బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. అయస్కాంత అభివాహ సాంద్రతకు S.I. ప్రమాణం
A) వెబర్ B) వెబర్/మీ C) టెస్లా D) వెబర్/మీ, టెస్లా
2. అయస్కాంత అభివాహానికి S.I. ప్రమాణాలు
A) వెబర్/మీ2 B) వెబర్/సెం.మీ2. C) టెస్లా D) వెబర్
3. టీవీ రిమోట్ కంట్రోలర్పై పని చేసే బలం
A) అయస్కాంత B) విద్యుత్ C) క్షేత్ర D) ఏదీకాదు
4. సోలినాయిడ్ అనేది ....... ఆకారపు తీగచుట్ట.
A) వృత్తాకార B) దీర్ఘవృత్తాకార C) వలయాకార D) ఏదీకాదు
5. సోలినాయిడ్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తే అది కిందివాటిలో ఏ విధంగా పనిచేస్తుంది?
A) దండాయస్కాంతం B) గుర్రపు నాడా C) ట్రాన్స్ఫార్మర్ C) ఏదీకాదు
6. సోలినాయిడ్ బయట అయస్కాంత బలరేఖల దిశ
A) ఉత్తరం నుంచి దక్షిణం B) దక్షిణం నుంచి ఉత్తరం
C) తూర్పు నుంచి పడమర D) పడమర నుంచి తూర్పు
7. సోలినాయిడ్ లోపలివైపు అయస్కాంత బలరేఖల దిశ
A) ఉత్తరం నుంచి దక్షిణం B) దక్షిణం నుంచి ఉత్తరం
C) తూర్పు నుంచి పడమర D) పడమర నుంచి తూర్పు
8. అయస్కాంత బలరేఖలు
A) సంవృతాలు B) వివృతాలు C) వృత్తాలు D) దీర్ఘవృత్తాలు
9. సమరీతి అయస్కాంత క్షేత్రంలో స్థిరంగా ఉండే రాశి
A) అయస్కాంత ప్రేరణ B) అయస్కాంత అభివాహం C) క్షేత్ర దిశ D) అన్నీ
10. ఒక వాహకంలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను ఏ నిబంధన నుంచి తెలుసుకోవచ్చు?
A) ఫ్లెమింగ్ ఎడమ చేయి B) ఫ్లెమింగ్ కుడి చేయి
C) ఆంపియర్ ఎడమ చేయి D) ఆంపియర్ కుడి చేయి
11. కిందివాటిలో విద్యుత్ అయస్కాంత ప్రేరణతో పనిచేసే పరికరం
A) మోటారు B) టెలిఫోన్ రిసీవర్ C) డైనమో D) అన్నీ
12. అయస్కాంత అభివాహ సాంద్రతకు సూత్రం
13. అయస్కాంత అభివాహ సాంద్రతకు C.G.S. ప్రమాణం
A) వెబర్ B) గాస్ C) టెస్లా D) ఏదీకాదు
14. తీగచుట్టలో ప్రేరిత విద్యుచ్ఛాలక బలాన్ని ఏర్పరిచేది
A) క్షేత్ర ప్రేరణలో మార్పు B) తీగచుట్ట వైశాల్యంలో మార్పు
C) అయస్కాంతం, తీగచుట్టల సాపేక్ష చలనం D) అన్నీ
15. విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై పనిచేసే పరికరం
A) ఇండక్షన్ స్టవ్ B) టేప్ రికార్డర్ C) ఏటీఎం కార్డు D) అన్నీ
16. కిందివాటిలో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది
A) మోటారు B) ఏసీ డైనమో C) డీసీ జనరేటర్ D) ఏసీ డైనమో, డీసీ జనరేటర్
17. మోటారు ........ శక్తిని ........ గా మారుస్తుంది.
A) యాంత్రిక, విద్యుత్ B) విద్యుత్, యాంత్రిక C) విద్యుత్, కాంతి D) అన్నీ
18. ఏసీ జనరేటర్లో విద్యుత్ ప్రవాహ దిశను మార్చేవి
A) స్లిప్ రింగులు B) కార్బన్ బ్రష్లు C) బాహ్య అయస్కాంతం D) అన్నీ
19. మోటారు వేగం ఆధారపడే అంశం
A) భ్రమణాల సంఖ్య B) విద్యుత్ ప్రవాహం C) ఆర్మేచర్ వైశాల్యం D) అన్నీ
20. కిందివాటిలో ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసేది
A) విద్యుత్ మోటార్ B) విద్యుత్ జనరేటర్ C) కెపాసిటర్ D) ఏదీకాదు
21. క్షేత్రానికి లంబంగా ప్రమాణ వైశాల్యం ద్వారా వెళ్లే బలరేఖల సంఖ్య
A) అయస్కాంత క్షేత్రం B) ప్రేరిత విద్యుత్ ప్రవాహం
C) అయస్కాంత అభివాహం D) అయస్కాంత బలం
22. 1 టెస్లా =
A) 10-4 గాస్ B) 106 గాస్ C) 104 గాస్ D) 10-6 గాస్
23. జతపరచండి.
1) విద్యుత్ జనరేటర్ (AC) ఎ) విద్యుదయస్కాంత ప్రేరణ
2) సోలినాయిడ్ బి) రెండు స్లిప్ రింగులు
3) విద్యుత్ మోటార్ సి) రెండు అర్ధ వలయాలు
4) విద్యుత్ జనరేటర్ (DC) డి) మెత్తటి ఇనుప కోర్
A) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ B) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
C) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి D) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
24. విద్యుత్ మోటారులో
A) విద్యుత్ శక్తి కాంతి శక్తిగా మారుతుంది. B) రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది.
C) విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారుతుంది. D) విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది.
25. కిందివాటిలో విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఆధారంగా పనిచేసే పరికరం ఏది?
A) ఓల్ట్ మీటరు B) అమ్మీటరు C) గాల్వనోమీటరు D) ట్రాన్స్ఫార్మర్
26. సోలినాయిడ్ లోపల అయస్కాంత బలరేఖలు
A) వృత్తాకారంగా ఉంటూ ఖండించుకుంటాయి.
B) చివరల వృత్తాకారంగా ఉంటాయి.
C) అక్షం వెంబడి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి.
D) వృత్తాకారం కానీ ఒకదానికొకటి ఖండించుకోవు.
27. విద్యుత్ ప్రవహిస్తున్న సోలినాయిడ్లో మెత్తని ఇనుమును ప్రవేశపెట్టారు. సోలినాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రం
A) సున్నా అవుతుంది B) మారదు C) తగ్గుతుంది D) పెరుగుతుంది
28. ప్రమాణ పొడవులో సోలినాయిడ్లో ఉండే తీగచుట్ల సంఖ్యను రెట్టింపు చేస్తే, ఆ సోలినాయిడ్ స్వయం ప్రేరకత్వం
A) సగం అవుతుంది B) నాలుగు రెట్లు అవుతుంది C) స్థిరంగా ఉంటుంది D) రెట్టింపు అవుతుంది
29. విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన రేఖీయ సోలినాయిడ్లో అయస్కాంత క్షేత్రం
A) అన్ని బిందువుల వద్ద సమానంగా ఉంటుంది. B) దాని చివరకు వెళుతున్న కొద్దీ పెరుగుతుంది.
C) దాని చివరకు వెళుతున్న కొద్దీ తగ్గుతుంది. D) సున్నా
30. ఏసీ, డీసీ జనరేటర్ల మధ్య ముఖ్య భేదం
A) ఏసీ జనరేటర్ అధిక ఓల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది.
B) డీసీ జనరేటర్ అధిక ఓల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది.
C) ఏసీ జనరేటర్లో విద్యుదయస్కాంతం, డీసీ జనరేటర్లో శాశ్వత అయస్కాంతం ఉంటాయి.
D) ఏసీ జనరేటర్లో స్లిప్ రింగులు, డీసీ జనరేటర్లో కమ్యూటేటర్ ఉంటాయి.
31. వాణిజ్య విద్యుత్ మోటారులో ఉపయోగించనిది
A) మెత్తని ఇనుప కోర్ చుట్టూ చుట్టిన తీగచుట్ట
B) ఆర్మేచర్ను తిప్పడానికి ఉపయోగించే విద్యుదయస్కాంతం
C) విద్యుత్ ప్రవహించే తీగచుట్టలో అధిక సంఖ్యలో ఉండే వాహక తీగచుట్లు
D) ఆర్మేచర్ను తిప్పడానికి ఉపయోగించే శాశ్వత అయస్కాంతం
32. కిందివాటిలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది
A) జనరేటర్ B) మోటారు C) బ్యాటరీ D) సోలినాయిడ్
33. కిందివాటిలో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది
A) జనరేటర్ B) మోటారు C) బ్యాటరీ D) సోలినాయిడ్
34. విద్యుత్ ప్రవాహ తీగకు రెండువైపులా గుర్రపునాడ అయస్కాంత రెండు ధ్రువాలను ఉంచి, ఆ తీగపై ప్రయోగించిన బలదిశను పరిశీలించిన ప్రయోగంలో మీరు ఏం గమనించారు?
A) విద్యుత్ తీగ అయస్కాంత ఉత్తర ధ్రువం వైపు కదిలింది.
B) విద్యుత్ తీగ అయస్కాంత దక్షిణ ధ్రువం వైపు కదిలింది.
C) విద్యుత్ తీగలో కదలిక లేదు.
D) కుడిచేతి నిబంధనలో తెలిపిన దిశలో తీగ కదిలింది.
35. 'తీగచుట్టలో అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఉంటుంది ఇది ఏ నియమాన్ని సూచిస్తుంది?
A) ఫారడే నియమం B) ఫ్లెమింగ్ నియమం C) లెంజ్ నియమం D) టెస్లా నియమం
36. అయస్కాంత బలరేఖలు
A) రేఖీయమైనవి B) యదార్థమైనవి C) ఊహాజనితమైనవి D) ప్రేరిత రేఖలు
37. విద్యుదయస్కాంత ప్రేరణ దృగ్విషయాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త
A) మాక్స్వెల్ B) ప్లాంక్ C) ఫారడే D) వెబర్
జవాబులు: 1-D; 2-D; 3-C; 4-C; 5-A; 6-A; 7-B; 8-A; 9-D; 10-B; 11-C; 12-C; 13-B; 14-D; 15-D; 16-D; 17-B; 18-A; 19-D; 20-B; 21-C; 22-C; 23-D; 24-D; 25-D; 26-C; 27-D; 28-B; 29-A; 30-D; 31-D; 32-B; 33-A; 34-D; 35-C; 36-C; 37-C