• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భారతదేశ శీతోష్ణస్థితి

బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. దేశంలోని వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయగలగడం
     A) సులభతరమైంది      B) వేగవంతమైంది      C) మరింత కష్టతరమైంది      D) ఇవేవీకావు

జ: C(మరింత కష్టతరమైంది)

 

2. ఒక ప్రాంతంలోని నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితులను ఏమంటారు?
జ: వాతావరణం

 

3. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాలపాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను ఏమంటారు?
జ: శీతోష్ణస్థితి

 

4. ప్రతి సంవత్సరం ....... సంవత్సరాలపాటు కనపడిన వాతావరణ పరిస్థితులను ఆ ప్రాంత శీతోష్ణస్థితి అంటారు.
జ: 30

 

5. శీతోష్ణస్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత (అత్యధిక, అత్యల్ప), వర్షపాతాలను వేటి ద్వారా చూపించవచ్చు?
జ: క్లైమాటోగ్రాఫ్

 

6. 'శీతోష్ణస్థితి కారకాలు' అంటే...
జ: శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలు

 

7. భూమధ్యరేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి?
జ: తగ్గుతాయి

8. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఏవి?
జ: ఉష్ణప్రాంతాలు

 

9. భారతదేశంలో దక్షిణ ప్రాంతం ఏ రేఖకు దగ్గరగా ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి?
జ: భూమధ్యరేఖ

 

10. భారతదేశం సుమారుగా ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
జ: 8° - 37° ఉత్తర అక్షాంశాలు

 

11. భారతదేశాన్ని ఇంచుమించు రెండు సమభాగాలుగా విభజించే రేఖ
జ: కర్కటరేఖ

 

12. ఏ ప్రాంతాలు సూర్యరశ్మిని తిరిగి వాతావరణంలోకి ప్రసరింపజేస్తాయి?
జ: మంచుతో కప్పబడిన ప్రాంతాలు

 

13. నిదానంగా వేడెక్కి, నిదానంగా చల్లారేవి
    A) సముద్రాలు     B) మైదానాలు     C) పర్వతాలు     D) తీరమైదానాలు

జ: A(సముద్రాలు)

 

14. సముద్రమట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత
జ: తగ్గుతుంది

15. కిందివాటిలో వేసవి విడిది కానిది
     A) సిమ్లా      B) నైనిటాల్      C) జైపూర్      D) డార్జిలింగ్

జ: C(జైపూర్)

 

16. కింది ఏ ప్రాంతాన్ని ఊటీ అని కూడా అంటారు?
     A) కొడైకెనాల్      B) గుల్మార్గ్      C) మౌంట్ అబు      D) ఉదగ మండలం

జ: D(ఉదగ మండలం)

 

17. 'ట్రేడ్' అనేది ఏ భాషా పదం?
జ: జర్మన్

 

18. 'ట్రాక్' అంటే...
జ: ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులు

 

19. భారతదేశం ఏ మేఖలలో ఉంది?
జ: శుష్క ఈశాన్య పవనాలు

 

20. జెట్ ప్రవాహం నేల నుంచి ....... మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది.
జ: 12,000

 

21. 25° ఉత్తర అక్షాంశం వద్ద ఏర్పడే తూర్పు జెట్ ప్రవాహం వల్ల ఏం జరుగుతుంది?
జ: ఉష్ణోగ్రత చల్లబడి, మేఘాలు వర్షిస్తాయి

22. భారతదేశంలో జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతాయి?
జ: ఉత్తర భారతదేశం

 

23. పశ్చిమ విక్షోభాలనే తుపాను, వాయుగుండాలు ఏ సముద్రం మీద నుంచి వస్తాయి?
జ: మధ్యధరా

 

24. కిందివాటిలో రబీ కాలంలో సాగు చేసే పంట
     A) వరి      B) చెరకు      C) వేరుశనగ      D) గోధుమ

జ: D(గోధుమ)

 

25. ఈశాన్య గాలుల వల్ల ఏ తీరప్రాంతంలో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది?
జ: కోరమాండల్ తీరం

 

26. భారతదేశంలో ఉత్తరాది మైదానాల్లో వీచే స్థానిక పవనాలు
జ: 'లూ' పవనాలు

 

27. తొలకరి జల్లులను ఆంధ్రప్రదేశ్‌లో స్థానికంగా ఏమని పిలుస్తారు?
జ: మామిడి జల్లులు

 

28. కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని 'మాన్‌సూన్' అని పేరుపెట్టినవారు
జ: అరబ్బులు

29. ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20° ఉత్తర - 20° దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి ఏర్పడతాయి.
     A) తుపానులు      B) వాయుగుండాలు      C) రుతుపవనాలు      D) వ్యాపార పవనాలు

జ: C(రుతుపవనాలు)

 

30. భారత ద్వీపకల్పం నైరుతి రుతుపవనాలను విభజించిన శాఖలు
జ: అరేబియా, బంగాళాఖాతం శాఖలు

 

31. భారతదేశంలో 'రుతుపవనారంభం' ఏ నెలలో జరుగుతుంది?
జ: జూన్

 

32. వేడిమి పెరుగుతున్న నెలల నుంచి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య సంధికాలంగా ఉండే నెలలు
జ: అక్టోబరు, నవంబరు

 

33. 'అక్టోబరు వేడిమి' అంటే...
జ: చాలా ఉక్కబోతగా ఉండే పరిస్థితి

 

34. బంగాళాఖాతంలో ఏ నెల ఆరంభంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయి?
జ: నవంబరు

 

35. ఏ తీరంలో తుపాను, వాయుగుండాల వల్ల అధిక శాతం వర్షం సంభవిస్తుంది?
జ: కోరమాండల్

36. భారత సంప్రదాయం ప్రకారం ..... నెలలు ఉండే ..... రుతువులుగా సంవత్సరాన్ని విభజించారు?
జ: 2, 6

 

37. 'హరితగృహ' ప్రభావం అంటే....
జ: వాతావరణం కొంత సౌరశక్తిని పట్టి ఉంచడం

 

38. మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని ఏమంటారు?
జ: AGW

 

39. AGW అంటే...
జ: ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్

 

40. ఉత్తర అక్షాంశాల వద్ద టండ్రాల కింద ఏ వాయువు ఉంది?
జ: మీథేన్

 

41. ప్రపంచ దేశాల మధ్య శీతోష్ణస్థితి మార్పుపై ఏర్పడిన అంతర ప్రభుత్వ సంఘం
జ: IPCC

 

42. 2013లో వాతావరణంలోని మార్పులను తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఎక్కడ సమావేశమయ్యాయి?
జ: పోలండ్

 

43. భూగోళం వేడెక్కడానికి దోహదం చేసే మానవ కారణ అంశాల్లో ఇదొకటి
     A) అడవులను పెంచడం      B) పరిశ్రమలను స్థాపించడం 
     C) వ్యవసాయం చేయడం      D) అడవులను నరికేయడం

జ: D(అడవులను నరికేయడం)

44. సగటు ఉష్ణోగ్రతలు 2° సెంటిగ్రేడులు పెరిగితే వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి సముద్ర మట్టం ఎంత పెరుగుతుంది?
జ: ఒక మీటరు

 

45. సుందర్‌బన్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన ఐలా తుపాను ఏ సంవత్సరంలో సంభవించింది?
జ: 2009

 

46. శీతోష్ణస్థితిలోని అంశాలు...
     A) ఉష్ణోగ్రత      B) వాతావరణ పీడనం      C) ఆర్ద్రత      D) పైవన్నీ

జ: D( పైవన్నీ)

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం