1. విలువ స్థిరం అని ప్రయోగ పూర్వకంగా నిరూపించడానికి కావాల్సిన పరికరాల జాబితా రాసి, ప్రయోగ నిర్వహణా విధానాన్ని పటసహాయంతో వివరించండి.
(లేదా)
'స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని ప్రయోగ పూర్వకంగా నిరూపించడానికి కావాల్సిన పరికరాలు, ప్రయోగ నిర్వహణా విధానాన్ని పట సహాయంతో వివరించండి.(AS 3) 4 మార్కులు
జ: ఉద్దేశం: ఒక వాహకానికి సంబంధించిన విలువ స్థిరం అని చూపడం.
కావాల్సిన వస్తువులు: 1.5 V బ్యాటరీలు 5, అమ్మీటర్, ఓల్ట్‌మీటర్, వాహక తీగలు (రాగి తీగలు), 10 సెం.మీ. పొడవు ఉన్న సన్నని మాంగనిన్ తీగ, స్విచ్.
నిర్వహణ పద్ధతి:
* పటంలో చూపిన విధంగా వలయాన్ని కలపాలి.
* స్విచ్ ఆన్ చేసి, అమ్మీటర్‌లో విద్యుత్ ప్రవాహం, ఓల్ట్‌మీటర్‌లో పొటెన్షియల్ భేదం రీడింగులను గుర్తించి కింది పట్టికలో నమోదు చేయాలి.
* ఇప్పుడు వలయంలో ఒక బ్యాటరీకి బదులుగా రెండు బ్యాటరీలను శ్రేణిలో కలపాలి. ఈ సందర్భంలో వచ్చిన అమ్మీటర్, ఓల్ట్‌మీటర్ రీడింగులను పై పట్టికలో నమోదు చేయాలి.
* ఇదేవిధంగా 3, 4, 5 బ్యాటరీలను శ్రేణిలో కలుపుతూ ఈ కృత్యాన్ని మళ్లీ చేయాలి. ప్రతి సందర్భంలో V, I విలువలను పైపట్టికలో నమోదు చేయాలి.
* ప్రతీ సందర్భానికి విలువలను కనుక్కోవాలి.
* విలువ స్థిరమని తెలుస్తుంది.
= స్థిరం. దీన్ని మనం గణితపరంగా కింది విధంగా సూచిస్తాం. V
I
* ఈ ప్రయోగాన్ని బట్టి మాంగనిన్ తీగ (వాహకం) రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం దానిలో ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుందని తెలుస్తోంది.
2. ఒక వాహక నిరోధం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది? వాహక నిరోధాన్ని ప్రభావితం చేసే ఏదైనా ఒక కారకాన్ని ప్రయోగ పూర్వకంగా ఎలా సరిచూస్తారో తెలపండి. (AS 3) 4 మార్కులు
జ: వాహక నిరోధం ఆ వాహక పదార్థ స్వభావం, పొడవు, మధ్యచ్ఛేద వైశాల్యం లాంటి జ్యామితులు, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది.
వాహక నిరోధం ఉష్ణోగ్రతపై ఆధారపడుతుందని ప్రయోగ పూర్వకంగా సరిచూడటం:
* మల్టీమీటరును ఉపయోగించి ఒక తెరచి ఉంచిన వలయంలో బల్బు నిరోధాన్ని కొలిచి నోట్‌బుక్‌లో నమోదు చేయాలి.
* పటంలో చూపిన విధంగా వలయాన్ని ఏర్పాటు చేసి, స్విచ్ ఆన్ చేయాలి.
* కొద్ది నిమిషాల తర్వాత బల్బ్ వేడెక్కుతుంది.
* అప్పుడు తిరిగి బల్బ్ నిరోధాన్ని కొలవాలి.
* రెండో సందర్భంలో బల్బ్ నిరోధం మొదటి కంటే ఎక్కువగా ఉండటాన్ని గమనిస్తాం.
* బల్బ్‌లోని ఫిలమెంట్ ఉష్ణోగ్రతలో పెరుగుదల వల్ల బల్బ్ నిరోధం పెరిగింది. దీన్నిబట్టి బల్బ్ నిరోధానికి, దాని ఉష్ణోగ్రతకు సంబంధం ఉందని చెప్పవచ్చు.
* ఒక వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పుడు వాహక నిరోధం దాని ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది.
3. వాహక నిరోధం ఆ వాహక పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుందని ప్రయోగ పూర్వకంగా ఎలా సరిచూస్తారు? (AS 3) 4 మార్కులు
జ: P, Q ల మధ్య వివిధ లోహ ముక్కలను కలుపుతాం
* ఒకే పొడవు, మధ్యచ్ఛేద వైశాల్యాలున్న రాగి, అల్యూమినియం, ఇనుము లాంటి వివిధ లోహపు తీగలను తీసుకోవాలి.
* పటంలో చూపినట్లు వలయాన్ని ఏర్పాటు చేయాలి.
* మనం ఎంచుకున్న లోహపు తీగల్లో ఏదో ఒకదాన్ని P, Q ల మధ్య కలపాలి.
* స్విచ్ ఆన్ చేసి వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని అమ్మీటర్ సహాయంతో కొలిచి విలువను నోట్‌బుక్‌లో నమోదు చేయాలి.
* మిగిలిన లోహపు తీగలతో ఈ కృత్యాన్ని నిర్వహించి ప్రతి సందర్భంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవాలి.
* పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పటికీ విద్యుత్ ప్రవాహం విలువ వివిధ లోహపు తీగలకు వివిధ రకాలుగా ఉండటం గమనిస్తాం.
* ఈ ప్రయోగాన్ని బట్టి వాహక నిరోధం, ఆ వాహక స్వభావంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు.
4. వాహక నిరోధం, వాహక మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుందని ప్రయోగపూర్వకంగా నిరూపించడానికి కావాల్సిన పరికరాల జాబితాను రాసి, ప్రయోగ విధానాన్ని పట సహాయంతో వివరించండి. (AS 3) 4 మార్కులు
జ: కావాల్సిన వస్తువులు: బ్యాటరీ, అమ్మీటర్, స్విచ్, వాహకపు తీగలు; ఒకే పొడవు, వివిధ మధ్యచ్ఛేద వైశాల్యాలున్న ఇనుప కడ్డీలు.
ప్రయోగ విధానం:
* ఒకే పొడవు, వివిధ మధ్యచ్ఛేద వైశాల్యాలున్న ఇనుప కడ్డీలను తీసుకోవాలి.
* పటంలో చూపిన విధంగా వలయాన్ని ఏర్పాటు చేయాలి.
* మనం ఎంచుకున్న కడ్డీల్లో ఏదో ఒకదాన్ని P, Qల మధ్య ఉంచి వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచి, నమోదు చేయాలి.
* మిగిలిన కడ్డీలతో ఈ కృత్యాన్ని మళ్లీ నిర్వహించి ప్రతీ సందర్భంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచి రీడింగ్ నమోదు చేయాలి.
* ఇనుప కడ్డీ మధ్యచ్ఛేద వైశాల్యం పెరుగుతున్న కొద్దీ అందులో విద్యుత్ ప్రవాహం పెరగడాన్ని గమనిస్తాం. అంటే కడ్డీ మధ్యచ్ఛేద వైశాల్యం పెరుగుతున్న కొద్దీ దాని నిరోధం తగ్గుతుంది.
* ఈ ప్రయోగాన్ని బట్టి వాహక నిరోధం, వాహక మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుందని చెప్పవచ్చు.
* R
(వాహక ఉష్ణోగ్రత, పొడవు స్థిరంగా ఉన్నప్పుడు)
5. శ్రేణి సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం, వాటి విడి నిరోధాల మొత్తానికి సమానమని చూపండి. (AS 1) 4 మార్కులు
జ: నిరోధాల శ్రేణి సంధానం: ఒక వలయంలో చివరి నుంచి చివరికి కలిపిన నిరోధాల ద్వారా ఒకే విద్యుత్ ప్రవాహం, ఒకే మార్గంలో ప్రవహిస్తున్నట్లయితే అవి శ్రేణి సంధానంలో ఉన్నాయని అంటాం.
* R1, R2, R3 నిరోధాలను శ్రేణి సంధానంలో తీసుకోవాలి.
* R1, R2, R3 నిరోధాల కొనల మధ్య పొటెన్షియల్ భేదాలు వరుసగా V1, V2, V3 అనుకుంటే
* వలయంలో పొటెన్షియల్ భేదం 'V' అయితే
V = V1 + V2 + V3 .......... (1)
ఓమ్ నియమం ప్రకారం V1 = IR1, V2 = IR2, V3 = IR3
V1, V2, V3 విలువలను సమీకరణం (1)లో ప్రతిక్షేపించగా
V = IR1 + IR2 + IR3 .......... (2)
శ్రేణిలో కలిపిన నిరోధాల వల్ల కలిగే ఫలిత నిరోధం Req అనుకుందాం. అప్పుడు
... V = I Req అయితే సమీకరణం (2) నుంచి
I Req = IR1 + IR2 + IR3
I(Req) = I(R1 + R2 + R3)
Req = R1 + R2 + R3
అంటే శ్రేణి సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం, వాటి విడి నిరోధాల మొత్తానికి సమానం.
6. సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధ వ్యుత్ర్కమణం, వాటి విడి నిరోధాల వ్యుత్ర్కమణాల మొత్తానికి చూపండి. (AS 1) 4 మార్కులు
జ: నిరోధాల సమాంతర సంధానం: ఒక వలయంలో నిరోధాలను ఉమ్మడి టెర్నినల్స్‌కి కలిపి, వాటి మధ్య పొటెన్షియల్ భేదం సమానంగా ఉంటే అవి సమాంతర సంధానంలో ఉన్నాయని అంటారు.
* R1, R2, R3 నిరోధాలను పటంలో చూపినట్లు సమాంతర సంధానం చేయాలి.
* వలయంలో 'I' కరెంటు ప్రవహిస్తుందనుకుంటే... 'V' ఓల్టేజి నిరోధాల ద్వారా ప్రవహిస్తుంది.
* R1, R2, R3 ద్వారా I1, I2, I3 విద్యుత్‌లు ప్రవహిస్తాయి. అప్పుడు I = I1 + I2 + I3 ..... (1)
కానీ ఓమ్ నియమం ప్రకారం
I1, I2, I3 విలువలను సమీకరణం (1)లో ప్రతిక్షేపించగా
సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం Req అనుకుంటే...
Req =
సమాంతర సంధానంలో ఫలిత నిరోధం వ్యుత్ర్కమణం, విడి నిరోధాల వ్యుత్ర్కమణాల మొత్తానికి సమానం.
7. జంక్షన్ నియమం, లూప్ నియమాలు తెలిపి, ప్రతి నియమాన్ని ఒక్కో ఉదాహరణతో వివరించండి. (AS 1) 4 మార్కులు
జ: జంక్షన్ నియమం (సంధి నియమం): వలయంలో విద్యుత్ ప్రవాహం విభజితమయ్యే ఏ జంక్షన్ వద్దనైనా, జంక్షన్‌ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం, ఆ జంక్షన్‌ను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం అంటే వలయంలోని ఏ జంక్షన్ వద్ద కూడా ఆవేశాలు పోగవడం అనేది జరగదు.
ఉదా:
పక్కపటంలో P బిందువు జంక్షన్ (సంధి)ని సూచిస్తుంది.
I1, I4, I6 లు జంక్షన్‌ను చేరే విద్యుత్ ప్రవాహాలు
I2, I3, I5లు జంక్షన్‌ను విడిపోయే విద్యుత్ ప్రవాహాలు
జంక్షన్ నియమం ప్రకారం
I1 + I4 + I6 = I2 + I3 + I5
లూప్ నియమం: ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాల్లో పెరుగుదల, తగ్గుదలల బీజీయ మొత్తం శూన్యం.
ఉదా:
పై పటంలో చూపిన వలయానికి లూప్ నియమాన్ని అనువర్తింపజేయగా
1. ABCDEFA లూప్‌లో:
లూప్‌లో ఫలిత పొటెన్షియల్ భేదం -V1 + I1R1 - I2R2 + V2 = 0
2. AFEDCBA లూప్‌లో:
లూప్‌లో ఫలిత పొటెన్షియల్ భేదం -V2 + I2R2 - I1R1 + V1 = 0
8. ఓవర్‌లోడ్ అంటే మీరేం అర్థం చేసుకున్నారో వివరించండి.
(లేదా)
ఓవర్ లోడ్ వల్ల విద్యుత్ సాధనాలు ఎందుకు పాడవుతాయి? దానివల్ల సంభవించే ప్రమాదాలను ఎలా నివారించగలం?(AS 1)(AS 6) 4 మార్కులు
జ: ఓవర్‌లోడ్: విద్యుత్‌లైన్‌ల నుంచి వినియోగానికి కేటాయించిన మొత్తం విద్యుత్ ప్రవాహం కంటే వివిధ సాధనాల ద్వారా వినియోగించిన విద్యుత్ ప్రవాహం అధికమైతే ఓవర్‌లోడ్ అంటాం. ఓవర్‌లోడ్ వల్ల మంటలు ఏర్పడి విద్యుత్ సాధనాలు పాడవుతాయి.
ఉదాహరణకు:
* మన ఇంటికి లైన్‌ల ద్వారా వచ్చిన విద్యుత్ప్రవాహం 5 A నుంచి 20 A ఉంటుంది. పొటెన్షియల్ భేదం 240 V. అంటే ఇంటి మీటరు వద్దకు చేరే రెండు తీగల మధ్య 240 V పొటెన్షియల్ భేదంలో కనిష్ఠంగా 5 A, గరిష్ఠంగా 20 A విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. కానీ, ఆ తీగల ద్వారా 20 A కంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటే, ఇంట్లోని వలయం వేడెక్కి మంటలు వచ్చే ప్రమాదం ఉంది.
* పటంలో చూపిన హీటర్‌ను స్విచ్ ఆన్ చేస్తే మనం వినియోగించే విద్యుత్ 20 A కంటే ఎక్కువ అవుతుంది. అప్పుడు ఓవర్‌లోడై తీగలు, పరికరాలు కాలిపోతాయి.
* ఓవర్‌లోడ్ వల్ల కలిగే ప్రమాదాలను నివారించడానికి, పటంలో చూపినట్లు మన ఇళ్లలోని వలయంలో ఫ్యూజ్‌ని ఉపయోగిస్తాం. ఈ అమరికలో లైన్‌ల ద్వారా వచ్చే మొత్తం విద్యుత్ ఫ్యూజ్ ద్వారా ప్రవహించాల్సి ఉంటుంది.
* ఫ్యూజ్ అనేది అతి తక్కువ ద్రవీభవన స్థానం ఉన్న ఒక సన్నని తీగ. ఫ్యూజ్ ద్వారా ప్రవహించే విద్యుత్ 20 Aలను మించితే ఆ సన్నని తీగ వేడేక్కి కరిగిపోతుంది. అప్పుడు ఇంట్లోని మొత్తం వలయం తెరవబడి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. ఫలితంగా ఓవర్‌లోడ్ కారణంగా ఇంట్లోని విద్యుత్ సాధనాలు కాలిపోవు.
9. R Ω నిరోధం ఉన్న మూడు నిరోధాలు దగ్గరగా ఉన్నాయి అనుకుందాం. ఈ మూడింటిని వివిధ రకాలుగా కలపడం ద్వారా ఎన్ని రకాల నిరోధాలు పొందగలం. వాటికి సంబంధించిన పటాలను గీయండి. (AS 5) 4 మార్కులు
జ: ఈ మూడు నిరోధాలను 4 రకాలుగా సంధానం చేయవచ్చు.
* మూడు నిరోధాలను శ్రేణి సంధానం చేస్తే
* మూడు నిరోధాలను సమాంతర సంధానం చేస్తే
* రెండు నిరోధాలను శ్రేణిలోను, ఒక నిరోధాన్ని సమాంతరంగా సంధానం చేస్తే
* రెండు నిరోధాలను సమాంతరంగా, ఒక నిరోధాన్ని శ్రేణిలో సంధానం చేస్తే
10. మానవ శరీరంపై విద్యుత్ ఘాత ప్రభావాలను వివరించండి. (AS 1) (AS 6) 4 మార్కులు
జ: 240 V తీగను తాకినప్పుడు మన శరీరం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం I = 0.0024 A. ఈ పరిమాణంలో విద్యుత్ ప్రవాహం మన శరీరంలోకి ప్రవహిస్తే శరీరంలోని వివిధ అవయవాలు నిర్వహించే పనులకు ఆటంకం కలుగుతుంది. ఇలా ఆటంకం కలగడమే విద్యుత్‌ఘాతం.
* మన శరీరం ద్వారా ఇంకా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే శరీరంలోని కణజాలం దెబ్బతింటుంది. ఫలితంగా శరీర నిరోధం తగ్గిపోతుంది. శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించే కాలం పెరుగుతున్న కొద్దీ కణజాలం బాగా దెబ్బతిని, శరీర నిరోధం ఇంకా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం ద్వారా ప్రవహించే విద్యుత్ పెరుగుతుంది. ఇలా విద్యుత్ ప్రవాహం 0.07 A వరకు చేరితే, అది గుండె పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ విద్యుత్ ప్రవాహం గుండె ద్వారా ఒక సెకను కంటే ఎక్కువ కాలం ప్రవహిస్తే మనిషి స్పృహ కోల్పోతాడు. ఇంకా ఎక్కువకాలం ప్రవహిస్తే మనిషి చనిపోతాడు.
మానవ శరీరంపై విద్యుత్ ప్రవాహ ప్రభావాలు:
విద్యుత్ ప్రవాహం(ఆంపియర్‌లలో) | శరీరంపై ప్రభావం |
0.001 | ప్రభావాన్ని గుర్తించగలం |
0.005 | నొప్పిని కలగజేస్తుంది |
0.010 | కండరాలు సంకోచిస్తాయి |
0.015 | కండరాల పటుత్వం దెబ్బతింటుంది |
0.070 | ఒక సెకను కంటే ఎక్కువ సమయం గుండె ద్వారా ప్రవహిస్తే స్పృహ కోల్పోతారు |
11. లూప్ నియమం ప్రకారం ఒక విద్యుత్ వలయంలో పాటించే సంజ్ఞా సంప్రదాయలను వివరించండి. (AS 1) 4 మార్కులు
జ: * బ్యాటరీ ధన ధ్రువం నుంచి రుణధ్రువం వైపు కదులుతున్నప్పుడు విద్యుచ్ఛాలక బలం (emf) విలువను రుణాత్మకంగా తీసుకోవాలి.
* బ్యాటరీ రుణధ్రువం నుంచి ధనధ్రువం వైపు కదులుతున్నప్పుడు విద్యుచ్ఛాలక బలం (emf) విలువను ధనాత్మకంగా తీసుకోవాలి.
* నిరోధంపై పొటెన్షియల్ భేదానికి సంజ్ఞను ఇచ్చేటప్పుడు దానిలో ప్రవహించే విద్యుత్ ప్రవాహదిశను గమనించాలి.
* విద్యుత్ ప్రవాహ దిశలో నిరోధం ద్వారా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం రుణాత్మకంగా తీసుకోవాలి.
* విద్యుత్ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో నిరోధం ద్వారా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం ధనాత్మకంగా తీసుకోవాలి.
12. ఇచ్చిన R1,R2,R3,R4 నిరోధాలతో ఏర్పడే వీలైనన్ని రకాల సంధానాలను సూచించే వలయ చిత్రాలను గీయండి. (AS 5) 4 మార్కులు
13. పక్క వలయం నుంచి కింద తెలిపిన లూప్‌లలో ఫలిత పొటెన్షియల్ భేదాన్ని కనుక్కోండి.
1. ABEFA లూప్
2. ACDFA లూప్
3. BCDEB లూప్
4. EFABE లూప్
5. DEBCD లూప్
6. DFACD లూప్ (AS 4) 4 మార్కులు
జ: 1. ABEFA లూప్‌లో:
లూప్‌లో ఫలిత పొటెన్షియల్ భేదం -V2 + I2R2 - I1R1 + V1 = 0
2. ACDFA లూప్‌లో:
లూప్‌లో ఫలిత పొటెన్షియల్ భేదం -(I1 + I2)R3 - I1R1 + V1 = 0
3. BCDEB లూప్‌లో:
లూప్‌లో ఫలిత పొటెన్షియల్ భేదం -(I1 + I2)R3 - I2R2 + V2 = 0
4. EFABE లూప్‌లో:
లూప్‌లో ఫలిత పొటెన్షియల్ భేదం -I1R1 + V1 - V2 + I2R2 = 0
5. DEBCD లూప్‌లో:
లూప్‌లో ఫలిత పొటెన్షియల్ భేదం -I2R2 + V2 - (I1 + I2)R3 = 0
6. DFACD లూప్‌లో:
లూప్‌లో ఫలిత పొటెన్షియల్ భేదం -I1R1 + V1 - (I1 + I2)R3 = 0
14. మధు అనే విద్యార్థి ఒక తీగ, వోల్ట్‌మీటర్, అమ్మీటర్‌ను ఉపయోగించి సేకరించిన విద్యుత్ ప్రవాహాన్ని Y - అక్షంపై, వోల్టేజీలను X - అక్షంపై తీసుకుని గ్రాఫ్ గీశాడు. పై గ్రాఫ్‌ను అనుసరించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
i) తీసుకున్న తీగ ఏ రకమైంది?
ii) తీగనిరోధం కనుక్కోండి.
iii) తీగ కొనల మధ్య 20V పొటెన్షియల్
భేదం అనువర్తించేటప్పుడు ఆ తీగ ఎంత
విద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది?
iv) పై గ్రాఫ్ ఏ నియమాన్ని తెలుపుతుంది? (AS 4) 4 మార్కులు
జ: i) గ్రాఫ్ నుంచి మధు తీసుకున్న పదార్థం ఒమీయ వాహకం (లోహాలు)
ii) గ్రాఫ్ నుంచి I = 0.1
V = 5 V
ఓమ్ నియమం నుంచి V = IR లేదా R =
R = = 50 Ω
iii) తీగకొనల మధ్య పొటెన్షియల్ భేదం (V) = 20 V
నిరోధం (R) = 50 Ω
iv) ఓమ్ నియయం
వలయాన్ని పటంలో చూపారు. A, Bల మధ్య ఫలిత నిరోధం ఎంత? (AS 1) 2 మార్కులు
జ: A, Bల మధ్య 'R' నిరోధం ఉన్న మూడు నిరోధకాలను సమాంతరంగా కలిపారు. వీటికి R నిరోధకాన్ని శ్రేణిలో కలిపారు.
సమాంతరంగా కలిపిన మూడు నిరోధకాల ఫలిత నిరోధం
16. పటంలోని వలయాన్ని చూడండి. A, Bల మధ్య ఫలిత నిరోధం ఎంత? (AS 1) 2 మార్కులు
జ: A, B ల మధ్య బ్యాటరీని సంధానం చేస్తే మూడు నిరోధాల్లో వోల్టేజీ విడిపోతుంది. కాబట్టి వలయాన్ని తిరిగి గీయగా
17. మీ ఇంటిలోని వివిధ విద్యుత్ పరికరాలు వలయంలో ఏ విధంగా కలిపి ఉన్నాయో తెలియజేసే చిత్రాన్ని గీయండి. (AS 5) 2 మార్కులు
జ:
18. ఇంటిలో విద్యుత్ పరికరాలను కలిపే వలయంలో ఫ్యూజ్‌లను ఎందుకు వాడతారో తెలపండి.
లేదా
ఫ్యూజ్‌ల వల్ల ఉపయోగమేమిటి? (AS 6) 2 మార్కులు
జ: * ఫ్యూజ్ అనేది అతి తక్కువ ద్రవీభవన స్థానం ఉన్న ఒక సన్నని తీగ
* ఫ్యూజ్ ద్వారా ప్రవహించే విద్యుత్ 20 Aలను మించితే ఆ సన్నని తీగ వేడెక్కి కరిగిపోతుంది. అప్పుడు ఇంటిలోని మొత్తం వలయం తెరచుకుని విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. దాంతో ఓవర్‌లోడ్ కారణంగా ఇంటిలోని విద్యుత్ సాధనాలు కాలిపోవు.
* ఫ్యూజ్‌ను వాడటం ద్వారా ఇంటిలోని వలయం, అందులోని సాధనాలకు ఓవర్‌లోడ్ వల్ల ఇబ్బంది కలగకుండా కాపాడవచ్చు.
19. మీ శరీర నిరోధం 1,00,000 Ω అనుకుంటే మీరు 24V బ్యాటరీని తాకినప్పుడు మీ శరీరం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత? ఆ విద్యుత్ ఘాతం ప్రభావం శరీరంపై ఎలా ఉంటుంది? (AS 1) 2 మార్కులు
జ: శరీర నిరోధం (R) = 1,00,000 Ω
బ్యాటరీ విద్యుత్ పొటెన్షియల్(V) = 24 V
శరీరం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం (I) = ?
ఓమ్ నియమం ప్రకారం I =
= 0.00024A
ఇది చాలా స్వల్ప పరిమాణం గలది. ఇలాంటి విద్యుత్ ప్రవాహం మన శరీరం ద్వారా ప్రవహించినా శరీరంలోని వివిధ అవయవాలు నిర్వహించే పనులను ప్రభావితం చేయదు.
20. అధిక వోల్టేజీ ఉన్న తీగపై నిలుచున్న పక్షికి విద్యుత్ ఘాతం కలగదు. ఎందుకో వివరించండి. (AS 6) 2 మార్కులు
జ: విద్యుత్ స్తంభాలపై రెండు విద్యుత్ సరఫరా తీగలు సమాంతరంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య 240V పొటెన్షియల్ భేదం ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఏదైనా విద్యుత్ పరికరాన్ని కలిపితే అది విద్యుత్ ప్రవాహాన్ని పొందుతుంది. అంటే విద్యుత్ ప్రవాహాన్ని పొందాలంటే ఏదైనా, ఈ రెండు తీగలకు కలపాలి. అధిక ఓల్టేజ్ తీగపై పక్షి నిల్చొని ఉన్నప్పుడు దాని కాళ్ల మధ్య పొటెన్షియల్ భేదం లేదు. ఎందుకంటే అది ఒకే తీగపై నిల్చుంది. అందువల్ల పక్షి ద్వారా విద్యుత్ ప్రవాహం జరగదు. కాబట్టి దానికి విద్యుత్‌ఘాతం కలగలేదు.
21. ఫ్యూజ్‌ల తయారీలో లెడ్ తీగను వాడటానికి కారణాలు తెలపండి. (AS 1) (AS 6) 2 మార్కులు
జ: ఫ్యూజ్‌ల తయారీలో లెడ్ తీగను వాడటానికి కారణం లెడ్‌కు ద్రవీభవన స్థానం తక్కువ. ఈ పదార్థం ద్వారా తయారుచేసిన తీగ ద్వారా విద్యుత్ ప్రవాహిస్తే, అది ఒక ఉష్ణోగ్రత వద్ద వేడెక్కి కరుగుతుంది. దీని వల్ల వలయం తెరచుకుని ఇంటిలోని ఇతర పరికరాలకు విద్యుత్ ప్రవాహం నిలిచిపోతుంది. దాంతో ఆ పరికరాలు పాడవకుండా ఉంటాయి.
22. కిందివాటికి సంకేతాలను గీయండి.
i) విద్యుత్‌ఘటం
ii) నిరోధం
iii) అమ్మీటర్
iv) కీ (AS 5) 2 మార్కులు
23. విద్యుత్ వాహకాల V - I గ్రాఫ్ ఆకృతిని గీయండి. (AS 5) ఒకమార్కు
24. అర్ధవాహకాలు V - I గ్రాఫ్ ఆకృతిని గీయండి. (AS 5) ఒక మార్కు
25. ఓమ్ నియమం షరతులేవి? (AS 1) ఒకమార్కు
జ: * లోహ వాహకాలు ఓమ్ నియమాన్ని పాటిస్తాయి.
* వాయు వాహకాలకు ఓమ్ నియమం వర్తించదు.
* అర్ధవాహకాలకు ఓమ్ నియమం వర్తించదు.
26. అర్ధవాహకాల ఉపయోగాలను తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: డయోడ్, ట్రాన్సిస్టర్, ఇంటిగ్రేటెడ్ చిప్ (IC) లను తయారుచేయడానికి అర్ధ వాహకాలను వాడతారు. ICలను కంప్యూటర్, టి.వి., సెల్‌ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగిస్తారు.
27. విద్యుత్ ప్రవాహంను కొలవడానికి వాడే పరికరం ఏది? (AS 6) ఒక మార్కు
జ: అమ్మీటర్
28. పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి వాడే పరికరం ఏది? (AS 1) ఒక మార్కు
జ: వోల్ట్‌మీటరు
29. కింది పటం 'X' విలువను కనుక్కోండి? (AS 1) ఒక మార్కు
జ: జంక్షన్ నియమం నుంచి I1 + I2 = I3 + I4
2 + 5 = 1.5 + x
x = 7 - 1.5
x = 5.5A
30. లూప్ నియమాన్ని అనుసరించి కింది పటంలో ఫలిత పొటెన్షియల్ భేదాన్ని కనుక్కోండి. (AS 4) 2 మార్కులు
జ: i) ABCDA లూప్‌లో:
ఫలిత పొటెన్షియల్ భేదం +V1 - IR1 + V2 -IR2 - IR3 = 0
ii) ADCBA లూప్‌లో:
ఫలిత పొటెన్షియల్ భేదం +IR3 + IR2 - V2 + IR1 - V1 = 0
సమస్యలు - సాధనలు
1. ఒక వాహకంలో 4 నిమిషాల్లో 90 కూలూంబ్‌ల ఆవేశం ప్రవహిస్తే ఆ వాహకంలోని విద్యుత్ ప్రవాహం ఎంత? (AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: Q = 90 కూలూంబ్‌లు
t = 4 × 60 = 240 సెకన్లు
I = ?
= 0.375 ఆంపియర్లు
2. వాహకంలో 2 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహం 5 నిమిషాలపాటు ఉంటే, ఆ వాహకంలో ప్రయాణించిన ఆవేశం ఎంత? (AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: I = 2 ఆంపియర్లు
t = 5 × 60 = 300 సెకన్లు
Q = ?
Q = I × t
= 2 × 300
= 600 కూలూంబ్‌లు.
3. ఒక బల్బ్‌కు 240V పొటెన్షియల్ భేదాన్ని కలగజేస్తే దాని ద్వారా 6A విద్యుత్ ప్రవహిస్తుంది. అయితే దాని నిరోధాన్ని తెలుసుకోండి.,(AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: V = 240 V
I = 6 A
R = ?
ఓమ్ నియమం ప్రకారం R =
R =
= 40 Ω
4. 23 Ω నిరోధం ఉన్న ఒక ఇమ్మర్షన్ హీటర్‌ను 230 V పొటెన్షియల్ భేదం ఉన్న మెయిన్స్‌కు కలిపినప్పుడు, దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం విలువను కనుక్కోండి. (AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: R = 23 Ω
V = 230 V
I = ?
5. 10 Ω ల నిరోధం ద్వారా 0.15 A విద్యుత్ ప్రవహిస్తుంది. దాని కొనల మధ్య పొటెన్షియల్ భేదం ఎంత? (AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: R = 10 Ω
I = 0.15 A
V = ?
ఓమ్ నియమం ప్రకారం V = IR
V = 0.15 × 10
= 1.5 V
6. మీ శరీర నిరోధం 5,00,000 Ω అనుకుంటే మీరు 240 V తీగను తాకినప్పుడు మీ శరీరం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత? (AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: R = 5,00,000 Ω
V = 240 V
I = ?
= 0.00048 A
7. ఒక మీటరు పొడవున్న మాంగనీస్ తీగకు 8 Ω నిరోధం ఉంది. అంతే మధ్యచ్ఛేదం ఉన్న 5 మీటర్ల మాంగనీస్ తీగ నిరోధం ఎంత? (AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: R1 = 8 Ω
l1 = 1 మీటరు
l2 = 5 మీటర్లు
R2 = ?
R2 = 40 Ω
8. ఒక మి.మీ.2మధ్యచ్ఛేదం ఉన్న మాంగనీస్ తీగకు 12 Ω నిరోధం ఉంది. అంతే పొడవున్న 4 మి.మీ.2 మధ్యచ్ఛేదం ఉన్న మాంగనీస్ తీగ నిరోధం ఎంత? (AS 1) 4 మార్కులు
సాధన: ఇచ్చినవి: R1 = 12 Ω
A1 = 1 మి.మీ.2
A2 = 4 మి.మీ.2
R2 = ?
R2 = 3 Ω
9. 300 మీ. పొడవు, 3.4 × 10-6 మీ.2 మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న ఇత్తడి తీగ నిరోధం 6 Ω. అయితే దాని విశిష్ట నిరోధాన్ని తెలుసుకోండి. (AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: l = 300 మీ.
A = 3.4 × 10-6 మీ.2
R = 6 Ω
= 6.8 × 10-8 ఓమ్ - మీటరు
10. 4 Ω, 8 Ω లను (a) శ్రేణి, (b) సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం ఎంత? (AS 1) 4 మార్కులు
సాధన: ఇచ్చినవి: R1 = 4 Ω
R2 = 8 Ω
a) శ్రేణి సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం (Req)
Req = R1 + R2
Req = 4 + 8
Req = 12 Ω
b) సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం (Req)
Req = 2.6 Ω
11. 1 Ω, 10 Ω లను సమాంతర సంధానం చేసినప్పుడు, ఫలిత నిరోధాన్ని గణించండి. (AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: R1 = 1 Ω
R2 = 10 Ω
సమాంతర సంధానంలో ఫలిత నిరోధం Req
12. 2 Ω, 4 Ω, 8 Ω నిరోధం ఉన్న మూడు నిరోధాలను (a) శ్రేణిలో,(b) సమాంతరంగా కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధాలను కనుక్కోండి. (AS 1) 4 మార్కులు
సాధన: ఇచ్చినవి: R1 = 2 Ω
R2 = 4 Ω
R3 = 8 Ω
a) శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం
Req = R1 + R2 + R3
Req = 2 + 4 + 8 = 14 Ω
13. R1 Ω, 2 Ω, 8 Ω నిరోధం ఉన్న మూడు నిరోధాలను శ్రేణిలో కలపగా ఫలిత నిరోధం 17 Ω. అయితే R1 విలువ కనుక్కోండి. (AS 1) 2 మార్కులుb) సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం
సాధన: శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం
Req = R1 + R2 + R3
17 = R1 + 2 + 8
R1 = 17 10
R1 = 7 Ω
14. ఒక వలయంలోని మూడు నిరోధాల శ్రేణి సంయోగ ఫలిత నిరోధ విలువ 50 Ω. రెండు నిరోధాలు వరుసగా 10 Ω, 15 Ω. అయితే మూడో నిరోధం విలువ ఎంత? (AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: Req = 50 Ω
R1 = 10 Ω
R2 = 15 Ω
R3 = ?
శ్రేణి సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం
Req = R1 + R2 + R3
50 = 10 + 15 + R3
R3 = 50 - 25
R3 = 25 Ω
15. 6 Ω, R2 Ω నిరోధం ఉన్న రెండు నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం 4 Ω. అయితే R2 విలువను కనుక్కోండి. (AS 1) 2 మార్కులు
16. వలయంలో A, Bల మధ్య ఫలిత నిరోధం ఎంత? (AS 1) 2 మార్కులు
సాధన: ఇచ్చినవి: R1 = 3 Ω
R2 = 6 Ω
R3 = 2 Ω
ఇచ్చిన వలయం నుంచి
R1 = 3 Ω, R2 = 6 Ω లను సమాంతరంగా కలిపారు. కాబట్టి ఫలిత నిరోధం
Req = 2 Ω
R1, R2లకు R3 శ్రేణిలో కలిపారు. కాబట్టి ఫలిత నిరోధం Req = 2 + 2 = 4 Ω
17. విద్యుత్ వలయంలోని x, yల మధ్య ఫలిత నిరోధం ఎంత? (AS 1) 4 మార్కులు
ఈ మూడు X, Yల మధ్య 1 Ω నిరోధంతో శ్రేణిలో ఉన్నాయి కాబట్టి
X, Yల మధ్య ఫలిత నిరోధం = 1 + 1 + 1 + 1 = 4 Ω
18. ఒక విద్యుత్ బల్బుపై 60 W, 240 V అని రాసి ఉంది. అయితే దాని ఫిలమెంట్ నిరోధం ఎంత? (AS 1) 2 మార్కులు
= 960 Ω
19. మీ ఇంట్లో 40 W ఉన్న 5 ట్యూబు లైట్లు ఉన్నాయనుకుందాం. వీటిని మీరు సగటున రోజుకు 6 గంటలు వాడుతున్నారు. దీంతోపాటు 1500 W ఉన్న ఒక ఇమ్మర్షన్ హీటర్‌ను రోజుకు గంట చొప్పున వాడుతున్నారు. మీరు నెలకు వినియోగించుకునే విద్యుచ్ఛక్తి ఎంత? (AS 6) 4 మార్కులు
సాధన: ఒక రోజులో ట్యూబు లైట్లకు కావాల్సిన విద్యుచ్ఛక్తి = ట్యూబు లైట్ల సంఖ్య × వోల్టేజి × వాడిన కాలం గంటల్లో
= 5 × 40 × 6
= 1200 WH
ఒక రోజులో ఇమ్మర్షన్ - హీటర్‌కు కావాల్సిన విద్యుచ్ఛక్తి = 1 × 1500 × 1
= 1500 WH
ఒక రోజులో వినియోగించిన మొత్తం విద్యుచ్ఛక్తి = 1200 + 1500
= 2700 WH
నెల మొత్తానికి వినియోగించే విద్యుచ్ఛక్తి (KWHలలో) =
= 81 KWH లేదా 81 యూనిట్లు
20. ఒక ఇంటిలో 100W బల్బులు 7 ఉన్నాయి. ఇవి ప్రతిరోజు సగటున 4 గంటలు వెలిగితే యూనిట్‌కు 3 రూపాయల చొప్పున 30 రోజులకు అయ్యే ఖర్చు ఎంత? (AS 6) 4 మార్కులు
సాధన: 100 W 7 బల్బులు రోజుకు 4 గంటల చొప్పున 30 రోజులు వినియోగించే
= 84 KWH లేదా 84 యూనిట్లు
ఒక యూనిట్ ధర = 3 రూపాయలు
84 యూనిట్ల ధర = 84 × 3
= 252 రూపాయలు
స్వల్ప సమాధాన ప్రశ్నలు
1. విద్యుత్ వలయాన్ని ఏర్పరచడానికి కావాల్సిన ఉపకరణాల పేర్లను తెలపండి. (AS 1) ఒక మార్కు
జ: విద్యుత్ జనకం (బ్యాటరీ), వాహకపు తీగలు, బల్బు, కీ (స్విచ్).
2. లోహాల లాంటి వాహకాల్లో అధిక సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు, ధనాత్మక అయాన్లు నిర్దిష్ట స్థానాల్లో ఉంటాయని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? (AS 1) ఒక మార్కు
జ: డ్రూడ్, లోరెంజ్
3. తెరిచి ఉన్న వలయం లాంటి వాహకంలో ఏదైనా మధ్యచ్ఛేదం వెంబడి కదిలే ఆవేశం ఎంత? (AS 1) ఒక మార్కు
జ: శూన్యం
4.
పై వలయంలో ఎలక్ట్రాన్లు క్రమరహిత చలనంలో ఉన్నాయి. కారణం ఏమిటి? (AS 1) ఒక మార్కు
జ: వలయం బ్యాటరీకి కలిపి లేదు.
5.
పై పటం దేన్ని సూచిస్తుంది? (AS 5) ఒక మార్కు
జ: వలయం నుంచి విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు దాని ద్వారా క్రమ పద్ధతిలో ఎలక్ట్రాన్లు చలించడాన్ని సూచిస్తుంది.
6. మధ్యచ్ఛేద వైశాల్యం A = 10-6 m2 గా ఉండే రాగి తీగ ద్వారా 1 A విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ అపసర వడిని కనుక్కోండి. (AS 1) 2 మార్కులు
(n = 8.5 × 1028 m-3)
జ: A = 10-6 m2
n = 8.5 × 1028 m-3
qe = 1.602 × 10-19 C
I = 1A
Vd = ?
= 0.07 mm/s
7. మూసిన విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ, ఎలక్ట్రాన్‌ల చలన దిశలు ఎలా ఉంటాయి? (AS 1) ఒక మార్కు
జ: విద్యుత్ ప్రవాహ దిశ, ఎలక్ట్రాన్‌ల చలన దిశలు రెండూ వ్యతిరేక దిశల్లో ఉంటాయి.
8.
పై పటంలో Fe దేన్ని సూచిస్తుంది? (AS 5) ఒక మార్కు
జ: విద్యుత్ క్షేత్రం కలగజేసే బలం
9. విద్యుత్ వలయంలో ప్రవహించే విద్యుదావేశాన్ని ఎలా కొలుస్తారు? (AS 1) ఒక మార్కు
జ: అమ్మీటర్ సహయంతో
10. వలయంలో ఏవైనా రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? (AS 1) ఒక మార్కు
జ: ఓల్ట్ మీటర్
11. అమ్మీటర్‌ను వలయంలో ఎలా కలుపుతారు? (AS 1) ఒక మార్కు
జ: శ్రేణిలో
12. ఓల్ట్ మీటర్‌ను వలయంలో ఎలా కలుపుతారు? (AS 1) ఒక మార్కు
జ: సమాంతరంగా
13.
పై పటం నుంచి దేన్ని నిర్ధారిస్తారు? (AS 5) ఒక మార్కు
జ: బ్యాటరీలో విద్యుత్ బలం (Fe), రసాయన బలం (Fc) సమానమైనప్పుడు ఆవేశాల చలనం ఆగిపోతుందని నిర్ధారిస్తాం.
14. ఏకాంక ధనావేశాన్ని రుణ ధృవం నుంచి ధన ధృవానికి కదిలించడానికి రసాయనబలం చేసిన పనిని ఏమంటారు? (AS 1) ఒక మార్కు
జ: విద్యుచ్ఛాలక బలం (emf) లేదా
15. ఒక వాహకానికి సంబంధించిన విలువ స్థిరమని చూపేందుకు నిర్వహించే ప్రయోగానికి కావాల్సిన ఉపకరణాలు ఏవి? (AS 3) ఒక మార్కు
జ: బ్యాటరీలు, అమ్మీటర్, ఓల్ట్‌మీటర్, వాహక తీగలు, ఇనుప తీగ, మాంగనీస్ తీగ, స్విచ్, LED.
16. ఓమ్ నియమాన్ని నిరూపించే ప్రయోగంలో స్థిరంగా ఉండాల్సింది ఏది? (AS 3) ఒక మార్కు
జ: ఉష్ణోగ్రత
17. ఓమ్ నియమాన్ని పాటించే పదార్థాలు ఏవి? ఉదాహరణ ఇవ్వండి. (AS 1) ఒక మార్కు
జ: ఓమీయ పదార్థాలు
ఉదా: నిక్రోమ్, మాంగనీస్, ఇనుము
18. ఓమ్ నియమాన్ని పాటించని పదార్థాలు ఏవి? ఉదాహరణ ఇవ్వండి. (AS 1) ఒక మార్కు
జ: అఓమీయ పదార్థాలు
ఉదా: LED, సిలికాన్, జెర్మేనియం
19. మానవ శరీరం ద్వారా 0.005 ఆంపియర్‌ల విద్యుత్ ప్రసారం జరిగితే ఏమవుతుంది? (AS 1) ఒక మార్కు
జ: నొప్పి కలుగుతుంది.
20. మానవ శరీరం ద్వారా 0.070 ఆంపియర్‌ల విద్యుత్ ప్రసారం జరిగితే ఏం జరుగుతుంది? (AS 1) ఒక మార్కు
జ: గుండె పని తీరుపై ప్రభావం చూపుతుంది.
21. విద్యుత్ పొటెన్షియల్ భేదం, విద్యుత్ ప్రవాహం, శరీర నిరోధాల ఫలిత ప్రభావంగా చెప్పేది? (AS 1) ఒక మార్కు
జ: విద్యుత్ ఘాతం
22. ఇంటిలోకి వచ్చే రెండు కరెంట్ తీగల మధ్య పొటెన్షియల్ భేదం ఎంత ఉంటుంది? (AS 6) ఒక మార్కు
జ: 230 - 240 V
23. మల్టీమీటర్ డిస్‌ప్లేపై ఒకటి లేదా 0 L అని కనిపిస్తే అది దేన్ని సూచిస్తుంది? (AS 1) ఒక మార్కు
జ: ఓవర్‌లోడ్
24. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వాహక నిరోధం ఏమవుతుంది? (AS 2) ఒక మార్కు
జ: పెరుగుతుంది
25. వాహకం పొడవు పెరిగితే, దాని నిరోధం ఏమవుతుంది? (AS 2) ఒక మార్కు
జ: పెరుగుతుంది
26. వాహక మధ్యచ్ఛేద వైశాల్యం పెరిగితే వాహక నిరోధం ఏమవుతుంది? (AS 2) ఒక మార్కు
జ: తగ్గుతుంది
27. విశిష్ట నిరోధానికి SI పద్ధతిలో ప్రమాణం ఏమిటి? (AS1) ఒక మార్కు
జ: Ω - m (ఓమ్ - మీటరు)
28. విశిష్ట నిరోధ విలోమాన్ని ఏమంటారు? (AS 1) ఒక మార్కు
జ: వాహకత్వం
29. నిజ జీవితంలో తక్కువ విశిష్ట నిరోధం ఉండే లోహాలను ఎలా ఉపయోగిస్తారు? (AS 6) ఒక మార్కు
జ: మంచి వాహకాలుగా
ఉదా: రాగితీగ
30. విద్యుత్ బల్బులో వాడే ఫిలమెంట్‌ను ఏ లోహంతో తయారు చేస్తారు? (AS 6) ఒక మార్కు
జ: టంగ్‌స్టన్
31. ఇస్త్రీపెట్టె, రొట్టెలను వేడిచేసే పరికరాల్లో తాపన పరికరాలుగా ఏ మిశ్రమ లోహాలను ఉపయోగిస్తారు? (AS 6)ఒక మార్కు
జ:: నిక్రోమ్, మాంగనీస్
32. నిక్రోమ్‌లో ఉన్న లోహాలు ఏవి? (AS 1) ఒక మార్కు
జ: నికెల్, క్రోమియం, ఇనుము
33. మాంగనీస్‌లో ఉన్న లోహాలు ఏవి? (AS 1) ఒక మార్కు
జ: రాగి, మాంగనీస్, నికెల్
34. డయోడ్, ట్రాన్సిస్టర్, ఇంటిగ్రేటెడ్ చిప్ (IC)ల తయారీలో ఏ పదార్థాలను ఉపయోగిస్తారు? (AS 6) ఒక మార్కు
జ:అర్ధ వాహకాలు
35. ఇంటిగ్రేటెడ్ చిప్ (IC)లను దేనిలో ఉపయోగిస్తారు? (AS 6) ఒక మార్కు
జ: కంప్యూటర్, టీవీ, సెల్‌ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగిస్తారు.
36. నిరోధాల శ్రేణి సంధానం వల్ల వలయంలోని ఫలిత నిరోధం విలువ ఏమవుతుంది? (AS 1) ఒక మార్కు
జ: పెరుగుతుంది
37. నిరోధాల సమాంతర సంధానం వల్ల వలయంలోని ఫలిత నిరోధం విలువ ఏమవుతుంది? (AS 1) ఒక మార్కు
జ: తగ్గుతుంది
38.
ఇచ్చిన జంక్షన్‌లో 'x' విలువను కనుక్కోండి. (AS 1) ఒక మార్కు
జ: 1.5 + 7 = 2.5 + 1.5 + x
8.5 = 4 + x
x = 8.5 - 4
x = 4.5 A
39.
పై పటంలో AEDCBA లూప్‌లో ఫలిత పొటెన్షియల్ భేదాన్ని లూప్ నియమం ఉపయోగించి కనుక్కోండి? (AS 1) ఒక మార్కు
జ: వలయంలో ఫలిత పొటెన్షియల్ భేదం +V2 - IR3 + V1 - IR2 - IR1 = 0
40. ఇండ్లలో ఉపయోగించే విద్యుత్ వినియోగాన్ని ఏ ప్రమాణాల్లో తెలియజేస్తారు? (AS 6) ఒక మార్కు
జ: యూనిట్ లేదా కిలోవాట్ అవర్ (1 kWh)
41. ఇండ్లలో ఓవర్‌లోడ్ ఎప్పుడు ఏర్పడుతుంది? (AS 6) ఒక మార్కు
జ: విద్యుత్ తీగల నుంచి 20 A కంటే ఎక్కువ విద్యుత్ ప్రవహించినప్పుడు
42. మందంగా ఉన్న తీగను ప్యూజ్‌వైరుగా వాడితే ఏం జరుగుతుందో ఊహించండి. (AS 2) 2 మార్కులు
జ: తీగ మధ్యచ్ఛేద వైశాల్యం పెరుగుతుంది. తీగ నిరోధం తగ్గి దాని ద్వారా విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. విద్యుత్ ఉపకరణాలు ఓవర్‌లోడ్ కారణంగా పాడవుతాయి.
43. ఇనుప తీగను ఫ్యూజ్‌వైరుగా ఉపయోగించవచ్చా? ఊహించండి. (AS 2) ఒక మార్కు
జ: అధిక ద్రవీభవన స్థానం వల్ల ఇనుప తీగను ఫ్యూజ్‌వైరుగా ఉపయోగించలేం.
44. ఇంటిలోని విద్యుత్ ఉపకరణాలను శ్రేణి సంధానం చేస్తే ఏం జరుగుతుంది? ఊహించండి. (AS 2) 2 మార్కులు
జ: i) ఒక ఉపకరణం పనిచేయకపోతే మిగతావి కూడా పనిచేయవు.
ii) ఒక స్విచ్ పెట్టడానికే అవకాశం ఉంటుంది.
iii) అన్నింటినీ ఏకకాలంలోనే వాడుకోవాలి.