• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం (1900 - 1950)

 లక్ష్యాత్మక ప్రశ్నలు

I.

1. 20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా  (  )
1) 100 కోట్లు      2) 160 కోట్లు      3) 200 కోట్లు      4) 260 కోట్లు


2. పారిశ్రామికంగా అగ్రభాగాన ఉన్నదేశం (  )
1)  అమెరికా       2) బ్రిటన్             3) రష్యా               4) జపాన్


3. ఎరిక్ హాబ్స్‌బామ్ ఎన్నో శతాబ్దాన్ని 'తీవ్ర సంచలనాల యుగం'గా పేర్కొన్నాడు? (  )
1) 18                2) 19                3) 20                   4) 21


4. 1914వ సంవత్సరం దేనికి సంబంధించింది?  (  )
1) మొదటి ప్రపంచ యుద్ధం             2) వర్సెయిల్స్ సంధి
3) రెండో ప్రపంచ యుద్ధం              4) ఇండియా - పాకిస్థాన్ యుద్ధం


5. రెండో ప్రపంచ యుద్ధంలో గెలుపొందిన దేశాలేవి?  (  )
1) జర్మనీ, ఇటలీ               2) బ్రిటన్, ఫ్రాన్స్
3) జర్మనీ, బ్రిటన్               4) ఇటలీ, ఫ్రాన్స్

6. శాంతి కోసం జర్మనీపై విధించిన షరతులు ----- యుద్ధానికి దారితీశాయి.  (  )
1) రెండో ప్రపంచ యుద్ధం                 2) మొదటి ప్రపంచ యుద్ధం
3) ఇండో - చైనా యుద్ధం                 4) ఏదీకాదు


7. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినవారి సంఖ్య   (  )
1) నాలుగు కోట్ల మంది                   2) మూడు కోట్ల మంది
3) రెండు కోట్ల మంది                       4) కోటి మంది


8. రెండో ప్రపంచ యుద్ధంలో ఏ నగరాలపై అమెరికా అణుబాంబు వేసింది  (  )
1) టోక్యో, నాగసాకి, హిరోషిమా          2) నాగసాకి, హిరోషిమా
3) నాగసాకి, టోక్యో                    4) హిరోషిమా, టోక్యో


9. నాగసాకి, హిరోషిమా నగరాలు ఏ దేశంలో ఉన్నాయి?  (   )
1) రష్యా               2) చైనా             3) జపాన్                4) ఫిలిఫ్పైన్స్


10. రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించిన అణుబాంబు వల్ల ఏ సమస్యలు దశాబ్దాల పాటు కొనసాగాయి? (  )
1) ఎయిడ్స్, క్యాన్సర్                       2) ఎయిడ్స్, ల్యుకేమియా
3) క్యాన్సర్, డయేరియా                    4) ల్యుకేమియా, క్యాన్సర్


11. అక్ష/ కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశం  (  )
1) ఇటలీ             2) జర్మనీ          3) జపాన్                 4) ఆస్ట్రియా

12. మిత్రరాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశాలు   (  )
1) ఫ్రాన్స్, అమెరికా, రష్యా                        2) చైనా, అమెరికా, రష్యా
3) పోలండ్, అమెరికా, రష్యా                      4) బ్రిటన్, అమెరికా, రష్యా


13. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలవ్యవధి ఎన్నేళ్లు? (  )
1) 19 సంవత్సరాలు                2) 20 సంవత్సరాలు
3) 21 సంవత్సరాలు                4) 22 సంవత్సరాలు


14. ఆస్ట్రియా పక్షాన ఏ దేశాలు యుద్ధంలో చేరడంతో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది? (  )
1) జర్మనీ, ఇటలీ                         2) జపాన్, జర్మనీ
3) జపాన్, ఇటలీ                        4) జర్మనీ, టర్కీ


15. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సంవత్సరం  (  )
1) 1918            2) 1919            3) 1938            4) 1939


16. జర్మనీ ఛాన్స్‌లర్ బిస్మార్క్ ఏ దేశాన్ని ఒంటరి చేయాలని చూశాడు? (  )
1) ఇటలీ            2) అమెరికా        3) ఫ్రాన్స్             4) టర్కీ


17. బిస్మార్క్ 1879, 1882లలో ఏ దేశాలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు? (  )
1) ఆస్ట్రియా, ఇటలీ                         2) ఇటలీ, టర్కీ
3) టర్కీ, జపాన్                          4) జపాన్, ఫ్రాన్స్

18. ఫ్రాన్స్ 1891, 1940 లలో ఏ దేశాలతో సంబంధాలు కుదుర్చుకుంది?   (  )
1) అమెరికా, రష్యా                       2) రష్యా, బ్రిటన్
3) బ్రిటన్, ఫ్రాన్స్                         4) ఫ్రాన్స్, బెల్జియం


19. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఏ సంవత్సరంలో మిత్రదేశాల కూటమిగా ఏర్పడ్డాయి? (  )
1) 1905             2) 1906             3) 1907            4) 1908


20. వర్సెయిల్స్ శాంతి సమావేశంలో హాజరైన వివిధ దేశాల ప్రతినిధి బృందాల సంఖ్య  (  )
1) 12                       2) 24                       3) 32             4) 64


21. నానాజాతి సమితి ఏ దేశాల దురాక్రమణలను నివారించలేకపోయింది? (  )
1) అమెరికా, రష్యా                     2) జర్మనీ, ఇటలీ
3) ఫ్రాన్స్, జపాన్                      4) ఫ్రాన్స్, ఇటలీ


22. బ్రిటన్, ఫ్రాన్స్‌ల కూటమికి వ్యతిరేకంగా నిలిచినవాడు   (  )
1) ఉడ్రో విల్సన్         2) ముస్సోలినీ            3) లెనిన్         4) హిట్లర్


23. ఏ దేశాల చేతిలో ఐక్యరాజ్యసమితి కీలుబొమ్మగా మారిందనే అపవాదులున్నాయి? (  )
1) అమెరికా, రష్యా                         2) బ్రిటన్, ఫ్రాన్స్
3) జర్మనీ, ఇటలీ                           4) జపాన్, చైనా

II. కింది ఖాళీలను పూరించండి.

1. ............ త్రైపాక్షిక కూటమి, ............మిత్రరాజ్యాల వల్ల యూరప్‌లో సాయుధశాంతి, భయ వాతావరణం నెలకొన్నాయి.

2. భద్రతకు సైనికశక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మడాన్ని ............ అంటారు.

3. మొదటి ప్రపంచ యుద్ధం 1919లో ............ శాంతి సమావేశంతో ముగిసింది.

4. యుద్ధాలను నివారించడానికి వర్సెయిల్స్ ఒప్పందం ............ ను ఏర్పాటు చేసింది.

5. నానాజాతిసమితి ఏర్పాటుకు చురుకైన పాత్ర వహించినవాడు ............ .

6. 1934లో నానాజాతి సమితిలోని సభ్యుల సంఖ్య ............

7. నానాజాతి సమితి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సంక్షేమ సంస్థలు ............

8. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిన ............ దేశాన్ని శిక్షించాలని, మళ్లీ కోలుకోకుండా దెబ్బతీయాలని మిత్రదేశాలు భావించాయి.

9. ............ వల్ల జర్మనీ తిరిగి వేగంగా పారిశ్రామికీకరణ చెందింది.

10. రష్యాలో 1917లో విప్లవం సంభవించి ............ ప్రభుత్వం ఏర్పడింది.

11. రెండో ప్రపంచ యుద్ధంలో మరణించినవారిలో అధికశాతం ............ ఏళ్లలోపు వయసున్న పురుషులే.

12. రెండు ప్రపంచ యుద్ధాల వల్ల ............, ............, ఆయుధాల పోటీ పెరిగింది.

13. మొదటి ప్రపంచ యుద్ధంతో జర్మనీ లాంటి దేశాలు రాచరికం నుంచి బయటపడి ............ గణతంత్రంగా ఏర్పడ్డాయి.

14. టర్కీలో ఓట్టోమాన్ సామ్రాజ్య స్థానంలో ............, ............ ప్రభుత్వం ఏర్పడింది.

15. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతి సమితి ............ .

16. 'యునిసెఫ్' అంటే ............ .

17. 'యునెస్కో' అంటే ............

18. 'డబ్ల్యూహెచ్‌వో' అంటే ............

19. చరిత్రలో మొదటిసారిగా, మొదటి ప్రపంచయుద్ధంలో బాంబులు వేయడానికి ............ ఉపయోగించారు.


III. జతపరచండి.

                      A                                                                                                                               B

i) 1. మొదటి ప్రపంచ యుద్ధ విజేతలు                             (  )                 A) రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ 

2. వర్సెయిల్స్ శాంతి సమావేశానికి  ఆహ్వానం అందని దేశాలు        (  )                 B) జర్మనీ, రష్యా, ఆస్ట్రియా ఇటలీ,  ఫ్రాన్స్, బ్రిటన్

3. వర్సెయిల్స్ సంధి ప్రకారం జర్మనీ  వదులుకున్న ప్రాంతాలు        (  )                 C) రష్యా, జర్మనీ

 4. 1880-1914 నాటి ఆరు ప్రధాన శక్తులు                          (  )                 D) ఆల్వాస్, లోరైన్

5. నానాజాతి సమితిలో చేరడానికి ఆహ్వానం అందని దేశాలు          (  )                 E) అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్
                      A                                                                               B

ii) 1. సోవియట్ సోషలిస్టు దేశాల సమాఖ్య              ( )       A) 1942

  2. జర్మనీ, రష్యాల ఒప్పందం                        ( )       B) 1918

 3. రష్యాపై హిట్లర్ దండెత్తాలనే నిర్ణయం               ( )       C) 1924

 4. బ్రిటిష్ మహిళలకు ఓటుహక్కు లభించిన సంవత్సరం  ( )       D) 1939
 
జవాబులు

I.  1-2; 2-2; 3-3; 4-1; 5-2; 6-1; 7-4; 8-2; 9-3; 10-4; 11-2; 12-4; 13-3; 14-1; 15-4; 16-3; 17-1; 18-2; 19-3; 20-3; 21-2; 22-4; 23-1.

II.  1. జర్మనీ, ఫ్రాన్స్           2. సైనికవాదం     3. వర్సెయిల్స్             4. నానాజాతి సమితి 

    5. ఉడ్రో విల్సన్            6. 58    7. ఆరోగ్యం, కార్మిక సంక్షేమ సంస్థలు  8. జర్మనీ 

   9. నాజీల          10. కమ్యూనిస్టుల ప్రభుత్వం     11. 40           12. అణుబాంబులు, రసాయనిక 

   13. వైమర్        14. ప్రజాస్వామ్య, లౌకిక    15. ఐక్యరాజ్యసమితి      16. బాలల అత్యవసర నిధి 

  17. విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ   18. ప్రపంచ ఆరోగ్య సంస్థ  19. విమానాలను

III. i) 1-E; 2-A; 3-D; 4-B; 5-C.

   ii) 1-C; 2-D; 3-A; 4-B.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం