• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విద్యుత్ ప్రవాహం

1. రెండు మేఘాల మధ్య లేదా మేఘం, భూమి మధ్య విద్యుత్ ఉత్సర్గాన్ని మెరుపులు తెలియజేస్తాయి. మేఘాల నుంచి భూమికి గాలి ద్వారా జరిగే విద్యుత్ ఉత్సర్గమే మనకు వాతావరణంలో స్పార్క్ లేదా మెరుపులా కనిపిస్తుంది. వాతావరణంలో ఆవేశాల చలనాన్ని తెలియజేయడానికి మెరుపులు మంచి ఉదాహరణ.


2. బ్యాటరీ నుంచి బల్బుకు శక్తిని సరఫరా చేయగలిగే పదార్థాన్ని వాహకం అంటారు. బ్యాటరీ నుంచి బల్బ్‌కు శక్తిని సరఫరా చేయలేని పదార్థాన్ని బంధకం లేదా అవాహకం అంటారు.
ఉదా: రాగి తీగ వాహకం, నైలాన్‌దారం అవాహకం.


3. డ్రూడ్, లోరెంజ్ శాస్త్రవేత్తలు 19వ శతాబ్దంలో, లోహాల్లో ఎక్కువ సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు, ధనాత్మక అయాన్‌లు ఉంటాయని ప్రతిపాదించారు. ఈ ధనాత్మక అయాన్‌ల అమరికను లాటిస్ అంటారు.


4. ప్రమాణ కాలంలో ఏదైనా వాహక మధ్యచ్ఛేదం ద్వారా ప్రవహించే ఆవేశాన్ని విద్యుత్ ప్రవాహం అంటారు.

5. విద్యుత్ ప్రవాహానికి SI ప్రమాణం ఆంపియర్. దీన్ని 'A' తో సూచిస్తారు. s


6. ఒక కులూంబ్ ఆవేశం ఒక సెకను కాలంలో ఏదైనా వాహక మధ్యచ్ఛేదాన్ని దాటితే ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహించింది అంటారు.


7. వాహకంలో ఎలక్ట్రాన్‌లు స్థిర సరాసరి వడితో చలిస్తాయి. ఈ వడిని అపసర వడి (డ్రిఫ్ట్‌వడి) లేదా అపసర వేగం అంటారు.



n - ప్రమాణ ఘనపరిమాణంలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య (ఎలక్ట్రాన్ సాంద్రత)
q - ఎలక్ట్రాన్ ఆవేశం
A - వాహకం మధ్యచ్ఛేద వైశాల్యం
I - విద్యుత్ ప్రవాహం

8. వాహకం ద్వారా విద్యుత్ ప్రవహించడానికి దాని ఒక కొన, రెండో కొన కంటే హెచ్చు పొటెన్షియల్ వద్ద ఉండాలి.


9. ఏకైక ధనాత్మక ఆవేశాన్ని అనంతం దూరం నుంచి అంతరాళంలో ఒక బిందువు వద్దకు త్వరణం లేకుండా, విద్యుక్షేత్రానికి వ్యతిరేకంగా తీసుకురావడానికి వినియోగించిన పని, ఆ బిందువు వద్ద పొటెన్షియల్‌కు సమానం.


10.


ప్రమాణ ధనావేశాన్ని A నుంచి B కు l దూరం కదిలించడానికి విద్యుత్ బలం చేసిన పనిని A, Bల మధ్య పొటెన్షియల్ భేదం అంటారు. పొటెన్షియల్ భేదాన్ని 'V' తో సూచిస్తారు.

              


11. పొటెన్షియల్ భేదానికి SI ప్రమాణం వోల్ట్. దీన్ని 'V' తో సూచిస్తారు.
                    


 

12. ఒక కులూంబ్ ధనావేశాన్ని ఒక బిందువు నుంచి మరో బిందువుకు చేర్చడానికి ఒక జౌల్ పని వినియోగిస్తే ఆ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం ఒక వోల్టు ఉందని అంటారు.


13. విద్యుచ్ఛాలక బలం: ఏకాంక ధనావేశాన్ని రుణధృవం నుంచి ధన ధృవానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పనిని విద్యుచ్ఛాలక బలం (emf) అంటారు.

d = ధ్రువాల మధ్య దూరం


14. విద్యుత్ ప్రవాహాన్ని అమ్మీటరుతో కొలుస్తారు.


15. విద్యుత్ పరికరం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం లేదా  emfను కొలవడానికి వోల్ట్‌మీటర్‌ను ఉపయోగిస్తారు. వలయంలో దీన్ని విద్యుత్ పరికరం రెండు చివరలకు సమాంతరంగా కలుపుతారు.


16. ఓమ్ నియమం: స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
V∝ I (ఉష్ణోగ్రత స్థిరం)


17. ఎలక్ట్రాన్‌ల చలనాన్ని వ్యతిరేకించే పదార్థ లక్షణాన్ని వాహక విద్యుత్ నిరోధం అంటారు.


18. నిరోధానికి SI ప్రమాణం 'ఓమ్'. ఓమ్‌ను Ω గుర్తుతో సూచిస్తారు.


19. ఓమ్ నియమాన్ని పాటించే పదార్థాలను ఓమీయ పదార్థాలు అంటారు.
ఉదా: లోహాలు


20. ఓమ్ నియమాన్ని పాటించని పదార్థాలను అఓమీయ పదార్థాలు అంటారు.
ఉదా: LED


21. i) మానవ శరీరం ఒక నిరోధం.
ii) మన శరీర నిరోధం విలువ సాధారణంగా 100
 Ω (శరీరం ఉప్పు నీటితో తడిసి ఉన్నప్పుడు) నుంచి 5,00,000 Ω (చర్మం బాగా పొడిగా ఉంటే)కు మధ్యస్థంగా ఉంటుంది.
iii) 240 V తీగను తాకినప్పుడు, మన శరీరం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం
0.00024 A. ఈ పరిమాణంలో విద్యుత్ ప్రవాహం మన శరీరంలోకి ప్రవహిస్తే శరీరంలోని వివిధ అవయవాలు నిర్వహించే పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ఇలా ఆటంకం ఏర్పడటాన్నే విద్యుత్‌ఘాతం అంటారు.


iv) మానవ శరీరంపై విద్యుత్ ప్రవాహ ప్రభావాలు:

v) విద్యుత్ ఘాతాన్ని విద్యుత్ పొటెన్షియల్ భేదం అంటారు. దీన్ని విద్యుత్ ప్రవాహం, శరీర నిరోధాల ఫలిత ప్రభావంగా చెప్పవచ్చు.


22. మల్టీమీటర్ ఒక ఎలక్ట్రానిక్ పరికరం. దీని ద్వారా నిరోధం, వోల్టేజ్ లాంటి వివిధ విలువలను కొలవవచ్చు.

వాహక నిరోధం ఆధారపడే అంశాలు:
23. ఉష్ణోగ్రత పెరిగితే వాహక నిరోధం పెరుగుతుంది.


24. వాహక నిరోధం వాహక పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది.


25. వాహక నిరోధం దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
          


26. వాహక నిరోధం, వాహక మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది.
                 
              
ఇక్కడ 'ρ' అనేది వాహక పదార్థం యొక్క నిరోధకత లేదా విశిష్ట నిరోధం.

27. ప్రమాణ పొడవు, ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న వాహకం నిరోధాన్ని ఆ వాహక పదార్థపు విశిష్ట నిరోధం అంటారు.
           


28. విశిష్ట నిరోధం ప్రమాణం ఓమ్ -  మీటర్ (Ω-m).


29. ఒక పదార్థం విశిష్ట నిరోధం అనేది ఉష్ణోగ్రత, పదార్థ స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.


30. విశిష్ట నిరోధం విలోమాన్ని వాహకత్వం అంటారు.
                    


31. వాహకత్వం ప్రమాణం మో/మీటరు (mho/m).


32. విద్యుత్ బల్బులో వాడే ఫిలమెంట్‌ను టంగ్‌స్టన్‌తో తయారు చేస్తారు. దీనికి కారణం టంగ్‌స్టన్ విశిష్ట నిరోధం, ద్రవీభవన స్థానం విలువలు (3422 ºC) చాలా ఎక్కువ.


33. విద్యుత్ బంధకాల విశిష్ట నిరోధం విలువలు అత్యధికంగా 1014 నుంచి 1016 Ω-m వరకు ఉంటాయి.

34. నిక్రోమ్ (నికెల్, క్రోమియం, ఇనుము), మాంగనీస్ (86% రాగి, 12% మాంగనీస్, 2% నికెల్) లాంటి మిశ్రమలోహాల విశిష్ట నిరోధం విలువలు, లోహాల విశిష్ట నిరోధానికి 30 - 100 రెట్లు ఉంటాయి. కాబట్టి వాటిని ఇస్త్రీ పెట్టె, రొట్టెలను వేడిచేసే పరికరం లాంటి విద్యుత్ ఉపకరణాల్లో ఉపయోగిస్తారు.


35. డయోడ్, ట్రాన్సిస్టర్, ఇంటి గ్రేటెడ్ చిప్ (Ic) లను తయారుచేయడానికి అర్థవాహకాల (Si, Ge) ను వాడతారు.


36. బ్యాటరీ, వాహక తీగల్లో ఎలక్ట్రాన్‌లు ప్రవహించడానికి అనుకూలంగా ఏర్పరిచిన సంవృత మార్గాన్ని వలయం అంటారు.


37. శ్రేణిలో కలిపిన నిరోధాలన్నింటి ద్వారా ఒకే విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది.


38. శ్రేణి సంధానం చేసిన నిరోధాల చివర ఉన్న ఫలిత పొటెన్షియల్ భేదం వాటి విడి పొటెన్షియల్ భేదాల మొత్తానికి సమానం.
V = V1 + V2 + V3 .....


39. నిరోధాలను శ్రేణి సంధానం చేసినప్పుడు వాటి ఫలిత నిరోధం వాటి విడి నిరోధాల మొత్తానికి సమానం.
Req= R1 + R2 + R3 .......


40. నిరోధాల సమాంతర సంధానం ద్వారా ఉండే మొత్తం విద్యుత్ ప్రవాహం దానిలోని విడి నిరోధాల ద్వారా వెళ్లే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం
I = I1 + I2 + I3 .........


41. నిరోధాలను సమాంతరంగా సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం యొక్క విలోమం విడి నిరోధాల విలోమాల మొత్తానికి సమానం.

   


42. నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు వలయంలోని ఫలిత నిరోధం విలువ పెరుగుతుంది.


43. నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు వలయంలోని ఫలిత నిరోధం విలువ తగ్గుతుంది.


కిర్‌ఛాఫ్ నియమాలు
44. జంక్షన్ నియమం:
వలయంలో విద్యుత్ ప్రవాహం విభజితమయ్యే ఏ జంక్షన్ వద్దనైనా, ఆ జంక్షన్‌కు చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం,ఆ జంక్షన్‌ను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం.

 

45. లూప్ నియమం: ఒక మూసిన వలయంలో పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాల్లో పెరుగుదల, తగ్గుదల బీజం మొత్తం శూన్యం.


46. విద్యుత్ పని జరిగే రేటును విద్యుత్ సామర్థ్యం అంటారు.
                
47. విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణం వాట్ (జౌల్/సెకను)


48. విద్యుత్ సామర్థ్యం = పొటెన్షియల్ భేదం × విద్యుత్ ప్రవాహం
                               

49. వినియోగించబడిన విద్యుత్ శక్తి (W) = సామర్థ్యం × కాలం
                 
50. ఒక విద్యుత్ సాధనం విద్యుత్ శక్తిని వినియోగించుకునే రేటును దాని వాటేజ్ అంటారు.
వాటేజ్ P = VI
              = I2R
              
51. వినియోగించబడిన విద్యుత్ శక్తికి ప్రమాణం కిలో - వాట్ - గంట.


52. 1 KW = 1000 వాట్లు


53. 1 MW = 106 వాట్లు


54. ఒక గంట కాలంలో ఒక వాట్ విద్యుత్ శక్తిని వినియోగించుకుంటే ఆ విద్యుత్ శక్తి వినియోగాన్ని వాట్ - గంట అంటారు.


55. 1 KWH = 3.6 × 10J


56. మన ఇంటిలో అన్ని విద్యుత్ ఉపకరణాలను సమాంతరంగా కలుపుతారు. ప్రతీ ఉపకరణం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం 240 V ఉంటుంది.

57. 240 V వద్ద మెయిన్ నుంచి పొందే గరిష్ఠ విద్యుత్ 5 - 20 A


58. విద్యుత్ వాడకం విలువ 20 A కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇంటిలోని వలయం బాగా వేడెక్కి మంటలు ఏర్పడే అవకాశం ఉంది. దీన్నే ఓవర్‌లోడ్ అంటారు.


59. ఓవర్ లోడింగ్ వల్ల కలిగే విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి ఎలక్ట్రిక్ ఫ్యూజ్‌ను ఉపయోగిస్తారు.


60. ఫ్యూజ్‌లో తక్కువ ద్రవీభవన స్థానం ఉన్న తీగ ఉంటుంది.

విద్యుత్ ప్రవాహం

భావనల అమరిక చిత్రం

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం