండి.  (AS1) 4 మార్కులు


8. ఆవర్తన పట్టిక రూపకల్పనలో వివిధ శాస్త్రవేత్తల కృషిని వివరించండి.  (AS1) 4 మార్కులు


9. కింది పట్టికను సరైన సమాధానాలతో పూర్తిచేయండి.  (AS1) (AS4) 2 మార్కులు


10. కింది పట్టికను సరైన సమాధానాలతో పూర్తి చేయండి.  (AS1) (AS4) 2 మార్కులు

మూలకం హీలియం బోరాన్ ఆక్సిజన్ నియాన్
గ్రూపు సంఖ్య (VIIIA) 18     18
వేలన్సీ ఎలక్ట్రాన్‌ల సంఖ్య 2     8
లూయిస్ చుక్కల నిర్మాణం    


11. నవీన ఆవర్తన పట్టికలో పీరియడ్ల నిర్మాణాన్ని వివరించండి.  (AS1) 2 మార్కులు


12. నవీన ఆవర్తన పట్టికలో గ్రూపుల నిర్మాణాన్ని వివరించండి. (AS1) 2 మార్కులు


13. ఒకే ప్రధాన కక్ష్యలో ఉండే ఆర్బిటాళ్లలో కేంద్రకం వైపునకు చొచ్చుకుపోయే స్వభావం వేర్వేరుగా ఉంటుంది. ఒక ఉదాహరణతో వివరించండి.  (AS1) 2 మార్కులు


14. ఆక్సిజన్‌తో పోల్చినప్పుడు నైట్రోజన్ అయనీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది, కారణం తెలపండి. (AS1) 2 మార్కులు


15. మెండలీవ్ ఆవర్తన పట్టికలోని పరిమితులను తెలపండి. (AS1) 2 మార్కులు


16. గ్రూపు, పీరియడ్‌లలో మూలకాల లోహ, అలోహ ధర్మాలు ఏ విధంగా మార్పు చెందుతాయి?  (AS1) 2 మార్కులు


19. A అనే మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం 2, 8, 6 అయితే
i) అది B అనే మూలకం (పరమాణు సంఖ్య = 14) కంటే పరిమాణంలో పెద్దదా లేదా చిన్నదా? ఎందుకు?
ii) O(8), C(6), N(7), Ar(18)మూలకాల్లో దేంతో అది రసాయనికంగా సామీప్యం కలిగి ఉంది? ఎందుకు?  (AS1) 2 మార్కులు


20. కింది పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా ఆనయాన్ ఏర్పరిచే పరమాణువును గుర్తించండి. కారణం వివరించండి.  (AS1) 2 మార్కులు
    X - 1s2 2s2 2p6 3s2 3p6
    Y - 1s2 2s2 2p6 3s2 3p5


21. X, Y, Zఅనే మూడు మూలకాల పరమాణు సంఖ్యలు వరుసగా 2, 6, 10 అయితే
    i) ఒకే గ్రూపులో ఉన్న రెండు మూలకాలు ఏవి?
   ii) ఒకే పీరియడ్‌లో ఉన్న రెండు మూలకాలు ఏవి? కారణాన్ని తెలపండి. (AS1) 2 మార్కులు


22. మూలకాలను శాస్త్రజ్ఞులు వివిధ రకాలుగా వర్గీకరించారు. ఎవరైనా ఇద్దరు శాస్త్రజ్ఞుల వర్గీకరణలను వివరించండి. (AS1)2 మార్కులు


23. Li, Na, Kలు డాబరీనర్ త్రికం Li పరమాణుభారం 7, K పరమాణు భారం 39 అయితే Na పరమాణు భారం ఎంత?  (AS1) ఒకమార్కు
 

24. మిల్లికన్ రుణవిద్యుదాత్మకత విలువను ఏ విధంగా నిర్ణయించాడు? (AS1) ఒకమార్కు


25. లైనస్ పౌలింగ్ రుణవిద్యుదాత్మకత విలువలను ఏ విధంగా, దేని ఆధారంగా నిర్ణయించాడు? (AS1) ఒకమార్కు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం