• facebook
  • twitter
  • whatsapp
  • telegram

లోహసంగ్రహణ శాస్త్రం

1. ప్రకృతిలో లభించే ధాతువుల నుంచి లోహాలను సంగ్రహించే వివిధ పద్ధతులను వివరించే శాస్త్రాన్ని లోహసంగ్రహణ శాస్త్రం అంటారు.


2. ప్రస్తుతం లభ్యమయ్యే మూలకాల్లో 75% కంటే ఎక్కువ మూలకాలు లోహాలే.


3. లోహాల ప్రధానవనరు భూపటలం.


4. సముద్ర జలంలో సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ వంటి కొన్ని కరిగే లవణాలు ఉంటాయి.


5. బంగారం (Au), వెండి (Ag), రాగి (Cu) వంటి కొన్ని లోహాలకు చర్యాశీలత తక్కువ కాబట్టి అవి ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభ్యం అవుతాయి.


6. భూపటలంలో దొరికే మలినాలతో కూడిన లోహ సమ్మేళనాన్ని 'లోహఖనిజం' అంటారు.


7. తక్కువ ఖర్చుతో లోహం పొందడానికి అత్యంత అనుకూలమైన ఖనిజాన్ని ధాతువు లేదా ముడి ఖనిజం అంటారు.


8. బాక్సైట్ ధాతువులో 50 - 70% అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది.


9. లోహ ధాతువులో ఉన్న మలినాలను ఖనిజ మలినం (gangue) అంటారు.

ధాతువు ఫార్ములా లోహం
బాక్సైట్ Al2O3. 2 H2O Al
కాపర్ ఐరన్ పైరటీస్ CuFeS2 Cu
జింక్ బ్లెండ్ ZnS Zn
సిన్నబార్ HgS Hg
గెలీనా PbS Pb
హార్న్ సిల్వర్ AgCl Ag
రాక్ సాల్ట్ NaCl Na
మాగ్నసైట్ MgCO3 Mg
ఎప్సమ్ లవణం MgSO4. 7 H2O Mg
కార్నలైట్ MgCl2. KCl. 6 H2O Mg
హెమటైట్ Fe2O3 Fe
మాగ్నటైట్ Fe3O4 Fe
జింకైట్ ZnO Zn
సున్నపురాయి CaCO3 Ca
జిప్సం CaSO4. 2 H2O Ca

K, Na, Ca, Mg, Al వంటి వాటికి క్రియాశీలత చాలా ఎక్కువ కాబట్టి అవి ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభించవు.
 

12. Zn, Fe, Pb, Cu తదితర లోహాల క్రియాశీలత మధ్యస్థంగా ఉంటుంది. దీంతో అవి వాటి సల్ఫైడ్‌లు, ఆక్సైడ్‌లు, కార్బొనేట్‌ల రూపంలో భూపటలంపై లభిస్తాయి.


13. Au, Ag లాంటి లోహాల క్రియాశీలత చాలా తక్కువ. అవి ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభిస్తాయి.


14. కొన్ని లోహాల చర్యాశీలత తగ్గే వరుసక్రమం
    


15. లోహాలను వాటి చర్యాశీలతల అవరోహణ క్రమంలో అమర్చితే వచ్చే శ్రేణిని చర్యాశీలత శ్రేణి అంటారు.


16. ధాతువుల నుంచి లోహ నిష్కర్షణం ముఖ్యంగా మూడు దశల్లో జరుగుతుంది
      (i) ముడి ఖనిజ సాంద్రీకరణ
      (ii) ముడిలోహ నిష్కర్షణ
      (iii) లోహన్ని శుద్ధి చేయడం.


17. నిరుపయోగమైన మలినాలను ధాతువుల నుంచి వేరు చేసే పద్ధతిని ధాతువుని గాఢత చెందించడం లేదా ముడి ఖనిజ సాంద్రీకరణం చేయడం అని అంటారు.

18. ధాతువును సాంద్రీకరించేందుకు ఉపయోగించే కొన్ని భౌతిక పద్థతులు
      (i) చేతితో ఏరి వేయడం
      (ii) నీటితో కడగడం
      (iii) ప్లవన ప్రక్రియ
      (iv) అయస్కాంత వేర్పాటు పద్ధతి


19. రంగు, పరిమాణం వంటి ధర్మాల్లో వ్యత్యాసం ఉంటే చేతితో ఏరివేయడం ద్వారా ధాతువును గాఢత చెందిస్తారు.


20. ధాతువు, మలినాలకు మధ్య సాంద్రతలు తేడాగా ఉన్నప్పుడు నీటితో కడగడం ద్వారా ధాతువును శుద్ధి చేస్తారు. ధాతువును బాగా చూర్ణం చేసి వాలుగా ఉన్న తలంపై ఉంచుతారు. పై నుంచి వచ్చే నీటి ప్రవాహంతో కడుగుతారు. అప్పుడు తేలికగా ఉన్న మలినాలు నీటి ప్రవాహంతో కొట్టుకు పోతాయి. బరువైన, శుద్ధమైన ముడి ఖనిజ కణాలు నిలిచిపోతాయి.


21. సల్ఫైడ్ ధాతువులను గాఢత చెందించేందుకు ప్లవన ప్రక్రియను ఉపయోగిస్తారు.


22. ధాతువు లేదా మలినాలు ఏదో ఒకటి అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటే వాటిని అయస్కాంత వేర్పాటు ద్వారా వేరు చేస్తారు.


23. Na, K లు తక్కువ ఆక్సిజన్ సమక్షంలో, Na2O, K2O లను అధిక ఆక్సిజన్ సమక్షంలో పెరాక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.
 

24. Ca, Mg , Al, Zn, Fe తదితర లోహాలు ఆక్సిజన్‌తో చర్య జరిపి వాటి ఆక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.

25. Pb, Cu, Hg మొదలైన లోహాలు ఆక్సిజన్ సమక్షంలో వాటి ఉపరితలంపై ఆక్సైడ్ పొరలను ఏర్పరుస్తాయి.


26. Ag, Pt, Au వంటి లోహాలు ఆక్సిజన్‌తో చర్య జరపవు.


27. K, Na, Ca, Mg తదితర లోహాలు చల్లని నీటితో చర్య జరిపి హైడ్రోజన్‌ను విడుదల చేస్తాయి.


28. K, Na, Ca, Mg, Al, Zn, Fe మొదలైన లోహాలు నీటి ఆవిరితో చర్య జరిపి హైడ్రోజన్‌ను విడుదల చేస్తాయి.


29. Pb, Cu, Hg, Ag, Pt, Au తదితర లోహాలు చల్లని నీరు లేదా నీటి ఆవిరి నుంచి హైడ్రోజన్‌ను స్థానభ్రంశం చెందించలేవు.


30. K, Na, Ca, Mg, Al, Zn, Fe, Pb మొదలైన లోహాలు గాఢ, సజల ఆమ్లాల నుంచి హైడ్రోజన్‌ను స్థానభ్రంశం చెందిస్తాయి.


31. Cu, Hg, Ag, Pt, Au వంటి లోహాలు బలమైన విలీన ఆమ్లాలతో హైడ్రోజన్‌ను స్థానభ్రంశం చెందించలేవు.


32. అన్ని లోహాలు క్లోరిన్‌తో వేడి చేసినప్పుడు వాటి క్లోరైడ్‌లను ఏర్పరుస్తాయి.


33. ధాతువుల నుంచి లోహ నిష్కర్షణం ఆ లోహం చర్యాశీలత మీద ఆధారపడి ఉంటుంది.


34. K, Na, Ca, Mg, Al లోహాలను వాటి ద్రవ సమ్మేళనాలను విద్యుద్విశ్లేషణం చేయటం ద్వారా నిష్కర్షణం చేస్తారు.

35. ద్రవ NaCl ను స్టీల్ కాథోడ్, గ్రాఫైట్‌ను ఆనోడ్ సహాయంతో విద్యుద్విశ్లేషణం చేసినప్పుడు కాథోడ్ వద్ద సోడియం లోహం నిక్షిప్తమై ఆనోడ్ వద్ద క్లోరిన్ విడుదలవుతుంది.
NaCl     Na+ + Cl-
కాథోడ్ వద్ద: 2 Na+ + 2 e-  2 Na
ఆనోడ్ వద్ద: 2 Cl-  Cl2 + 2 e-


36. Zn, Fe, Pb, Cu లోహాలను క్షయకరణ పద్ధతుల ద్వారా నిష్కర్షణం చేస్తారు.


37. సల్ఫైడ్ ధాతువులను అధిక గాలితో తీవ్రంగా వేడిచేసినప్పుడు వాటి ఆక్సైడ్‌లు ఏర్పడతాయి. ఈ ఆక్సైడ్‌లను తగిన క్షయకరణితో క్షయకరణం జరిపినప్పుడు లోహాలు ఏర్పడతాయి.
 
    2 PbS + 3 O2  2 PbO + 2 SO2


38. లోహ ఆక్సైడ్‌లను కోక్‌తో క్షయకరణం చేసినప్పుడు లోహాలు ఏర్పడతాయి.
     


39. లోహ ఆక్సైడ్‌లను కార్బన్ మోనాక్సైడ్‌తో క్షయకరణం చేసినప్పుడు లోహాలు లభిస్తాయి.
       


40. సల్ఫైడ్ ధాతువు నుంచి రాగిని సంగ్రహించేటప్పుడు ఆ ధాతువును గాలిలో పాక్షిక భర్జనం చేసి ఆక్సైడ్‌గా మారుస్తారు. ఇంకా మిగిలి ఉన్న లోహ సల్ఫైడ్ లోహ ఆక్సైడ్‌తో చర్య పొంది లోహాన్ని ఏర్పరుస్తుంది.

2 Cu2S + 3 O2  2 Cu2O + 2 SO2
2 Cu2O + Cu2 6 Cu + SO2


41. అధిక చర్యాశీలత ఉన్న లోహాలను క్షయకరణులుగా ఉపయోగించి తక్కువ చర్యాశీలత ఉన్న లోహాలను వాటి సమ్మేళనాల నుంచి స్థానభ్రంశం చెందిస్తారు.
    


42. అల్యూమినియం పొడితో లోహ ఆక్సైడ్‌లను క్షయకరణం జరిపే ప్రకియను థర్మైట్ చర్య అంటారు.


43. గాఢత పరచిన ఆక్సైడ్ ధాతువు, అల్యూమినియం పొడి మిశ్రమాన్ని థర్మైట్ అంటారు.


44. థర్మైట్ చర్యలో అల్యూమినియం లోహం క్షయకరణిగా ఉపయోగపడుతుంది.


45. Fe, Cr లోహాలను అల్యూమినో థైర్మిక్ పద్ధతి ద్వారా నిష్కర్షణం చేస్తారు.
   
    Fe2O3 + 2 Al      Al2O3 + 2 Fe + Heat
       Cr2O3 + 2 Al      Al2O3 + 2 Cr + Heat


46. విరిగిన రైలు కమ్మీలు, పగిలిన యంత్ర పరికరాలను అతికించడానికి థర్మైట్ చర్యను ఉపయోగిస్తారు.


47. తక్కువ చర్యాశీలత ఉన్న లోహ ఆక్సైడ్‌లను వేడిమి చర్యతో క్షయీకరించడం ద్వారా లేదా వీటి జలద్రావణాల నుంచి స్థానభ్రంశం చెందించటం ద్వారా లోహాలను పొందవచ్చు.


48. సిన్నబార్ (HgS) ను గాలిలో మండించినప్పుడు అది మొదట (HgO) గా మారుతుంది. దీన్ని ఇంకా వేడి చేస్తే పాదరసం ఏర్పడుతుంది.
     


49. గాఢత చెందించిన అర్జెంటైట్ (Ag2S) ధాతువును KCN ద్రావణంతో కరిగించినప్పుడు డైసైనార్జిమేట్ (I) అయాన్‌లు ఏర్పడతాయి. ఈ అయాన్‌లను జింక్ డస్ట్ చూర్ణంతో చర్య జరిపితే Ag అవక్షేపం ఏర్పడుతుంది.
 
  Ag2S + 4 CN-  2[Ag (CN)2]- + S2-
   2[Ag(CN)2] +  Zn    [Zn(CN)4]2- + 2 Ag

(జ. ద్రా.)      (ఘ.)     (జ. ద్రా.)    (ఘ.)


50. అపరిశుద్ధ లోహం నుంచి శుద్ధ లోహాన్ని పొందే ప్రక్రియను లోహశోధనం లేదా లోహ శుద్ధి అంటారు.


51. లోహాన్ని శుద్ధి చేసే పద్ధతి లోహం, దానిలోని మలినాల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది.


52. లోహాలను శుద్ధి చేసేందుకు ఉపయోగించే పద్ధతులు
       i) స్వేదనం
       ii) పోలింగ్
       iii) గలనం చేయడం
       iv) విద్యుద్విశ్లేషణం


53. జింక్, పాదరసం వంటి అల్ప భాష్పశీల లోహాలు అధిక భాష్పశీల లోహాలను మలినాలుగా కలిగి ఉంటే అలాంటి లోహాలను శుద్ధి చేసేందుకు స్వేదనాన్ని ఉపయోగించుకుంటారు.


54. ద్రవస్థితిలో ఉన్న నిష్కర్షించిన లోహాలను స్వేదనం చేసి శుద్ధ లోహాన్ని పొందుతారు.


55. లోహంలో దాని ఆక్సైడ్ మలినంగా ఉన్నప్పుడు ఆ లోహన్ని శుద్ధి చేసేందుకు పోలింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ద్రవ స్థితిలో లోహాన్ని పచ్చి కర్రలతో బాగా కలిపినప్పుడు విడుదలైన వాయువులు క్షయ కరణిలుగా ప్రవర్తిస్తాయి. ఇవి లోహంలో ఉన్న ఆక్సైడ్ మలినాలను క్షయకరణం చేస్తాయి.


56. బ్లిస్టర్ కాపర్‌ను పోలింగ్ పద్ధతిలో శుద్ధి చేస్తారు.


57. అల్పద్రవీభవన స్థానం ఉన్న లోహాన్ని అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాల నుంచి వేరు చేసేందుకు గలనం పద్ధతిని ఉపయోగిస్తారు.


58. గలనం పద్ధతిలో టిన్ (Sn) వంటి అల్పద్రవీభవన స్థానాలున్న లోహాలను వేడి చేసి వాలుగా ఉన్న తలంపై జారేటట్లు చేసినప్పుడు లోహం కరిగి కిందికి కారడం ద్వారా అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాలు వేరు అవుతాయి.


59. విద్యుత్ శోధనం పద్ధతిలో అపరిశుద్ధ లోహాన్ని ఆనోడ్‌గా, శుద్ధ లోహాన్ని కాథోడ్‌గా ఉపయోగిస్తారు. విద్యుద్విశ్లేషణలో అదే లోహానికి చెందిన ద్రవస్థితిలో ఉన్న లవణాన్ని విద్యుద్విశ్లేష్యంగా తీసుకుంటారు.

60. విద్యుత్ శోధనం పద్ధతిలో శుద్ధలోహం కాథోడ్ వద్ద నిక్షిప్తం అవుతుంది. మలినాలు ఆనోడ్ మడ్‌గా ఆనోడ్ వద్ద అడుగుకు చేరుతాయి.


61. విద్యుత్ శోధనం పద్ధతిలో శుద్ధ లోహం ఆనోడ్ నుంచి కాథోడ్‌కు స్థానభ్రంశం చెందుతుంది.
  ఆనోడ్ వద్ద:
 M  Mn+ + e-
  కాథోడ్ వద్ద: Mn+ + ne-  M    (M - శుద్ధలోహం)


62. విద్యుత్ శోధనం పద్ధతిలో కాపర్‌ను శుద్ధి చేసేటప్పుడు వాడే మలిన కాపర్‌ను ఆనోడ్‌గా, స్వచ్ఛమైన పలుచటి కాపర్ రేకులను కాథోడ్‌గా, ఆమ్లకృత కాపర్ సల్ఫేటు ద్రావణాన్ని విద్యుద్విశ్లేష్యంగా తీసుకుని విద్యుద్విశ్లేషణ ప్రక్రియ చేసినప్పుడు శుద్ధ కాపర్ ఆనోడ్ నుంచి కాథోడ్‌కు స్థానభ్రంశం చెందుతుంది.
ఆనోడ్ వద్ద: 
Cu 

 Cu2+ +  2e- 
కాథోడ్ వద్ద: Cu2+ + 2e-  Cu

63. లోహక్షయం అనేది ఒక ఉపరితల ప్రక్రియ.


64. లోహం తిరిగి తన సంయోగ స్థితిలోకి మార్పుచెందే ప్రక్రియను లోహక్షయం అంటారు.


65. లోహక్షయం ఒక రిడాక్స్ చర్య. దీనిలో తేమ సమక్షంలో లోహాలు ఆక్సిజన్‌తో ఆక్సీకరణం చెందుతాయి.


66. ఇనుము తుప్పు పట్టడం, వెండి వస్తువులు కాంతి విహీనమవడం, రాగి, కంచు వస్తువులపై ఆకు పచ్చని పొర ఏర్పడటం వంటివి లోహ క్షయానికి కొన్ని ఉదాహరణలు.


67. లోహ క్షయంలో లోహం ఆక్సిజన్‌కు ఎలక్ట్రాన్‌లను కోల్పోవడం ద్వారా ఆక్సీకరణం చెంది దాని ఆక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.


68. నీరు, గాలి సమక్షంలో ఇనుము లోహక్షయం చెందుతుంది.


69. ఇనుమును గాలి, తేమ సమక్షంలో ఉంచినప్పుడు దాని ఉపరితలంపై గోధుమ రంగు పొర ఏర్పడుతుంది. దీన్నే తుప్పు అంటారు.


70. తుప్పులో ఆర్ద్రపెర్రిక్ ఆక్సైడ్ Fe2O3 × H2ఉంటుంది.


71. ఇనుప వస్తువుల ఉపరితలంపై ఒక నిర్దిష్ట ప్రాంతంలో క్షయం జరిగేటప్పుడు అక్కడ ఆక్సీకరణం జరిగి, ఆ ప్రాంతం ఆనోడ్‌గా ప్రవర్తిస్తుంది.
ఆనోడ్ వద్ద: 
2 Fe  2 Fe2+ + 4e-

72. ఆనోడ్ వద్ద విడుదలైన ఎలక్ట్రాన్‌లు లోహం ద్వారా వేరే ప్రాంతం వద్దకు పోయి హైడ్రోజన్ అయాన్ (H+) సమక్షంలో ఆక్సిజన్‌ను క్షయీకరిస్తాయి. ఈ ప్రాంతం కాథోడ్‌గా వ్యవహరిస్తుంది.
కాథోడ్ వద్ద: 
O2 + 4 H+ + 4e-  2 H2O


73. ఇనుము తుప్పు పట్టడంలో జరిగే మొత్తం చర్య
  
   2 Fe   +   O2   +  4 H+          2 Fe2+    +     2 H2O
   (ఘ.)   (వా.)  (జ.ద్రా.)       (జ.ద్రా.)    (ద్ర.)
వాతావరణంలోని ఆక్సిజన్ ఫెర్రస్ అయాన్‌లను (Fe2+) ఆక్సీకరణం చేసి ఫెర్రిక్ అయాన్లుగా (Fe3+) మార్పు చేసి హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ (Fe2O3 X H2O) రూపంలో తుప్పుగా మారుతుంది.


74. లోహ వస్తువుల ఉపరితల వాతావరణంతో స్పర్శలో లేకుండా నివారించడం అనేది లోహక్షయం నివారణ సాధారణ పద్ధతుల్లో ఒకటి. లోహక్షయాన్ని నివారించేందుకు లోహ ఉపరితలాన్ని పెయింట్‌తో లేదా కొన్ని రసాయనాల (బైస్ఫినాల్)తో కప్పి ఉంచుతారు.


75. లోహక్షయాన్ని నివారించేందుకు లోహం ఉపరితలం మీద అధిక ధన విద్యుదాత్మకత ఉన్న లోహంతో కప్పి ఉంచుతారు. దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా జరుపుతారు.


76. విద్యుత్ రసాయన పద్ధతిలో Mg, Zn వంటి లోహ ఎలక్ట్రోడ్‌లు తమకు తామే క్షయం చెంది వస్తువును క్షయం చెందకుండా రక్షిస్తాయి.


77. ఇనుప వస్తువుల మీద జింక్‌తో పూత పూయడాన్ని గాల్వనైజేషన్ అంటాం. దీని వల్ల ఇనుము తుప్పు పట్టదు.


78. ధాతువులు గాలి లేకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పద్ధతిని భస్మీకరణం అంటారు. భస్మీకరణంలో ధాతువు విఘటనం చెందుతుంది.


79. భస్మీకరణంలో కార్బోనేట్‌లు వాటి ఆక్సైడ్‌లుగా మార్పు చెందుతాయి.
       MgCO3   Mgo  +  CO2
          (ఘ)               (ఘ)        (వా)
       CaCO3   CaO  +  CO2
          (ఘ)              (ఘ)        (వా)


80. ధాతువును గాలి లేదా ఆక్సిజన్ సమక్షంలో అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పద్ధతిని భర్జనం అంటారు.


81. భర్జనంలో సల్ఫైడ్ ధాతువులు వాటి ఆక్సైడ్‌లుగా మార్పు చెందుతాయి.
    
  2 ZnS   +   3 O2        2 ZnO   +   2 SO2
        (ఘ)          (వా)                    (ఘ)          (వా)

82. ధాతువు, ద్రవకారి, క్షయకరణి మిశ్రమాన్ని వాటి ద్రవీభవన స్థానం కంటే అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పద్ధతిని ప్రగలనం అంటారు.


83. ధాతువులోని మలినాలను తొలగించడానికి ధాతువుకు కలపాల్సిన పదార్థాన్ని ద్రవకారి అంటారు.


84. ఆమ్ల మలినాన్ని తొలగించేందుకు ధాతువుకు క్షార ద్రవకారిని కలుపుతారు.
    
  SiO2   +   CaO    

   CaSiO3
      గాంగ్       ద్రవకారి                 స్లాగ్


85. క్షార మలినాన్ని తొలగించేందుకు ధాతువుకు ఆమ్ల ద్రవకారిని కలుపుతారు.
      
FeO   +  SiO2     FeSiO3
        గాంగ్     ద్రవకారి               స్లాగ్


86. మలినం, ద్రవకారితో కలిసి ఏర్పడే ద్రవ పదార్థాన్ని లోహమలం అంటారు.


87. హెమటైట్‌కు కోక్, సున్నపురాయిని కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు ద్రవస్థితిలో ఇనుము లభిస్తుంది.
2 C + O2  2 CO
Fe2O3 + 3CO  2 Fe + 3 CO2
CaCO3    CaO + CO2
CaO  +  SiO2   CaSiO2

88. లోహ నిష్కర్షణలో ఉష్ణ రసాయన ప్రక్రియలను చేయడానికి వాడేదే కొలిమి.


89. కొలిమిలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. అవి
    i) హర్త్       ii) చిమ్నీ        iii) అగ్గిగది


90. బ్లాస్ట్ కొలిమిలో అగ్గి గది, హర్త్ ఒక పెద్ద గదిలో ఉంటాయి. దీనిలో ధాతువు, ఇంధనం నింపి ఉంటాయి.


91. రివర్బరేటరీ కొలిమిలో హర్త్, అగ్గిగది రెండూ వేరు చేసి ఉంటాయి. కాని ఇంధనాన్ని మండించినప్పుడు వెలువడిన వేడి బాష్పం హర్త్‌లో ఉన్న ధాతువును వేడి చేస్తుంది.


92. రిటార్ట్ కొలిమిలో హర్త్, అగ్గిగదికి మధ్య ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం ఉండదు, మంటలు కూడా ధాతువును వేడి చేయవు.


93. భస్మీకరణం, భర్జనం ప్రక్రియలు రివర్బరేటరీ కొలిమిలో జరుగుతాయి.


94. బ్లాస్ట్ కొలిమిలో ప్రగలన ప్రక్రియను నిర్వహిస్తారు.
 

లోహ సంగ్రహణశాస్త్రం

మైండ్ మ్యాపింగ్


 

ధాతువులు

ఆక్సైడ్ ధాతువులు:

కార్బోనేట్ ధాతువులు:

సల్ఫైడ్ ధాతువులు:

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం