• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కార్బన్ - దాని సమ్మేళనాలు 

1. ఇథనాల్ (ఇథైల్ ఆల్కహాల్) మానవాళికి మిత్రుడా లేదా శత్రువా మీ అభిప్రాయాలను తెలుపుతూ సరైన కారణాలు ఇవ్వండి. (AS 1) (AS 6) 4 మార్కులు


2. వజ్రం, గ్రాఫైట్ రెండూ కార్బన్ రూపాంతరాలే అయినప్పటికీ వాటి ధర్మాలు వేరుగా ఉంటాయని ఒక విద్యార్థి చెప్పాడు. అతడిని మీరు సమర్థిస్తారా? అయితే వజ్రం, గ్రాఫైట్‌లను పోల్చండి.  (AS 1) 4 మార్కులు


3. నానో నాళాల గురించి వివరించి, ఉపయోగాలు రాయండి.   (AS 1) 4 మార్కులు


4. ఈథీన్ (C2H4) అణువు సంకర ఆర్బిటాళ్ల నిర్మాణాన్ని చూపే పటాన్ని గీయండి. (AS 5) 4 మార్కులు


5. కార్బన్ సమ్మేళనాల ఎస్టరిఫికేషన్, సపొనిఫికేషన్ చర్యల మధ్య భేదాలను వివరించండి. (AS 1) 4 మార్కులు


6. కింది పట్టికను పూర్తి చేయండి.  (AS 4) 4 మార్కులు

వర్గం

ఫార్ములా

ద్వితీయ పూర్వ పదం

ద్వితీయ పర పదం

కీటోన్‌లు

- C = O

ఆక్సో

 

 

- CN

 

కార్బొనైట్రైల్

ఆల్కహాల్‌లు

 

హైడ్రాక్సీ

 

కార్బాక్సిలిక్ ఆమ్లాలు

- COOH

 

 

 

- OR

(R) ఆక్సీ

-

అమైన్‌లు

 

అమైనో

అమైన్

ఎస్టర్‌లు

- COOR

 

(R).. కార్బాక్సిలేట్

 

- CONH2

కార్బమైల్

 

ఆమ్ల హాలైడ్‌లు

 

 

కార్బొనైల్ హాలైడ్

ఆల్డిహైడ్‌లు

- CHO

 

కార్బాల్డిహైడ్

7.

 


i) పక్క పటం దేన్ని సూచిస్తుంది? వివరించండి.
ii) పక్క పటంలో భాగాలను గుర్తించండి.   (AS 5) 4 మార్కులు

i) పక్క పటం దేన్ని సూచిస్తుంది? వివరించండి.
ii) పక్క పటంలో భాగాలను గుర్తించండి. (AS 5) 4 మార్కులు

9. కింద ఇచ్చిన రెండు హైడ్రో కార్బన్‌ల నిర్మాణాలను పరిశీలించండి.
  
   (a) CH3 - CH2 - CH2 - CH3         (b) CH3 - CH - CH3
                                                                              |
                                                                           CH3

i) పై నిర్మాణాల IUPAC పేర్లను రాయండి.
ii) పై నిర్మాణాల్లో ఏం తేడాలను గమనించారు?  (AS 1) 4 మార్కులు

 

10. కింది సమ్మేళనాల IUPAC పేర్లు రాయండి.   (AS 1) 4 మార్కులు

11. కింది సమ్మేళనాల నిర్మాణాలు గీయండి.
i) 2, 3 - డై మిథైల్ - సైక్లోహెక్స్ఎన్ - 1 - ఓల్
ii) 3 - బ్రోమో - 2 - క్లోరో - 5 ఆక్సో హెక్సానోయిక్ ఆమ్లం
iii) 3, 4 - డై క్లోరో బ్యూట్ - 1 - ఈన్
iv) 3 - అమినో - 2 - బ్రోమోహెక్సేన్ - 1 - ఓల్  (AS 1) 4 మార్కులు


12. ఇథనోల్, ఇథనోయిక్ ఆమ్లాల మధ్య భేదాన్ని గుర్తించడానికి ఒక ప్రయోగాన్ని సూచించండి. (AS 3) 4 మార్కులు


13. జంతు సంబంధమైన కొవ్వులను వంటకు ఉపయోగించకూడదు అంటారు. ఎందుకు? (AS 1) (AS 6) 2 మార్కులు


14. వంట చేయడానికి ఏ నూనెలు మంచివి? ఎందుకు?  (AS 6) 2 మార్కులు


15. 'గ్రాఫిన్ ఒక కొత్త అద్భుతమైన పదార్థం'. సమర్థించండి.  (AS 6) 2 మార్కులు


16. C5H12 ఫార్ములాకు మూడు నిర్మాణాత్మక సాదృశ్యాలను రాయండి. (AS 1) 2 మార్కులు


17. C6H14 ఫార్ములాకు అయిదు నిర్మాణాత్మక సాదృశ్యాలను రాయండి.  (AS 1) 2 మార్కులు


18. ఈథర్ సాధారణ ఫార్ములా తెలిపి ఉదాహరణ ఇవ్వండి. (AS 1) 2 మార్కులు


19. ఎస్టర్‌ల సాధారణ ఫార్ములాను తెలిపి ఉదాహరణ ఇవ్వండి. (AS 1) 2 మార్కులు


20. దహన చర్యను ఒక ఉదాహరణతో వివరించండి. (AS 1) 2 మార్కులు
 

21. ఇథనాల్ Na తో జరిపే చర్యను వివరించండి.  (AS 1) 2 మార్కులు


22. వాహనాలు నడిపే వ్యక్తులు మద్యం సేవించారా లేదా అని పోలీసులు K2Cr2Oసహాయంతో ఎలా తెలుసుకుంటారు?  (AS 6) 2 మార్కులు


23. ఇథనోయిక్ ఆమ్లం (ఎసిటిక్ ఆమ్లం) సోడియం లోహంతో జరిపే చర్యను వివరించండి.  (AS 1) 2 మార్కులు


24. కింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి.
i) C2H6 + O2  CO2 + H2O
ii) CH3COOH + NaOH  CH3COONa + H2O
  (AS 1) 2 మార్కులు

i) పక్కన ఉన్న కర్బన సమ్మేళనాన్ని ఏమని పిలుస్తారు?
ii) దీన్ని మొదట ఎవరు తయారు చేశారు? (AS 4) 2 మార్కులు

26. ఆల్కేనులు, ఆల్కీనులు, ఆల్కైన్ లలో సంకలన చర్యలలో పాల్గొనే హైడ్రోకార్బన్‌ లేవి?  (AS 1) ఒక మార్కు
 

27. CH3COOH, CH4, C2H6, C2H5OH లలో ఏవి Na లోహంతో చర్యనొంది హైడ్రోజన్‌ను విడుదల చేస్తాయి? (AS 1) ఒక మార్కు


28. CH4, C4H10, C2H6, C2H4, C3H6, C4H8, C2H2, C4H6 లలో సంకలన చర్యల్లో పాల్గొనే హైడ్రోకార్బన్‌ లేవి?   (AS 1) ఒక మార్కు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం