• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విద్యుత్ ప్రవాహం

 1. అర్ధవాహకాలు ఓమ్ నియమాన్ని పాటించవని ప్రయోగపూర్వకంగా నిరూపించడాని కావాల్సిన పరికరాల జాబితాను రాసి ప్రయోగ నిర్వహణ విధానాన్ని పట సహాయంతో వివరించండి.   (AS 3 ) 4 మార్కులు


2. వలయంలో ఫలిత విద్యుత్ ప్రవాహం విడివిడి బల్బ్‌ల ద్వారా ప్రవహించే విద్యుత్‌ల మొత్తానికి సమానమని ప్రయోగపూర్వకంగా ఎలా నిరూపిస్తారు?   (AS 3 ) 4 మార్కులు


3. బల్బ్‌ల విడివిడి పొటెన్షియల్ భేదాల మొత్తం, వాటి శ్రేణి సంధానం వల్ల ఏర్పడిన రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదానికి సమానం అని ప్రయోగపూర్వకంగా ఎలా నిరూపిస్తారు?  (AS 3) 4 మార్కులు



పై పటంలో చూపిన విధంగా ఒక వలయంలో A వద్ద ప్రవేశించే విద్యుత్ I.
i) C, D బిందువువల మధ్య పొటెన్షియల్ భేదం ఎంత?
ii) A, B బిందువుల మధ్య వలయ ఫలిత నిరోధం ఎంత?
iii) C, D ద్వారా ప్రవహించే విద్యుత్ ఎంత?  (AS 4) 4 మార్కులు

5. పక్క పటంలోని వలయాన్ని గమనించండి.
R1 = R2 = R3 = 200 Ω
వోల్ట్‌మీటరు రీడింగ్ = 100 V
వోల్ట్‌మీటరు నిరోధం = 100 Ω, అయితే
బ్యాటరీ విద్యుచ్ఛాలక బలం E ను కనుక్కోండి. (AS 4) 4 మార్కులు



పై పటంలో చూపిన విధంగా A, B, C ల వద్ద పొటెన్షియల్ భేదాల విలువలు
70 V, O V, 10 V గా ఉన్నాయి.
i) D వద్ద పొటెన్షియల్ ఎంత?
ii) AD, DB, DC లలో ప్రవహించే విద్యుత్ ప్రవాహాల నిష్పత్తిని కనుక్కోండి.   (AS 4) 4 మార్కులు


7. దోషజ్ఞ ఇంటిలో నాలుగు ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్నాయి. ప్రతి ట్యూబ్‌లైట్ 40 W, ప్రతి ఫ్యాన్ 80 W, టీవీ 100 W విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. ఒక్కో ట్యూబ్‌లైట్‌ను 5 గంటలు, రెండు ఫ్యాన్లను 12 గంటలు, టీవీని 6 గంటలు చొప్పున వినియోగిస్తున్నారు. ఒక యూనిట్‌కు 2 రూపాయల చొప్పున విద్యుత్ ఛార్జి వేస్తే ఒక నెలకు (30 రోజులు) చెల్లించాల్సిన సొమ్ము ఎంత?   (AS 6) 4 మార్కులు


8. ఒక 2 V బ్యాటరీకి 10 Ω, 20 Ω ల నిరోధాలను సమాంతరంగా కలిపారు. వలయాన్ని గీయండి, వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం, ప్రతి నిరోధం ప్రవహించే విద్యుత్ ప్రవాహాలను గణించండి. (AS 1) 4 మార్కులు


9. విద్యుత్ ప్రవాహం, పొటెన్షియల్ బేధాల మధ్య తేడాలను రాయండి.  (AS 1) 2 మార్కులు


10. వాహక నిరోధం, విశిష్ట నిరోధాల మధ్య భేదాలను తెలపండి. (AS 1) 4 మార్కులు


11. నిక్రోమ్, మాంగనీస్ లాంటి పదార్థాలను ఇస్త్రీ పెట్టెలు, టోస్టర్‌లలో ఎందుకు వినియోగిస్తారు? (AS 1) (AS 6) 2 మార్కులు


12. ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలను శ్రేణిలో కాకుండా సమాంతరంగా కలుపుతారు కారణమేమిటి? (AS 1) (AS 6) 2 మార్కులు


13. బల్బులోని ఫిలమెంట్ తయారికీ వాడే లోహం ఏది? ఎందువల్ల ఆ లోహాన్ని ఉపయోగిస్తారు?  (AS 6) 2 మార్కులు


14. 'అధిక వోల్టేజీ ప్రమాదం అనే బోర్డులను తరచుగా చూస్తుంటాం కాని 'అధిక విద్యుత్ ప్రమాదం అని ఎందుకు ఉంచడం లేదో ఊహించి సమాధానం రాయండి.  (AS 2) 2 మార్కులు


15. కిర్‌చాప్ నియమాలు అని వేటిని అంటారు? (AS 1) ఒకమార్కు


16. 1 యూనిట్ = 1KWH అంటాం. దీని విలువను జౌళ్లలో సూచించండి.   (AS 1) ఒక మార్కు


17. ఫ్యూజ్ సంకేతాన్ని గీయండి.   (AS 5) ఒకమార్కు


18. కారు హెడ్‌లైట్‌లను సమాంతర సంధానంలో కలుపుతారు. కారణమేమిటి? (AS 1) ఒక మార్కు


19. 20 Ω ల నిరోధం చివరల 4.5 V పొటెన్షియల్ భేదం కలగజేస్తే దానిలోని విద్యుత్ ప్రవాహమెంత? (AS 1) ఒక మార్కు


20. ప్రవాహ విద్యుత్తును కనుక్కుని ఉండకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించండి.  (AS 2) 2 మార్కులు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం