• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ఖాళీలు 

1. వ్యక్తి అభివృద్ధికి తోడ్పడేవిగా భారత రాజ్యాంగంలో పేర్కొన్నవి ....
2. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ .....
3. ''ఏ దేశమైనా సరే దాని ఒక్కదానికే బాధ్యత వహిస్తే సరిపోదు అని మేము నమ్ముతున్నాం..." అని పేర్కొన్న రాజ్యాంగ ప్రవేశిక .....
4. భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు .....
5. భారత ద్వంద్వ రాజ్య తంత్ర విధానం ..... దేశ రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది.
6. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు .....
7. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగసభ ఆమోదించిన తేదీ ......
8. ''భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్తు ఒక బృందానికో లేదా ఒక వర్గానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితమైంది కాదు. ఇది దేశ 40 కోట్ల జనాభాకు సంబంధించింది" అని రాజ్యాంగ సభలో ప్రకటించినవారు ....
9. ప్రజల నుంచి సూచనలు, విమర్శలు, స్పందనలు తెలుసుకునే నిమిత్తం భారత రాజ్యాంగ ముసాయిదాను ...... నెలలు ప్రజల ముందు ఉంచారు.
10. భారతదేశంలో అమల్లో ఉన్న ప్రభుత్వ విధానం ......
11. రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ...... గా పేర్కొంది.
12. భారత రాజ్యాంగం ..... అనే పదాలతో ప్రారంభమవుతుంది.
13. భారత రాజ్యాంగంలోని ఎక్కువ అంశాలు .... చట్టంలోనివి.
14. రాజ్యాంగ సవరణలు చేసే అధికారం .....కు ఉంటుంది.
15. రాజ్యాంగ మౌలిక సూత్రాలను సవరించడానికి వీలులేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కేసు .....

సమాధానాలు: 1. ప్రాథమిక హక్కులు  2. 1950, జనవరి 26     3. జపాన్ రాజ్యాంగ ప్రవేశిక
4. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్   5. అమెరికా   6. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్   7. 1949, నవంబరు 26
8. జవహర్‌లాల్ నెహ్రూ    9. 8
   10. పార్లమెంటరీ విధానం   11. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
12. భారత ప్రజలమైన మేము   13. భారత ప్రభుత్వ చట్టం - 1935   14. పార్లమెంటు
15. కేశవానంద భారతి కేసు

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం