• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రసాయన బంధం

1. కింది అణువులు ఏర్పడే విధానాన్ని వేలన్సీ బంధ సిద్ధాంతం ఆధారంగా వివరించండి. (AS1) 4 మార్కులు
      i) H2       ii) Cl2


2. F2, O2 అణువులు సమయోజనీయ బంధం ద్వారా ఏర్పడటాన్ని వివరించండి.  (AS1) 4 మార్కులు


3. కింది అణువుల్లో ఎలక్ట్రాన్‌ల అమరికను చూపే పటాలను గీయండి.
      ఎ) కాల్షియం ఆక్సైడ్ (CaO)
      బి) మీథేన్ (CH4)
      సి) బోరాన్ ట్రై ఫ్లోరైడ్ (BF3)
      డి) ఫ్లోరిన్ (F2)   (AS1) 4 మార్కులు


4. ఏక, ద్వి, త్రిక బంధాలు ఏవిధంగా ఏర్పడతాయో పటం ద్వారా సూచించండి.   (AS5) 4 మార్కులు


5. X, Y పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాలు వరుసగా 2, 8, 1; 2, 8, 7 అయితే
   i) ఏ పరమాణువు ఆనయాన్‌ను ఏర్పరుస్తుంది?ఎందుకు?
  ii) ఏ పరమాణువు కేటయాన్‌ను ఏర్పరుస్తుంది?ఎందుకు?
  iii) X, Y మూలకాలు ఆవర్తన పట్టికలో ఏ బ్లాకుల్లోనివి?
  iv) X, Y మూలక పరమాణువులతో ఏర్పడే అణువు ఫార్ములాను తెలపండి. (AS1) (AS4) 4 మార్కులు

6. X, Y మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు వరుసగా 2, 8, 3; 2, 6 అయితే
  i) ఏ పరమాణువు ఆనయాన్‌ను ఏర్పరుస్తుంది?
  ii) ఏ పరమాణువు కేటయాన్‌ను ఏర్పరుస్తుంది?
  iii) పరమాణువు X వేలన్సీ ఎంత?
  iv) X, Y మూలక పరమాణువులతో ఏర్పడే అణువు ఫార్ములాను రాయండి. (AS1) (AS4) 4 మార్కులు


7. Na, Mg, O, Cl, N, Ca లలో ఏ ఏ మూలకాల మధ్య అయానిక బంధం ఏర్పడటానికి అవకాశం ఉందో సకారణంగా రాయండి. (AS1) 4 మార్కులు


8. పక్క పటాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
   i) కార్బన్ మూలకంపై ఎన్ని వేలన్సీ ఎలక్ట్రాన్‌లు ఉన్నాయి?
   ii) హైడ్రోజన్ వేలన్సీ ఎంత?
   iii) ఆ అణువులో ఎన్ని సమయోజనీయ బంధాలున్నాయి?
   iv) HCH మధ్య బంధకోణం ఎంత? (AS4) 4 మార్కులు

 

9. కింది పట్టికలో NaCl, HCl, C2H6 ధర్మాలు ఇచ్చారు. వాటిని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

 i) అయానిక పదార్థం ఏది?దాని ఫార్ములా రాయండి.
 ii) అయానిక పదార్థాల ద్రావణీయతను గురించి రాయండి.
 iii) ఏ పదార్థాల చర్యాశీలత తక్కువ?
 iv) HCఅణువు చిత్రాన్ని గీయండి. (AS4) 4 మార్కులు

10. అయానిక, సమయోజనీయ పదార్థాల మధ్య తేడాలను తెలపండి. (AS1) 4 మార్కులు


11. NH3 లోని బంధాలను సంకరీకరణం పరంగా వివరించండి.   (AS1) 2 మార్కులు


12. అష్టక విన్యాసాన్ని వివరించండి.   (AS1) 2 మార్కులు


13. మూలక పరమాణువులు ఎందుకు అణువులుగా సంయోగం చెందుతాయి? (AS1) 2 మార్కులు


14. VSEPRT నియమం ప్రకారం నీటి అణువులో బంధకోణం 104° 31' ఉంటుంది. ఎందుకో వివరించండి. (AS1) 2 మార్కులు


15. సమన్వయ సంఖ్యను తెలపండి.NaCl స్ఫటికంలో Na+, Cl-ల సమన్వయ సంఖ్యలను తెలపండి. (AS1) 2 మార్కులు


16. సమయోజనీయ బంధం వల్ల CH4 అణువు ఏర్పడటాన్ని వివరించండి.  (AS1) 2 మార్కులు


17. సంకరీకరణం ఆధారంగా HCఅణువు ఏర్పడే విధానాన్ని వివరించండి.


18.   పక్క పటం నుంచి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) ఆక్సిజన్ పరమాణువులో ఎన్ని వేలన్సీ ఎలక్ట్రాన్‌లు ఉన్నాయి?
ii) ఆక్సిజన్ పరమాణువుల మధ్య ఏ బంధం ఏర్పడుతుంది?    (AS4) 2 మార్కులు


19. రసాయన బంధాలు ఏర్పడకపోతే ఏం జరుగుతుందో ఊహించండి. (AS2) 2 మార్కులు

20. పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ బదిలీ జరగకపోతే ఏం జరుగుతుందో ఊహించండి. (AS2) 2 మార్కులు


21. సంకరీకరణం ద్వారా ఏర్పడిన BF3 అణువు పటాన్ని గీయండి. (AS5) ఒకమార్కు


22. పక్క పటం దేన్ని సూచిస్తుంది.   (AS5) ఒకమార్కు


23. పక్క పటం దేన్ని సూచిస్తుంది?   (AS5) ఒకమార్కు


24. Al పరమాణువుకు లూయిస్ చుక్కల నిర్మాణాన్ని గీయండి.  (AS5) ఒకమార్కు


25. BFఅణు నిర్మాణాన్ని గీసి బంధ కోణాన్ని గుర్తించండి. (AS5) ఒకమార్కు


26. రేఖీయాకృతిలో ఉండే BeCl2 అణు నిర్మాణాన్ని గీసి బంధకోణాన్ని గుర్తించండి. (AS5) ఒకమార్కు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం