• facebook
  • twitter
  • whatsapp
  • telegram

లోహ సంగ్రహణ శాస్త్రం 

1. చర్యాశీలత శ్రేణిలో ఎగువభాగంలో ఉండే లోహాల సంగ్రహణం ఏ విధంగా చేస్తారో తెలపండి. (AS 1) 4 మార్కులు


2. చర్యాశీలత శ్రేణిలో మధ్యలో ఉండే లోహాల సంగ్రహణం ఏ విధంగా చేస్తారో రాయండి.  (AS 1) 4 మార్కులు


3. చర్యాశీలత శ్రేణిలో దిగువన ఉండే లోహాల నిష్కర్షణ ఏ విధంగా చేస్తారో చెప్పండి.   (AS 1) 4 మార్కులు


4. ధాతువు గురించి వివరించండి. ధాతువుల్లో రకాలను తెలిపి ఉదాహరణలు ఇవ్వండి. (AS 1) 4 మార్కులు


5. బాక్సైట్, కాపర్, ఐరన్ పైరటీస్, జింక్‌బ్లెండ్, మాగ్నసైట్, మాగ్నటైట్, సిన్నబార్, రాక్‌సాల్ట్, జింకైట్, ఎప్సమ్ లవణం, గెలీనా, జిప్సం, హర్న్‌సిల్వర్, హెమటైట్, సున్నపురాయి, కార్నలైట్, పైరోలుసైట్ లాంటి ధాతువులతో కింది పట్టికను పూర్తిచేయండి. (AS 4) 4 మార్కులు

ఆక్సైడ్‌లు కార్బొనేట్‌లు సల్ఫైడ్‌లు క్లోరైడ్‌లు సల్ఫేట్‌
         


6. ధాతువులు, ఖనిజాలకు మధ్య భేదాలను తెలపండి.   (AS 1) 2 మార్కులు

7. భర్జనం, భస్మీకరణాలను పోల్చండి.   (AS 1) 2 మార్కులు

8. బ్లాస్ట్ కొలిమి, రివర్బరేటరీ కొలుముల మధ్య భేదాలను తెలపండి.  (AS 1) 2 మార్కులు


9. A + BSO4 

 ASO4 + B
     B + ASO చర్య జరగదు
   ఈ చర్యల్లో A, B అనేవి మూలకాలు అయితే వాటిలో ఏది అధిక చర్యాశీలత ఉండే మూలకం? ఎందుకు?  (AS 2) 2 మార్కులు


10. 'ప్రతిధాతువు ఖనిజం అవుతుంది. కానీ, ప్రతి ఖనిజం ధాతువు కాదు' వివరించండి.  (AS 1) 2 మార్కులు


11. బ్లాస్ట్ కొలిమిలో జరిగే చర్యలకు సమీకరణాలను రాయండి.  (AS 1) 2 మార్కులు


12. తుప్పు పట్టడం అనేది చాలా తీవ్రమైన సమస్య. దీన్ని నివారించడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి? (AS 6) 2 మార్కులు


13. కింది పటంలో అయస్కాంత, అనయస్కాంత చక్రాలను గుర్తించండి.   (AS 5) 2 మార్కులు
                                              

17. అమాల్గమ్‌ల తయారీలో వాడే లోహం ఏది?   (AS 6) ఒకమార్కు


18. లోహాన్ని శుద్ధిచేసే కొన్ని పద్ధతులను సూచించండి.  (AS 1) ఒకమార్కు


19. సోడియం, మెగ్నీషియం లాంటి అధిక చర్యాశీలత లోహాల నిష్కర్షణకు ఏ పద్ధతిని ఉపయోగిస్తారు. (AS 1) ఒకమార్కు


20. చర్యాశీలత శ్రేణిలో కింద ఉండే Hg లోహ నిష్కర్షణను వివరించండి. (AS 1) ఒకమార్కు


21. చర్యాశీలత శ్రేణిలో కింద ఉండే Ag లోహ నిష్కర్షణను వివరించండి.   (AS 1) ఒకమార్కు


22. కార్బన్‌తో లోహ ఆక్సైడ్‌ల క్షయకరణాన్ని సూచించే చర్యలకు సమీకరణాన్ని రాయండి. (AS 1) ఒకమార్కు


23. కార్బన్ మోనాక్సైడ్‌తో ఆక్సైడ్ ధాతువులను క్షయకరణం చెందించే చర్యకు సమీకరణాన్ని రాయండి. (AS 1) ఒకమార్కు


24. SiO2 లాంటి ఆమ్ల పదార్థం మలినం (గాంగ్)గా ఉంటే దాన్ని తొలగించడానికి వాడే ద్రవకారి ఏది? దాని స్వభావం ఏమిటి? (AS 1) ఒకమార్కు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం