బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. వేలన్సీ ఎలక్ట్రాన్‌ల ద్వారా పరమాణువుల మధ్య రసాయన బంధం ఏర్పడుతుందని వివరించినవారు
A) కోసెల్, లూయి B) స్లాటర్ C) లండన్ D) హిట్లర్
2. ఒక పరమాణువు బాహ్యశక్తి స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్‌లను ఏమంటారు?
A) చివరి ఎలక్ట్రాన్‌లు B) బాహ్య ఎలక్ట్రాన్‌లు
C) బంధ ఎలక్ట్రాన్‌లు D) వేలన్సీ ఎలక్ట్రాన్‌లు
3. ఆక్సిజన్ పరమాణువులో వేలన్సీ ఎలక్ట్రాన్‌ల సంఖ్య
A) 5 B) 6 C) 7 D) 4
4. ఆక్సిజన్ సంయోజకత
A) 1 B) 2 C) 4 D) 5
5. పరమాణువులు ఎందుకు సంయోగం చెందుతాయి?
A) బాహ్యశక్తిస్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్‌ల విన్యాసం పొందడం ద్వారా స్థిరత్వాన్ని పొందడానికి
B) శక్తి కోల్పోయి స్థిరత్వం పొందడానికి
C) బాహ్యశక్తిస్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్‌ల విన్యాసం పొందడం ద్వారా స్థిరత్వాన్ని పొందడానికి, శక్తి కోల్పోయి స్థిరత్వం పొందడానికి
D) ఏదీకాదు
6. జడవాయువులు సాధారణంగా రసాయన చర్యలో పాల్గొనవు. కారణమేంటి?
A) వీటికి స్థిరత్వం ఉంటుంది.
B) శక్తిస్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.
C) ఇతర మూలకాలతో చర్యలో పాల్గొనవు.
D) బాహ్య శక్తిస్థాయిలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.
7. బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్‌లు లేని జడవాయువు
A) Ne B) Ar C) Xe D) He
8. క్రిప్టాన్ లూయిస్ చుక్కల నిర్మాణంలో సరైంది
9. ఒక పరమాణువు బాహ్య కర్పరం నుంచి వేరొక పరమాణువు బాహ్యకర్పరంలోకి ఎలక్ట్రాన్‌లు మార్పిడి జరగడం ద్వారా ఏర్పడే బంధం
A) అయానిక బంధం B) సమయోజనీయ బంధం C) ఏకబంధం D) ద్విబంధం
10. కిందివాటిలో అయానిక పదార్థం
A) H2O B) NH3 C) MgCl2 D) CH4
11. కిందివాటిలో అయానిక పదార్థం కానిది
A) NaCl B) Na2O C) AlCl3 D) BeCl2
12. ఎలక్ట్రాన్‌లను సమష్టిగా పంచుకోవడం ద్వారా ఏర్పడే బంధం
A) అయానిక బంధం
B) సమన్వయ సమయోజనీయ బంధం
C) ఎలక్ట్రోవాలెంట్ బంధం
D) సమయోజనీయ బంధం
13. సమయోజనీయ బంధం ఉన్న అణువు
A) MgCl2 B) BeCl2 C) AlCl3 D) NaCl
14. కిందివాటిలో సమయోజనీయ బంధం లేని అణువు
A) NH3 B) NaCl C) F2 D) O2
15. అయానిక, సమయోజనీయ బంధం రెండూ ఉన్న సమ్మేళనం
A) H2O B) NH3 C) KCN D) KCl
16. X అనే మూలకం ఆక్సిజన్‌తో కలిసి X2O అనే సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. X పరమాణువు బాహ్య కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాన్‌ల సంఖ్య
A) 5 B) 2 C) 1 D) 3
17. కిందివాటిలో త్రిక బంధం ఉన్న అణువు
A) O2 B) N2 C) Cl2 D) F2
18. పిరమిడ్ ఆకృతి ఉన్న అణువు
A) CH4 B) H2O C) NH3 D) HCl
19. నీటి అణువులో బంధకోణం
A) 90° B) 104° 31' C) 107° 8' D) 120°
20. అమ్మోనియా అణువులో H-N-H బంధకోణం
A) 104° 31' B) 109° 28' C) 120° D) 107° 48'
21. సమయోజనీయ బంధం దేనిపై ఆధారపడుతుంది?
A) ఆర్బిటాళ్ల అతిపాతం B) ఆర్బిటాళ్ల శక్తి C) ఆర్బిటాళ్ల ఆకృతి D) ఆర్బిటాళ్ల పరిమాణం
22. X, Y మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు 1s2 2s2 2p6 3s1, 1s2 2s2 2p6 3s2 3p5 అయితే X, Yలు సంయోగం చెందినప్పుడు ఏర్పడే బంధం
A) సమయోజనీయ B) అయానిక C) వాండర్‌వాల్ D) ఏదీకాదు
23. N2 అణువులో ఉన్న , Π బంధాల సంఖ్య
A) 1, 3 B) 1, 2 C) 2, 1 D) 2, 2
24. వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
A) లైనస్ పౌలింగ్ B) గిలిబ్సి, నైహోమ్ C) లూయిస్, కోసెల్ D) స్లాటర్
25. X అనే మూలకం పరమాణు సంఖ్య 6, ద్రవ్యరాశి సంఖ్య 12 అయితే XH4లో ఉన్న బంధాల రకం
A) అయానిక బంధం B) సమయోజనీయ బంధం C) సమన్వయ సమయోజనీయ బంధం D) ఏదీకాదు
26. జతపరచండి.
1) H2O అణువు a) సమతల త్రికోణీయ ఆకారం
2) BeCl2 అణువు b) పిరమిడ్ ఆకారం
3) BF3 అణువు c) V ఆకృతి
4) NH3 అణువు d) రేఖీయం
A) 1-c, 2-d, 3-b, 4-a B) 1-d, 2-c, 3-b, 4-a
C) 1-c, 2-d, 3-a, 4-b D) 1-c, 2-b, 3-d, 4-a
27. జతపరచండి.
1. 104°31' a) NH3
2. 180° b) BF3
3. 107°48' c) BeCl2
4. 120° d) H2O
A) 1-d, 2-c, 3-b, 4-a B) 1-d, 2-a, 3-c, 4-b
C) 1-d, 2-c, 3-a, 4-b D) 1-a, 2-b, 3-c, 4d
28.జతపరచండి.
1) సమయోజనీయ బంధం a) కొసెల్
2) VSEPRT సిద్ధాంతం b) కొసెల్, లూయీ
3) అయానిక బంధం c) జి.ఎన్.లూయిస్
4) వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం d) సిట్జివిక్, పావెల్
A) 1-c, 2-d, 3-a, 4-b B) 1-c, 2-d, 3-b, 4-a
C) 1-c, 2-a, 3-b, 4-d D) 1-a, 2-b, 3-c, 4-d
29. కిందివాటిలో సరికానిది
A) వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం - కొసెల్, లూయీ
B) VSEPRT సిద్ధాంతం - సిట్జివిక్, పావెల్
C) వేలన్సీ బంధ సిద్ధాంతం - లైనస్ పౌలింగ్
D) అష్టక సిద్ధాంతం - డాబరీనర్
30. X+2 ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 అయితే X అనేది
A) Mg B) Mn C) Cl D) Cu
31. ను సూచించే మూలక పరమాణువు
A) Ne B)Ar C) Kr D) అన్నీ
32. నీటి అణువులో బంధకోణం
A) 104°31' B) 107°48' C) 109°28' D) 120°
33. కిందివాటిలో sp3 సంకరీకరణం చెందనిది
A) CH4 B) CH3 C) BF3 D) H2O
34. CH4లోని Π బంధాల సంఖ్య
A) 0 B) 1 C) 2 D) 3
35. సమయోజనీయ బంధం దేని ద్వారా ఏర్పడుతుంది?
A) ఎలక్ట్రాన్‌లను పంచుకోవడం ద్వారా
B) రెండు పరమాణువుల మధ్య వికర్షణ బలాల వల్ల
C) ఎలక్ట్రాన్‌ల బదిలీ వల్ల
D) ఒక పరమాణువు ఎలక్ట్రానులను పంచుకోవడం వల్ల
36. 2, 8, 1; 2, 8, 7 ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న A, B మూలకాలను కలపగా ఏర్పడే సమ్మేళన ఫార్ములా
A) AB B) AB2 C) AB3 D) A3B
37. H2O అణువు ఆకృతి
A) రేఖీయ B) పిరమిడ్ C) టెట్రాహైడ్రల్ D) కోణీయం
38. NaCl స్ఫటికంలో Na+ చుట్టూ ఎన్ని Cl - అయాన్‌లు ఉంటాయి?
A) 5 B) 6 C) 7 D) 8
39. O2 లో బంధం ఏర్పరిచే ఎలక్ట్రాన్‌ల సంఖ్య
A) 2 B) 4 C) 6 D) 8
40. కిందివాటిలో అధిక స్థిరత్వం గలది
A) N B) O C) Ne D) Mg
41. కిందివాటిలో అయానిక బంధాన్ని ప్రదర్శించేది
A) CO2 B) O2 C) MgCl2 D) N2
42. X మూలకం ఏ ఇతర మూలకాలతో చర్యలో పాల్గొనదు. కిందివాటిలో X మూలకపు ఎలక్ట్రాన్ విన్యాసం
A) 1s2 2s2 2p1 B) 1s2 2s2 2p4 C) 1s2 2s2 2p5 D) 1s2 2s2 2p6
43. HCl బంధం ఏర్పడటంలో క్లోరిన్ ఇచ్చే ఎలక్ట్రాన్‌ల సంఖ్య
A) 3 B) 7 C) 4 D) 1
44. బహుళ సమయోజనీయ బంధాలను కలిగి ఉన్న అణువు
A) HCl B) H2 C) F2 D) N2
45. కిందివాటిలో అధిక బంధకోణం కలిగింది
A) BeCl2 B) CH4 C) H2O D) NH3
46. అమ్మోనియా (NH3) అణువు లూయిస్ చుక్కల నిర్మాణం
47. ఆక్సిజన్ అణువు లూయిస్ చుక్కల నిర్మాణం
48. నైట్రోజన్ అణువు లూయిస్ చుక్కల నిర్మాణం

49. మీథేన్ (CH4) అణువు లూయిస్ చుక్కల నిర్మాణం
50. నీటి (H2O) అణువు లూయిస్ చుక్కల నిర్మాణం
51. BF3 అణువు లూయిస్ చుక్కల నిర్మాణం
52. BeCl2 అణువు లూయిస్ చుక్కల నిర్మాణం
53. H - Fల మధ్య బంధ దూరం (Å)
A) 0.74 B) 1.44 C) 0.901 D) 0.918
54. F - Fల మధ్య బంధ దూరం (Å)
A) 0.74 B) 0.91 C) 1.27 D) 1.44
55. H - Cl బంధశక్తి
A) 410 kJ mol-1 B) 482 kJ mol-1 C) 432 kJ mol-1 D) 460 kJ mol-1
56. CH4లో H - C బంధశక్తి
A) 0.96 kJ/ mol B) 1.01 kJ/ mol C) 1.10 kJ/ mol D) 1.27 kJ/ mol
57. H2 అణువును సూచించే సరైన పటం
58. అణువులోని మధ్య పరమాణువు కేంద్రకం చుట్టూ రెండు బంధ జంటలు, రెండు ఒంటరి జంటలు ఉన్న అణువు
A) NH3 B) BF3 C) CH4 D) H2O
59. రెండు పరమాణువుల మధ్య ఏర్పడ గల సమయోజనీయ బంధాల గరిష్ఠ సంఖ్య
A) 1 B) 2 C) 3 D) 4
60. ఒక అణువులోని మధ్య పరమాణువు వేలన్సీ కక్ష్యలో నాలుగు బంధ జంటలున్నాయి. అయితే ఆ అణువు ఆకృతి
A) చతుర్ముఖీయం B) రేఖీయం C) రేఖీయ త్రిభుజం D) రేఖీయ చతురస్రం
61. ద్విబంధంలో ఉండేవి
A) రెండు బంధాలు B) రెండు Π బంధాలు C) ఒక
, ఒక Π బంధం D) ఏదీకాదు
62. Π బంధాలను ఏర్పరిచే ఆర్బిటాళ్లు
A) s B) p C) s, p D) ఏదీకాదు
63. BeCl2 అణువు ఏర్పడటంలో మధ్య పరమాణువు చెందే సంకరీకరణం
A) sp B) sp2 C) sp3 D) sp3 - s
64. అమ్మోనియా అణువు ఏర్పడటంలో నైట్రోజన్ పరమాణువు చెందే సంకరీకరణ
A) sp B) sp2 C) sp3 D) sp3 - s
65. N2 అణువులోని Π బంధాలు ఎన్ని?
A) 0 B) 1 C) 2 D) 3
66. త్రికబంధంలోని బంధాల సంఖ్య
A) 3 బంధాలు B) 3 Π బంధాలు C) 1
, 2 Π బంధాలు D) 1Π, 2
బంధాలు
67. హైడ్రోజన్ పరమాణువు దేని ఎలక్ట్రాన్ విన్యాసం పొందడం ద్వారా స్థిరత్వం పొందుతుంది?
A) He B) Li C) Be D) Ne
68. s - p అతిపాతం ఉన్న అణువు
A) H2 B) O2 C) Cl2 D) HCl
69. సోడియం క్లోరైడ్ స్ఫటిక జాలకంలో ఉండేవి
A) Na+, Cl- అయాన్లు B) Na, Cl పరమాణువులు
C) NaCl అణువులు D) ఏదీకాదు
70. ఈ వాయువు తప్ప మిగతా జడవాయువులన్నీ వాటి వేలన్సీ కక్ష్యలో 8 ఎలక్ట్రాన్‌లను కలిగి ఉంటాయి.
A) He B) Ne C) Ar D) Kr
71. NaCl స్ఫటికంలో ఉండేది
A) NaCl అణువులు B) Na, Cl పరమాణువులు
C) Na+, Cl− అయాన్‌లు D) NaCl యొక్క ద్వి అణుకాలు
72. కిందివాటిలో అయానిక బంధం కానిది
A) CaCl2 B) MgCl2 C) BaCl2 D) CH3Cl
73. రెండు పరమాణువుల మధ్య సమయోజనీయ బంధాల గరిష్ఠ సంఖ్య
A) 1 B) 2 C) 3 D) 4
74. సంకరీకరణంలో.....
A) పరమాణు ఆర్బిటాళ్లు వేరవుతాయి. B) పరమాణు ఆర్బిటాళ్లు కలుస్తాయి.
C) ఎలక్ట్రాన్ జంట తొలగించబడుతుంది. D) ఎలక్ట్రాన్ జంట కలుస్తుంది.
75. కిందివాటిని జతపరచండి.
అణువులు మధ్య పరమాణువుపై ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య
1)BF3 a) 1
2) H2O b) 0
3) NH3 c) 2
A) 1-a, 2-c, 3-b B) 1-b, 2-c, 3-a C) 1-a, 2-b, 3-c D) 1-c, 2-b, 3-a
76. కేంద్ర పరమాణువుపై ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉండేది
A) H2O B) BeCl2 C) CH4 D) NH3
77. ద్విబంధం ఏర్పడటానికి రెండు పరమాణువుల మధ్య పంచుకునే ఎలక్ట్రాన్‌ల సంఖ్య
A) 2 B) 3 C) 4 D) 6
78. N2 అణువులోని బంధాలు
A) 1σ, 1π B) 1σ, 2π C) 2σ, 1π D) 2σ, 2π
79. π బంధం .......
A) σ బంధం కంటే బలమైంది. B) σ బంధం కంటే బలహీనమైంది.
C) σ బంధానికి సమానమైన శక్తి కలది. D) σ బంధంతో సరిపోల్చలేం.
80. సంయోజనీయ సమ్మేళనం యొక్క ధర్మం
A) అయాన్‌లుగా ఉంటుంది. B) సాధారణంగా నీటిలో కరుగుతుంది.
C) విద్యుత్‌ను ప్రసరింపజేస్తుంది. D) అల్పద్రవీభవన, బాష్పీభవన స్థానాలుంటాయి.
81. కిందివాటిలో ధృవ సంయోజనీయ బంధం ఉన్న అణువు
A) NaCl B) C2H6 C) HCl D) MgCl2
82. హైడ్రోజన్ క్లోరైడ్ అణువులో ఉండే అతిపాతం
A) s − s B) s − p C) p − p D) s − d
83. హైడ్రోజన్ క్లోరైడ్ అణువులోని పరమాణువులు ఏ విధంగా బంధితమై ఉంటాయి?
A) అయానిక బంధాలతో B) ధృవశీల సంయోజనీయ బంధంతో
C) వాండర్ వాల్ బలాలతో D) డైపోల్ - డైపోల్ ఆకర్షణ వల్ల
84. కిందివాటిలో సంయోజనీయ పదార్థాలు ఎందులో కరుగుతాయి?
A) ధృవ ద్రావణి B) అధృవ ద్రావణి C) గాఢ ఆమ్లం D) అన్ని ద్రావణాలు
జవాబులు: 1-A; 2-D; 3-B; 4-B; 5-C; 6-D; 7-D; 8-C; 9-A; 10-C; 11-D; 12-D; 13-B; 14-B; 15-C; 16-C; 17-B; 18-C; 19-B; 20-D; 21-A; 22-B; 23-B; 24-A; 25-B; 26-C; 27-C; 28-A; 29-D; 30-A; 31-D; 32-A; 33-C; 34-A; 35-A; 36-A; 37-D; 38-B; 39-B; 40-C; 41-C; 42-D; 43-D; 44-D; 45-A; 46-C; 47-D; 48-D; 49-C; 50-C; 51-D; 52-B; 53-D; 54-D; 55-C: 56-C; 57-D; 58-D; 59-C; 60-A; 61-C; 62-B; 63-A; 64-C; 65-C; 66-C; 67-A; 68-D; 69-A; 70-A, 71-C; 72-D; 73-C; 74-B; 75-B; 76-D; 77-C; 78-B; 79-B; 80-D; 81-C; 82-B; 83-B; 84-B.