• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విద్యుదయస్కాంతత్వం

1. ఏ పరికరం యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది.? ఆ పరికరం పటం గీయండి. అది పనిచేసే విధానాన్ని వివరించండి.  (AS 1) 4 మార్కులు


2. ఏ పరికరం విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది? ఆ పరికరం పటం గీయండి. ఆ పరికరాన్ని నిత్య జీవితంలో ఎక్కడెక్కడ వినియోగిస్తున్నాం?    (AS 1) 4 మార్కులు


3. విద్యుత్ ప్రవాహం గల తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచితే ఆ తీగపై ప్రయోగించే బలాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా సరిచూస్తారు?   (AS 3) 4 మార్కులు


4. ఫారడే నియమాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఏ ప్రయోగాన్ని సూచిస్తారు? దానికి ఏయే పరికరాలు కావాలి? ప్రయోగ ఫలితాలు సరిగ్గా పొందడానికి సూచనలివ్వండి. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను కూడా తెలపండి. (AS 3) 4 మార్కులు


5. A.C., D.C. మధ్య భేదాలను తెలపండి.   (AS 1) 2 మార్కులు


6. విద్యుత్ మోటార్, జనరేటర్ మధ్య భేదాలను తెలపండి.  (AS 1) 2 మార్కులు


7. ఏటీఎం కార్డులో విద్యుదయస్కాంత ప్రేరణను ఎలా వినియోగించుకుంటున్నాం?  (AS 6) 2 మార్కులు


8. సెక్యూరిటీ చెకింగ్ కోసం వాడే మెటల్ డిటెక్టర్ విద్యుదయస్కాంత ప్రేరణ ద్వారా పనిచేసే విధానాన్ని వివరించండి.  (AS 6) 2 మార్కులు


9. DC జనరేటర్ పటం గీసి, భాగాలను గుర్తించండి.  (AS 5) 2 మార్కులు


10. సోలినాయిడ్ వల్ల ఏర్పడే బలరేఖలను చూపే పటం గీయండి.  (AS 5) 2 మార్కులు


11. అయిర్‌స్టెడ్ ప్రయోగాన్ని నిరూపించడానికి కావాల్సిన పరికరాల జాబితా రాయండి.  (AS 3) ఒక మార్కు


12. 'తీగచుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మారుస్తూ ఉంటే ఆ తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఉత్పన్నమవుతుంది అని తెలిపే నియమం ఏమిటి? (AS 1) ఒక మార్కు


13. తీగచుట్టలో అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఉంటుందని తెలిపే నియమం ఏది?  (AS 1) ఒక మార్కు


14. అయస్కాంత క్షేత్ర బలాన్ని, క్షేత్ర దిశను ఎలా కనుక్కుంటారు?  (AS 1) ఒక మార్కు


15. అయస్కాంత బలరేఖలు సంవృత వక్రాలా లేదా వివృత వక్రాలా?  (AS 1) ఒక మార్కు


16. అయస్కాంత బలరేఖలు సంవృత వలయాల్లా ఉంటాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాలంటే ఏయే పరికరాలు కావాలి?  (AS 3) ఒక మార్కు
 

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం