బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. నీలి లిట్మస్‌ను ఎర్రగా మార్చే పదార్థాలు
A) ఆమ్లాలు B) క్షారాలు C) లవణాలు D) తటస్థ పదార్థాలు
2. ఎర్ర లిట్మస్‌ను నీలిరంగులోకి మార్చే పదార్థాలు
A) ఆమ్లాలు B) క్షారాలు C) లవణాలు D) తటస్థ పదార్థాలు
3. జలద్రావణంలో H+ అయాన్లను ఇచ్చేవి
A) ఆమ్లాలు B) క్షారాలు C) లవణాలు D) తటస్థ పదార్థాలు
4. జల ద్రావణంలో OH- అయాన్లను ఇచ్చే పదార్థం
A) ఆమ్లం B) క్షారం C) లవణం D) తటస్థ పదార్థం
5. నీటి అణువు H+ అయాన్‌ను గ్రహించి దేన్ని ఏర్పరుస్తుంది?
A) OH- B) H3O+ C) H2O+ D) H2O-
6. జలద్రావణంలో ఎక్కువ సంఖ్యలో H+ అయాన్లను ఇచ్చే పదార్థం
A) బలమైన ఆమ్లం B) బలహీన ఆమ్లం C) బలమైన క్షారం D) బలహీన క్షారం
7. జలద్రావణంలో తక్కువ సంఖ్యలో H+ అయాన్లను ఇచ్చే పదార్థం
A) బలమైన ఆమ్లం B) బలహీన ఆమ్లం C) బలమైన క్షారం D) బలహీన క్షారం
8. జల ద్రావణంలో ఎక్కువ సంఖ్యలో OH- అయాన్లను ఇచ్చే పదార్థం
A) బలమైన ఆమ్లం B) బలహీన ఆమ్లం C) బలమైన క్షారం D) బలహీన క్షారం
9. జలద్రావణంలో తక్కువ సంఖ్యలో OH- అయాన్లను ఇచ్చే పదార్థం
A) బలమైన ఆమ్లం B) బలహీన ఆమ్లం C) బలమైన క్షారం D) బలహీన క్షారం
10. కిందివాటిలో అత్యంత బలమైన ఆమ్లం ఏది?
A) HNO3 B) H2SO4 C) HCl D) HClO4
11. కిందివాటిలో బలమైన క్షారం
A) LiOH B) NaOH C) KOH D) NH4OH
12. కిందివాటిలో బలహీన క్షారం
A) NH4OH B) NaOH C) KOH D) LiOH
13. కిందివాటిలో బలహీన ఆమ్లం -
A) H2SO3 B) H2SO4 C) HCl D) CH3COOH
14. pH మానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త -
A) ఛార్లెస్ B) సోరెన్ సన్ C) బోర్ D) అర్హీనియస్
15. ఒక ద్రావణం pH విలువ సున్నా అయితే అది
A) బలమైన ఆమ్లం B) బలహీన ఆమ్లం C) బలమైన క్షారం D) బలహీన క్షారం
16. శుద్ధజలం pH విలువ -
A) 5 B) 0 C) 9 D) 7
17. ఒక ద్రావణం pH విలువ 13.8 అయితే అది -
A) బలమైన క్షారం B) బలమైన ఆమ్లం C) బలహీన క్షారం D) బలహీన ఆమ్లం
18. Na2CO3, HCl ఆమ్లంతో చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు-
A) CO2 B) H2O C) N2 D) H2
19. జతపరచండి.
1) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ a) CaOCl2
2) జిప్సం b)
3) బ్లీచింగ్ పౌండర్ c) Na2CO3
4) వాషింగ్ సోడా d) CaSO4. 2 H2O
A) 1-a, 2-c, 3-d, 4-b B) 1-d, 2-b, 3-a, 4-c
C) 1-b, 2-d, 3-a, 4-c D) 1-b, 2-a, 3-d, 4-c
20. ఆమ్లాలు, క్షారాలతో చర్యనొంది .... , నీరు ఏర్పడతాయి.
A) లవణాలు B) బ్లీచింగ్ పౌడర్ C) వాషింగ్ సోడా D) బేకింగ్ సోడా
21. క్షారాల జలద్రావణాలు విద్యుత్ వాహకతను ప్రదర్శించడం వల్ల వాటిలో ఉండేవి
A) H+ అయాన్లు B) OH- అయాన్లు C) H+, OH- అయాన్లు D) H3O+ అయాన్లు
22. సోడియం హైడ్రాక్సైడ్‌ను ఏమంటారు?
A) కాస్టిక్ సోడా B) సోడా లైమ్ C) చిలీ సాల్ట్ పీటర్ D) కాస్టిక్ పొటాష్
23. బ్రైన్ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణం చేసినప్పుడు ఆనోడ్ వద్ద విడుదలయ్యే వాయువు ఏది?
A) CO2 B) Cl2 C) O2 D) H2
24. క్లోరో-ఆల్కలీ ప్రక్రియలో కాథోడ్ వద్ద విడుదలయ్యే వాయువు
A) CO2 B) Cl2 C) O2 D) H2
25. కిందివాటిలో సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగం కానిది ఏది?
A) C.F.C. తయారీ B) సబ్బుల తయారీ C) కాగితం తయారీ D) కృత్రిమ దారాల తయారీ
26. కిందివాటిలో బ్లీచింగ్ పౌడర్ ఉపయోగం కానిది
A) యాంటీసెప్టిక్ B) కొయ్య గుజ్జును బ్లీచింగ్ చేయడం
C) క్రిమిసంహారిణిగా D) ఆక్సీకారిణిగా
27. క్లోరిన్ ఉపయోగం
A) నీటిశుద్ధి B) C.F.C. C) పెస్టిసైడ్స్ D) అన్నీ సరైనవే
28. కిందివాటిలో హైడ్రోజన్ ఉపయోగం కానిదేది?
A) పెస్టిసైడ్స్ B) ఇంధనాలు C) మార్గరిన్ D) అమ్మోనియం తయారీ
29. కిందివాటిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగం
A) నీటిశుద్ధి B) సబ్బుల తయారీ C) ఉక్కును శుభ్రపరచడం D) పెస్టిసైడ్స్
30. కిందివాటిలో NaHCO3 ఉపయోగం కానిది
A) యాంటీసెప్టిక్ B) సోడా ఆమ్లం C) బేకింగ్ పౌడర్ తయారీలో D) గాజు తయారీలో
31. కిందివాటిలో సోడియం కార్బొనేట్ ఉపయోగం కానిదేది?
A) నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించడం B) గృహావసరాల్లో
C) ఇంధనాలు D) కాగితం పరిశ్రమలో
32. అనార్ద్ర తడి సున్నం క్లోరిన్ వాయువుతో చర్య జరిపినప్పుడు ఏర్పడే ఉత్పన్నం ఏది?
A) వాషింగ్ సోడా B) బేకింగ్ పౌడర్ C) బ్లీచింగ్ పౌడర్ D) సాధారణ లవణం
33. బేకింగ్ సోడా అంటే ఏమిటి?
A) NaHCO3.10H2O B) NaHCO3 C) Na2CO3 D) NaCO3
34. బేకింగ్ సోడాను వేడిచేసినప్పుడు ఏర్పడే వాయువు ఏది?
A) O2 B) H2 C) CO2 D) N2
35. సోడియం బై కార్బొనేట్ ఉపయోగం
A) యాంటాసిడ్ B) గాజు తయారీ C) వాషింగ్ సోడా D) నీటిశుద్ధి
36. బేకింగ్ పౌడర్‌లో ఉన్న ముఖ్యమైన సంఘటనాలు
i) సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ii) సోడియం కార్బొనేట్
iii) ఆగ్జాలిక్ ఆమ్లం iv) కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్
A) i, iii B) ii, iv C) i, iv D) iii, iv
37. నీటి శాశ్వత కఠినత్వాన్ని తొలగించడానికి ఉపయోగించే పదార్థం
A) NaHCO3 B) Na2CO3 C) NaHSO4 D) Na2SO4
38. అనార్ద్ర కాపర్ సల్ఫేట్ రంగు
A) నీలం B) తెలుపు C) ఆకుపచ్చ D) ఏదీకాదు
39. జిప్సమ్ ఫార్ములా |
A) CaSO4 B) CaSO4. H2O C) CaSO4. 2H2O D) CaSO4 H2O
40. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ను ఏమంటారు?
A) జిప్సమ్ B) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ C) ఎన్‌హైడ్రైట్ D) బ్లీచింగ్ పౌడర్
41. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేని వల్ల గట్టిపడుతుంది?
A) CO2తో చర్య జరపడం వల్ల B) CO2 విడుదలవడం వల్ల
C) నీటిని కోల్పోవడం వల్ల D) నీటిని కలపడం వల్ల
42. విరిగిన ఎముకల కట్టు బాండేజ్కు ఉపయోగించే పదార్థం
A) జిప్సం B) బ్లీచింగ్ పౌడర్ C) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ D) కాల్షియం సల్ఫేట్
43. విగ్రహాలు, నల్లబోర్డు మీద రాసే చాక్‌పీస్‌లు తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం
A) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ B) సున్నపురాయి
C) బ్లీచింగ్ పౌడర్ D) కాల్షియం సల్ఫేట్
44. సజల హైడ్రోక్లోరికామ్ల ద్రావణంలో కొన్ని చుక్కల సార్వత్రిక సూచికను కలిపినప్పుడు ఆ ద్రావణం రంగు
A) ఎరుపు B) పసుపు C) వంగపువ్వు D) ఆకుపచ్చ
45. బేకింగ్ పౌడర్ లో ఉన్న ముఖ్యమైన సంఘటనాలు
A) Na2CO3, NaHCO3 B) NaHCO3, NaOH
C) Na2CO3, Ca(H2PO4)2 D) NaHCO3, Ca(H2PO4)2 మరియు పిండిపదార్థాలు
46. బలమైన ఆమ్లం, బలహీన క్షారాల మధ్య చర్య వల్ల ఏర్పడిన లవణాల pH విలువ
A) 0 B) 7 C) 7 కంటే తక్కువ D) 7 కంటే ఎక్కువ
47. ఘనస్థితిలోని సోడియం బై కార్బొనేట్‌తో pH కాగితాన్ని చర్యనొందించినప్పుడు కాగితం రంగులో వచ్చే మార్పు.
A) నీలం రంగు B) మార్పు ఉండదు C) ఆకుపచ్చ రంగు D) గులాబి రంగు
48. 8 నుంచి 14 మధ్య pH విలువ ఉన్న ద్రావణాలు
A) ఆమ్లాలు B) క్షారాలు C) తటస్థాలు D) ఏదీకాదు
49. తేనెటీగ కుట్టినప్పుడు తీవ్రమైన నొప్పి కలిగించే ఆమ్లం
A) మిథనోయిక్ ఆమ్లం B) టార్టారిక్ ఆమ్లం C) హైడ్రోక్లోరిక్ ఆమ్లం D) సిట్రిక్ ఆమ్లం
50. కిందివాటిలో సరికాని జత ఏది?
A) NaOH Na+ + OH- B) KOH K+ + OH-
C) Ca(OH)2 Ca+2 + 2OH- D) Zn(OH)2 Zn+2 + OH-2
51. కిందివాటిలో సరికాని జత
A) నిమ్మరసం - ఆమ్లం B) వెనిగర్ - ఆమ్లం
C) వంటసోడా - క్షారం D) వర్షం నీరు - తటస్థం
52. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
A) లిట్మస్ ద్రావణాన్ని లైకెన్ అనే మొక్క నుంచి గ్రహిస్తారు
B) తటస్థ ద్రావణంలో లిట్మస్ రంగు ముదురు ఊదా
C) ఆమ్లాలు నీలి లిట్మస్‌ను ఎరుపు రంగులోకి మారుస్తాయి
D) పైవన్నీ
53. కిందివాటిలో pH విలువ పెరిగే క్రమం
a) గ్యాస్ట్రిక్ ద్రవం b) మిల్క్ ఆఫ్ మెగ్నిషియా c) రక్తం d) నిమ్మరసం
A) a, b, c, d B) a, c, b, d C) a, d, b, c D) a, d, c, b
54. కిందివాటిలో pH విలువలు తగ్గే క్రమం
a) నారింజరసం b) సముద్రపు నీరు c) నిమ్మరసం d) రక్తం
A) a, b, c, d B) b, c, d, a C) b, d, c, a D) b, d, a, c
55. X అనే లవణంతో H2SO4 చర్య జరిపితే Y, Na2SO4 ఏర్పడ్డాయి. ఇక్కడ X, Yలు ఏవి?
A) Cl, HCl B) HCl, NaCl C) NaCl, HCl D) NaCl, H2
56. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కలిసినప్పుడు ఏర్పడేది
A) Ca(OH)2 B) CaSO4. 7 H2O C) CaSO4. 2 H2O D) CaSO4. H2O
57. కింది జతల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.
A) రక్తం pH = 7.2 B) సముద్రం నీరు pH = 8
C) నిమ్మరసం pH = 6.4 D) నారింజరసం pH = 3.4
58. అగ్నిమాపక యంత్రాల్లో సోడా ఆమ్లంగా దేన్ని ఉపయోగిస్తారు?
A) Na2CO3 B) NaOH C) NaHCO3 D) NaCl
59. కిందివాటిలో గాయం కుళ్లిపోకుండా సహాయపడే రసాయనం ఏది?
A) Na2CO3 B) NaHCO3 C) NaOH D) NaCl
60. వర్షపునీరు నదీజలాల్లో కలిసినప్పుడు నదీజలాల pH విలువలు ...
A) పెరుగుతాయి B) తగ్గుతాయి C) మార్పుండదు D) చెప్పలేం
61. నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువ అయితే కలిగే వ్యాధి -
A) దంత క్షయం B) గాయిటర్ C) బెరిబెరి D) మలేరియా
62. ఆమ్లం లేదా క్షారాన్ని నీటిలో కరిగించినప్పుడు ఉష్ణం...
A) గ్రహించబడుతుంది B) వెలువడుతుంది
C) మార్పుండదు D) సందర్భాన్ని బట్టి మారుతుంది
63. ఆమ్లానికి నీటిని కలపడం వల్ల అయాన్ల గాఢత
A) పెరుగుతుంది B) తగ్గుతుంది C) మార్పుండదు D) చెప్పలేం
64. గాఢ ఆమ్లాన్ని సజల ఆమ్లంగా మార్చడానికి ఆమ్లానికి నీటిని ఏ విధంగా కలపాలి?
A) ఒకేసారి పోయాలి
B) మొత్తం నీటిలో 50% ఆమ్లం ఒకసారి, మిగతా 50% ఆమ్లం రెండోసారి పోయాలి
C) మొత్తం నీటిలో 25% ఆమ్లం ఒకసారి, మిగతా 75% ఆమ్లం రెండోసారి పోయాలి
D) నీటిలో చుక్కలు చుక్కలుగా కలపాలి
65. తటస్థీకరణ చర్యవల్ల ఏర్పడేవి....
A) లవణాలు B) ఆమ్లాలు C) నీరు D) A, C
66. ఒక బలమైన ఆమ్లం, బలమైన క్షారంతో చర్య జరిపినప్పుడు ఏర్పడిన లవణాల pH విలువ
A) < 7 B) > 7 C) 7 D) ≤ 7
67. ఒక బలమైన ఆమ్లం, బలహీన క్షారంతో చర్య జరిపినప్పుడు ఏర్పడిన లవణాల pH విలువ
A) < 7 B) > 7 C) 7 D) ≥ 7
68. ఒక బలహీన ఆమ్లం, బలమైన క్షారంతో చర్య జరిపినప్పుడు ఏర్పడిన లవణాల pH విలువ
A) < 7 B) > 7 C) 7 D) ≤ 7
69. నిమ్మరసం pH విలువ
A) 2.1 B) 2.2 C) 2.3 D) 2.4
70. మానవుడి రక్తం pH విలువ
A) 7 B) 7.1 C) 7.2 D) 7.3
71. తాజాస్వేదన జలం pH విలువ
A) 6.5 B) 7 C) 7.5 D) 8
72. కాఫీ pH విలువ
A) 4 B) 4.5 - 5 C) 6 D) 7
73. మన కడుపులో మంటకు కారణమేంటి?
A) అధిక ఆమ్లాలు విడుదలవడం B) అధిక క్షారాలు విడుదలవడం
C) అల్ప ఆమ్లాలు విడుదలవడం D) అల్ప క్షారాలు విడుదలవడం
74. మన జీర్ణాశయం ఏ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది?
A) HCl B) H2CO3 C) H2SO4 D) HNO3
75. యాంటాసిడ్లు అనేవి
A) ఆమ్లాలు B) క్షారాలు C) లవణాలు D) తటస్థాలు
76. యాంటాసిడ్లు కడుపులో అధికమైన ఆమ్లాన్ని
A) పెంచుతాయి B) తగ్గిస్తాయి C) తటస్థీకరిస్తాయి D) ఏదీకాదు
77. తేనెటీగలు స్రవించే రసాయనం-
A) ఫార్మిక్ ఆమ్లం B) మిథనోయిక్ ఆమ్లం
C) హైడ్రోక్లోరిక్ ఆమ్లం D) ఎసిటిక్ ఆమ్లం
78. తేనెటీగ కుట్టినప్పుడు నొప్పిని తగ్గించడానికి వాడే రసాయనం
A) బట్టలసోడా B) సోడియం ఫాస్ఫేట్
C) సోడియం క్లోరైడ్ D) వంటసోడా
79. ఆహారం అజీర్తి అయిన సందర్భంలో కిందివాటిలో వాడకూడనిది-
A) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా B) ఈనో C) తినే సోడా D) నిమ్మరసం
80. కింది జతల్లో ఏవి సాధారణ లవణాన్నిస్తాయి?
A) జింక్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం
B) నైట్రోజన్, క్లోరిన్
C) నత్రికామ్లం, సోడియం కార్బొనేట్
D) సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్
జవాబులు: 1-A; 2-B; 3-A; 4-B; 5-B; 6-A; 7-B; 8-C; 9-D; 10-C; 11-B; 12-A; 13-D; 14-B; 15-A; 16-D; 17-A; 18-A; 19-C. 20-A; 21-B; 22-A; 23-B; 24-D; 25-A; 26-A. 27-D; 28-A; 29-C; 30-D; 31-C; 32-C. 33-B; 34-C; 35-A; 36-C; 37-B; 38-A: 39-C; 40-B; 41-D; 42-C; 43-A; 44-A; 45-D: 46-C; 47-B; 48-B; 49-A; 50-D; 51-D: 52-D; 53-D; 54-D; 55-C; 56-C: 57-C; 58-C; 59-B; 60-B; 61-A; 62-B; 63-B: 64-D; 65-D; 66-C; 67-D; 68-B; 69-A: 70-C; 71-B; 72-B; 73-A; 74-A; 75-B; 76-C; 77-B; 78-D; 79-D; 80-D.