• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భారతదేశ న‌దులు - నీటి వనరులు 

బిట్లు

1. ప్రజల గృహ అవసరాలకు ఉపయోగించే నీటి శాతం?  (  )
     A) 5%      B) 10%      C) 15%      D) 20%

2. భారతదేశంలో ఎన్ని కోట్ల ఎకరాల భూమి వరద, కరవుకు గురయ్యే ప్రమాదంలో ఉంది? (  )
     A) ఒక కోటి      B) 2      C) 3      D) 4

3. ఉపరితల నీటి వనరుల్లో కలుషితమయ్యే నీటి శాతం ఎంత?  (  )
     A) 50%      B) 60%      C) 70%      D) 80%

4. కిందివాటిలో హిమాలయ నదులు ఏవి?  (  )
     A) గంగా, సింధు      B) గంగా, సింధు, బ్రహ్మపుత్ర      C) గంగా, బ్రహ్మపుత్ర      D) సింధు, బ్రహ్మపుత్ర

5. 'V' ఆకారపు లోతైన లోయలను ఎక్కడ చూడవచ్చు? (  )
     A) థార్ ఎడారి      B) దక్కన్ పీఠభూమి      C) తీరమైదానాలు      D) హిమాలయాలు

6. సింధు, బ్రహ్మపుత్ర నదుల్లో ఏ ఆకారపు లోయలు ఎక్కువగా కనిపిస్తాయి?   (  )
     A) 'V' ఆకారం      B) 'X' ఆకారం      C) 'Y' ఆకారం      D) 'S' ఆకారం

7. సంవత్సరమంతా నీరు ఉండే నదులు  (  )
     A) ద్వీపకల్ప నదులు      B) హిమాలయ నదులు      C) దక్షిణ నదులు      D) పశ్చిమాన పుట్టే నదులు

8. జీవనదుల్లో నిరంతరం నీరు ప్రవహించడానికి కారణం?  (  )
     A) వర్షపాతం      B) అధిక వర్షపాతం      C) మంచు కరగడం      D) వర్షపాతం, మంచు కరగడం

9. టిబెట్‌లోని మానస సరోవరం వద్ద ఉన్న కైలాస పర్వతాల్లో పుట్టిన నది    (  )
     A) గంగానది      B) బ్రహ్మపుత్ర      C) సింధూనది      D) ఈ నదులన్నీ

10. భారతదేశంలో సింధూనది ఎక్కడ ప్రవేశిస్తుంది? (  )
     A) ఉత్తరాఖండ్      B) జమ్మూ కశ్మీర్      C) ఉత్తర్ ప్రదేశ్      D) గుజరాత్

11. సింధూనది ఉపనదులు  (  )
     A) జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్      B) జీలం, చీనాబ్, కోసి, బియాస్, సట్లెజ్
     C) జీలం, రావి, గండక్, బియాస్, సట్లెజ్      D) జీలం, చీనాబ్, రావి, యమునా, సట్లెజ్

12. భారతదేశంలో సింధూనది ప్రవహించే రాష్ట్రాలు ఏవి?  (  )
     A) జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్    B) జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్
     C) జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా        D) పైవన్నీ

13. కిందివాటిలో రెండు నదులు కలయికతో ఏర్పడిన నది?  (  )
     A) సింధూనది      B) గంగానది      C) బ్రహ్మపుత్ర      D) నర్మద

14. భగీరథి, అలకనంద కలసి గంగానదిగా మారే ప్రాంతం?  (  )
     A) రుద్రప్రయాగ      B) డెహ్రాడూన్      C) దేవప్రయాగ      D) కర్ణప్రయాగ

15. గంగానది పర్వతాల నుంచి మైదానాల్లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది?(  )
     A) హరిద్వార్      B) రుషికేష్      C) కేదారీనాథ్      D) బదరీనాథ్

16. బ్రహ్మపుత్ర జన్మస్థలం (  )
     A) గంగోత్రి      B) బదరీనాథ్      C) యమునోత్రి      D) చెమయుంగ్‌డంగ్

17. టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు?  (  )
     A) సియాంగ్      B) సాంగ్‌పో      C) దిహాంగ్      D) దిబంగ్

18. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ప్రదేశ్‌లో నైరుతి దిశగా పెద్దమలుపు తిరిగిన చోట ఏమంటారు? (  )
     A) సియాంగ్, దిహాంగ్      B) దిబంగ్, దిహాంగ్      C) సియాంగ్, దిబంగ్      D) దిబంగ్, లోహిత్

19. దిబంగ్, లోహిత్ ఉపనదులు ఏ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిలో కలుస్తున్నాయి?  (  )
     A) అరుణాచల్‌ప్రదేశ్      B) మేఘాలయ      C) అసోం      D) సిక్కిం

20. ఏ రెండు నదులు తప్ప ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పు వైపునకు ప్రవహిస్తాయి?  (  )
     A) గోదావరి, కృష్ణ      B) కృష్ణ, కావేరి      C) గోదావరి, మహానది      D) నర్మద, తపతి

21. చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్ నదులు ఏ నదీ వ్యవస్థకు చెందినవి? (  )
     A) సింధూనది      B) గంగానది      C) ద్వీపకల్ప నది      D) ఏదీకాదు

22. ద్వీపకల్ప నదుల్లో పెద్దది, మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఉండే త్రయంబకం దగ్గర పుట్టిన నది  (  )
     A) గోదావరి      B) కృష్ణ      C) తుంగభద్ర      D) కావేరి

23. వాగులు, కాలువలు, నదులు లాంటి వాటిలోని నీటి ప్రవాహం (  )
     A) అంతర్గత ప్రవాహం      B) భూగర్భ ప్రవాహం     C) ఉపరితల ప్రవాహం      D) ఏదీకాదు

24. అవపాతం అంటే? (  )
     A) వాన, వడగళ్లు      B) హిమం      C) పొగమంచు      D) అన్నీ

25. అవపాతాన్ని లెక్కించడానికి సగటున ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి?(  )
     A) 1      B) 2     C) కొన్ని సంవత్సరాలు      D) చెప్పలేం

26. ఉపరితల నీటి వనరుల నుంచి నీరు ఆవిరి అవడాన్ని ఏమంటారు? (  )
     A) బాష్పీభవనం      B) అవపాతం      C) ప్రవాహం      D) నీటి ప్రవాహం

27. 'బాష్పోత్సేకం' అంటే? (  )
     A) మొక్కలు నీటిని గ్రహించడం       B) కిరణజన్య సంయోగక్రియ ద్వారా నీటి విడుదల
     C) అవపాత                         D) అన్నీ

28. భారతదేశంలో చాలా గ్రామాల్లో వేటి నుంచి నీటిని పొందుతున్నారు?  (  )
     A) బావులు      B) బోరుబావులు      C) ఈ రెండూ      D) ఏదీకాదు

29. భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఎందుకంటే?  (  )
     A) అవి వేల సంవత్సరాల కాలంగా నిల్వ ఉన్న నీరు      B) వాటిని భవిష్యత్ తరాలకు అందించాలి
     C) తీవ్ర కరవు పరిస్థితుల్లో ఉపయోగపడతాయి           D) పైవన్నీ

30. తుంగభద్ర జలాలను పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవి? (  )
     A) కర్నాటక, తమిళనాడు, తెలంగాణ      B) కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
     C) కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్      D) మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

31. తుంగభద్ర మొత్తం పరీవాహక ప్రాంతం ఎన్ని చ.కి.మీ.?   (  )
     A) 71,417      B) 61,417      C) 81,417      D) 51,417

32. 57,671 చ.కి.మీ. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది?    (  )
     A) తెలంగాణ      B) ఆంధ్రప్రదేశ్      C) కర్నాటక      D) తమిళనాడు

33. తుంగభద్ర ఏ నదికి ఉపనది? (  )
     A) గోదావరి      B) కృష్ణ      C) కావేరి      D) మహానది

34. వృక్ష, జంతు సంపద అంతరించిపోవడానికి కారణం  (  )
     A) చెట్లను నరకడం      B) గనులు తవ్వడం      C) మానవతప్పిదం      D) అన్నీ

35. చెట్లు లేకపోతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది?(  )
     A) భూగర్భ జాలలు తగ్గుతాయి      B) అకస్మాత్తుగా వరదలు వస్తాయి
     C) జంతుసంపద తగ్గుతుంది         D) పైవన్నీ

36. తుంగభద్ర ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తగ్గడానికి కారణం? (  )
     A) గనుల తవ్వకం, దుమ్ము      B) నేలకోత, వ్యర్థ పదార్థాలు      C) A, B      D) ఏదీకాదు

37. 50 ఏళ్ల కిందట తుంగభద్ర ఆనకట్ట సామర్థ్యం ఎంత? (కోట్ల ఘ.మీ.లలో)  (  )
     A) 376.6      B) 576.6      C) 276.6      D) 476.6

38. కుద్రేముఖ్‌లో ఇనుప ఖనిజం, శాండూర్ వద్ద మాంగనీస్ తవ్వకాల వల్ల ఏ నదీ పరీవాహక ప్రాంతంలో నేలకోత ఎక్కువైంది?   (  )
     A) గోదావరి      B) తుంగభద్ర      C) గంగానది      D) నర్మద

39. నీటిని ఎగువన నిల్వచేసినప్పుడు అది దిగువన ఉన్నవారికి అందేనీటిని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే?  (  )
     A) నీరు నిలకడగా ఉంటుంది      B) నీటిని కొనుక్కోవాల్సి వస్తుంది
     C) నీరు ప్రవహించే వనరు        D) అన్నీ

40. తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో పండే ప్రధాన పంటలు ఏవి?  (  )
     A) వరి, జొన్న      B) వరి, చెరకు      C) పత్తి, రాగులు      D) అన్నీ

41. కిందివాటిలో ఏ పంటకు ఎక్కువ నీరు కావాలి?  (  )
     A) వరి, చెరకు      B) జొన్న, పత్తి      C) సజ్జ, రాగులు      D) ఏదీకాదు

42. పారిశ్రామికీకరణ వల్ల   (  )
     A) కొంతమంది జీవన ప్రమాణాలు పెరిగాయి    B) కాలుష్యం పెరిగింది
     C) A, B                                    D) ఏదీకాదు

43. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న భారీ, చిన్నతరహా పారిశ్రామిక సంస్థల సంఖ్య?(  )
     A) 25,2540      B) 27,2543      C) 37,2500      D) 39,2800

44. పారిశ్రామిక సంస్థలు (  )
     A) కలుషిత జలాలను నదిలోకి వదలాలి      B) కలుషిత జలాలను వదలకూడదు
     C) కలుషిత జలాలను శుద్ధి చేసి వదలాలి      D) B, C

45. 'ఆదర్శ గ్రామ పథకం' కింద మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామం ఏది? (  )
     A) అహ్మద్ నగర్      B) హివారే బజార్      C) రాంపురం      D) దూబగుంట

46. హివారే బజార్ గ్రామంలో అమలు చేసిన నిషేదాలు  (  )
     A) చెట్లను నరకడం, మత్తు పానీయాలు సేవించడం.   B) పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం.
     C) అధిక సంతానం                                D) అన్నీ

47. భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు  (  )
     A) ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి      B) ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి కావు
     C) ఈ మధ్యకాలంలో చేసినవి          D) ఏదీకాదు

48. భూగర్భంలో ప్రవహిస్తున్న నీటికి సరిహద్దులు చూపడం  (  )
     A) వీలుపడదు      B) వీలు పడుతుంది     C) కొంత వరకు వీలుపడుతుంది      D) ఏదీకాదు

49. ప్రస్తుతం ప్రజలకు ప్రధానమైన నీటివనరు  (  )
     A) ఉపరితల ప్రవాహాలు      B) బోర్లు, బావులు      C) భూగర్భ జలాలు      D) B, C

50. 'నీటిని' ఎలా భావించాలి?  (  )
     A) భూ యజమానికి చెందిందిగా      B) ఉమ్మడి వనరుగా      C) ప్రజా ఆస్తిగా      D) B, C

51. రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భ జలాల వినియోగంపై విరుద్ధంగా చేస్తున్న పని  (  )
     A) విద్యుత్ సబ్సిడీలను పెంచడం             B) విద్యుత్ సబ్సిడీలు ఇవ్వకపోవడం
     C) కావాల్సినంత విద్యుత్ ఇవ్వకపోవడం      D) ఏదీకాదు

52. భూగర్భ జలాల వినియోగంపై పంచాయతీరాజ్ సంస్థల నియంత్రణ   (  )
     A) ఉండకూడదు      B) ఉండాలి      C) అప్పుడప్పుడూ ఉంటే చాలు      D) ఏవీ కావు

53. భూగర్భ జలాలకు సంబంధించి కేరళలోని ఏ గ్రామంలోని ప్రజలు న్యాయస్థానానికి వెళ్లారు? (  )
     A) మలయత్తూర్      B) కరుకుట్టీ      C) పెరుమట్టి      D) ముక్కానూర్

54. కిందివాటిలో సరైంది. (  )
1. లోట్సేత్సాంగ్ వద్ద బ్రహ్మపుత్ర నది జలప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పయిన నదిగా మారి 640 కి.మీ. ప్రవహిస్తుంది.
2. మహానది, గోదావరి, కృష్ణా, కావేరి ద్వీపకల్పంలోని ముఖ్యమైన నదులు.
     A) 1 మాత్రమే సరైంది      B) 2 మాత్రమే సరైంది     C) రెండూ సరైనవి కావు      D) రెండూ సరైనవే

55. కిందివాటిలో సరికాని జత ఏది? (  )
     A) గోదావరి - మానస సరోవరం      B) కృష్ణానది - మహాబలేశ్వరం 
     C) మహానది - సిహావా (ఒడిశా)     D) నర్మద, తపతి - అమరకంటక్, ముల్తాయ్

56. భూగర్భ జలాలకు సంబంధించి కిందివాటిలో సరికానిది? (  )
     1) భూ యజమానులకు ఇష్టమొచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వలేం.
     2) వీచే గాలికి సరిహద్దులకు నిర్ణయించడం కష్టం.
     3) ప్రభుత్వ భూములను సాగుకోసం ఆక్రమించు కోవడం వల్ల అటవీ విస్తీర్ణం తగ్గుతుంది.
     4) అడవులు నరకడం వల్ల భూగర్భ జలాలు తగ్గుతున్నాయి.
     A) 1, 4      B) 2, 3      C) 3      D) 2, 4

57. నదీ కాలుష్యానికి కారణం?   (  )
     A) పరిశ్రమలు      B) చెత్తను సక్రమంగా తొలగించక పోవడం      C) ప్రజల నిర్లక్ష్యం      D) అన్నీ
కింది నదులను పరిశీలించి సమాధానాలను గుర్తించండి.
    చంబల్,   సింధ్,   బేత్వా,   కేన్,   సోన్,   జీలం,   చీనాబ్,   రావి,   బియాస్,   సట్లెజ్

58. కిందివాటిలో గంగానదీ వ్యవస్థకు చెందిన నదులు   (  )
     A) జీలం, సట్లెజ్      B) చంబల్, సింధ్      C) రావి, బేత్వా      D) చీనాబ్, కేన్

59. బియాస్ ఏ నదికి ఉపనది?   (  )
     A) గంగ      B) బ్రహ్మపుత్ర      C) సింధు      D) గోదావరి

60. ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర భాగంలో పుట్టిన నది (  )
     A) సోన్      B) సట్లెజ్      C) రావి      D) జీలం


జ‌వాబులు: 1-A;   2-D;   3-C;   4-B;   5-D;  6-A 7-B;   8-D;   9-C;   10-B;   11-A;   12-A;   13-B;   14-C;   15-A;   16-D;   17-B;   18-A;   19-C;  20-D;   21-B;   22-A;   23-C;   24-D;   25-C;   26-A;   27-B;   28-C;   29-D;   30-C;   31-A;   32-C; 33-B;   34-D;   35-D;   36-C;   37-A;   38-B;   39-C;   40-D;   41-A;   42-C;   43-B;   44-D;   45-B;   46-D;   47-B;   48-A;   49-D;   50-D;   51-A;   52-B;   53-C;   54-D;   55-A; 56-C;   57-D;   58-B;   59-C;   60-A.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం