• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భారతదేశ జాతీయోద్యమం - దేశవిభజన, స్వాతంత్య్రం : 1939 - 47

బిట్లు

1. బ్రిటిషు పార్లమెంటు 'భారత ప్రభుత్వ చట్టాన్ని' ఎప్పుడు ఆమోదించింది? (   )
     A) 1935      B) 1937      C) 1938      D) 1940


2. 1937లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ఘనవిజయం సాధించింది? (   )
     A) కమ్యూనిస్టు పార్టీ      B) ముస్లిం లీగ్      C) కాంగ్రెస్ పార్టీ      D) ఏదీకాదు


3. కిందివాటిలో సరికానిది.    (   )
A) 1937 ఎన్నికల్లో 11 రాష్ట్రాలకు 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన మంత్రులు ఎన్నికయ్యారు.
B) బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాలు పంచుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వాలతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంది.
C) కాంగ్రెస్ నాయకులు హిట్లర్‌ని, ముస్సోలినిని వ్యతిరేకించారు.
D) కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939 అక్టోబరులో రాజీనామా చేశాయి.

4. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధాని   (  )
    A) ఎలిజబెత్      B) మార్గరెట్ థాచర్      C) ఫ్రెడరిక్      D) విన్‌స్టన్ చర్చిల్

 

5. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.    (  )
     i) కాంగ్రెస్ భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించడం లేదని బ్రిటన్ భావం.
     ii) అనేక మంది భారతీయుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని బ్రిటన్ భావించింది.
     A) i సరైంది      B) ii సరైంది      C) i, ii సరైనవే      D) i, ii సరైనవికావు

 

6. 'విభజించి - పాలించు' అనే సిద్ధాంతాన్ని అనుసరించిన దేశం    (  )
     A) బ్రిటన్      B) అమెరికా      C) రష్యా      D) జర్మనీ

 

7. తిరగబడుతున్న భారతీయులను బలహీనపరచడానికి బ్రిటన్ ఏం చేసింది?  (  )
     A) ముస్లిం లీగ్ ప్రణాళికలకు మద్దతు ఇచ్చింది.            B) కాంగ్రెస్‌కు ప్రాముఖ్యాన్ని తగ్గించింది.
     C) 'విభజించి - పాలించు' సూత్రాన్ని అనుసరించింది.      D) అన్నీ

 

8. 'ముస్లిం లీగ్‌'ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?   (  )
     A) 1904      B) 1905      C) 1906      D) 190

9. ముస్లింల కోసం ప్రత్యేక నియోజక వర్గాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? (  )
     A) 1909      B) 1908      C) 1907      D) 1906

 

10. ముస్లిం లీగ్‌కు ఆదరణ లభించిన ప్రాంతాలు    (  )
     A) యునైటెడ్ ప్రావిన్స్      B) బాంబే      C) మద్రాసు      D) అన్నీ

 

11. హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)ల ఆశయం (  )
     A) బ్రిటిష్‌వారిని పారద్రోలడం                           B) హిందువులను ఏకం చేయడం
     C) సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావడం     D) B, C

 

12. 'సారే జహాసే అచ్ఛా హిందూస్థాన్ హమారా' కవిత రచయిత   (  )
     A) మహ్మద్ అలీ జిన్నా      B) మహ్మద్ ఇక్బాల్     C) చౌదరీ రహ్మత్ అలీ      D) మహ్మద్ రఫీ

 

13. 'చౌదరీ రహ్మత్ అలీ' ఏ దేశం పేరును రూపొందించాడు?   (  )
     A) పాకిస్థాన్      B) పాక్‌స్థాన్      C) ఆఫ్ఘనిస్థాన్      D) A, B

 

14. మహ్మద్ అలీ జిన్నా ఏ పార్టీ నాయకుడు?    (  )
     A) కాంగ్రెస్      B) కమ్యూనిస్టు      C) ముస్లిం లీగ్      D) ముస్లిం కాంగ్రెస

15. 1941 నాటికి జపాన్ ఏ ప్రాంతాన్ని విస్తరించింది?(  )
     A) వాయవ్య ఆసియా      B) ఈశాన్య ఆసియా     C) ఆగ్నేయ ఆసియా      D) అన్నీ

 

16. 1942 మార్చిలో బ్రిటన్ మంత్రి 'సర్ స్టాఫర్డ్ క్రిప్స్' భారతదేశానికి రావడానికి కారణం (  )
     A) గాంధీజీ, కాంగ్రెస్‌తో రాజీకోసం                  B) ముస్లిం లీగ్‌తో రాజీ కోసం
     C) కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల మధ్య సఖ్యతకు        D) అన్నీ

 

17. క్విట్ ఇండియా (1942 ఆగస్టు) అంటే?   (  )
     A) త్వరలో ఇండియా వదిలి వెళ్లమని      B) ఇండియాను శాంతంగా ఉంచమని
     C) భారతదేశం వదిలి వెళ్లండి             D) మా దేశాన్ని మాకు ఇవ్వండి

 

18. క్విట్ ఇండియా ఉద్యమంలోని సంఘటనలు  (  )
     A) గాంధీజీని జైలులో పెట్టడం      B) ఆస్తి నష్టం     C) యువత కళాశాలలను వదిలి పెట్టడం      D) అన్నీ

 

19. 'భారత జాతీయ సైన్యాన్ని' (ఐ.యన్.ఎ.) తయారు చేసినవారు  (  )
     A) సర్దార్ వల్లభాయ్ పటేల్      B) గాంధీజీ      C) సుభాష్ చంద్రబోస్      D) గోపాలకృష్ణ గోఖలే

20. సుభాష్ చంద్రబోస్ కిందివారిలో ఎవరిని ఐ.యన్.ఎ.గా తయారు చేశారు?   (  )
     A) జపాన్‌లోని సైనికులను     B) జపాన్‌లో యుద్ధబందీలుగా ఉన్న బ్రిటిష్ సైనికులను
     C) భారతీయ సైనికులను       D) భారతదేశంలోని యువతను

 

21. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణం  (   )
     A) అక్రమ నిల్వలు, ధరల పెరుగుదల       B) ఆహార ధాన్యాల కొరత
     C) ఆహార కోటాలు                       D) అన్నీ

 

22. రాయల్ నౌకాదళంలోని భారత సైనికుల నిరాహారదీక్షకు కారణం  (  )
     A) నాసిరకం ఆహారం, తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన.     B) యుద్ధ ఆయుధాల్లో నాణ్యత లేకపోవడం.
     C) భారతదేశం వదలి వెళ్లమనడం.                            D) అన్నీ

 

23. రాయల్ నౌకాదళ సైన్యం తిరుగుబాటులో ఉపయోగించిన జెండాలు   (  )
     A) మూడు రంగుల జెండా      B) నెలవంక; కత్తి, సుత్తి ఉన్న జెండాలు
     C) A, B                     D) మూడు రంగుల జెండా, నెలవంక జెండ

24. 'తెభాగ' ఉద్యమంలో రైతుల కోరికలు   (  )
     A) తమ వాటాను మూడింట ఒకవంతు ఇవ్వాలని     B) మూడింట రెండు వంతులకు పెంచాలని
     C) సగానికి సగం ఇవ్వాలని                         D) ఏదీకాదు

 

25. ముస్లిం లీగ్ భారతీయ ముస్లింల 'ఏకైక ప్రతినిధి' అనే వాదనను నిజం చేసిన ఎన్నికలు (  )
     A) 1930 ఎన్నికలు      B) 1946 ఎన్నికలు     C) 1935 ఎన్నికలు      D) 1945 ఎన్నికలు

 

26. 1946లో కేబినెట్ మిషన్ ప్రతిపాదించిన మూడంచెల సమాఖ్యపై అభిప్రాయాలను ఎలా తెలియజేశారు?  (  )
     A) మొదట్లో అన్ని ప్రధాన పార్టీలు అంగీకరించాయి.
     B) వివిధ పార్టీలు పరస్పర విరుద్ధమైన పద్ధతిలో అర్థం చేసుకున్నాయి.
     C) కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఆమోదించలేదు.
     D) అన్నీ

 

27. ముస్లిం లీగ్ పాకిస్థాన్‌ను సాధించుకోవడానికి ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ఏ రోజును ప్రకటించింది? (  )
     A) 1946, ఆగస్టు 16      B) 1945, ఆగస్టు 16     C) 1947, జులై 16      D) 1947, ఆగస్టు 14

28. 1947 మార్చిలో ఏ రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం సమ్మతించింది? (  )
     A) కాశ్మీర్      B) పంజాబ్      C) మైసూర్      D) హైదరాబాద్

 

29. 1947 ఫిబ్రవరిలో వేవెల్ స్థానంలో ఎవరు వైస్రాయ్‌గా వచ్చారు?   (  )
     A) విల్లింగ్‌టన్      B) క్రిప్స్      C) వెల్లస్లీ      D) మౌంట్‌బాటన్

 

30. ఆఖరి దఫా చర్చలు విఫలం కావడంతో మౌంట్‌బాటన్ ఇచ్చిన ప్రకటన  (  )
     A) స్వాతంత్య్రాన్ని ఇవ్వడం, దాంతోపాటు దేశాన్ని విభజించడం.     B) స్వాతంత్య్రాన్ని ఇవ్వడం.
     C) దేశాన్ని విభజించడం.                                       D) ఏదీకాదు

 

31. దేశం విడిపోయిన తర్వాత పాకిస్థాన్‌లో ఉన్న ప్రాంతాలు  (  )
    A) ముస్లింలు అధికంగా ఉన్న పంజాబ్, ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ     B) సింధ్, పశ్చిమ్ బెంగాల్
     C) సింధ్, బెలూచిస్తాన్, తూర్పు బెంగాల్                 D) A, C

 

32. బ్రిటిషు ప్రభుత్వం భారత్, పాకిస్థాన్‌లకు అధికార బదిలీలు ఎప్పుడు చేసింది?     (  )
     A) 1947 ఆగస్టు 15న పాకిస్థాన్, భారత్‌కు         B) 1947 ఆగస్టు 14న పాకిస్థాన్‌కు, 15న భారత్‌కు
     C) 1947 ఆగస్టు 14న పాకిస్థాన్‌కు, భారత్‌కు       D) ఏదీకాదు

33. దేశ విభజన జరిగిన తర్వాత జరిగిన సంఘటనలు   (  )
     A) ఆస్తి, ప్రాణ నష్టం జరిగాయి; ఇరువర్గాల వారు అశాంతికి గురయ్యారు.
     B) హిందువులు, ముస్లింలు సంతోషించి, వేడుకల్లో పాల్గొన్నారు.
     C) ముస్లింలు మాత్రమే సంతోషించారు.
     D) దేశమంతా ప్రశాంతంగా ఉంది.

 

34. కిందివాటిలో సరికానిది? (  )
     A) కాంగ్రెస్ పార్టీ 'రెండు దేశాల సిద్ధాంతాన్ని' అంగీకరించలేదు.
     B) దేశ విభజనకు బలవంతంగా ఒప్పుకుంది.
     C) పూర్వంలాగే కొనసాగాలని విశ్వసించింది.
     D) దేశ విభజనను పట్టించుకోలేదు.

 

35. 'ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను బలికావాల్సి వస్తే, నవ్వుతూ అందుకు సిద్ధం' అన్నవారు?  (  )
     A) గాంధీజీ      B) జవహర్‌లాల్ నెహ్రూ     C) సర్దార్ వల్లభాయ్ పటేల్      D) సుభాష్ చంద్రబోస్

36. గాంధీజీ వర్ధంతిని ఎప్పుడు నిర్వహిస్తారు? (  )
     A) డిసెంబరు 30      B) జనవరి 30     C) అక్టోబరు 2      D) అక్టోబరు 30

 

37. బ్రిటిష్‌వారి అధికారం కింద భారతదేశంలోని సంస్థానాల సంఖ్య?  (  )
     A) 450      B) 550      C) 650      D) 750

 

38. భారతదేశంలో సంస్థానాల విలీన ప్రక్రియను ఎవరికి అప్పగించారు?  (  )
     A) గాంధీజీ      B) జవహర్‌లాల్ నెహ్రూ     C) సర్దార్ వల్లభాయ్ పటేల్      D) గోపాలకృష్ణ గోఖలే

 

39. 1947, ఆగస్టు 15 నాటికి భారత్‌లో కలవని సంస్థానాలు?   (  )
     A) కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్     B) కాశ్మీర్, రాయగఢ్, హైదరాబాద్
     C) కాశ్మీర్, మైసూర్, జునాగఢ్         D) హైదరాబాద్, మీరజ్, మైసూర్

 

40. భారత ప్రభుత్వం రాజాభరణాన్ని, రాచరిక కుటుంబాల బిరుదులను ఎప్పుడు రద్దు చేసింది?  (  )
     A) 1971      B) 1947      C) 1956      D) 1950

జవాబులు:  1-A;  2-C;  3-B;  4-D;  5-C;  6-A;  7-D;  8-C; 9-A;  10-D;  11-D;  12-B;  13-D;  14-C;  15-C;  16-A;  17-C;  18-D;  19-C;  20-B;  21-D;  22-A;  23-C;  24-B;  25-B;  26-D;  27-A;   28-B;  29-D;  30-A;  31-D;  32-B;  33-A;  34-D;  35-A;   36-B;  37-B;  38-C;  39-A;  40-A.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం