• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రసాయన బంధం

 ప్రశ్నలు - జవాబులు

1. లూయీ, కోసెల్‌ల వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలను తెలపండి.   (AS1) 4 మార్కులు
జ: * ఎలక్ట్రాన్‌ల ఆధారంగా వేలన్సీని నిర్వచించడమే ఈ సిద్ధాంతానికి మూలాధారం.
* వీరు జడవాయువుల రసాయనిక జడత్వం ఆధారంగా వేలన్సీకి ఒక తార్కిక వివరణ ఇవ్వగలిగారు. ఇవి అష్టక సిద్ధాంతానికి దారి తీసింది.
* ప్రధాన గ్రూపులు IA, IIA, IIIA, IVA, VA, VIA, VIIA, సున్నా గ్రూపు లేదా VIII A గ్రూప్‌ల్లో ఉన్న మూలక పరమాణువులు రసాయనిక చర్యల్లో పాల్గొనప్పుడు అవి తమ బాహ్యకక్ష్యలో లేదా అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం పొందడానికి ప్రయత్నం చేస్తాయి.
* IA గ్రూప్ మూలకాలు (Li నుంచి Cs వరకు) వాటి పరమాణు బాహ్యకక్ష్య నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి దానికి సంబంధించిన ఏకమాత్ర ధనాత్మక అయాన్‌ను ఏర్పరచడం ద్వారా తమ బాహ్యకక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉండే విధంగా మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి.
ఉదా: 11Na  2, 8, 1; 11Na+ 2, 8
* IIA గ్రూప్ మూలకాల (Mg నుంచి Ba వరకు) పరమాణువులు రసాయనిక చర్యల్లో పాల్గొనేటప్పుడు తమ బాహ్య కక్ష్య నుంచి రెండు వేలన్సీ ఎలక్ట్రాన్‌లను కోల్పోయి ద్వి మాత్రిక ధనాత్మక అయాన్‌గా ఏర్పడటం ద్వారా తమ బాహ్యకక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉండేలా మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి.
ఉదా: 12Mg  2, 8, 2; 12Mg2+ 2, 8
* అదేవిధంగా IIIA గ్రూప్ మూలకాలు మూడు వేలన్సీ ఎలక్ట్రాన్‌లను కోల్పోయి వాటికి సంబంధించిన అయాన్‌లా ఏర్పడటానికి ప్రయత్నిస్తాయి.
ఉదా: 13Al  2, 8, 3; 13Al3+ 2, 8
* VI A గ్రూప్ మూలకాల పరమాణువులు రసాయన మార్పునకు లోనయ్యేటప్పుడు రెండు ఎలక్ట్రాన్‌లను గ్రహించి వాటికి సంబంధించిన ఆనయాన్‌లుగా ఏర్పడటం ద్వారా వాటి బాహ్యకక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉండేలా మార్పు చెందుతాయి.
ఉదా: 8O  2, 6; 8O3-

 2, 8
* VII A గ్రూప్ మూలకాల పరమాణువులు రసాయన మార్పునకు లోనయ్యేటప్పుడు ఒక ఎలక్ట్రాన్‌ను గ్రహించి వాటికి సంబంధించిన ఆనయాన్‌లుగా ఏర్పడటం ద్వారా వాటి బాహ్య కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉండేలా మార్పు చెందుతాయి.
ఉదా: 9F  2, 7; 9F- 2, 8
* VIII A గ్రూప్ మూలకాలు సాధారణంగా ఎలక్ట్రాన్‌లను కోల్పోవడానికి లేదా గ్రహించడానికి ప్రయత్నించవు. సాధారణంగా హీలియం, నియాన్‌లు రసాయన మార్పుల్లో పాల్గొనవు. VIII A గ్రూప్‌నకు చెందిన మిగతా మూలకాలు అరుదుగా రసాయన మార్పుల్లో పాల్గొన్నప్పటికీ, ఎలక్ట్రాన్‌లను కోల్పోవడం లేదా గ్రహించడం జరగదు.
ఉదా: 10N  2, 8; నియాన్ పరమాణువు ఎలక్ట్రాన్‌ను కోల్పోవడం లేదా గ్రహించడం జరగదు.
     

2. కొసెల్ సిద్ధాంతం (ఎలక్ట్రాన్ మార్పిడి సిద్ధాంతం) ప్రకారం ఏవైనా రెండు సమ్మేళనాలు ఏర్పడటాన్ని వివరించండి.
                                          లేదా
అయానిక బంధం వల్ల NaCl, MgCl2 అణువులు ఏర్పడే విధానాన్ని లూయిస్ ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణం సహాయంతో వివరించండి.   (AS1) 4 మార్కులు
జ: సోడియం క్లోరైడ్ (NaCl) ఏర్పడటం: సోడియం, క్లోరిన్ మూలక పరమాణువులు సంయోగం చెందడం వల్ల సోడియం క్లోరైడ్ అణువు ఏర్పడుతుంది.
      Na + Cl  Na+ + Cl-  NaCl
కేటయాన్ ఏర్పడటం: సోడియం పరమాణువు తన బాహ్య కక్ష్యలో అష్టకాన్ని పొందడానికి ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి Na+ అయాన్‌గా ఏర్పడటం ద్వారా నియాన్ (Ne) ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది.
            Na  Na+ + e-
ఎలక్ట్రాన్ విన్యాసం (2, 8, 1)    (2, 8)

     లేదా             [Ne]3s1       [Ne]
ఆనయాన్ ఏర్పడటం: క్లోరిన్ పరమాణువుకు దాని చివరి కక్ష్యలో అష్టకాన్ని పొందడానికి ఒక ఎలక్ట్రాన్ అవసరం. కాబట్టి సోడియం కోల్పోయిన ఆ ఎలక్ట్రాన్‌ను క్లోరిన్ గ్రహించి Cl- ఆనయాన్‌గా ఏర్పడటం ద్వారా ఆర్గాన్ (Ar) ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది.
Cl + e-  Cl-
ఎలక్ట్రాన్ విన్యాసం    (2, 8, 7)                               (2, 8, 8)
                లేదా   [Ne] 3s23p5              [Ne] 3s23p6 లేదా [Ar]
అయాన్ల నుంచి NaCl ఏర్పడటం: సోడియం (Na), క్లోరిన్ (Cl) పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ మార్పిడి వల్ల ఏర్పడిన Na+, Cl- అయాన్ల స్థిర విద్యుదాకర్షణ బలాల వల్ల అవి రెండూ పరస్పరం ఆకర్షణకు గురైనప్పుడు సోడియం క్లోరైడ్ (NaCl) అనే కొత్త సంయోగ పదార్థం ఏర్పడుతుంది.
    Na+ + Cl- Na+ Cl- లేదా NaCl
   

మెగ్నీషియం క్లోరైడ్ (MgCl2) అణువు ఏర్పడటం: మెగ్నీషియం, క్లోరిన్ మూలక పరమాణువులు సంయోగం చెందడం వల్ల మెగ్నీషియం క్లోరైడ్ అణువు ఏర్పడుతుంది.
         Mg + Cl2 MgCl2
కేటయాన్ ఏర్పడటం:   Mg     Mg2+ + 2e-
ఎలక్ట్రాన్ విన్యాసం    (2, 8, 2)           (2, 8)
           లేదా          [Ne] 3s2         [Ne]
ఆనయాన్ ఏర్పడటం:    2Cl + 2e-               2Cl-
ఎలక్ట్రాన్ విన్యాసం         (2, 8, 7)                         (2, 8, 8)
       లేదా                 [Ne] 3s23p5                   [Ne] 3s23p6 లేదా [Ar]
 

మెగ్నీషియం, క్లోరిన్ అయాన్ల నుంచి MgCl2 ఏర్పడటం:
      మెగ్నీషియం పరమాణువు రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయి నియాన్ (Ne) ఎలక్ట్రాన్ విన్యాసాన్ని, క్లోరిన్ పరమాణువు ఒక ఎలక్ట్రాన్‌ను గ్రహించి ఆర్గాన్ (Ar) ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతాయి.
      ఒక మెగ్నీషియం పరమాణువు రెండు ఎలక్ట్రాన్‌లను ఒక్కో క్లోరిన్‌కు ఒక ఎలక్ట్రాన్ చొప్పున రెండు క్లోరిన్ పరమాణువులను ఇస్తుంది. ఈ విధంగా ఏర్పడిన Mg2+, 2 Cl-లు పరస్పరం ఆకర్షితమై MgCl2 ఏర్పడుతుంది.
Mg2+ + 2Cl-   MgCl2

3. కాటయాన్, ఆనయాన్ ఏర్పడటాన్ని ప్రభావితం చేసే అంశాలను తెలపండి.  (AS1) 4 మార్కులు
జ: * మూలకాలు ఎలక్ట్రాన్‌లను కోల్పోయే స్వభావాన్ని లోహధర్మం లేదా ధన విద్యుదాత్మకత అంటారు.
అధిక ధన విద్యుదాత్మకత ఉన్న మూలకాలు కాటయాన్‌లను ఏర్పరుస్తాయి.
* మూలకాలు ఎలక్ట్రాన్‌లను గ్రహించే స్వభావాన్ని అలోహధర్మం లేదా రుణ విద్యుదాత్మకత అంటారు.
* అధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకాలు ఆనయాన్‌లను ఏర్పరుస్తాయి.
* రుణ విద్యుదాత్మకత తేడా 1.9కు సమానం లేదా 1.9 కంటే ఎక్కువగా ఉండే మూలకాల పరమాణువుల మధ్య అయానిక బంధం ఏర్పడుతుంది.
* తక్కువ అయనీకరణశక్తి ఉన్న పరమాణువు నుంచి అధిక రుణ విద్యుదాత్మకత ఉన్న పరమాణువుకు ఎలక్ట్రాన్‌లు స్థానభ్రంశం చెందడం వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది.
* ఎలక్ట్రాన్‌లను కోల్పోయి కాటయాన్‌గా మారే స్వభావం లేదా ఎలక్ట్రాన్‌లను గ్రహించి ఆనయాన్‌గా మారే స్వభావం కింది అంశాలపై ఆధారపడుతుంది.
      1) పరమాణు పరిమాణం
      2) అయనీకరణ శక్మం
      3) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
      4) రుణ విద్యుదాత్మకత
* తక్కువ అయనీకరణ శక్మం, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, తక్కువ రుణ విద్యుదాత్మకత, అధిక పరమాణు పరిమాణం ఉన్న మూలకాల పరమాణువులు కాటయాన్‌లను ఏర్పరుస్తాయి.
* అధిక అయనీకరణ శక్మం, అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అధిక రుణ విద్యుదాత్మకత, తక్కువ పరమాణువు పరిమాణం ఉన్న మూలకాల పరమాణువులు ఆనయాన్‌లను ఏర్పరుస్తాయి.

4. అయానిక బంధం అంటే మీరేం అర్థం చేసుకున్నారో వివరించండి.  (AS1) 4 మార్కులు
జ: * అయానిక బంధం ఏర్పడటాన్ని కోసెల్ ప్రతిపాదించాడు.
* వ్యతిరేక విద్యుదావేశ అయాన్‌ల మధ్య ఉన్న స్థిర విద్యుదాకర్షణ బలాన్ని అయానిక బంధం లేదా స్థిర విద్యుత్ బంధం లేదా ఎలక్ట్రోవేలెంట్ బంధం అంటారు.
* ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్‌లు స్థానభ్రంశం చెందడం వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది.
* అయానిక బంధం ఏర్పడటంలో ఒక పరమాణువు కోల్పోయే లేదా గ్రహించే ఎలక్ట్రాన్‌ల సంఖ్యను దాని ఎలక్ట్రోవేలన్సీ అంటారు.
* అయానిక బంధం దిశారహితమైంది.
* ఒక లోహ పరమాణువు దాని వేలన్సీ కక్ష్య నుంచి కోల్పోయే ఎలక్ట్రాన్‌ల సంఖ్య దాని గ్రూపు సంఖ్యకు సమానం.
* ఒక అలోహ పరమాణువు గ్రహించే ఎలక్ట్రాన్‌ల సంఖ్యనే దాని వేలన్సీ అంటారు. ఇది దాని గ్రూపు సంఖ్యకు సమానమవుతుంది.
* కేటయాన్, ఆనయాన్‌ల మధ్య పనిచేసే స్థిర విద్యుత్ ఆకర్షణ బలం ఆ రెండింటిని కలిపి ఉంచి విద్యుత్ పరంగా తటస్థంగా ఉండే ఒక నూతన సంయోగ పదార్థాన్ని ఏర్పరుస్తుంది.
* NaCl, MgCl2, Na2O... అయానిక సమ్మేళనాలు.
* సోడియం పరమాణువు ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి Na+ అయాన్‌ను, క్లోరిన్ పరమాణువు ఒక ఎలక్ట్రాన్‌ను గ్రహించి Cl- అయాన్‌ను ఏర్పరుస్తాయి. ఈ రెండు అయాన్‌లు స్థిరమైన జడవాయు విన్యాసాన్ని పొందుతాయి. ఈ వ్యతిరేక విద్యుదావేశ అయాన్‌లు స్థిర విద్యుదాకర్షణ బలాలతో బంధితమవడం వల్ల సోడియం క్లోరైడ్ NaCl ఏర్పడుతుంది.
    Na  Na+ + e-
    Cl + e- Cl-
    Na+ + Cl-

 Na+ Cl- లేదా NaCl

5. సమయోజనీయ బంధం అంటే మీరేం అర్థం చేసుకున్నారు? వివరించండి. (AS1) 4 మార్కులు
జ: సమయోజనీయ బంధం ఏర్పడటాన్ని జి.ఎన్.లూయిస్ ప్రతిపాదించాడు.
* రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్‌లు సమష్టిగా పంచుకోవడం ద్వారా సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.
* సమయోజనీయ బంధం ఏర్పడినప్పుడు రెండు పరమాణువులు సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్‌లను పొందుపరుస్తాయి.
* బంధ పరమాణువులకు జడవాయు విన్యాసం కంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్‌లు తక్కువగా ఉంటాయి.
* ఒక మూలకపు పరమాణువు ఏర్పరిచే మొత్తం సమయోజనీయ బంధాల సంఖ్యను దాని కోవేలన్సీ అంటారు.
* సమయోజనీయ బంధం ఏర్పడినప్పుడు ఒక పరమాణువు అందించే ఎలక్ట్రాన్‌ల సంఖ్య దాని కోవేలన్సీకి సమానమవుతుంది.
* ఒక పరమాణువు ఏర్పరిచే సమయోజనీయ బంధాల సంఖ్య దాని బాహ్య కక్ష్యలో ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్‌ల సంఖ్య మీద, జడవాయువు విన్యాసం పొందడానికి అవసరమయ్యే ఎలక్ట్రాన్‌ల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది.
* రెండు పరమాణువుల మధ్య ఒకటి, రెండు లేదా మూడు ఎలక్ట్రాన్ జంటలను సమష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాలను వరుసగా ఏకబంధం (−), ద్విబంధం (=) లేదా త్రికబంధం (≡) అంటారు.
* F2, O2, N2, CH4, NH3, H2O....ఇవన్నీ సమయోజనీయ సమ్మేళనాలు.
* F2 అణువు ఏర్పడినప్పుడు ప్రతి ఫ్లోరిన్ పరమాణువు ఒక ఎలక్ట్రాన్‌ను అందించి, ఒక ఎలక్ట్రాన్ జంటను రెండు ఫ్లోరిన్ పరమాణువులు సమష్టిగా పంచుకుని ఏకబంధాన్ని ఏర్పరుస్తాయి.
      

* O2 అణువు ఏర్పడేటప్పుడు ప్రతి ఆక్సిజన్ పరమాణువు రెండు ఎలక్ట్రాన్‌లను అందిస్తుంది. రెండు ఎలక్ట్రాన్ జంటలను రెండు ఆక్సిజన్ పరమాణువులు సమష్టిగా పంచుకుంటాయి. అప్పుడు వాటి మధ్య ద్విబంధం (=) ఏర్పడుతుంది.


* N2 అణువు ఏర్పడినప్పుడు ప్రతి నైట్రోజన్ పరమాణువు మూడు ఎలక్ట్రాన్‌లను అందించి, మూడు ఎలక్ట్రాన్ జంటలను రెండు నైట్రోజన్ పరమాణువులు సమష్టిగా పంచుకుంటాయి. అప్పుడు వాటి మధ్య త్రికబంధం () ఏర్పడుతుంది.

6. వేలన్సీ కక్ష్య ఎలక్ట్రాన్ జంట వికర్షణ సిద్ధాంతం (VSEPRT)లోని ముఖ్యాంశాలను తెలపండి. (AS1) 4 మార్కులు
జ: VSEPRT సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు:
* సమయోజనీయ బంధాల్లో వేలన్సీ కక్ష్యలోని ఎలక్ట్రాన్‌లు, బంధంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు సాధ్యమైనంత వరకు ఒకదానికొకటి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. అందువల్లే అణువులకు ప్రత్యేక ఆకారాలు వస్తాయి.
* వేలన్సీ కక్ష్యలో సమయోజనీయ బంధంలో ఉండే ఎలక్ట్రాన్ జంటల సంఖ్య, మధ్య పరమాణువుపై ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య తెలిస్తే ఆ ఎలక్ట్రాన్ జంటలు మధ్య పరమాణువు కేంద్రకం చుట్టూ ఏ విధంగా అమరి ఉన్నాయో అంచనా వేయడానికి తద్వారా అణువుల ఆకృతులు అంచనావేయడానికి మనకు వీలవుతుంది.
* మధ్య పరమాణువు చుట్టూ బంధ జంటల కంటే ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఎక్కువ ఖాళీని ఆక్రమిస్తాయి. ఒంటరి  ఎలక్ట్రాన్ జంటలు కేవలం ఒక కేంద్రకంతోనే  ఆకర్షితమవుతాయి  కానీ, బంధ ఎలక్ట్రాన్  జంట మాత్రం రెండు పరమాణువుల కేంద్రకాలతో ఆకర్షితమవుతుంది. మధ్య పరమాణువుపై ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంటల కారణంగానే అణువుల ఆకారం, బంధ కోణాలు మామూలుగా ఉండే దానికంటే కొద్దిగా మారతాయి. కేంద్రకంపైన ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంటలకు బంధ ఎలక్ట్రాన్ జంటలకు మధ్య వికర్షణ మరీ ఎక్కువైతే, సాధారణంగా పరమాణువుల మధ్య ఉండే బంధ కోణాలు కచ్చితంగా తగ్గాలి.
* సమయోజనీయ బంధంలో మధ్య పరమాణువు కేంద్రకం చుట్టూ వేలన్సీ కక్ష్యలో రెండు బంధ ఎలక్ట్రాన్ జంటలున్నట్లయితే, వాటి మధ్య వికర్షణ బలాన్ని తగ్గించడానికి వాటిని
180º కోణంలో వేరుచేయాలి. అలా చేయడం వల్ల అణువు రేఖీయాకృతిలో ఉంటుంది.
ఉదా: బెరీలియం క్లోరైడ్

సమయోజనీయ బంధంలో మధ్య పరమాణువు కేంద్రకం చుట్టూ వేలన్సీ కక్ష్యలో మూడు బంధ ఎలక్ట్రాన్ జంటలు ఉన్నట్లయితే అవి 120° కోణంలో త్రిభుజంలోని మూడు మూలలకు చేరతాయి. అందువల్లే అణువు రేఖీయ త్రిభుజం ఆకృతిలో ఉంటుంది.
ఉదా: బోరాన్ ట్రైఫ్లోరైడ్

                           


 సమయోజనీయ బంధంలో మధ్య పరమాణు కేంద్రకం చుట్టూ వేలన్సీ కక్ష్యలో నాలుగు బంధ ఎలక్ట్రాన్ జంటలున్నట్లయితే అవి చతుర్ముఖీయ ఆకారంలో నాలుగు మూలలకు వేరుచేయబడతాయి. బంధ కోణం సుమారుగా 109°28' ఉంటుంది.
ఉదా: మీథేన్

                             

సమయోజనీయ బంధంలో పాల్గొనే అణువులో మధ్య పరమాణువుపై మూడు బంధ ఎలక్ట్రాన్ జంటలు, ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉన్నట్లయితే, ఆ ఒంటరి ఎలక్ట్రాన్ జంట కేంద్రకం చుట్టూ ఎక్కువ ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. మిగతా మూడు ఎలక్ట్రాన్ జంటలు దగ్గరగా వస్తాయి.
ఉదా: అమ్మోనియా అణువు


                   


* సమయోజనీయ బంధంలో పాల్గొనే అణువులో మధ్య పరమాణువు కేంద్రానికి చుట్టూ రెండు బంధ ఎలక్ట్రాన్ జంటలు, రెండు ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉన్నట్లయితే, ఒంటరి - ఒంటరి ఎలక్ట్రాన్ జంటల మధ్య ఉండే వికర్షణ బలం, బంధ - బంధ ఎలక్ట్రాన్ జంటల మధ్య ఉండే వికర్షణ బలం కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బంధ జంటల మధ్య దూరం తగ్గుతుంది.
ఉదా: నీరు
                   


* VSEPRT సిద్ధాంతం ప్రధానంగా బంధ శక్తులను వివరించడంలో విఫలమైంది.

7. వేలన్సీ బంధ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలను వివరించండి. (AS1) 4 మార్కులు
జ: వేలన్సీ బంధ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు:
* వేలన్సీ కక్ష్యలో జతగూడని ఒంటరి ఎలక్ట్రాన్‌లను కలిగి ఉన్న రెండు పరమాణువులు దగ్గరగా చేరినప్పుడు ఆ రెండు పరమాణువుల్లో వ్యతిరేక స్పిన్ కలిగి ఉన్న జతగూడని ఎలక్ట్రాన్‌లను కలిసి పంచుకోవడం వల్ల సమయోజనీయ బంధం ఏర్పడుతుంది. రెండు పరమాణువుల అతిపాతం చెందిన ఆర్బిటాళ్లలోని ఎలక్ట్రాన్‌లను, రెండు కేంద్రకాలు కలిపి పంచుకోవడం వల్ల రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడుతుంది.

ఉదా:
       

ఆర్బిటాళ్లు ఎంతగా అతిపాతం చెందితే, అంత బలమైన బంధం ఏర్పడుతుంది. 's' ఆర్బిటాల్ కాకుండా వేరే ఆర్బిటాళ్లు బంధంలో పాల్గొనప్పుడు అవి బంధానికి దిశాత్మక లక్షణాన్ని కలిగిస్తాయి.
బంధంలో పాల్గొనే ప్రతి పరమాణువు తన సొంత ఆర్బిటాళ్లను కలిగి ఉంటుంది. కాని అతిపాతం చెందిన ఆర్బిటాళ్లలోని ఎలక్ట్రాన్‌ల జతను మాత్రం అతిపాతంలో పాల్గొనే రెండు పరమాణువులు కలిసి పంచుకుంటాయి.
* రెండు పరమాణువుల మధ్య బహుబంధాలు ఏర్పడినప్పుడు, వాటి మధ్య ఏర్పడే మొదటి బంధం, ఆ పరమాణువుల కేంద్రకాలను కలిపే అక్షీయ రేఖ వెంబడి ఆర్బిటాళ్ల అతిపాతం వల్ల ఏర్పడే సిగ్మా
(σ) బంధం అవుతుంది. ఈ సిగ్మా (σ) బంధం ఏర్పడిన తర్వాత ఆర్బిటాళ్ల పార్శ్వ అతిపాతం వల్ల పై (Π) బంధాలు ఏర్పడతాయి. ఆర్బిటాళ్ల శీర్షభాగాల అతిపాతం వల్ల ఏర్పడిన సిగ్మా (σ) బంధంలో ఎలక్ట్రాన్ జంట రెండు పరమాణు కేంద్రకాల మధ్య కేంద్రీకృతమై ఉండటం వల్ల ఈ సిగ్మా (σ) బంధం బలమైందిగా ఉంటుంది. కాని పై (Π) బంధం సిగ్మాబంధంతో పోల్చినప్పుడు బలహీనమైంది. ఎందుకంటే p ఆర్బిటాళ్లు పార్శ్వంగా అతిపాతం చెందడం వల్ల అంత బలమైన బంధాలను ఏర్పరచలేవు.


8. వేలన్సీ బంధ సిద్ధాంతం ఆధారంగా ద్విబంధం, త్రికబంధం ఏర్పడటాన్ని వివరించండి.
                                                       లేదా
వేలన్సీ బంధ సిద్ధాంతం పరంగా ఆక్సిజన్, నైట్రోజన్ అణువులు ఏర్పడే విధానాన్ని వివరించండి. (AS1) 4 మార్కులు

జ: ద్విబంధం ఏర్పడటం (O2 అణువు ఏర్పడటం): ఆక్సిజన్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px1 2py1 2pz1. ఆక్సిజన్ పరమాణువులో 'py' ఆర్బిటాల్ మరొక ఆక్సిజన్ పరమాణువులోని 'py' ఆర్బిటాల్‌తో పరమాణువు కేంద్రకాలను కలిపే అక్షీయరేఖ వెంబడి అతిపాతం చెందడం మూలంగాpy - py మధ్య సిగ్మాబంధం  (σ) ఏర్పడుతుంది. ఒక ఆక్సిజన్ పరమాణువులో ఉండేpz ఆర్బిటాల్ వేరొక ఆక్సిజన్ పరమాణువులో ఉండేpz ఆర్బిటాల్‌తో పార్శ్వ అతిపాతం చెందడం వల్ల పరమాణువు కేంద్రకాలను కలిపే అక్షీయ రేఖకు లంబంగా p- pz మధ్య పై(Π) బంధం ఏర్పడుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ అణువులోని రెండు పరమాణువుల మధ్య ద్విబంధం ఏర్పడుతుంది.

త్రిక బంధం ఏర్పడటం (N2 అణువు ఏర్పడటం): నైట్రోజన్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px1 2py1 2pz1 ఒక నైట్రోజన్ పరమాణువులోనిpఆర్బిటాల్ వేరొక నైట్రోజన్ పరమాణువులోని pxఆర్బిటాల్‌తో అతిపాతం చెందడం ద్వారా పరమాణువుల కేంద్రకాలను కలిపే అక్షంపైన సిగ్మా (σ) px- px బంధం ఏర్పడుతుంది.నైట్రోజన్ పరమాణువులో మిగిలినpy , pz ఆర్బిటాళ్లు వేరొక నైట్రోజన్ పరమాణువులోనిpy, pz ఆర్బిటాళ్లతో పార్శ్వ అతిపాతం చెందుతాయి. ఈ బంధాలు పరమాణువుల కేంద్రకాలను కలిపే అక్షీయ రేఖకు లంబంగా ఉండే రెండు పై (Π) py - py , pz - pz బంధాలను ఏర్పరుస్తాయి. ఈ విధంగా N2 అణువులోని రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్యలో త్రికబంధం ఏర్పడుతుంది.

9. సంకరీకరణం ఆధారంగా ఏవైనా రెండు అణువులు ఏర్పడే విధానాన్ని వివరించండి.   (AS1) 4 మార్కులు
జ: బెరీలియం క్లోరైడ్ అణువు ఏర్పడటం:
* బెరీలియం (4Be) ఎలక్ట్రాన్ విన్యాసం1s2 2s2.

* బెరీలియం పరమాణువు ఉత్తేజిత స్థితిలో ఉన్నప్పుడు దాని 2s స్థాయిలోని ఒక ఎలక్ట్రాన్2px స్థాయిలోకి వెళ్లడం వల్ల దాని ఎలక్ట్రాన్ విన్యాసం1s2 2s1 2pxగా మారుతుంది. అలాగే క్లోరిన్ పరమాణువు(17Cl) ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3px2 3py2 3pz1
*  బెరీలియం పరమాణువు ఉత్తేజిత స్థితిలో ఉన్నప్పుడు దానిలోని జతగూడని ఒంటరి ఎలక్ట్రాన్‌లను కలిగి ఉన్న 2s ఆర్బిటాల్, 2px ఆర్బిటాల్ పరస్పరం కలిసిపోయి (సంకరీకరణం చెంది) సర్వసమానమైన రెండు sp సంకర ఆర్బిటాళ్లను ఏర్పరుస్తాయి. వీటి మధ్య కోణం 180° గా ఉంటుంది.

                              

* బెరీలియంతో బంధంలో పాల్గొనే రెండు క్లోరిన్ పరమాణువుల్లో ప్రతి క్లోరిన్ పరమాణువు 3pz1 ఆర్బిటాల్, బెరీలియం sp సంకర ఆర్బిటాల్‌తో పటంలో చూపినట్లు అతిపాతం చెందడం వల్ల రెండు సర్వసమానమైన Be - Cసిగ్మా బంధాలు (σsp - p) ఏర్పడతాయి. బంధకోణం 180° గా ఉంటుంది.

బోరాన్ ట్రై ఫ్లోరైడ్ (BF3) అణువు ఏర్పడటం
*
 బోరాన్ పరమాణువు (5B) ఎలక్ట్రాన్ విన్యాసం1s2 2s2 2px1.
* ఉత్తేజిత స్థితిలో ఒక ఎలక్ట్రాన్ 2s ఆర్బిటాల్ నుంచి 2py ఆర్బిటాల్‌లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఎలక్ట్రాన్ విన్యానం 1s2 2s1 2px1 2pyగా మారుతుంది.
* ఉత్తేజిత స్థితిలో బోరాన్ పరమాణువులో ఒంటరి ఎలక్ట్రాన్‌లను కలిగి ఉన్న ఒక 2s ఆర్బిటాల్, రెండు p ఆర్బిటాళ్లు (2py, 2pz) కలిసిపోయి సర్వసమాన మూడు sp2 సంకర ఆర్బిటాళ్లను ఏర్పరుస్తాయి. వీటి మధ్యకోణం 120° గా ఉంటుంది.
* ఫ్లోరిన్ పరమాణువు (9F) ఎలక్ట్రాన్ విన్యాసం1s2 2s2px2 2py2 2pz1.
* బోరాన్ మూడుsp2 సంకర ఆర్బిటాళ్లు మూడు ఫ్లోరిన్ పరమాణువుల్లో ఉండే2pz ఆర్బిటాళ్లలోని ఒంటరి ఎలక్ట్రాన్‌లతో జతగూడి (అతిపాతం చెంది) మూడు 
σsp2 - p బంధాలను ఏర్పరుస్తాయి.
                             

10. సంకరీకరణం ఆధారంగా BeCl2, BF3, H2O, HCl అణువుల చిత్రాలను గీయండి. (AS5) 4 మార్కులు
:

11. B, C, N, O ల లూయిస్ చుక్కల నిర్మాణాలను గీయండి.  (AS5) 2 మార్కులు
జ: 


12. He, Ne, Ar, Kr ల వేలన్సీ ఎలక్ట్రాన్‌ల లూయిస్ చుక్కల నిర్మాణాలను గీయండి. (AS5) 2 మార్కులు
: 
              


13. కింది అణువుల చుక్క పటాలను గీయండి. (AS5) 2 మార్కులు
      i) మీథేన్ (CH4),         ii) నీరు (H2O)
జ: i) మీథేన్ అణువు:
            

ii) నీటి అణువు:
                        


14. కింది అణువుల లూయిస్ చుక్కల నిర్మాణాలను గీయండి. (AS5) 2 మార్కులు
     i) F2      ii) O2
: 
         

15. అమ్మోనియా అణువు, నీటి అణువుల ఏర్పాటు చుక్కల పటాలను గీయండి.  (AS5) 2 మార్కులు
జ: i) అమ్మోనియా (NH3) అణువు:

      
ii) నీటి అణువు (H2O):
   


16. కింది అణువుల లూయిస్ చుక్కల నిర్మాణాలను గీయండి.  (AS5) 2 మార్కులు
        i) BeCl2    ii) BF3
జ:

17. వేలన్సీ బంధ సిద్ధాంతం ఆధారంగా N2 అణువు ఏర్పడటాన్ని చూపే పటాన్ని గీయండి. (AS5) 2 మార్కులు
: 
    



    i) నైట్రోజన్ పరమాణువులో ఎన్ని వేలన్సీ ఎలక్ట్రాన్‌లు ఉన్నాయి.
    ii) నైట్రోజన్ పరమాణువుల మధ్య ఏ బంధం ఏర్పడుతుంది?  (AS4) 2 మార్కులు
జ: i) నైట్రోజన్ పరమాణువులో 5 వేలన్సీ ఎలక్ట్రాన్‌లు ఉన్నాయి.
     ii) నైట్రోజన్ పరమాణువుల మధ్య సమయోజనీయ, త్రికబంధం ఉంటాయి.


    i) 
NH3 అణువు ఆకృతిని తెలపండి.
    ii) 
NH3 అణువులో σs - sp3 బంధాలు ఎన్ని ఉన్నాయి?(AS4) 2 మార్కులు
జ: i) 
NH3 అణువు త్రికోణీయ పిరమిడ్ ఆకృతిలో ఉంటుంది.
    ii)
మూడు σs - sp3 బంధాలు


20. కింది పట్టికను సరైన సమాధానాలతో పూర్తి చేయండి.  (AS4) 2 మార్కులు

:

21. 'అమ్మోనియా అణువులో బంధాలెన్ని' అని ఉపాధ్యాయుడు అడిగేసరికి విద్యార్థి బొమ్మ చూసి '3 బంధాలున్నాయి' అని చెప్పాడు. ఈ అణువులోని ఆ బంధాలను సంకరీకరణం పరంగా వివరించండి. (AS1) 2 మార్కులు
జ: 
అమ్మోనియా అణువులో నైట్రోజన్ పరమాణువులో sp3 సంకరీకరణం ఏర్పడుతుంది. నైట్రోజన్‌లో ఒక 2s, మూడు 2p ఆర్బిటాళ్లు కలిసి sp3 సంకర ఆర్బిటాళ్లు ఏర్పడతాయి. ఈ నాలుగు sp3 సంకర ఆర్బిటాళ్లలోని ఒక ఆర్బిటాల్ మాత్రమే ఒక జత ఎలక్ట్రాన్‌లను కలిగి ఉంటుంది. మిగిలిన మూడు sp3 సంకర ఆర్బిటాళ్లు ఒంటరి ఎలక్ట్రాన్‌ను కలిగి ఉంటాయి. ఈ మూడు సంకర ఆర్బిటాళ్లు 3 హైడ్రోజన్ పరమాణువుల్లోని మూడు 1s ఆర్బిటాళ్లతో అతిపాతం చెంది మూడుσs - sp3 బంధాలను ఏర్పరుస్తాయి.


22. అమ్మోనియా అణువులో బంధకోణం 109° 28' బదులుగా 107° 48' గా; నీటి అణువులో బంధకోణం109° 28' బదులుగా 104° 31' గా ఉండటానికి కారణాలేమిటి?(AS1) 2 మార్కులు
జ: అమ్మోనియా అణువులో sp3 సంకరీకరణం ఉంటుంది. sp3 సంకరీకరణానికి  బంధకోణం 109°28' గా ఉండాలి. కానీ ఒక sp3 ఆర్బిటాల్‌తో బంధంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ జత ఉండటం వల్ల దానికి బంధంలో పాల్గొనే ఎలక్ట్రాన్ జతకు మధ్య వికర్షణ ఎక్కువ ఉండటం వల్ల  బంధకోణం 107°48' కు తగ్గుతుంది.
*  నీటి అణువులో sp3 సంకరీకరణం ఉంటుంది. sp3 టెట్రాహైడ్రల్ సంకరీకరణానికి  బంధకోణం 109°29'గా ఉండాలి. కానీ రెండు జత కూడిన ఎలక్ట్రాన్‌లతో ఉన్న ఆర్బిటాళ్ల మధ్య ఉండే వికర్షణ; బంధంలో పాల్గొన్న, పాల్గొనని ఎలక్ట్రాన్‌ల జతల మధ్య ఉండే వికర్షణల ఫలితంగా  బంధకోణం 109°28' నుంచి 104°31' కు తగ్గుతుంది.

23. అల్యూమినియం క్లోరైడ్, డై సోడియం మోనాక్సైడ్ అణువులుఏర్పడే విధానాన్ని చూపే లూయిస్ ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణాలను గీయండి. (AS5) 2 మార్కులు


జ: * అల్యూమినియం క్లోరైడ్ ఏర్పడటం:

డై సోడియం మోనాక్సైడ్ ఏర్పడటం:


24. సోడియం క్లోరైడ్,మెగ్నీషియం క్లోరైడ్ అణువులుఏర్పడే విధానాన్ని చూపే లూయిస్ ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణాలనుగీయండి. (AS5) 2 మార్కులు
జ: * సోడియం క్లోరైడ్ ఏర్పడటం:

* మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడటం:

25. సమయోజనీయ బంధం వల్ల N2 అణువు ఏర్పడటాన్ని వివరించండి. (AS1) 2 మార్కులు
జ: 
నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం 2, 5. దీని వేలన్సీ కక్ష్యలో అష్టక విన్యాసం పొందడానికి నైట్రోజన్‌కు 3 ఎలక్ట్రాన్‌లు అవసరం. రెండు నైట్రోజన్ పరమాణువులు దగ్గరగా వచ్చి బంధంలో పాల్గొనేటప్పుడు అవి మూడు ఎలక్ట్రాన్ జంటలను పంచుకుంటాయి. కాబట్టి రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్య త్రికబంధం ఏర్పడి నైట్రోజన్ అణువు (N2) ఏర్పడుతుంది.
                   
26. అయానిక, సమయోజనీయ బంధాల మధ్య భేదాలను రాయండి. (AS1) 2 మార్కులు
జ: 

అయానిక బంధం సమయోజనీయ బంధం
i) ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ల బదిలీ వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది. i) రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్‌లు సమష్టిగా పంచుకోవడం ద్వారా సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.
ii) లోహాలు, అలోహాల మధ్య ఈ బంధం ఏర్పడుతుంది. ii) అలోహాల మధ్య ఈ బంధం ఏర్పడుతుంది.
iii) అయానిక బంధం వల్ల అయానిక పదార్థాలు ఏర్పడతాయి. ఉదా: NaCl, MgCl2 iii) సమయోజనీయ బంధం వల్ల సమయోజనీయ పదార్థాలు ఏర్పడతాయి. ఉదా: N2, H2O, NH3
iv) అయానిక బంధం దిశారహితమైంది. iv) సమయోజనీయ బంధం దిశా ధర్మాన్ని పాటిస్తుంది.

27. సిగ్మా, పై బంధాలను పోల్చండి.  (AS1) 2 మార్కులు
జ: 

సిగ్మా బంధం (σ) పై బంధం (Π)
పరమాణు ఆర్బిటాళ్లు నేరుగా లేదా అంతర కేంద్రక అక్షం మీద అతిపాతం చెందడం వల్ల సిగ్మా (σ) బంధం ఏర్పడుతుంది. అంతర కేంద్రక అక్షానికి లంబంగా పరమాణు ఆర్బిటాళ్లు పక్క పక్కగా అతిపాతం చెందడం వల్ల Π బంధం ఏర్పడుతుంది.
ఇది స్వతంత్రంగా ఏర్పడుతుంది. ఇది స్వతంత్రంగా ఏర్పడదు.
ఇది బలమైన బంధం ఇది బలహీన బంధం.
రెండు పరమాణువుల మధ్య ఒకే ఒక సిగ్మా (σ) బంధం ఉంటుంది. రెండు పరమాణువుల మధ్య ఒకటి లేదా రెండు పై (Π) బంధాలుంటాయి.

28. సిగ్మా బంధం, పై బంధం కంటే బలమైంది, ఎందుకో కారణాలను ఊహించండి.   (AS2) 2 మార్కులు
జ: రెండు పరమాణువుల మధ్య బహుబంధాలు ఏర్పడినప్పుడు, వాటి మధ్య ఏర్పడే మొదటి బంధం, ఆ పరమాణువుల కేంద్రకాలను కలిపే అక్షీయ రేఖ వెంబడి ఆర్బిటాళ్ల అతిపాతం వల్ల ఏర్పడేది సిగ్మా (σ) బంధం అవుతుంది. ఈ సిగ్మా
(σ) బంధం ఏర్పడిన తర్వాత ఆర్బిటాళ్ల పార్శ్వ అతిపాతం వల్ల పై (Π) బంధాలు ఏర్పడతాయి.
*  ఆర్బిటాళ్ల శీర్షభాగాల అతిపాతం వల్ల ఏర్పడిన సిగ్మా (σ) బంధంలో ఎలక్ట్రాన్ జంట రెండు పరమాణు కేంద్రకాల మధ్య కేంద్రీకృతమై ఉండటం వల్ల ఈ సిగ్మా (σ) బంధం బలమైందిగా ఉంటుంది. కానీ పై (Π) బంధం సిగ్మా బంధంతో పోల్చినప్పుడు బలహీనమైంది. ఎందుకంటే p ఆర్బిటాళ్లు పార్శ్వంగా అతిపాతం చెందడం వల్ల అంత బలమైన బంధాలను ఏర్పరచలేవు.

29. కిందివాటిలో ఏర్పడే రసాయన బంధం .....
i) రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్‌లను పంచుకోవడం వల్ల
ii) ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ బదిలీ వల్ల    (AS1) ఒకమార్కు
జ: i) సమయోజనీయ బంధం
     ii) అయానిక బంధం


30. నీటి అణువులో ఏ రకమైన రసాయన బంధం ఉంటుంది?    (AS1) ఒకమార్కు
జ: సమయోజనీయ బంధం.


31. నైట్రోజన్ అణువులో ఎన్ని సిగ్మా, పై బంధాలు ఉంటాయి?    (AS1) ఒకమార్కు
జ: ఒక సిగ్మా బంధం, రెండు పై బంధాలు ఉంటాయి.


32. O2 అణువులో ఎన్ని σ, Π బంధాలు ఉంటాయి? (AS1) ఒకమార్కు
జ: ఒక
 σ, ఒక Π బంధం ఉంటాయి.


33. H2O , BFఅణువుల బంధ కోణాలు ఎంత?(AS1) ఒకమార్కు
జ: H2O అణువు బంధకోణం
104° 31'
     BF3 అణువు బంధకోణం 120°

34. Ne పరమాణువుకు లూయిస్ చుక్కల నిర్మాణాన్ని గీయండి.  (AS1) ఒకమార్కు
జ: 
            

35. H2O అణువు ఆకృతి గీయండి.  (AS5) ఒకమార్కు

జ: 
     

1. ఆవర్తన పట్టికలో ఏ గ్రూపు మూలకాల మధ్య అయానిక బంధం ఏర్పడుతుంది? (AS 1) ఒక మార్కు
జ: 
1 (I A), 17 (VII A) గ్రూపు మూలకాల మధ్య అయానిక బంధం ఏర్పడుతుంది.


2. ముఖ కేంద్రక స్ఫటిక నిర్మాణాన్ని కలిగిన అణువుకు ఒక ఉదాహరణ ఇవ్వండి. (AS 1) ఒక మార్కు
జ: NaCl


3. రెండు మూలక పరమాణువుల మధ్య రుణ విద్యుదాత్మకతల మధ్య తేడా ఎంత ఉంటే వాటి మధ్య అయానిక బంధం ఏర్పడుతుంది? (AS 1) ఒక మార్కు
జ: 1.9 లేదా అంతకంటే ఎక్కువ


4. H2O, HCl, SO2, MgCl2లలో ఏది అయానిక సమ్మేళనం? (AS 1) ఒక మార్కు
జ: 
MgCl2


5. BF3, BaCl2, CH4లలో ఎలక్ట్రాన్ కొరత ఉన్న సమ్మేళనం ఏది? (AS 1) ఒక మార్కు
జ: 
BF3


6. ఆక్సిజన్ అణువులోని సిగ్మా, పై బంధాల సంఖ్య ఎంత? (AS 1) ఒక మార్కు
జ: 1 - సిగ్మా బంధం, 1 - పై బంధం.


7. BF3లో ఉన్న సంకరీకరణం ఏమిటి? (AS 1) ఒక మార్కు
జ: sp2 సంకరీకరణం.

8. NH3లో ఉన్న సంకరీకరణం ఏమిటి? (AS 1) ఒక మార్కు


9. నీటి అణువు ఆకృతి ఏమిటి? (AS 1) ఒక మార్కు
జ: కోణీయ ఆకృతి (V - ఆకారం).


10. అణువుల ఆకృతులను వివరించిన సిద్ధాంతం ఏమిటి? (AS 1) ఒక మార్కు
జ: VSEPRT సిద్ధాంతం.


11. BeCl2 అణువులోని బంధ కోణం ఎంత? (AS 1) ఒక మార్కు
జ: 
180°.


12. NH3 అణువు ఆకృతిని తెలపండి. (AS 1) ఒక మార్కు
జ: పిరమిడల్ ఆకృతి.


13. కింది అణువుల లూయిస్ చుక్కల నిర్మాణాలను గీయండి. (AS 5) 2 మార్కులు
      i) F2       ii) HCl

14. అమ్మోనియా, మీథేన్‌లలో ఏ రకమైన బంధం ఉంటుంది? (AS 1) ఒక మార్కు
జ: సంయోజనీయ బంధం.


15. నీటి అణువులో ఉండే బంధం ఏ రకమైంది? నీటి అణువు లూయిస్ చుక్కల నిర్మాణాన్ని గీయండి. (AS 1) (AS 5) 2 మార్కులు
జ: సంయోజనీయ బంధం
   


16. మెగ్నీషియం క్లోరైడ్ ((MgCl2), అమ్మోనియా (NH3) లలో ఏ రకమైన బంధాలు ఉంటాయి? (AS 1) 2 మార్కులు
జ: మెగ్నీషియం క్లోరైడ్ (MgCl2) : అయానిక బంధం
      అమ్మోనియా (NH3) : సంయోజనీయ బంధం.


17. కిందివాటిలో ప్రతిదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
      i) ద్వి బంధం, సంయోజనీయ బంధం గల అణువు
      ii) త్రిక బంధం, సంయోజనీయ బంధం గల అణువు (AS 1) 2 మార్కులు
జ: i) ఆక్సిజన్
   ii) నైట్రోజన్.

18. X, Y అనే మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు కింది విధంగా ఉన్నాయి.
      X - 2, 6
      Y - 2, 8, 1
i) రెండు X పరమాణువుల మధ్య ఏ రకమైన బంధం ఏర్పడుతుంది?
ii) X, Y పరమాణువుల మధ్య ఏ రకమైన బంధం ఏర్పడుతుంది? (AS 2) 2 మార్కులు
జ: i) సంయోజనీయ బంధం
   ii) అయానిక బంధం


19. X, Y, Z అనే మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు ఈ విధంగా ఉన్నాయి.
      X - 2, 4
      Y - 2, 7
      Z - 2, 1
i) ఏ రెండు మూలకాలు కలిసినప్పుడు అయానిక పదార్థం ఏర్పడుతుంది?
ii) ఏ రెండు మూలకాలు కలిసినప్పుడు సంయోజనీయ పదార్థం ఏర్పడుతుంది?(AS 2) 2 మార్కులు
జ: i) Y, Z
 ii) X, Y

20. కింది అణువుల్లో ఏ రకమైన బంధాలు ఉన్నాయి? వాటి లూయిస్ చుక్కల నిర్మాణాలను గీయండి.
      i) O2       ii) CH4   (AS 5) 2 మార్కులు


21. H2O, NH3 అణువుల్లో బంధ కోణాలను తెలపండి. (AS 1) 2 మార్కులు
జ: H2O అణువులో బంధ కోణం
104° 31'
     NH3 అణువులో బంధ కోణం 107° 48'


22. కాటయాన్‌లు ఏర్పడటంలో ఏ అంశాలు ప్రభావం చూపుతాయి? (AS 1) 2 మార్కులు
జ: i) పరమాణు పరిమాణం
   ii) అయనీకరణ శక్మం
   iii) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
   iv) రుణ విద్యుదాత్మకత


23. కింది అయాన్‌ల ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయండి?

i) Mg2+      ii)  Cl-         iii)  S2-       iv) Al3+    (AS 1) 2 మార్కులు
 
జ: i) Mg2+  2, 8
     ii)
Cl-  2, 8, 8
     iii)
S2-  2, 8, 8
     iv)
Al3+ 

 2, 8

24. 'అయానిక సమ్మేళనాలు అధిక ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు కలిగి ఉంటాయి. ఎందుకో వివరించండి? (AS 1) 2 మార్కులు
జ: అణువుల్లో అయానిక బంధాలు ఏర్పడినప్పుడు వాటిలోని అయానుల మధ్య శక్తిమంతమైన స్థిర విద్యుదాకర్షణ బలాలు ఉంటాయి. అందువల్లనే అవి ఘన పదార్థాలుగా ఉండి అధిక ద్రవీభవన, భాష్పీభవన స్థానాలను కలిగి ఉంటాయి.
 

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం