• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వలసపాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు

1. యూరప్‌లో ఏ భావనలతో ప్రజలు స్ఫూర్తి పొందారు? 
   A) జాతీయతావాదం       B) ప్రజాస్వామ్యం       C) సోషలిజం       D) అన్నీ

జ: D (అన్నీ)
 

2. 20వ శతాబ్దం ఆరంభంలో మంచూవంశ చక్రవర్తులు ఏ దేశాన్ని పాలిస్తూ ఉండేవారు?
జ: చైనా
 

3. చైనా చక్రవర్తిపై వలస పాలకులు ఏ విషయాలపై ఒత్తిడి తేగలిగారు?
  (1) తక్కువ దిగుమతి పన్నులు చెల్లించడం       (2) చైనా చట్టాలు తమకు వర్తించకపోవడం
  (3) సైనిక దళాలను కలిగి ఉండటం              (4) చైనా చక్రవర్తిపై ఆంక్షలు విధించడం

జ: (1), (2), (3)
 

4. మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసినవారు-
జ: సన్-యెట్-సెన్
 

5. చైనాలో సన్-యెట్-సెన్ గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం-
జ: 1911

6. సన్-యెట్-సెన్ ఒక ...............
జ: ఆధునిక చైనా నిర్మాత
 

7. సన్-యెట్-సెన్ చేపట్టిన సన్, మిన్, చుయి అంటే ................
   A) జాతీయతావాదం       B) ప్రజాస్వామ్యం      C) సామ్యవాదం       D) అన్నీ

జ: D (అన్నీ)
 

8. సామ్యవాదం అంటే...
జ: భూసంస్కరణలు
 

9. చైనాలో స్థానిక సైనిక శక్తులను ఇలా పిలిచేవారు
జ: యుద్ధ ప్రభువులు
 

10. సన్-యెట్-సెన్ చనిపోయిన తర్వాత ఎన్నికైన గుయో మిండాంగ్ పార్టీ నాయకుడు ఎవరు?
జ: చియాంగ్ కైషేక్
 

11. కెన్‌సారో వివా ఒక ..............
జ: మానవ హక్కుల కార్యకర్త, పర్యావరణవాది
 

12. ఈ సుగుణాలపై మహిళలు శ్రద్ధ పెట్టాలని చియాంగ్ భావించాడు.
జ: పాతివ్రత్యం, రూపం, మాట, పని

13. ఆడవారు ధరించే గౌనులు ఎంత పొడవు ఉండాలనే విషయంపై సిఫారసు చేసినవాడు-
జ: చియాంగ్
 

14. 1937లో చైనాపై ఏ దేశం దండెత్తినప్పుడు గుయో మిండాంగ్ పార్టీ వెనకడుగు వేసింది?
జ: జపాను
 

15. చైనా కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1921
 

16. చైనాలో ఏ పార్టీలో మావో జెడాంగ్ పనిచేశాడు?
జ: సీసీపీ
 

17. మావో జెడాంగ్ ఎవరిని ఆధారంగా చేసుకుని విప్లవాన్ని నడిపాడు?
జ: రైతులను
 

18. రైతు సైన్యాన్ని తయారుచేసింది ఎవరు?
జ: మావో జెడాంగ్
 

19. మావో జెడాంగ్ వివాహానికి సంబంధించి వేటిని అమలు చేశాడు?
    A) పెద్దలు కుదిర్చిన వివాహాలను నిషేధించాడు
    B) వివాహ ఒప్పంద పత్రాల కొనుగోలు, అమ్మకాలను నిలిపివేశాడు
    C) కొత్త వివాహ చట్టాన్ని చేశాడు          

    D) అన్నీ
జ: D (అన్నీ)

20. షాంక్సికి 6000 మైళ్ల కష్ట భూయిష్ట ప్రయాణ (లాంగ్ మార్చ్) కాలం-
జ: 1934 - 35
 

21. ఏ కారణంగా గుయో మిండాంగ్, సీసీపీ చేతులు కలిపాయి?
జ: జపాను ఆక్రమణను ప్రతిఘటించడానికి
 

22. గుయో మిండాంగ్‌కు ఏ దీవిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడింది?
జ: తైవాన్
 

23. చైనాలో గణతంత్రం ఏర్పడిన సంవత్సరం-
జ: 1949
 

24. చైనాలో భూసంస్కరణ వల్ల ఏ పరిస్థితులు ఏర్పడ్డాయి?
    A) రైతు సంఘాలు ఏర్పడ్డాయి                        B) మధ్య తరగతి రైతులు ఆధిపత్యంలోకి వచ్చారు
    C) విచారణలో భూస్వాములకు మరణశిక్ష విధించారు    D) అన్నీ

జ: D (అన్నీ)
 

25. వియత్నాం ఏ దేశ ప్రత్యక్ష పాలన కింద ఉండేది?
జ: ఫ్రెంచి
 

26. వియత్నాంను ఏ పంటను ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చేయాలని ఫ్రెంచి ఆసక్తి చూపింది?
జ: వరి

27. 1931 నాటికి వియత్నాం బియ్యం ఎగుమతిలో ఏ స్థానంలో ఉంది?
జ: మూడో
 

28. అన్నాం అనే ప్రాంతంలో ఎంత శాతం కుటుంబాలకు అసలు ఏ మాత్రం భూమిలేదు?
జ: 53 శాతం
 

29. 1930లో వీరు ఆకలికి గురయ్యారు.
జ: కూలీలు, భూమి ఉన్న కుటుంబీకులు
 

30. వియత్నాం ప్రజలకు విద్య నేర్పడానికి ఫ్రెంచివారు ఎందుకు భయపడ్డారు?
జ: తమ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తారని
 

31. వియత్నాంలో పాఠ్య పుస్తకాలు ఎలా ఉండేవి?
జ: ఫ్రెంచివారిని పొడుగుతూ, వలస పాలనను సమర్థించేవి
 

32. వియత్నాంలో ఉన్నత విద్య ఏ భాషలో ఉండేది?
జ: ఫ్రెంచ్
 

33. వియత్నాం ఉపాధ్యాయులు పాఠాలు ఇలా చెప్పేవారు?
    A) పాఠ్యాంశాలను అనుసరించలేదు                   B) పాఠ్యాంశాలను మార్చేసేవారు
    C) ఫ్రెంచి ప్రభుత్వాన్ని విమర్శించేవారు               D) అన్నీ

జ: D (అన్నీ)

34. వియత్నాం విద్యార్థులు ఎప్పుడు యువ అన్నాం పార్టీని స్థాపించారు?
జ: 1920
 

35. వియత్నాంలో అన్నామీన్ స్టూడెంట్ ప్రతికను ఎవరు ప్రచురించారు?
జ: విద్యార్థులు
 

36. ఆధునిక విద్యకోసం వియత్నాం విద్యార్థులు ఏ దేశం వెళ్లేవారు?
జ: జపాను
 

37. 1930 నాటి ఆర్థిక మాంద్యంవల్ల వియత్నాంలో ఏ పరిస్థితి ఏర్పడింది?
జ: నిరుద్యోగం పెరిగింది
 

38. వియత్నాంలో జాతియతా బృందాలను కలిపి వియత్నాం కమ్యూనిస్టు పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు?
జ: హూచిమిన్
 

39. కిందివాటిలో దేన్ని వియత్ మిన్‌గా పిలుస్తారు?
   A) వియత్నాం కమ్యూనిస్టు పార్టీ             B) వియత్నా స్వాతంత్య్ర సమితి
   C) వియత్నాం సమితి                       D) ఇవేమీ కాదు

జ: B (వియత్నా స్వాతంత్య్ర సమితి)
 

40. హూచిమిన్ దేనికి ఛైర్మన్‌గా వ్యవహరించాడు?
జ: ప్రజాస్వామ్య గణతంత్రం
 

41. ఎప్పుడు డీన్ బీన్‌పు వద్ద ఫ్రెంచి ఓడిపోయింది?
జ: 1954

42. ఫ్రెంచివారు ఓడిపోయిన తర్వాత శాంతి సంప్రదింపులు ఎక్కడ జరిగాయి?
జ: జెనీవా
 

43. జాతీయ విముక్తి సమాఖ్యను సంక్షిప్తంగా ఏమంటారు?
జ: ఎన్.ఎల్.ఎఫ్.
 

44. ఎన్.ఎల్.ఎఫ్. దేనికోసం పోరాడింది?
జ: వియత్నాంను ఏకం చేయడానికి
 

45. అమెరికా తన సైన్యాన్ని, ఆయుధాలను ఉత్తర వియత్నాంకు ఎందుకు పంపింది?
జ: వియత్నాంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని
 

46. ఏజెంట్ ఆరెంజ్ అంటే ...........
జ: విషపదార్థం
 

47. నాపాలం అనేది ఒక ...............
జ: ప్రమాదకరమైన బాంబు
 

48. చిన్నదేశమైన వియత్నాం అమెరికాను ఓడించడానికి కారణం
జ: జాతీయతా భావంతో ప్రేరణ పొందిన రైతులు వియత్నాంలో ఉండటం
 

49. 1974 జనవరిలో ఇక్కడ జరిగిన శాంతి ఒప్పందంతో అమెరికా వియత్నాంపై యుద్ధం ముగించింది.
జ: ప్యారిస్

50. ఎన్.ఎల్.ఎఫ్. వియత్నాంను ఒకటిగా చేసిన సంవత్సరం
జ: 1975
 

51. ఏ తెగ ప్రజలు నైజీరియాలో ఉన్నారు?
   A) హౌసా - పులాని          B) ఈబో         C) యొరుబా         D) అన్నీ

జ: D (అన్నీ)
 

52. నైజర్ నదీ ప్రాంతం దేనికి ప్రసిద్ధి?
జ: అధిక జన సాంద్రతకు
 

53. అమెరికాకు బానిసలను సరఫరా చేయడంలో ప్రధాన కేంద్రంగా ఉన్న దేశం ఏది?
జ: నైజీరియా
 

54. నైజీరియాలో బ్రిటిషర్లు ఏ తెగలపై విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని ప్రయోగించారు?
జ: ఈబో, యొరుబా, హౌసాపులాని
 

55. 1923లో నైజీరియాలో నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీని ఎవరు స్థాపించారు?
జ: మకాలే
 

56. ఎన్.ఎన్.డి.పి. పార్టీ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకున్న సంవత్సరం -
    A) 1923          B) 1928          C) 1933          D) అన్నీ

జ: D (అన్నీ)

57. ఎన్ నంది అజికివై నైజీరియా యువ ఉద్యమాన్ని (ఎన్.వై.ఎం.) ఏ సంవత్సరంలో స్థాపించాడు?
జ: 1936
 

58. నైజీరియా, కామెరూన్‌ల జాతీయ సంఘాన్ని ఏర్పాటు చేసినదెవరు?
    1. మకాలే         2. చియాంగ్         3. అజికివె         4. హూచిమిన్

జ: 1, 3
 

59. నైజీరియా స్వాతంత్య్రం ఎప్పుడు పొందింది?
జ: 1963 అక్టోబరు 1
 

60. నైజీరియాకు ముఖ్యమైన వనరు -
జ: చమురు
 

61. నైజర్ డెల్టాలో చమురును ఎప్పుడు కనుక్కున్నారు?
జ: 1950

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం