1. sp2 సంకరీకరణాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
(లేదా)
కార్బన్ పరమాణువు రెండు ఏక సంయోజక బంధాలను, ఒక ద్విబంధాన్ని ఏర్పరిచే సామర్థ్యాన్ని వివరించండి. (AS1) 4 మార్కులు
జ: ఈథీన్ (ఇథిలీన్) CH2 = CH2 అణువును ఉదాహరణగా తీసుకుందాం.
* CH2 = CH2 అణువు ఏర్పడేటప్పుడు ఉత్తేజ స్థితిలో ఉండే ప్రతీ కార్బన్ పరమాణువులో ఒక s ఆర్బిటాల్ (2s), రెండు p - ఆర్బిటాళ్లు (2px, 2py) కలిసిపోయి sp2 సంకరీకరణం చెందడం ద్వారా మూడు sp2 సంకర ఆర్బిటాళ్లు ఏర్పడతాయి.
* ఇప్పుడు ప్రతి కార్బన్ పరమాణువులో సంకరీకరణం చెందని ఒక p - ఆర్బిటాల్ (pz) మిగిలి ఉంటుంది.
* మూడు sp2 ఆర్బిటాళ్లు ఒక్కో ఎలక్ట్రాన్‌ను కలిగి ఉండి కార్బన్ పరమాణు కేంద్రం చుట్టూ పరస్పరం 120º కోణంతో వేరై ఉంటాయి.
* ఎప్పుడైతే కార్బన్ పరమాణువులు బంధానికి సిద్ధంగా ఉంటాయో అప్పుడు ఒక కార్బన్ పరమాణువులోని sp2 సంకర ఆర్బిటాల్, మరొక కార్బన్ పరమాణువులోని sp2 సంకర ఆర్బిటాల్‌తో అతిపాతం చెందడం ద్వారా sp2 - sp2 సిగ్మా (σ) బంధం ఏర్పడుతుంది.
* ప్రతి కార్బన్ పరమాణువులో మిగిలిన రెండు sp2 సంకర ఆర్బిటాళ్లలోని జతకూడని ఎలక్ట్రాన్‌లు రెండు హైడ్రోజన్ పరమాణువుల్లోని s - ఆర్బిటాళ్లతో అతిపాతం చెంది బంధాన్ని ఏర్పరుస్తాయి.
* రెండు కార్బన్ పరమాణువుల్లో సంకరీకరణం చెందని pz ఆర్బిటాళ్లు పార్శ్వంగా అతిపాతం చెందడం ద్వారా పటంలో చూపినట్లు వాటి మధ్య π బంధం ఏర్పడుతుంది.
* ఇథిలీన్ అణువులోని రెండుకార్బన్ పరమాణువుల మధ్య ఒక సిగ్మా (σ), ఒక పై (π) బంధం ఏర్పడతాయి.

2. sp3 సంకరీకరణాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
(లేదా)
మీథేన్‌లో sp3 సంకరీకరణాన్ని వివరించండి. (AS1 ) 4 మార్కులు
జ: * ఉత్తేజం చెందిన కార్బన్ పరమాణువులోని ఒక s - ఆర్బిటాల్ (2s), మూడు p - ఆర్బిటాళ్లు (2px, 2py, 2pz) ఒకదాంతో ఒకటి పునరేకీకరణం చెంది నాలుగు సర్వసమాన ఆర్బిటాళ్లు ఏర్పడతాయి. వాటినే sp3 సంకర ఆర్బిటాళ్లు అంటారు.
* హుండ్ నియమం ప్రకారం ఈ నాలుగు సర్వసమానమైన సంకర ఆర్బిటాళ్లలోకి 4 ఎలక్ట్రాన్‌లు చేరతాయి. వీటినే sp3 సంకర ఆర్బిటాళ్లు అంటారు.
* సంకరీకరణం వల్ల కార్బన్ పరమాణువు ఒక్కోదానిలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్‌ను కలిగి ఉన్న సమాన శక్తిగల నాలుగు sp3 సంకర ఆర్బిటాళ్లు ఉంటాయి.
* కార్బన్ పరమాణువు నాలుగు జతకూడని ఎలక్ట్రాన్‌లను కలిగి ఉండటం వల్ల అది నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో లేదా ఏక సంయోజకత కలిగిన ఇతర మూలక పరమాణువులతో బంధాన్ని ఏర్పరచగలుగుతుంది.
* కార్బన్, హైడ్రోజన్‌తో చర్యనొందినప్పుడు నాలుగు హైడ్రోజన్ పరమాణువుల్లోని s - ఆర్బిటాళ్లలో ఉన్న ఒక్కో ఎలక్ట్రాను కార్బన్ పరమాణువుతో 109º28' కోణం చేసేలా ఉండే నాలుగు sp3 సంకర ఆర్బిటాళ్లతో అతిపాతం చెందడం వల్ల నాలుగు సంయోజనీయ బంధాలు ఏర్పడటం ద్వారా CH4 అణువు ఏర్పడుతుంది.
* CH4 అణువులోని కార్బన్ పరమాణువులో ఉండే నాలుగు సంకర ఆర్బిటాళ్లు వాటి ఎలక్ట్రాన్‌ల మధ్య ఉండే వికర్షణను తగ్గించే విధంగా టెట్రాహెడ్రాన్ నాలుగు మూలల్లో ఉంటాయి. పరమాణు కేంద్రకం టెట్రాహెడ్రాన్ కేంద్రకంలో ఉంటుంది.
* ఈ అమరిక కార్బన్, నాలుగు హైడ్రోజన్ పరమాణువుల మధ్య నాలుగు (sp3 - s) సిగ్మా బంధాలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. ఈ బంధాలన్నీ కూడా సమాన శక్తిని కలిగి ఉంటాయి.
3. sp సంకరీకరణాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
(లేదా)
ఒక ఏకబంధం, ఒక త్రిబంధం ఏర్పరచగల కార్బన్ సామర్థ్యాన్ని వివరించండి. (AS 1) 4 మార్కులు
జ: * ఇథైన్ (ఎసిటిలీన్) C2H2 అణువును ఉదాహరణగా తీసుకుంటే...
* ఎసిటిలీన్ అణువులోని రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఒక త్రిబంధం ఉంటుంది. పరమాణువు చతుర్ సంయోజనీయతను సంతృప్తపరచడానికి ప్రతీ కార్బన్ పరమాణువు ఒక హైడ్రోజన్‌తో బంధాన్ని ఏర్పరుస్తుంది. (H - C ≡ C - H)
* ఎసిటిలిన్ (C2H2) అణువులో రెండు కార్బన్, రెండు హైడ్రోజన్ పరమాణువులున్నాయి. ఉత్తేజిత స్థితిలో ప్రతి కార్బన్ పరమాణువులో ఒక s - ఆర్బిటాల్ (2s), p - ఆర్బిటాల్ (2spx) కలవడం వల్ల sp సంకరీకరణం జరిగి రెండు సర్వసమానమైన sp ఆర్బిటాళ్లు ఏర్పడతాయి.
* ప్రతి కార్బన్ పరమాణువు రెండు సంకరీకరణం చెందని p - ఆర్బిటాళ్లను (2py, 2pz) కలిగి ఉంటుంది.
* ఒక కార్బన్‌లోని sp సంకర ఆర్బిటాల్ మరో కార్బన్‌లోని sp సంకర ఆర్బిటాల్‌తో అతిపాతం చెందడం వల్ల sp - sp సిగ్మా బంధం ఏర్పడుతుంది.
* రెండు కార్బనుల్లో మిగిలిన sp ఆర్బిటాళ్లు, రెండు హైడ్రోజన్ పరమాణువుల s - ఆర్బిటాళ్లతో అతిపాతం చెందడం వల్ల రెండు s - p సిగ్మా బంధాలు ఏర్పడతాయి.
* ఒక కార్బన్ పరమాణువులో ఉండే సంకరీకరణం చెందని p ఆర్బిటాళ్లు వేరొక కార్బన్ పరమాణువులోని p ఆర్బిటాళ్లతో పార్శ్వ అతిపాతం చెందడం వల్ల రెండు π బంధాలు ఏర్పడతాయి (πpy - py, πpz - pz). అందువల్ల ఎసిటిలీన్ పరమాణువు (H - C ≡ C - H)లో 3 సిగ్మా బంధాలు, రెండు π బంధాలు ఉంటాయి.
4. రూపాంతరతను గురించి వివరించండి. కార్బన్ రూపాంతరాలు గురించి రాయండి. (AS 1) 4 మార్కులు
జ: * ఏదైనా ఒక మూలకం రెండు కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో లభిస్తూ, రసాయనిక ధర్మాల్లో దాదాపు సారూప్యాన్ని కలిగి ఉండి భౌతిక ధర్మాల్లో విభేదించే ధర్మాన్ని రూపాంతరత అంటారు.
* ఒక అణువులో పరమాణువుల అమరికలో తేడా వల్ల రూపాంతరాలు ఏర్పడతాయి.
* కార్బన్ రూపాంతరాలను రెండు రకాలుగా వర్గీకరించారు అవి:
ఎ) అస్ఫటిక రూపాలు బి) స్ఫటిక రూపాలు
* బొగ్గు, కోక్, కలప, చార్‌కోల్, జంతు చార్‌కోల్, నల్లని మసి, వాయురూప కార్బన్, పెట్రోలియం కోక్, చక్కెర చార్‌కోల్... కార్బన్ వేర్వేరు అస్ఫటిక రూపాంతరాలు.
* కార్బన్ 3 రకాలైన స్ఫటిక రూపాల్లో లభిస్తుంది. అవి: వజ్రం, గ్రాఫైట్, బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్.
* స్ఫటిక రూపాంతరాలు వాటి నిర్మాణాలు, భౌతిక ధర్మాల్లో వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి.
* వజ్రం, గ్రాఫైట్‌లు సంయోజక వల నిర్మాణాలు కాగా, నిర్ణీత దూరాల్లో వేరుచేసి ఉన్న బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్ అనేది C60 పరమాణువులతో ఏర్పడిన ఘన నిర్మాణం.
5. వజ్రం, గ్రాఫైట్‌ల నిర్మాణాలను సరిపోల్చండి. (AS 1) 4 మార్కులు
జ:
వజ్రం
* వజ్రం ఒక స్ఫటిక రూప ఘనపదార్థం.
* వజ్రంలోని ప్రతి కార్బన్ పరమాణువు ఉత్తేజిత స్థితిలో sp3 సంకరీకరణం చెందుతుంది.
* వజ్రంలో కార్బన్ పరమాణువులు చతుర్ముఖీయ నిర్మాణంలో ఏర్పాటై ఉంటాయి.
* ఇందులో ప్రతి కార్బన్ పరమాణువు నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో సమయోజనీయ బంధం ద్వారా కలిసి ఉంటుంది. దీన్ని అనేక పంజరం లాంటి నిర్మాణాలున్న స్థూల అణువుగా గుర్తించవచ్చు.
* అత్యంత తక్కువ ఘనపరిమాణంతో ఉండే ఈ నిర్మాణం పగలగొట్టడం కష్టం.
* C - C బంధ దూరం 1.54 Aº కాగా, బంధకోణం 109º28'
గ్రాఫైట్:
* ఇది నల్లని, మెత్తని స్ఫటిక ఘనపదార్థం. ఇది లోహధృతి కలిగి సబ్బు లాంటి స్పర్శ గలది.
* గ్రాఫైట్‌లో ప్రతి కార్బన్ పరమాణువు ఉద్రిక్త స్థితిలో sp2 సంకరీకరణం చెందుతుంది.
* గ్రాఫైట్‌లో కార్బన్ పరమాణువులు షట్కోణాకృతిలో వలయాలను ఏర్పరుస్తాయి.
* ఈ వలయాలన్నీ కలిసి ఒక గ్రాఫైట్ పొరను ఏర్పరుస్తాయి. ఈ పొరలు ఒకదానిపై ఒకటి పేర్చుకోవడం వల్ల గ్రాఫైట్ ఏర్పడుతుంది.
* దీనిలో C - C బంధ దూరం 1.42 Aº , బంధకోణం 120º.
* పక్కపక్కనే ఉండే రెండు గ్రాఫైట్ పొరల మధ్య దూరం 3.35 Aº .
* రెండు గ్రాఫైట్ పొరల మధ్య ఎలాంటి బలమైన రసాయన బంధాలు లేకపోవడం వల్ల ఈ పొరలు ఒకదానిపై ఒకటి జారగలవు.
6. కార్బన్‌కు ఉండే అసమాన ధర్మాలను వివరించండి. (AS1) 4 మార్కులు
జ: కార్బన్‌కు ఉండే అసమాన ధర్మాలు కాటనేషన్, సాదృశ్యం, బహుబంధాలను ఏర్పరచడం.
కాటనేషన్: ఒక మూలకంలోని పరమాణువులు ఒకదాంతో ఒకటి కలిసి పొడవైన గొలుసులను ఏర్పరచడాన్ని కాటనేషన్ అంటారు. కార్బన్‌కు కాటనేషన్ సామర్థ్యం చాలా ఎక్కువ. దీనికి కారణం బలమైన కార్బన్-కార్బన్ బంధాలు ఏర్పడటం, కార్బన్‌కు ఉన్న చతుస్సంయోజకత. కాటనేషన్ కారణంగా కార్బన్ పరమాణువులు అనేక రకాలైన సరళ శృంఖలాలు, శాఖా శృంఖలాలు, వలయ నిర్మాణాల ద్వారా అసంఖ్యాక సమ్మేళనాలను ఏర్పరచగలవు.
సాదృశ్యం: ఒకే అణుఫార్ములా కలిగి వివిధ నిర్మాణాత్మక ఫార్ములా ఉండే సమ్మేళనాలను సాదృశ్యాలని, ఈ దృగ్విషయాన్ని సాదృశ్యం అని అంటారు. కర్బన పదార్థాలు సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. అంటే ఒక అణు ఫార్ములాలో రెండు లేదా ఎక్కువ పదార్థాలు మనగలుగుతాయి. ఉదాహరణకు C4H10కు ఉండే నిర్మాణాలు.
బహు బంధాలను ఏర్పరచడం: రెండు కార్బన్ పరమాణువుల మధ్య బహు బంధాలు ఏర్పడగలవు. ఇందువల్ల కూడా కర్బన సమ్మేళనాల సంఖ్య అధికమవుతుంది. కిందివి కార్బన్ ఏర్పరిచే ఏక, ద్వి, త్రి బంధాలున్న పదార్థాలకు ఉదాహరణలు.
CH3 - CH2 - CH3 CH3 - CH = CH2 CH3 - C ≡ CH
n - ప్రొపేన్ ప్రొపీన్ ప్రొపైన్
7. సమజాత శ్రేణి గురించి తెలిపి, సమజాతశ్రేణుల ప్రత్యేక ధర్మాలను రాయండి. (AS 1) 4 మార్కులు
జ: కర్బన సమ్మేళనాల శ్రేణుల్లో వరుసగా ఉండే రెండు సమ్మేళనాలు -CH2 భేదంతో ఉంటే వాటిని సమాజాత శ్రేణులు అంటారు.
ఉదా: CH4, CH2H6, C3H8, C4H10, .....
సమజాత శ్రేణుల ప్రత్యేక ధర్మాలు
* ఒక శ్రేణికి ఒకే సాధారణ ఫార్ములా ఉంటుంది.
ఉదా: ఆల్కేన్‌లు (Cn H2n + 2)
ఆల్కైన్‌లు (Cn H2n - 2)
* ఒక శ్రేణిలో పక్క పక్క సమ్మేళనాల మధ్య తేడా (-CH2) ఉంటుంది.
* ఒక శ్రేణిలో ఒకే రకమైన ప్రమేయ సమూహం ఉండటం వల్ల వాటికి ఒకే రకమైన రసాయన ధర్మాలు ఉంటాయి.
ఉదా: ఆల్కహాల్‌లు, ఆల్డిహైడ్‌లు, కార్బాక్సిలిక్ ఆమ్లాలు వరుసగా C - OH, C - CHO, C - COOH ప్రమేయ సమూహాలను కలిగి ఉంటాయి.
* ఇవి వాటి భౌతిక ధర్మాల్లో ఒక సాధారణ క్రమం ప్రదర్శిస్తాయి.
8. C2H2, CH4, C2H4, C2H6, C3H8, C3H6, C3H4, C4H6, C4H8, C4H10, C5H10, C5H12, C5H8 లాంటి హైడ్రోకార్బన్‌లతో కింది పట్టికను పూర్తి చేసి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (AS 4) 4 మార్కులు
ఆల్కేన్లు |
ఆల్కీన్లు |
ఆల్కైన్లు |
|
|
|
i) సంతృప్త హైడ్రోకార్బన్‌లు ఏవి?
ii) ఆల్కీన్‌ల సాధారణ ఫార్ములాను తెలపండి.
iii) బ్యూటేన్ ఫార్ములాను రాయండి.
iv) ఈథీన్ (C2H4) నిర్మాణాన్ని గీయండి.
జ:
ఆల్కేన్లు | ఆల్కీన్లు | ఆల్కైన్లు |
CH4 | C2H4 | C2H2 |
C2H6 | C3H6 | C3H4 |
C3H8 | C4H8 | C4H6 |
C4H10 | C5H10 | C5H8 |
C5H12 |
i) ఆల్కేన్‌లు సంతృప్త హైడ్రోకార్బన్‌లు
ii) ఆల్కీన్‌ల సాధారణ ఫార్ములా Cn H2n
iii) బ్యూటేన్ ఫార్ములా C4H10
9. కింది పట్టికను పూర్తి చేయండి. (AS 4) 4 మార్కులు
ప్రమేయ సమూహం |
ఫార్ములా |
పూర్వపదం |
పరపదం |
ఆమ్ల హాలైడ్‌లు |
- COX |
హాలో కార్బొనైల్ |
|
ఆల్కహల్ |
|
|
|
|
- NH2 |
|
అమైన్ |
ఈథర్ |
R - O - R |
|
- |
ఎస్టర్‌లు |
- COOR |
|
(R)... కార్బాక్సిలేట్ |
ఆల్డిహైడ్‌లు |
|
ఫార్మైల్ |
కార్బాల్డిహైడ్ |
కార్బాక్సిలిక్ ఆమ్లం |
-COOH |
|
కార్బాక్సిలిక్ ఆమ్లం |
|
- CN |
|
కార్బొనైట్రైల్ |
జ:
ప్రమేయ సమూహం |
ఫార్ములా |
పూర్వపదం |
పరపదం |
ఆమ్ల హాలైడ్‌లు |
- COX |
హాలోకార్బొనైల్ |
కార్బొనైల్ హాలైడ్ |
ఆల్కహాల్ |
- OH |
హైడ్రాక్సీ |
ఓల్ |
అమైన్‌లు |
- NH2 |
అమైనో |
అమైన్ |
ఈథర్ |
R - O - R |
(R) ఆక్సీ |
- |
ఎస్టర్‌లు |
- COOR |
ఆక్సీ కార్బొనైల్ |
(R)... కార్బాక్సిలేట్ |
ఆల్డిహైడ్‌లు |
- CHO |
ఫార్మైల్ |
కార్బాల్డిహైడ్ |
కార్బాక్సిలిక్ ఆమ్లం |
-COOH |
కార్బాక్సి |
కార్బాక్సిలిక్ ఆమ్లం |
నైట్రైల్స్ |
- CN |
సయనో |
కార్బొనైట్రైల్ |
10. కర్బన సమ్మేళనాల నామీకరణం సూత్రాలను తెలపండి. (AS 1) 4 మార్కులు
జ: నామీకరణం - సూత్రాలు:
కార్బన్ పరమాణువులను లెక్కించడం:
1) కార్బన్ పరమాణువులను ఎడమ నుంచి కుడికి లేదా కుడి నుంచి ఎడమకు ఏ విధంగానైనా లెక్కపెట్టవచ్చు. అయితే ప్రతిక్షేపకం, ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న స్థానాలను సూచించే సంఖ్య సాధ్యమైనంత తక్కువగా ఉండేలా గుర్తించాలి.
2) ప్రమేయ సమూహం ఉన్న కార్బన్‌కు అతి తక్కువ సంఖ్యను ఇవ్వాలి. ఒకవేళ అది (1)వ నియమాన్ని పాటించకపోయినా సరే. ఒకవేళ గొలుసు చివరలో ప్రమేయ సమూహం ఉన్నప్పుడు ఉదాహరణకు - CHO లేదా - COOH లాంటి సమూహాలున్నప్పుడు (1), (2) నియమాలను పాటించకపోయినా సరే ఎల్లవేళలా '1 సంఖ్యనే ఇస్తాం.
పొడవైన శృంఖల నియమం: సమ్మేళనంలో పొడవైన కర్బన అణువుల శృంఖలాన్ని గుర్తించాలి. దీన్ని మాతృశృంఖలం లేదా ప్రధాన శృంఖలం అంటారు. మిగిలిన వాటిని శాఖా శృంఖలాలు అంటారు.
కనిష్ఠ సంఖ్యానియమం: కర్బన సమ్మేళనంలో ఒకే ప్రతిక్షేపకం ఉన్నప్పుడు కర్బన అణువులకు సంఖ్యలను కేటాయించేటప్పుడు ప్రతిక్షేపకం కలిగిన కర్బన అణువుకు కనిష్ఠ సంఖ్య వచ్చే విధంగా సంఖ్యను ఇవ్వాలి.
కనిష్ఠ మొత్తం నియమం: కర్బన సమ్మేళనంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రతిక్షేపకాలు ఉన్నప్పుడు కార్బన్ అణువులకు సంఖ్యలను కేటాయించేటప్పుడు ఎక్కువ ప్రతిక్షేపకాలు ఉన్న కర్బన అణువుకు కనిష్ఠ మొత్తం వచ్చే విధంగా సంఖ్యలను ఇవ్వాలి.
ఆకారాదిక్రమ నియమం: కర్బన సమ్మేళనంలో రెండు లేదా అంత కంటే ఎక్కువ ప్రతిక్షేపకాలు లేదా శాఖాశృంఖలాలు ఉన్నప్పుడు వాటిని ఆంగ్ల అక్షరాల క్రమంలో అమర్చాలి.
11. కింది సమ్మేళనాల IUPAC పేర్లు రాయండి. (AS 1) 4 మార్కులు
జ: i) 2, 3, - డై బ్రోమో 2, 3 - డై క్లోరో పెంటేన్
ii) సైక్లో పెంటేన్
iii) 1, 2 - డై క్లోరో సైక్లో బ్యూటేన్
iv) 2, 3 - డై మిథైల్ - సైక్లో హెక్సేన్ - 1 ఓల్
12. కింది సమ్మేళనాల నిర్మాణాలు గీయండి. (AS 1) 4 మార్కులు
i) 7 - హైడ్రాక్సీ హెప్టేన్ - 2 - ఓన్
ii) 2, 3, - డై క్లోరో ప్రొపనాల్
iii) 2 - మిథైల్ పెంటేన్ - 3 - ఓల్
iv) 5, 6 - డై క్లోరో - ఆక్ట్‌లు - 6, 7 - డై ఈన్ - 1, 2 - డై ఓల్
13. C5H12 అణుఫార్ములా ఉన్న పెంటేన్‌కు ఎన్ని సాదృశ్యాలను గీయగలం? అవి ఏవి? వాటి నిర్మాణ పటాలను గీసి, వాటి సాధారణ పేర్లను పేర్కొనండి. (AS 1) 4 మార్కులు
జ: పెంటేన్ సాదృశ్యాలు 3 అవి:
i) n - పెంటేన్ ii) ఐసో పెంటేన్ iii) నియో పెంటేన్
i) n - పెంటేన్: CH3 - CH2 - CH2 - CH3
14. ఆల్డిహైడ్‌ల సమజాత శ్రేణిలోని మొదటి నాలుగు కర్బన సమ్మేళనాల అణుఫార్ములాను రాసి,వాటి నిర్మాణ పటాలను గీయండి. (AS1)4 మార్కులు
జ: ఆల్డిహైడ్‌ల సమజాత శ్రేణిలోని మొదటి నాలుగు కర్బన సమ్మేళనాలు ఫార్మాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్, ప్రొపనాల్డిహైడ్, బ్యుటనాల్డిహైడ్
15. బ్యూటేన్ (C4H10) సాదృశ్యకాల (isomers) నిర్మాణాలను గీయండి. (AS 1) 4 మార్కులు
జ: బ్యూటేన్ (C4H10) సాదృశ్యకాలు n - బ్యూటేన్, ఐసోబ్యూటేన్
నిర్మాణాలు:
16. కార్బన్ సమ్మేళనాల్లో జరిగే కొన్ని ముఖ్యమైన చర్యలను ఉదాహరణలతో వరించండి. (AS 1) 4 మార్కులు
జ: కార్బన్ సమ్మేళనాల్లో జరిగే కొన్ని ముఖ్యమైన చర్యలు:
i) దహన చర్య ii) ఆక్సీకరణ చర్యలు iii) సంకలన చర్యలు iv) ప్రతిక్షేపక చర్యలు
i) దహన చర్య: కార్బన్ లేదా కార్బన్ సమ్మేళనాలు గాలి లేదా ఆక్సిజన్ సమక్షంలో దహనం చెంది కార్బన్ డై ఆక్సైడ్, వేడి, కాంతిని ఇచ్చే ప్రక్రియను దహన చర్య అంటారు.
ఉదా: CH4 + 2 O2 CO2 + 2 H2O + శక్తి
ii) ఆక్సీకరణ చర్యలు: సాధారణంగా దహన చర్యలన్నీ ఆక్సీకరణ చర్యలే. ఆక్సీకారిణుల వల్ల ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి.
ఉదా: ఇథైల్ ఆల్కహాల్‌ను క్షారీకృత KMnO4 ద్రావణంతో ఆక్సీకరణం చేసినప్పుడు ఎసిటాల్డిహైడ్, చివరకు ఎసిటిక్ ఆమ్లం ఏర్పడతాయి.
iii) సంకలన చర్యలు: అసంతృప్త కర్బన సమ్మేళనాల్లో ద్విబంధం లేదా త్రిబంధం ఉంటుంది. అసంతృప్త కర్బన సమ్మేళనాలు సంకలన చర్యల్లో పాల్గొని సంతృప్త హైడ్రోకార్బన్‌లను ఏర్పరుస్తాయి.
iv) ప్రతిక్షేపణ చర్యలు: ఏదైనా ఒక రసాయన చర్యలో ఒక సమ్మేళనంలోని ఒక పరమాణువు లేదా పరమాణు సమూహం, వేరొక పరమాణువు లేదా పరమాణు సమూహంతో ప్రతిక్షేపితమైతే ఆ చర్యను ప్రతిక్షేపణ చర్య అంటారు.
ఉదా: మీథేన్ సూర్యకాంతి సమక్షంలో క్లోరిన్‌తో చర్యనొందినప్పుడు మిథైల్ క్లోరైడ్, మిథిలీన్ క్లోరైడ్, క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఏర్పడతాయి.
CH4 + Cl2 CH3Cl + HCl
CH3Cl + Cl2 CH2Cl2 + HCl
CH2Cl2 + Cl2 CHCl3 + HCl
CHCl3 + Cl2 CCl4 + HCl
17. దహన చర్యలన్నీ ఆక్సీకరణ చర్యలే కానీ ఆక్సీకరణ చర్యలన్నీ దహన చర్యలు కావు. ఉదాహరణతో వివరించండి. (AS1) 4 మార్కులు
జ: * కార్బన్, దాని సమ్మేళనాలు గాలి లేదా ఆక్సిజన్ సమక్షంలో దహనం చెంది CO2, వేడి, కాంతిని ఇస్తాయి. కార్బన్ లేదా కర్బన సమ్మేళనం అధికమైన ఆక్సిజన్‌లో మండి వేడిని, కాంతినిచ్చే ప్రక్రియనే దహనచర్య అంటారు. దహన చర్యలు ఆక్సీకరణ చర్యలు.
ఉదా: 1) C + O2 CO2 + శక్తి
2) 2 C2H6 + 7 O2 4 CO2 + 6 H2O + శక్తి
* సాధారణంగా దహన చర్యలన్నీ ఆక్సీకరణ చర్యలే కాని ఆక్సీకరణ చర్యలన్నీ దహన చర్యలు కావు. ఆక్సీకారిణుల వల్ల ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి. ఆక్సీకారిణులు అనేవి ఆక్సీకరణకు తోడ్పడే పదార్థాలు. ఇవి దహనంలో క్షయకరణానికి గురవుతాయి.
ఉదా: ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ లేదా ఆమ్లీకృత పొటాషియం డై క్రోమేట్ ద్రవరూపంలో ఉన్నప్పుడు ఆక్సీకారిణిగా పనిచేసి ఆల్కహాల్‌కు ఆక్సిజన్‌ను అందించి దాన్ని కార్బాక్సిలిక్ ఆమ్లంగా మారుస్తుంది.
ఉదా: ఇథైల్ ఆల్కహాల్ ఆక్సీకరణం చెంది ఆల్డిహైడ్‌నిస్తూ చివరకు ఎసిటిక్ ఆమ్లంగా మారుతుంది.
* ఒక సమ్మేళనానికి ఆక్సిజన్‌ను కలపడం (లేదా చేర్చడం) ఆక్సీకరణ చర్య. ఒక సమ్మేళనాన్ని పూర్తిగా గాలిలో (లేదా ఆక్సిజన్‌లో) మండించడాన్ని దహన చర్య అన్నప్పటికీ, ఈ రెండు చర్యలు వేడిని గ్రహించి జరగడమే కాకుండా, రెండు చర్యల్లో కూడా సమ్మేళనాలకు ఆక్సిజన్‌ను కలుపుతారు.
* దహన చర్యలన్నీ ఆక్సీకరణ చర్యలే కానీ ఆక్సీకరణ చర్యలన్నీ దహన చర్యలు కావు. ఎందుకంటే ఆక్సీకరణ చర్యలన్నీ ఆక్సీకారిణుల వల్ల జరుగుతాయి. అదే దహన చర్య అయితే నేరుగా ఆక్సిజన్ (ఆక్సీకరణ) సమక్షంలో జరగడమే కాకుండా, ఆక్సిజన్ క్షయకరణానికి గురవుతుంది.
18. క్లోరిన్‌తో మీథేన్ ప్రతిక్షేపణ చర్యలను వివరించండి. (AS 1) 4 మార్కులు
జ: కాంతి సమక్షంలో మీథేన్, క్లోరిన్‌తో చర్య నొందుతుంది. ఈ చర్యల్లో మీథేన్‌లోని హైడ్రోజన్ పరమాణువును క్లోరిన్ పరమాణువులు ప్రతిక్షేపిస్తాయి. అందుకే వీటిని ప్రతిక్షేపణ చర్యలు అంటారు.
ఈ చర్యలో మీథేన్‌లోని - H పరమాణువు Cl - పరమాణువుతో ప్రతిక్షేపితమవుతుంది. ఫలితంగా CH4 నుంచి CH3Cl ఏర్పడుతుంది. అత్యధిక Cl2 సమక్షంలో, ఒక్కొక్కటిగా మిలిగిన - H పరమాణువులు కూడా క్లోరిన్‌తో ప్రతిక్షేపితమవుతాయి.
19. ప్రమేయ సమూహం అంటే మీరేం అర్థం చేసుకున్నారు? వివరించండి. (AS 1) 4 మార్కులు
(లేదా)
కర్బన సమ్మేళనాల్లోని ప్రమేయ సమూహాలను గురించి తెలపండి. (AS 1) 4 మార్కులు
జ: ఒక కర్బన సమ్మేళనం గుణాత్మక ధర్మాలు ప్రధానంగా దానిలోని ఒక పరమాణువు లేదా పరమాణు సమూహంపైన ఆధారపడి ఉంటాయి. ఇలాంటి పరమాణువు లేదా పరమాణు సమూహాన్నే ప్రమేయ సమూహం అంటారు.
*ప్రమేయ సమూహాన్ని బట్టి ఆ కర్బన సమ్మేళన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఒకేరకమైన ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న సమ్మేళనాలు ఒకే రకమైన చర్యలో పాల్గొంటాయి. ఒక్కో ప్రమేయ సమూహం ఒక్కో రకమైన ప్రత్యేక ధర్మాలను ప్రదర్శిస్తుంది. ఈ ధర్మాలు అణువులోని మిగతా భాగంపై ఆధారపడి ఉండవు.
ప్రమేయ సమూహం పేరు |
ప్రమేయ సమూహం ఫార్ములా |
ఉదాహరణ |
ఆల్కహాల్ |
- C - OH |
CH3OH |
ఆల్డిహైడ్ |
- C - CHO |
CH3CHO |
|
|
|
ఆమ్లం |
C - COOH |
CH3COOH |
ఈథర్ |
- C - O - C |
CH3 - O - CH3 |
అమైన్ |
- C - NH2 |
CH3 - NH2 |
ఎస్టర్ |
- C - COOR |
CH3COOCH3 |
20. సబ్బుకు ఉండే శుభ్రపరిచే గుణాన్ని వివరించండి.
(లేదా)
సాధారణ నీటిని మాత్రమే ఉపయోగించి దుస్తులను శుభ్రపరచకుండా మనం వాటిని ఉతికినప్పుడు డిటర్జెంట్ వాడతాం.ఎందుకు? అది దుస్తుల్లోని మురికిని ఎలా తీసివేస్తుందో వివరించండి.(AS1)4 మార్కులు
జ: * సబ్బు లేదా డిటర్జెంట్ ద్రావణంలో మురికిగా ఉన్న దుస్తులను వేశామనుకోండి. మురికి అనేది జిడ్డుగా ఉంటుంది. సబ్బు కణాలు జిడ్డుగానున్న పదార్థం హైడ్రోకార్బన్ కొనలచుట్టూ గుండ్రంగా చేరతాయి. అయాన్ భాగాలు వెలుపలికి నీటి వైపు ఉంటాయి.
* మురికిగా ఉన్న దుస్తులను సబ్బునీటి ద్రావణంలో వేస్తే హైడ్రోకార్బన్ భాగం మురికి/ నూనెతో అతుక్కుపోతుంది. కొంచెం కుదిపినా/ రుద్దినా మురికి కణాలు సబ్బు నురగ కణాలతో కలసి బయటకు చేరి నీటిలో కరిగిపోతాయి. అందుకే సబ్బు నీళ్లు మురికిగా అవుతాయి. దుస్తులు శుభ్రమవుతాయి.
* సబ్బులు, డిటర్జెంట్‌లు దుస్తులపై జిడ్డు లేదా మురికిని కరిగిస్తాయి. ఆ కరిగిన మురికిని తిరిగి నీటిలో కరిగేలా చేసి దుస్తులను శుభ్రం చేస్తాయి.
* సబ్బు కణం ఒక ధ్రువ కొనను (కార్టాక్సీ - - O కొన), అధ్రువ కొనను (హైడ్రోకార్బన్ గొలుసుగల కొన) కలిగి ఉంటుంది.
* ధ్రువం చివరి భాగం హైడ్రోఫిలిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది నీటివైపు ఆకర్షితమవుతుంది. ఆ ధ్రువాంతం హైడ్రోఫోబిక్ స్వభావం కలిగి ఉంటుంది. అది జిడ్డు లేదా మురికి వైపు మాత్రమే ఆకర్షితమవుతుంది. నీటివైపు ఆకర్షితమవదు.
* సబ్బు నీటిలో కరిగినప్పుడు సబ్బు కణాల హైడ్రోఫోబిక్ కొనలు మురికికి అతుక్కుంటాయి. తర్వాత అవి దుస్తుల నుంచి మురికిని వేరుచేస్తాయి.
* సబ్బు కణాలన్నీ జిడ్డుకణం చుట్టూ గుంపుగా చేరి జిడ్డుకణం కేంద్రంగా ఉన్న ఒక గుండ్రటి నిర్మాణం ఏర్పడటాన్ని సూచిస్తాయి. కొల్లాయిడల్ ద్రావణంలోని కణాల మాదిరిగా మిగిలిన కణాలు కూడా నీటిలో అవలంబనాలుగా ఉంటాయి.
* నీటిలో ఉండే వేర్వేరు మిసిలి కణాలు కలిసి ఒక దగ్గర చేరి అవక్షేపాన్ని ఏర్పరచడం జరగదు. ఎందుకంటే సబ్బు కణాల మధ్య ఉండే అయాన్ - అయాన్ వికర్షణ వాటిని ఒక దగ్గరకు చేరకుండా నిరోధిస్తుంది. మురికి కణాలను సబ్బు నురగ కణాలు చుట్టుముట్టడంతో అవి నీటి అవలంబనాలుగా ఉంటాయి. కాబట్టి సులువుగా నీటితో బయటికి వెళ్లిపోతాయి. అందుకే సబ్బు కణాలు నీటిలో కరగగానే మురికిని వేరు చేయగలుగుతాయి.
21. సబ్బు శుభ్రపరిచే గుణాన్ని మీరు ఏ విధంగా పరీక్షిస్తారు? (AS 3) 4 మార్కులు
జ: * 10 మి.లీ.ల చొప్పున నీటిని రెండు పరీక్ష నాళికల్లో తీసుకోవాలి.
* రెండింటిలోనూ ఒక చుక్క వంట నూనెను కలిపి వాటికి A, B అనే లేబుల్స్ అంటించాలి.
* B పరీక్ష నాళికకు కొన్ని చుక్కల సబ్బు ద్రావణాన్ని కలపాలి.
* రెండు పరీక్ష నాళికలను కొంత సమయం పాటు తీవ్రంగా కుదపాలి.
* కుదపడం ఆపిన వెంటనే రెండు పరీక్ష నాళికల్లో నూనె, నీటి పొరలు ఏర్పడవు. కొంతసేపు పరీక్షనాళికలను కదపకుండా పక్కన ఉంచాలి.
* B పరీక్ష నాళికలో నూనె పొర వేరుగా కనిపిస్తుంది. దీనికి కారణం ఆ పరీక్ష నాళికలో సబ్బు ద్రావణం ఉండటం. ఈ విధంగా సబ్బు శుభ్రపరిచే గుణాన్ని పరీక్షించవచ్చు.
22. ఈథైన్‌లోని సంకరీకరణం అతిపాతాన్ని సూచించే పటాన్ని గీయండి. (AS 5) 4 మార్కులు
జ:
23. ఎస్టరీకరణ చర్యను గురించి వివరించండి. (AS 1) 2 మార్కులు
జ: * గాఢ H2SO4 సమక్షంలో కార్బాక్సిలిక్ ఆమ్లం ఆల్కహాల్‌తో చర్య జరిపి తియ్యటి వాసన ఉండే ఎస్టర్ ఏర్పడుతుంది. ఈ చర్యనే ఎస్టరీకరణం అంటారు.
¤ గాఢ H2SO4 సమక్షంలో ఇథనోయిక్ ఆమ్లం, ఇథైల్ ఆల్కహాల్‌తో చర్య జరిపి ఇథైల్ ఎసిటేట్ అనే ఎస్టర్‌ను ఏర్పరుస్తుంది.
24. సపోనిఫికేషన్ చర్యను గురించి వివరించండి. (AS 1) 2 మార్కులు
జ: * కొవ్వులను సోడియం హైడ్రాక్సైడ్‌తో చర్య జరిపినప్పుడు ఫాటీ ఆమ్లాల సోడియం లవణాలు (సబ్బు), గ్లిజరాల్ ఏర్పడతాయి. ఈ చర్యను సపోనిఫికేషన్ చర్య అంటారు.
* ఉన్నత ఫాటీ ఆమ్లాల ట్రైఎస్టర్‌లను క్షారీకృత జలవిశ్లేషణం చేసినప్పుడు సబ్సు ఏర్పడటాన్ని సపోనిఫికేషన్ అంటారు.
25. మీథేన్ (CH4) సంకర ఆర్బిటాళ్ల నిర్మాణాన్ని చూపే పటాన్ని గీయండి. (AS 5) 2 మార్కులు
జ:
26. కింది ప్రమేయ సమూహాల పేర్లను రాయండి. (AS 1) 2 మార్కులు
i) - CHO ii) C = O iii) -OH iv) -COOH
జ: i) ఆల్డిహైడ్ ii) కీటోన్‌లు iii) ఆల్కహాల్ iv) ఆమ్లం
27. కింద ఇచ్చిన సమ్మేళనాల్లోని ప్రమేయ సమూహాలను గుర్తించి IUPAC పేర్లు రాయండి. (AS 1) 2 మార్కులు
జ: i) ఈ సమ్మేళన ప్రమేయ సమూహం పేరు ఆల్డిహైడ్.
దీని IUPAC పేరు 2 - క్లోరో - బ్యుటేన్ - 1 - ఓల్.
ii) ఈ సమ్మేళన ప్రమేయ సమూహం పేరు కీటోన్.
దీని IUPAC పేరు 3 - మీథైల్ 2 - బ్యుటనోన్.
28. i) CH3COOH + NaOH
ii) CH3 - CH = CH - CH3 + H2
పై రసాయన చర్యలను పూర్తి చేయండి. (AS 1) 2 మార్కులు
జ: i) CH3COOH + NaOH CH3COONa + H2O
ii) CH3 - CH = CH - CH3 + H2 CH3 - CH2 - CH2 - CH3
29. ఆల్కేన్‌ల సాధారణ ఫార్ములాను తెలిపి ఉదాహరణ ఇవ్వండి. (AS 1) 2 మార్కులు
జ: ఆల్కేన్‌ల సాధారణ ఫార్ములా CnH2n + 2
ఉదా: మీథేన్ (CH4)
ఈథేన్ (C2H6)
ప్రొపేన్ (C3H8)
బ్యూటేన్ (C4H10)
30. ఆల్కీన్‌ల సాధారణ ఫార్ములాను తెలిపి ఉదాహరణ ఇవ్వండి. (AS 1) 2 మార్కులు
జ: ఆల్కీన్‌ల సాధారణ ఫార్ములా CnH2n
ఉదా: ఈథీన్ (C2H4)
ప్రొపీన్ (C3H6)
బ్యూటీన్ (C4H8)
31. ఆల్కైన్‌ల సాధారణ ఫార్ములాను తెలిపి ఉదాహరణలివ్వండి. (AS 1) 2 మార్కులు
జ: ఆల్కైన్‌ల సాధారణ ఫార్ములా CnH2n - 2
ఉదా: ఈథైన్ (C2H2)
ప్రొపైన్ (C3H4)
బ్యూటైన్ (C4H6)
32. హాలో హైడ్రోకార్బన్‌ల సాధారణ ఫార్ములాను తెలిపి ఉదాహరణలివ్వండి. (AS 1) 2 మార్కులు
జ: హాలో హైడ్రోకార్బన్‌లు లేదా హాలోజన్ ఉత్పన్నాల సాధారణ ఫార్ములా
Cn H2n + 1 X లేదా R - X
ఉదా: మిథైల్ క్లోరైడ్ (CH3Cl)
ఇథైల్ క్లోరైడ్ (CH3CH2Cl)
33. కార్బాక్సిలిక్ ఆమ్లాల సాధారణ ఫార్ములాను తెలిపి ఉదాహరణలివ్వండి. (AS 1) 2 మార్కులు
జ: కార్బాక్సిలిక్ ఆమ్లాల సాధారణ ఫార్ములా R - COOH
ఉదా: ఫార్మిక్ ఆమ్లం (H - COOH)
ఎసిటిక్ ఆమ్లం ((CH3 - COOH)
34. ప్రాథమిక ఎమీన్‌ల సాధారణ ఫార్ములాను తెలిపి ఉదాహరణలివ్వండి. (AS 1) 2 మార్కులు
జ: ప్రాథమిక ఎమీన్‌ల సాధారణ ఫార్ములా R - NH2
ఉదా: మిథైల్ ఎమీన్ (CH3 - NH2)
ఇథైల్ ఎమీన్ (CH3CH2 - NH2)
35. కింది సమ్మేళనాల నిర్మాణాలు గీయండి.
i) 3 క్లోరో - 2 - మిథైల్ పెంటేన్
ii) 1, 3 - హెక్సా-డై-ఈన్-5-ఐన్ (AS 1) 2 మార్కులు
ii) CH ≡ C - CH = CH - CH = CH2
36. కింది సమ్మేళనాల IUPAC పేర్లు రాయండి. (AS 1) 2 మార్కులు
జ: i) 5, 5 - డై మిథైల్ - 1 - హెక్స్ ఈన్
ii) 3, 4 - డై క్లోరో 1 - బ్యూటీన్
37. హైడ్రోకార్బన్‌లను ఎన్ని తరగతులుగా విభజించారు? వివరించండి. (AS 1) 2 & 4 మార్కులు
జ: * కార్బన్, హైడ్రోజన్‌లను మాత్రమే కలిగి ఉన్న సమ్మేళనాలను హైడ్రోకార్బన్‌లు అంటారు.
* హైడ్రోకార్బన్‌లను రెండు రకాలుగా విభజించారు. అవి వివృత శృంఖల హైడ్రోకార్బన్‌లు, సంవృత శృంఖల హైడ్రోకార్బన్‌లు. వివృత శృంఖల హైడ్రోకార్బన్‌లను ఆలిఫాటిక్ లేదా అచక్రీయ హైడ్రోకార్బన్‌లని కూడా అంటారు.
ఉదా: CH3 - CH2 - CH2 - CH2 - CH3 (వివృత శృంఖల సమ్మేళనం)
* హైడ్రో కార్బన్‌లను (అలిఫాటిక్, చక్రీయ హైడ్రోకార్బన్‌లను కలిపి) ఆల్కేన్‌లు, ఆల్కీన్లు, ఆల్కైన్‌లు అని మూడు రకాలుగా వర్గీకరించారు.
* కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధాలను కలిగి ఉన్న హైడ్రోకార్బన్‌లను ఆల్కేన్‌లు అంటారు. (C - C)
* కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం ఉన్న హైడ్రోకార్బన్‌లను ఆల్కీన్‌లు అంటారు. (C = C)
* కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక త్రిబంధం ఉన్న హైడ్రోకార్బన్‌లను ఆల్కైన్‌లు (C ≡ C) అంటారు.
38. సంతృప్త, అసంతృప్త హైడ్రోకార్బన్‌లను గురించి వివరించండి. (AS 1) 2 మార్కులు
జ: * కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధాలున్న (C - C) హైడ్రోకార్బన్‌లను సంతృప్త హైడ్రోకార్బన్‌లు అంటారు.
ఉదా: ఆల్కేన్‌లు
* కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం లేదా త్రిబంధం ఉన్న హైడ్రోకార్బన్‌లను అసంతృప్త హైడ్రోకార్బన్‌లు అని అంటారు.
ఉదా: ఆల్కీన్‌లు, ఆల్కైన్‌లు
39. కార్బన్ స్ఫటిక, అస్ఫటిక రూపాంతరాలను తెలపండి. (AS 1) 2 మార్కులు
జ: * కార్బన్ రూపాంతరాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:
a) అస్ఫటిక రూపాలు
b) స్ఫటిక రూపాలు
* బొగ్గు, కోక్, కలప, చార్‌కోల్, జంతు చార్‌కోల్, నల్లని మసి, వాయురూప కార్బన్, పెట్రోలియం కోక్, చక్కెర చార్‌కోల్ లాంటివి కార్బన్ వేర్వేరు అస్ఫటిక రూపాంతరాలు.
* కార్బన్ స్ఫటిక రూపాంతరాలు మూడు. అవి:
a) వజ్రం
b) గ్రాఫైట్
c) బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్
40. సబ్బు అంటే ఏమిటి? సబ్బు ఫార్ములాను రాయండి. (AS 1) 2 మార్కులు
జ: * పామిటిక్ ఆమ్లం, స్టీరిక్ ఆమ్లం, ఓలియిక్ ఆమ్లం లాంటి ఉన్నత ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాన్ని సబ్బు అంటారు.
* సబ్బు సాధారణ ఫార్ములా R - COONa లేదా R - COOK. దీనిలో R = C15H31, C17H35.
41. సబ్బు కణం పటం గీయండి. (AS 5) ఒక మార్కు
42. మిసిలి పటాన్ని గీయండి. (AS 5) ఒక మార్కు
43. ఫుల్లరిన్ ఉపయోగాలు తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: ఫుల్లరిన్‌లను వైద్యరంగంలో అత్యధిక నిరోధకత ఉండే బ్యాక్టీరియాను అంతమొందించే విశిష్ట రోగ నిరోధక ఔషధంగా, మెలనోమా లాంటి క్యాన్సర్ కణాలను అంతమొందించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
44. నానోనాళాల ఉపయోగాలు తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: * నానో నాళాలు విద్యుత్ వాహకాలు. వీటిని అణు తీగలుగా ఉపయోగిస్తారు.
* సమీకృత వలయాల్లో రాగికి బదులుగా నానో ట్యూబ్‌లను అనుసంధాన తీగలుగా వాడుతున్నారు.
* శాస్త్రవేత్తలు జీవాణువులను సన్నని అతి పలుచని నానోట్యూబ్‌ల్లోకి పంపించి వాటి ద్వారా కణంలోకి ప్రవేశపెడతారు.
45. వెనిగర్ ఉపయోగాన్ని తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: వెనిగర్‌ను ఎక్కువగా పచ్చళ్లు నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
46. పెన్సిల్‌తో కాగితంపై రాసినప్పుడు, గ్రాఫైట్ కాగితంపై ఎలా రాస్తుంది? (AS 6) ఒక మార్కు
జ: మనం కాగితంపై పెన్సిల్‌తో రాసినపుడు గ్రాఫైట్ పొరల మధ్య బలహీన బలాలు వీగిపోయి గ్రాఫైట్ పొరలు కాగితంపై ఉండిపోతాయి. అదే మనకు రాతలాగా కాగితంపై కనిపిస్తుంది.
47. గ్రాఫైట్ ఉపయోగాలు తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: గ్రాఫైట్‌ను కందెనలుగా, పెన్సిల్ లెడ్‌గా ఉపయోగిస్తారు.
48. వజ్రం ఉపయోగాలను తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: * వజ్రాన్ని ఆభరణాల్లో ఖరీదైన రాళ్లుగా ఉపయోగిస్తారు.
* గాజును కోయడానికి, రాళ్లలో రంధ్రాలు చేయడానికి వజ్రాన్ని సానరాయిగా ఉపయోగిస్తారు.
49. వాహనాలకు మంచి ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తారు? (AS 6) ఒక మార్కు
జ: 10% ఇథనోల్ ఉన్న గాసోలిన్ ద్రావణం వాహనాలకు మంచి ఇంధనంగా పనిచేస్తుంది.
50. ఇథైల్ ఆల్కహాల్ ఉపయోగాలను తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: ఔషధాలైన టింక్చర్ ఆఫ్ అయోడిన్, దగ్గు టానిక్, ఇంకా అనేక టానిక్‌లలో ఇథైల్ ఆల్కహాల్‌ను ఉపయోగిస్తారు.
51. కిరోసిన్ స్టవ్‌పైన లేదా గ్యాసు పొయ్యిపైన వంట చేస్తున్నప్పుడు వంట పాత్రలపై నల్లని మసి ఏర్పడుతుంది. ఎందుకు? (AS 1) (AS 6) ఒక మార్కు
జ: గ్యాస్ లేదా కిరోసిన్ పొయ్యిలోని గాలి గదుల్లో ఏదైనా కారణం వల్ల అడ్డంకి ఏర్పడితే గాలిలో దహనం చెందడానికి ఇంధనానికి ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దాని ఫలితంగా ఇంధనం సంపూర్ణంగా దహనం చెందదు. అదే పాత్రలపై మసిగా ఏర్పడుతుంది.
52. ప్రకాశమంతమైన నీలిరంగు మంటలతో దహనం చెంది ఇంధనాలుగా ఉపయోగపడే హైడ్రోకార్బన్ లేవి? (AS 6) ఒక మార్కు
జ: సంతృప్త హైడ్రోకార్బన్‌లు
53. తృణధాన్య ఆల్కహాల్ అని దేన్ని అంటారు? (AS 6) ఒక మార్కు
జ: మొక్కజొన్న, గోధుమ, బార్లీ లాంటి తృణధాన్యాల నుంచి కూడా సాధారణంగా ఇథనోల్‌ను తయారు చేస్తారు. దీన్ని తృణధాన్య ఆల్కహాల్ అంటారు.
54. వెనిగర్‌లో ఉండే ఆమ్లం పేరేమిటి? (AS 1) ఒక మార్కు
జ: ఎసిటికామ్లం
55. సంకలన చర్యల్లో పాల్గొనే హైడ్రోకార్బన్‌లేవి? (AS 1) ఒక మార్కు
జ: అసంతృప్త హైడ్రోకార్బన్‌లు (ఆల్కీన్‌లు, ఆల్కైన్‌లు)
56. C, H, X లతో ఏర్పడే సమ్మేళనాలను ఏమంటారు? (AS 1) ఒక మార్కు
జ: హాలోహైడ్రోకార్బన్‌లు
57. కింది సమ్మేళనం పేరు తెలపండి. (AS 1) ఒక మార్కు
జ: 5 - క్లోరో 4, 6 - డై మిథైల్ సైక్లోహెక్సా - 1, 3 డై ఈన్ - 1 - ఓల్
58. ఇథనోల్ Naతో జరిపే చర్యను వివరించండి. (AS 1) ఒక మార్కు
జ: ఇథనోల్, లోహ సోడియంతో చర్యనొంది హైడ్రోజన్‌ను విడుదల చేస్తూ సోడియం ఇథాక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.
2 C2H5OH + 2 Na 2 C2H5ONa + H2
ఇథనోల్ సోడియం ఇథాక్సైడ్
59. డ్రైవర్ మద్యం తాగినట్లు నిర్ధారించడానికి ఉపయోగించే పదార్థం ఏది? (AS 6) ఒక మార్కు
జ: K2Cr2O7
జ: 2 - మిథైల్ 1 - బ్యుటీన్
మరిన్ని ప్రశ్నలు
1. CH4లో ఏ రకమైన సంకరీకరణం ఉంటుంది? (AS1) ఒక మార్కు
జ: sp3
2. CH4 అణువు ఆకృతి, బంధకోణాలను తెలపండి. (AS1) ఒక మార్కు
జ: చతుర్మిఖీయ ఆకృతి, బంధకోణం 109º.28'
3. ఈథీన్, ఇథైన్ అణువుల్లోని సంకరీకరణాలను తెలపండి. (AS1) ఒక మార్కు
జ: ఈథీన్‌లో sp2 సంకరీకరణం, ఇథైన్‌లో sp సంకరీ కరణం ఉంటుంది.
4. ఇథైన్‌లో రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఉన్న సిగ్మా (σ), పై (π) బంధాల సంఖ్య ఎంత? (AS1) ఒక మార్కు
జ: ఒక సిగ్మా (σ) బంధం, రెండు పై (π) బంధాలు
5. కింది అణువుల్లో దేనిలో కర్బనాల మధ్య దూరం తక్కువగా ఉంటుంది? (AS1) ఒక మార్కు
1) C2H6 2) C2H4 3) C2H2
జ: C2H2లో కర్బనాల మధ్య బంధదూరం తక్కువగా ఉంటుంది. దీనికి కారణం బహుబంధాలు ఎక్కువగా ఉండటమే.
6. బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్‌లో ఉండే సంకరీకరణం ఏది? (AS1) ఒక మార్కు
జ: sp2
7. బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్‌లో పంచముఖ, షణ్ముఖ ముఖాల సంఖ్య ఎంత? (AS1) ఒక మార్కు
జ: 12 పంచముఖ, 20 షట్ముఖ ఆకృతి ఉండే ముఖాలు ఉంటాయి.
8. యూరియా అణువు ఆకృతిని గీయండి. (AS5) ఒక మార్కు
9. అమ్మోనియం సయనేట్‌ని వేడిచేస్తే ఏర్పడే పదార్థం ఏది? (AS1) ఒక మార్కు
జ: యూరియా
10. ఏ రకమైన హైడ్రోకార్బన్‌లను సంతృప్త కర్బన సమ్మేళనాలు అంటారు? (AS1) ఒక మార్కు
జ: ఏక బంధం కలిగి ఉన్న (ఆల్కేన్‌లు) హైడ్రోకార్బన్‌లు సంతృప్త హైడ్రోకార్బన్‌లు.
11. ఆల్కైన్‌ల సాధారణ ఫార్ములాను తెలపండి. (AS1) ఒక మార్కు
జ: CnH2n - 2
12. ఆల్కహాల్‌ల ప్రమేయ సాదృశ్యాలు ఏవి? (AS1) ఒక మార్కు
జ: ఈథర్‌లు
ఉదా: CH3 - CH2 - OH CH3 - O - CH3
ఆల్కహాల్ ఈథర్
13. కిందివాటిలో ఏ అణువును బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్‌గా పిలుస్తారు? (AS1) ఒక మార్కు
C30, C60, C70, C90
జ: C60
14. కార్బన్, హైడ్రోజన్‌లతో ఏర్పడే సమ్మేళనాల సాధారణ నామాన్ని తెలపండి. (AS1) ఒక మార్కు
జ: హైడ్రోకార్బన్‌లు
15. కింద సూచించిన హైడ్రోకార్బన్‌లతో ఏర్పడే అణు సాదృశ్యాల సంఖ్య ఎంత? (AS1) ఒక మార్కు
(i) C4H10 (ii) C5H12
జ: i) రెండు
ii) మూడు
16. కార్బన్ ఏ రూపాంతరం పొరల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది? (AS1) ఒక మార్కు
జ: గ్రాఫైట్
17. గ్రాఫైట్‌లోని రెండు వరుస పొరల మధ్య దూరం ఎంత? (AS1) ఒక మార్కు
జ: 3.35 Aº
18. నానో నాళాలు (ట్యూబ్‌లు) కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? (AS1) ఒక మార్కు
జ: సుమియో లీజిమ
19. బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్ అనేది ఏ మూలకానికి చెందిన రూపాంతరం? (AS1) ఒక మార్కు
జ: కార్బన్
20. మనకు తెలిసిన పదార్థాలన్నింటిలోనూ అతి గట్టిపదార్థం ఏది? (AS1) ఒక మార్కు
జ: వజ్రం
21. గ్రాఫైట్ అనేది ఏ మూలకానికి చెందిన రూపాంతరం? (AS1) ఒక మార్కు
జ: కార్బన్
22. కిందివాటి సాధారణ ఫార్ములాలను తెలపండి. (AS1) 2 మార్కులు
i) ఆల్కేన్లు ii) ఆల్కీన్లు iii) ఆల్కైన్లు
జ: i) ఆల్కేన్లు : CnH2n + 2
ii) ఆల్కీన్లు : CnH2n
iii) ఆల్కైన్‌లు : CnH2n - 2
23. కింది సమ్మేళనాలను ఆల్కేన్‌లు, ఆల్కీన్‌లు, ఆల్కైన్‌లుగా వర్గీకరించండి. (AS1) 2 మార్కులు
C2H2, C2H4, C2H6, C3H6, C3H4, C3H8
జ: ఆల్కేన్లు : C2H6, C3H8
ఆల్కీన్లు : C2H4, C3H6
ఆల్కైన్‌లు : C2H2, C3H4
24. కింది సమ్మేళనాల్లో ఏది త్రికబంధాన్ని కలిగి ఉంటుంది? (AS1) ఒక మార్కు
C3H6, C3H8, C3H4
జ: C3H4
25. కింది సమ్మేళనాల్లో ఏది ద్విబంధాన్ని కలిగి ఉంటుంది?
C2H6, C3H4, C5H10 (AS1) ఒక మార్కు
జ: C5H10
26. కిందివాటిలో ఏది అసంతృప్త హైడ్రోకార్బన్?
C5H12, C3H8, C4H8 (AS1) ఒక మార్కు
జ: C4H8
27. కింది సమీకరణాలను పూర్తి చేయండి. (AS1) 2 మార్కులు
i) 2 C2H5OH + 2 Na
ii) 2 CH3COOH + 2 Na
జ: i) 2 C2H5OH + 2 Na 2 C2H5ONa + H2
ii) 2 CH3COOH + 2 Na 2 CH3COONa + H2
28. కింది సమీకరణాలను పూర్తి చేయండి. (AS1) 2 మార్కులు
29. కింది సమీకరణాలను పూర్తిచేసి, తుల్యం చేయండి. (AS1) 2 మార్కులు
30. 5, 6 - డై క్లోరో - ఆక్ట్ - 6, 7 - డై ఈన్ - 1, 2 - డై ఓల్ యొక్క నిర్మాణాన్ని రాయండి. (AS1) ఒక మార్కు
31. 3 - బ్రోమో - 1 - సైక్లో పెంటీన్ యొక్క నిర్మాణాన్ని రాయండి. (AS1) ఒక మార్కు
32. 3 - బ్రోమో - 2 క్లోరో - 5 - ఆక్సో - హెక్సానోయిక్ ఆమ్లం యొక్క నిర్మాణాన్ని గీయండి. (AS1) ఒక మార్కు
33. కింది సమ్మేళనాల IUPAC పేర్లు రాయండి. (AS1) 2 మార్కులు
జ: i) 2, 4, 6, 6 టెట్రామిథైల్ హెప్ట్ - 2 - ఈన్
ii) 5 - బ్రోమో - 2 - మిథైల్ - హెక్స్ - 1 - ఈన్ - 3 - ఐన్
34. కింది సమ్మేళనాల IUPAC పేర్లు రాయండి. (AS1) 2 మార్కులు
జ: i) 5 - క్లోరో - హెక్స్ - 3 - ఐన్ - 1 - ఆల్
ii) 2, 3 - డై మిథైల్ బ్యూట్ - 2 - ఈన్