లక్ష్యాత్మక ప్రశ్నలు
1. ప్రతి ఒక్కరి కోరికలు ఇలా ఇంటాయి.
1) ఒకేలా 2) వ్యతిరేకంగా 3) వేర్వేరుగా 4) ఏదీకాదు
2. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం వేట, సేకరణ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి?
1) 2,000 సంవత్సరాలు 2) 20,000 సంవత్సరాలు
3) 2,00,000 సంవత్సరాలు 4) 20,00,000 సంవత్సరాలు
3. 'కుడంకుళం' అనేది ఒక...
1) ప్రాంతం 2) చెట్టు 3) ఫ్యాక్టరీ 4) పక్షి
4. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం వ్యవసాయం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలైందని తెలుస్తోంది?
1) 12,000 సంవత్సరాలు 2) 1,20,000 సంవత్సరాలు
3) 1,200 సంవత్సరాలు 4) 120 సంవత్సరాలు
5. 'కుడంకుళం' ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఆంధ్రప్రదేశ్ 2) హిమాచల్‌ప్రదేశ్ 3) కర్ణాటక 4) తమిళనాడు
6. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం పారిశ్రామికీకరణ మొదలై ఎన్ని సంవత్సరాలైందని తెలుస్తోంది?
1) 40 సంవత్సరాలు 2) 400 సంవత్సరాలు 3) 4000 సంవత్సరాలు 4) 40,000 సంవత్సరాలు
7. కుడంకుళంలో ఏ విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టారు?
1) పవన విద్యుత్ 2) సౌర విద్యుత్ 3) థర్మల్ విద్యుత్ 4) అణు విద్యుత్
8. కుడంకుళంలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఎందుకు నిర్మించారు?
1) అణుబాంబుల తయారీకి 2) నిరుద్యోగుల కోసం
3) విద్యుత్ అవసరాలు తీర్చడానికి 4) ఇవేవీకాదు
9. కుడంకుళం ప్రాంత ప్రజలు ఎందుకు ఉద్యమించారు?
1) ఉద్యోగాలు లభించలేదని 2) జీతాలు ఎక్కువగా ఇవ్వాలని
3) ప్రజల భద్రత, రక్షణ కోసం 4) స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని
10. 'ఐవరీ కోస్ట్' దేశం ఏ ఖండంలో ఉంది?
1) ఆఫ్రికా 2) ఆసియా 3) ఆస్ట్రేలియా 4) ఐరోపా
11. 'అబిద్జాన్' అనే పట్టణం ఏ దేశంలో ఉంది?
1) దక్షిణాఫ్రికా 2) ఈజిప్టు 3) ఐర్లాండ్ 4) ఐవరీకోస్ట్
12. అబిద్జాన్‌లో దీనివల్ల ప్రమాదం జరిగింది.
1) సునామీ 2) పెనుతుపాను 3) వ్యర్థ పదార్థాలు 4) భూకంపం
13. ప్రజలు ఆదాయాన్నే కాకుండా ఏ ఇతర అంశాలను కూడా కోరుకుంటున్నారు?
1) స్వేచ్ఛ, భద్రత 2) స్వేచ్ఛ, సమానత్వం
3) సమానత్వం, భద్రత 4) సమానత్వం, స్వేచ్ఛ, భద్రత, గౌరవం
14. భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణం ఉంటే మహిళలు...
1) ఉద్యోగం చేయరు 2) ఉద్యోగం చేస్తారు
3) వ్యాపారాలు చేయరు 4) ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా చేస్తారు
15. దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికం
1) ఆదాయం 2) జనాభా 3) విస్తీర్ణం 4) సంస్కృతి
16. దేశవాసులందరి ఆదాయాన్ని కలిపి ఇలా పిలుస్తారు.
1) తలసరి ఆదాయం 2) జాతీయాదాయం 3) సంపాదిత ఆదాయం 4) అసంపాదిత ఆదాయం
17. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చే ఆదాయం.
1) సంపాదిత ఆదాయం 2) అసంపాదిత ఆదాయం 3) జాతీయాదాయం 4) తలసరి ఆదాయం
18. 2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను ఏమని పిలుస్తారు?
1) పేద దేశాలు 2) అతి పేద దేశాలు 3) ధనిక దేశాలు 4) మధ్య ఆదాయ దేశాలు
19. ఒక దశాబ్దం కిందట భారతదేశం ఈ జాబితాలో ఉండేది.
1) అతి తక్కువ ఆదాయ దేశాలు 2) తక్కువ ఆదాయ దేశాలు
3) ఎక్కువ ఆదాయ దేశాలు 4) సంపన్న దేశాలు
20. పశ్చిమాసియా దేశాలు, మరికొన్ని చిన్నదేశాలు మినహా ధనిక దేశాలను సాధారణంగా ఇలా పిలుస్తారు.
1) అభివృద్ధి చెందని దేశాలు 2) అభివృద్ధి చెందిన దేశాలు
3) అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు 4) అభివృద్ధి ఆగిన దేశాలు
21. శిశు మరణాలు లెక్కించడానికి ప్రామాణికంగా తీసుకునే పిల్లల సంఖ్య
1) సంవత్సర కాలంలో 100 మంది పిల్లలు 2) సంవత్సర కాలంలో 500 మంది పిల్లలు
3) సంవత్సర కాలంలో 1000 మంది పిల్లలు 4) సంవత్సర కాలంలో 2000 మంది పిల్లలు
22. ఈ రాష్ట్రంలో సగం మంది పిల్లలు కూడా బడికి వెళ్లడం లేదు.
1) ఆంధ్రప్రదేశ్ 2) హిమాచల్ ప్రదేశ్ 3) తమిళనాడు 4) బీహార్
23. శిశుమరణాలు తక్కువగా ఉండాలంటే..
1) ఆరోగ్య, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉండాలి 2) ఆరోగ్య సౌకర్యాలుండాలి
3) విద్యా సౌకర్యాలుండాలి 4) కుటుంబ నియంత్రణను పాటించాలి
24. మానవ అభివృద్ధి సూచిక సూచించే దేశాల సంఖ్య
1) 174 2) 175 3) 176 4) 177
25. 2013లో భారతదేశ తలసరి ఆదాయం ఎంత?
1) 3258 2) 3285 3) 3825 4) 3582
26. భారతదేశ ఆయుః ప్రమాణం ఎన్నేళ్లు?
1) 60.8 2) 62.8 3) 65.8 4) 68.5
27. ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారతదేశ స్థానం ఎంత?
1) 136 2) 137 3) 138 4) 139
28. ఈ రాష్ట్రంలో పాఠశాల విద్యను విప్లవంగా పరిగణిస్తున్నారు.
1) కేరళ 2) తమిళనాడు 3) ఉత్తరప్రదేశ్ 4) హిమాచల్ ప్రదేశ్
29. 2005 సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థికి ఎంత ఖర్చుపెట్టాయి?
1) రూ.1094 2) రూ.1904 3) రూ.1049 4) రూ.1409
30. లింగ వివక్షత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1) పంజాబ్ 2) హరియాణా 3) ఉత్తరాంచల్ 4) హిమాచల్‌ప్రదేశ్
31. అక్షరాస్యత శాతాన్ని గణించేటప్పుడు ఎన్ని సంవత్సరాలకు మించి వయసు ఉన్నవారిని లెక్కలోకి తీసుకుంటారు?
1) 5 2) 6 3) 7 4) 8
32. నికర హాజరు శాతం లెక్కించడానికి బడికి హాజరవుతున్న పిల్లల్లో ఏ వయసు వారి శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు?
1) 6 - 10 ఏళ్లు 2) 6 - 17 ఏళ్లు 3) 6 - 15 ఏళ్లు 4) 6 - 18 ఏళ్లు
33. 2005లో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం విద్యపై సగటున ప్రతి విద్యార్థికి ఎంత ఖర్చుచేసింది?
1) రూ.2005 2) రూ.2004 3) రూ.2003 4) రూ.2002
34. హిమాచల్‌ప్రదేశ్‌లో కిందివారిలో ఎవరు విద్యపై ఎంతో ఆసక్తి చూపారు?
1) విద్యార్థులు 2) ప్రభుత్వం 3) ప్రజలు 4) విద్యార్థులు, ప్రభుత్వం, ప్రజలు
35. UNDP అంటే
1) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి 2) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
3) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ 4) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రక్రియ
36. 2012 సంవత్సరానికి 1035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఇలా పిలుస్తున్నారు.
1) తక్కువ ఆదాయ దేశాలు 2) అధిక ఆదాయ దేశాలు
3) మధ్య ఆదాయ దేశాలు 4) ధనిక దేశాలు
37. కిందివాటిలో మానవ అభివృద్ధి నివేదికలోని ప్రామాణికం కాని అంశం ఏది?
1) తలసరి ఆదాయం 2) జాతీయాదాయం
3) విద్యాస్థాయి 4) ఆరోగ్యస్థితి
38. మానవాభివృద్ధి సూచికలో మంచి స్థానంలో ఉన్న మన పొరుగుదేశం
1) బంగ్లాదేశ్ 2) పాకిస్థాన్ 3) శ్రీలంక 4) నేపాల్
39. పోలికకు 'సగటు' ఉపయోగకరంగా ఉంటే ఇది వెల్లడి చేయదు.
1) ఆదాయాలను 2) దేశాల మధ్య అంతరాలను
3) ప్రజల మధ్య అంతరాలను 4) ఇవేవీకాదు
40. 2012లో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఏది?
1) పంజాబ్ 2) బీహార్ 3) ఆంధ్రప్రదేశ్ 4) హిమాచల్‌ప్రదేశ్
జవాబులు: 1-3; 2-3; 3-1; 4-1; 5-4; 6-2; 7-4; 8-3; 9-3; 10-1; 11-4; 12-3; 13-4; 14-4; 15-1; 16-2; 17-4; 18-3; 19-2; 20-2; 21-3; 22-4; 23-1; 24-4; 25-2; 26-3; 27-1; 28-4; 29-3; 30-4; 31-3; 32-2; 33-1; 34-4; 35-2; 36-1; 37-2; 38-3; 39-3; 40-1.