• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రపంచీకరణ

బిట్లు

1. ప్రపంచీకరణకు సంబంధించినవి.  (  )
     A) రాజకీయ కోణాలు      B) సంస్కృతిక కోణాలు        C) రాజకీయ, సంస్కృతిక కోణాలు      D) ఏదీకాదు

2. అంతర్జాతీయ ఆర్థిక మార్పిళ్లతో ఎన్ని రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు? (  )
     A) 3      B) 4      C) 2      D) 5

3. 'అరబ్ వసంతం' దేనికి సంబంధించింది? (  )
     A) గ్రీష్మ రుతువు                    B) నియంతలను తొలగించడానికి చోటు చేసుకున్న విప్లవాలు
     C) అరబ్‌దేశాల్లో జరిగే పండగ         D) హోళీ పండగ

4. నియంతల పాలనలో ఏ దేశాల్లో ప్రసార మాధ్యమాలు కీలక పాత్రను పోషించాయి? (  )
     A) ట్యునీషియా, నైజీరియా      B) నైజీరియా, ఈజిప్టు     C) సూడాన్, ఈజిప్టు      D) ట్యునీషియా, ఈజిప్టు

5. కిందివాటిలో సరైంది ఏది? (  )
     A) ప్రపంచీకరణ కేవలం మార్కెట్‌కే పరిమితమై ఉంది     B) ఆలోచనలు పంచుకుంటుంది
     C) భావాలు పంచుకొని విస్తృతమవుతుంది                D) బి, సి

6. ప్రపంచీకరణలో ప్రస్తుత దశ మొదలై ఎన్ని సంవత్సరాలైంది? (  )
     A) 10 − 20 సంవత్సరాలు           B) 20 − 30 సంవత్సరాలు
     C) 30 − 40 సంవత్సరాలు           D) 40 − 50 సంవత్సరాలు

7. 19వ శతాబ్దంలో ఏ అంశాలు వేగం పుంజుకున్నాయి? (  )
     A) విదేశీ వ్యాపారం               B) విదేశాల్లో పెట్టుబడులు
     C) కార్మికుల వలసలు             D) అన్నీ

8. వలస పాలకుల ప్రణాళికల్లో భాగంగా భారత్, చైనా దేశాలకు చెందిన లక్షలాది కార్మికులు ఏ పనులు ఎక్కువగా చేయడానికి వలస వెళ్లారు?   (  )
     A) తోటలు, గనులు, రోడ్లు, రైలు మార్గాల నిర్మాణ పనులు     B) తోటలు, గనుల్లో పని
     C) భవన నిర్మాణ పనులు                                 D) రోడ్లు, రైలు మార్గాల నిర్మాణ పనులు

9. భారతదేశానికి చెందిన కార్మికులు ఒప్పంద కూలీలుగా ఏఏ దేశాలకు వెళ్లారు? (  )
     A) కరేబియన్ దీవులు, ఇండోనేషియా దీవులకు
     B) కరేబియన్ దీవులు, మారిషస్, ఫిజీ, మలేషియా, శ్రీలంక దేశాలకు
     C) మారిషస్, ఫిజీ, మలేషియా, శ్రీలంక దేశాలకు
     D) పైవన్నీ

10. కిందివాటిలో సరైంది ఏది? (  )
     1) 20వ శతాబ్దం మధ్య భాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశం లోపల నిర్వహించేవారు
     2) ముడిసరకులు, ఆహార ధాన్యాలు, తయారీ వస్తువులను మాత్రమే దేశ సరిహద్దులు దాటించేవారు
     A) 1, 2 సరైనవి కావు      B) 1, 2 సరైనవే     C) 1 సరైంది      D) 2 సరైంది

11. బహుళజాతి సంస్థ (ఎమ్.ఎన్.సి)లు తమ సంస్థలను ఎక్కడ ఎక్కువగా నెలకొల్పుతాయి? (  )
     A) కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాలు     B) నైపుణ్యం ఉన్న కార్మికులున్న చోట
     C) రాజధాని నగరాల్లో                                    D) నైపుణ్యంలేని కార్మికులున్నచోట

12. ఎమ్.ఎన్.సి.లు వాటి వస్తువులను ఏ ప్రాంతాలకు విస్తరింపచేస్తాయి.  (  )
     A) మహానగరాలకు      B) కొన్ని ప్రాంతాలకు     C) ప్రపంచ వ్యాప్తంగా      D) ఏదీకాదు

13. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశంగా పేరుగాంచిన దేశం? (  )
     A) అమెరికా      B) రష్యా     C) భారతదేశం      D) చైనా

14. భారతదేశంలో వినియోగదారుల సేవ (కస్టమర్ కేర్) విభాగంలో ఎవరు ఎక్కువగా ఉంటారు? (  )
     A) తెలుగు బాగా మాట్లాడే విద్యావంతులైన యువత    B) హిందీ బాగా మాట్లాడే యువత
     C) బాగా చదువుకున్న యువత                      D) ఇంగ్లీషు మాట్లాడే విద్యావంతులైన యువత

15. బహుళజాతి సంస్థలకు ఖర్చుల్లో 50 - 60 శాతం ఆదా అవ్వడానికి కారణం  (  )
     A) తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశంగా చైనా ఉపయోగపడటం
     B) మెక్సికో, తూర్పు ఐరోపాలో అసెంబ్లింగ్ చేపట్టడం
     C) భారతదేశంలో కస్టమర్‌కేర్ సేవలను అందించడం
     D) పైవన్నీ

16. 'కార్గిల్ ఫుడ్స్' సంస్థ ఏ దేశానికి చెందింది   (  )
     A) అమెరికా      B) జర్మనీ      C) ఇంగ్లండ్      D) మెక్సికో

17. భారతదేశంలో చైనా బొమ్మలు అమ్మటం వల్ల వచ్చే ఫలితం   (  )
     A) భారతదేశానికి ఆదాయం బాగా వస్తుంది
     B) భారతీయ ఉత్పత్తిదారులు కొత్త మార్గాలను అన్వేషించవలసి వచ్చింది.
     C) చైనా తయారీదారులు నష్టపోయారు
     D) పైవన్నీ

18. ఆయా దేశాల్లో బహుళజాతి సంస్థలు వేటిని పెంచుతున్నాయి? (  )
     A) విదేశీ పెట్టుబడులు      B) విదేశీ వాణిజ్యం     C) విదేశీ పెట్టుబడులు, వాణిజ్యం      D) ఏదీకాదు

19. ప్రపంచీకరణ ప్రక్రియలో ఏవి ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి.  (  )
     A) ప్రత్యేక ఆర్థిక మండళ్లు               B) బహుళజాతి కంపెనీలు
     C) డబ్యూ.టి.ఒ., ఐ.బి.ఆర్.డి           D) ఐ.ఎమ్.ఎఫ్., ఐ.ఎఫ్.ఎ

20. వాణిజ్య అవరోధాలకు ఒక ఉదాహరణ   (  )
     A) రవాణా      B) వ్యవస్థాపకుడు      C) నైపుణ్యం      D) పన్ను

21. ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం  (  )
     A) ఇంటర్నెట్                                      B) సాంకేతిక పరిజ్ఞానం
     C) సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం      D) ఏదీకాదు

22. దీర్ఘకాల ప్రభావాన్ని చూపే భారతదేశ విదేశీ వాణిజ్య విధానాల్లో మార్పులు చేసిన సంవత్సరం (  )
     A) 1991      B) 1992      C) 1993      D) 1994

23. భారతీయ ఉత్పత్తిదారులు ప్రపంచ వ్యాప్త ఉత్పత్తిదారులతో పోటీపడాలంటే ఏం చేయాలి  (  )
     A) వస్తువుల ధరలు తగ్గించాలి                     B) వస్తువుల ధరలు పెంచాలి
     C) వస్తువుల నాణ్యతను మెరుగుపరచాలి      D) పెట్టుబడులు పెంచాలి

24. విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలు తొలగించడం అంటే?  (  )
   A) స్వేచ్ఛగా దిగుమతులు చేసుకోవడం                         B) స్వేచ్ఛగా ఎగుమతులను చేసుకోవడం
   C) విదేశీ కంపెనీలు కార్యాలయాలు, కర్మాగారాలను స్థాపించడం   D) పైవన్నీ

25. కర్బన ఉద్గారాలను తగ్గించాలంటే ఏం చేయాలి   (  )
     A) దేశాలన్నీ విడివిడిగా కృషి చేయాలి         B) దేశాలన్నీ కలిసి పరిష్కరించుకోవాలి
     C) కొన్ని దేశాలు పరిష్కరించుకుంటే చాలు     D) ఏదీకాదు

26. అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలపై పనిచేస్తున్న సంస్థ    (  )
     A) డబ్ల్యూ.టి.ఒ.      B) డబ్ల్యూ.హెచ్.ఓ.      C) యు.ఎన్.ఒ.      D) ఐ.ఎఫ్.ఎ.

27. అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలను కొనసాగిస్తున్న దేశాలు   (  )
      A) అభివృద్ధి చెందని దేశాలు                B) అభివృద్ధి చెందుతున్న దేశాలు
      C) అభివృద్ధి చెందిన దేశాలు                D) నిరుపేద దేశాలు

28. ప్రపంచీకరణ వల్ల ఏర్పడ్డ పరిణామాల్లో ఆలోచించాల్సిన అంశం  (  )
     A) పట్టణాల్లోని సంపన్నులకు మేలు జరగడం
     B) ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి, ధరలు తగ్గడం
     C) ప్రజలు మెరుగైన జీవణ ప్రమాణాలను అందించడం
     D) చిన్న ఉత్పత్తిదారులకు పెను సవాళ్లను సృష్టించటం

29. 'సెజ్‌'లలో ఉండే సౌకర్యాలు ఏవి?   (  )
     A) విద్యుత్తు, నీళ్లు      B) రోడ్లు     C) రవాణా, విద్య, వినోదం      D) అన్నీ

30. న్యాయపరమైన ప్రపంచీకరణ కోసం ఎవరు ముఖ్య పాత్ర పోషించాలి (  )
     A) బహుళజాతి సంస్థలు      B) ప్రజలు     C) ప్రపంచ వాణిజ్య సంస్థ      D) సంపన్నులు

31. ప్రపంచీకరణ వల్ల ప్రపంచ భాషలపై కొందరి భావన ఎలా ఉంది? (  )
     A) అన్నీ భాషలకు సమాన అవకాశాలు లభిస్తాయి       B) కొన్ని భాషలు అంతరించే ప్రమాదం ఉంది.
     C) కొత్త భాషలు పుట్టుకొస్తాయి.                      D) ఇవేమీ కావు

32. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు (  )
      A) జిమ్ యంగ్ కిమ్      B) క్రిస్టాలినా జార్జివె     C) పౌల్ పార్మర్      D) క్రిస్టినా లగార్డే

33. ప్రపంచీకరణ వల్ల ఏ రాజ్యాలు అంతరించిపోతాయని చర్చనీయాంశమైంది.  (  )
     A) ప్రపంచ      B) జాతీయ      C) వలస      D) అన్నీ

34. ప్రపంచ బ్యాంకులో అమెరికా ఓటుకున్న విలువ   (  )
     A) 13%      B) 14%      C) 15%      D) 16%

35. ప్రస్తుతం, దాదాపు అన్నీ రంగాల్లో ఏవి ప్రవేశించాయి  (  )
     A) ఫేస్‌బుక్      B) ట్విట్టర్      C) కంప్యూటర్      D) ఈమెయిల్

36. కార్గిల్ ఫుడ్స్(అమెరికా) సంస్థ, భారతదేశంలో కొనుగోలు చేసిన కంపెనీ పేరు (  ) 
     A) పారఖ్ ఫుడ్స్      B) షారూఖ్ ఫుడ్స్     C) హిందుస్థాన్ ఫుడ్స్      D) ప్రియ ఫుడ్స్

37. ప్రపంచీకరణ వల్ల వేటికి భంగం వాటిల్లుతుందని కొందరి భావన?  (  )
     A) ప్రజాస్వామ్యం      B) కార్మికుల హక్కులు     C) పర్యావరణం      D) అన్నీ

38. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (  )
     A) న్యూయార్క్      B) వాషింగ్టన్     C) అట్టావా      D) జెనీవా

39. ''ప్రపంచ వాణిజ్య సంస్థ" ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (  )
     A) లండన్      B) జెనీవా      C) మాస్కో      D) బెర్లిన్

40. అమెరికా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను చాలా తక్కువ ధరలకు అమ్మటానికి గల కారణం  (  )
     A) పంటలు బాగా పండటం                         B) నాణ్యమైన విత్తనాలు వాడటం
     C) అమెరికా ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం           D) ఏదీకాదు

జవాబులు: 1-C;  2-A;  3-B;  4-D;  5-D; 6-C;  7-D;  8-A;  9-B; 10-B;  11-A;  12-C;  13-D;  14-D;  15-D;  16-A;  17-B;  18-C;  19-B;  20-D;  21-C;  22-A;  23-C;  24-D;  25-B;  26-A;  27-C;  28-D; 29-D;  30-B;  31-B;  32-A;  33-B;  34-D; 35-C;  36-A;  37-D;  38-B;  39-B;  40-C.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం