• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రసాయన సమీకరణాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1. రసాయన సమీకరణం అంటే మీరేం అర్థం చేసుకున్నారు?   (AS 1) 4 మార్కులు
జ: 
* ఒక రసాయనిక చర్యను క్లుప్తంగా, అర్థవంతంగా సూచించే సాంకేతిక సమీకరణాన్ని రసాయనిక సమీకరణం అంటారు.
* రసాయన మార్పులను రసాయన సమీకరణాల ద్వారా సూచిస్తారు.
* రసాయనిక చర్యలో పాల్గొనే రసాయనాలను (మూలకాలు లేదా సమ్మేళనాలు) క్రియాజనకాలు అంటారు. చర్య జరిగిన తర్వాత ఏర్పడే కొత్త పదార్థాలను క్రియాజన్యాలు అంటారు.
* క్రియాజన్యాలు, క్రియాజనకాలను బాణం గుర్తు '' తో వేరు చేసి రాస్తారు.
* క్రియాజనకాలను సమీకరణానికి ఎడమవైపు రాస్తారు. అవి ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాటిని '+' గుర్తుతో అనుసంధానం చేస్తారు.
* క్రియాజన్యాలను సమీకరణానికి కుడివైపు రాస్తారు. అవి ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని '+' గుర్తుతో అనుసంధానం చేసి రాస్తారు.
ఉదాహరణలు:
ఎ) జింక్ లోహం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు జింక్ క్లోరైడ్, హైడ్రోజన్ వాయువు ఏర్పడతాయి.
      

బి) కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.
      

 

2  తుల్య సమీకరణం అంటే మీరేం అర్థం చేసుకున్నారు? ఎందుకు రసాయన సమీకరణాలను తుల్యం చేయాలి?  (AS 1) 4 మార్కులు                                                                                                          
జ:  ఏ రసాయన సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపు ఉండే మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు ఉండే మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అలాంటి రసాయన సమీకరణాన్ని తుల్య రసాయన సమీకరణం అంటారు.
ఉదా: ప్రొపేన్‌ను ఆక్సిజన్‌తో మండించినప్పుడు కార్బన్‌డైఆక్సైడ్, నీరు ఏర్పడతాయి.
     
» ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం, ఒక రసాయన చర్యలో పాల్గొనే పదార్థాల మొత్తం ద్రవ్యరాశి చర్యకు ముందు, తర్వాత సమానంగా ఉండాలి. ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం కావు. కాబట్టి ఒక రసాయన సమీకరణాన్ని కచ్చితంగా తుల్యం చేయాలి.

 

3. కింది రసాయన సమీకరణాలను వాటి భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి.   (AS 1) 4 మార్కులు
 
జ:  

 

4.  కింది రసాయన సమీకరణాన్ని ఏ విధంగా తుల్యం చేస్తారో వివరించండి.   (AS 1) 4 మార్కులు
   

జ:తుల్యం కాని రసాయన సమీకరణం

* ఇరువైపులా ఉండే మూలక పరమాణువుల సంఖ్యను పోల్చగా


* పై సమీకరణంలో ఎడమవైపు రెండు ఆక్సిజన్ పరమాణువులు, కుడివైపు ఒక ఆక్సిజన్ పరమాణువు ఉన్నాయి.
* ఆక్సిజన్ పరమాణువులను తుల్యం చేయడానికి కుడివైపున ఉండే H2Oను 2తో గుణించాలి.
     
డ్రోజన్ పరమాణువులను తుల్యం చేయడానికి ఎడమవైపున ఉండే H2ను 2తో గుణించాలి.
   

»* రెండు వైపులా మూలక పరమాణువులన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి సమీకరణం తుల్యం చేయబడింది.
* తుల్య సమీకరణం 


 

5.  కింది రసాయన సమీకరణాన్ని ఏ విధంగా తుల్యం చేస్తారో వివరించండి.   (AS 1) 4 మార్కులు
       

జ:
* తుల్యం కాని రసాయన సమీకరణం
* ఇరువైపులా ఉండే మూలక పరమాణువుల సంఖ్యను పోల్చగా


*  'C' పరమాణువులను తుల్యం చేయడానికి కుడివైపున ఉండే CO2ను 3తో గుణించాలి.
                                                     

*  'H' పరమాణువులను తుల్యం చేయడానికి కుడివైపున ఉండే H2Oను 4తో గుణించాలి.
     

* 'O' పరమాణువులను తుల్యం చేయడానికి ఎడమవైపున ఉండే O2ను 5తో గుణించాలి.
     

*  రెండు వైపులా మూలక పరమాణువులన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి సమీకరణం తుల్యం చేయబడింది.
*  తుల్య సమీకరణం

6.  ఒక రసాయనిక చర్య జరిగినప్పుడు జరిగే మార్పులను తెలపండి.      (AS 1) 4 మార్కులు
జ:
* తొలి పదార్థాలు వాటి గుణాత్మక ధర్మాలను కోల్పోతాయి. రంగు, స్థితిలో మార్పు చెందిన క్రియాజన్యాలు ఏర్పడతాయి.
* రసాయన చర్యలు ఉష్ణమోచక లేదా ఉష్ణగ్రాహక చర్యలు కావచ్చు. అంటే ఉష్ణం విడుదల కావచ్చు లేదా ఉష్ణం గ్రహించవచ్చు.
* కరగని అవక్షేపాన్ని ఏర్పరుస్తూ చర్య జరగవచ్చు.
* రసాయన మార్పులో కొన్ని సందర్భాల్లో వాయువు విడుదల కావచ్చు.

7.  కింది రసాయన చర్యలకు తుల్య రసాయన సమీకరణాలు రాయండి.    (AS 1) 4 మార్కులు
  i) కాల్షియం హైడ్రాక్సైడ్ + కార్బన్ డై ఆక్సైడ్  కాల్షియం కార్బొనేట్ + నీరు
  ii) జింక్ + సోడియం హైడ్రాక్సైడ్    సోడియం జింకేట్ + హైడ్రోజన్
  iii) మెగ్నీషియం + హైడ్రోక్లోరికామ్లం   మెగ్నీషియం క్లోరైడ్ + హైడ్రోజన్
  iv) సోడియం హైడ్రాక్సైడ్ + సల్ఫ్యూరికామ్లం  సోడియం సల్ఫేట్ + నీరు            

జ: i) Ca(OH)2 + CO2 CaCO3 + H2O
  ii) Zn + 2 NaOH  Na2ZnO2 + H2
  iii) Mg + 2 HCl  MgCl2 + H2
  iv) 2 NaOH + H2SO4  Na2SO4 + 2 H2O

 

8  రసాయన సమీకరణం ద్వారా మనం తెలుసుకోగలిగే అదనపు సమాచారం ఏమిటి?     (AS 1) 4 మార్కులు
జ: రసాయన సమీకరణాల ద్వారా మరింత సమాచారం తెలుసుకోవడానికి క్రియాజనకాలు, క్రియాజన్యాలకు సంబంధించిన కింది లక్షణాలు ఉపయోగపడతాయి.
    i) భౌతిక స్థితి
    ii) ఉష్ణోగ్రతలో మార్పులు (ఉష్ణగ్రాహక లేదా ఉష్ణమోచక చర్యలు)
    iii) ఏదైనా వాయువు వెలువడటం
    iv) ఏదైనా అవక్షేపం ఏర్పడటం.
i) భౌతిక స్థితిని తెలియజేయడం: ఒక రసాయన సమీకరణంలో మరింత సమాచారం కోసం క్రియాజనకాల, క్రియాజన్యాల భౌతిక స్థితులను తెలియజేయాలి. పదార్థాలు ప్రధానంగా ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉంటాయి. వీటిని వరుసగా (ఘ), (ద్ర), (వా) లతో రసాయన సమీకరణాల్లో సూచిస్తాం. ఏదైనా పదార్థం నీటిలో కరిగి ఉన్నట్లయితే వాటిని 'జల ద్రావణాలు' అంటారు. వాటిని (జ.ద్రా.) తో సూచిస్తాం.

ii) ఉష్ణ మార్పులను తెలియజేయడం: ఉష్ణాన్ని విడుదల చేస్తూ జరిగే చర్యలను ఉష్ణమోచక చర్యలు, ఉష్ణాన్ని గ్రహిస్తూ జరిగే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు.

 
iii) వాయువు విడుదలను సూచించడం: ఒక రసాయన చర్యలో వాయువు విడుదలైతే దాన్ని పైకి చూపిస్తున్న ఒక బాణపు గుర్తు ( లేదా (వా))తో సూచిస్తాం (లేదా) అవ‌క్షేపం చెందిన పదార్థం ఫార్ములాను (ఘ‌.) పాదాంకంగా ఇస్తాం.

 

iv) అవక్షేపం ఏర్పడటాన్ని సూచించడం: ఒక రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడితే దాన్ని కింద వైపునకు చూపిస్తున్న బాణపు గుర్తు () తో సూచిస్తాం.

 
v) కొన్నిసార్లు చర్య జరగడానికి అవసరమైన ఉష్ణోగ్రత, పీడనం, ఉత్ప్రేరకం లాంటి వాటిని బాణపు గుర్తు కిందకు లేదా పైన సూచిస్తారు.

 

9 . తుల్య రసాయన సమీకరణం తెలియజేసే అంశాలను తెలపండి.      (AS 1) 4 మార్కులు
జ: 
* రసాయన సమీకరణం క్రియాజనకాలు, క్రియాజన్యాలకు సంబంధించిన గుర్తులు, సంకేతాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది.
*  ఏయే మూలకాలకు చెందిన పరమాణువులు చర్యలో పాల్గొన్నాయో, ఏయే మూలకాలకు చెందిన క్రియాజన్యాలు ఏర్పడ్డాయో తెలుపుతుంది.
*  క్రియాజనకాలు, క్రియాజన్యాలకు సంబంధించిన సాపేక్ష ద్రవ్యరాశుల గురించిన సమాచారాన్ని వివరిస్తుంది.
*  ఒకవేళ సమీకరణంలో క్రియాజన్యాల, క్రియాజనకాల ద్రవ్యరాశులను గ్రాముల్లో వ్యక్తపరిస్తే అది వాటి మోలార్ నిష్పత్తులను తెలుపుతుంది.
*  ఒకవేళ రసాయన చర్యలో వాయువులు వెలువడితే వాటి ద్రవ్యరాశులు, ఘనపరిమాణాలను సమానం చేసి వాటి ఘనపరిమాణాలను గణించాలి. లేదా స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద (STP) విడుదలైన వాయువుల మోలార్ ద్రవ్యరాశి, మోలార్ ఘనపరిమాణాల మధ్య ఉండే సంబంధం ద్వారా లెక్కించవచ్చు.

* మోలార్ ద్రవ్యరాశి, అవగాడ్రో సంఖ్యను ఉపయోగించి సమీకరణంలోని వివిధ పదార్థాల అణువుల, పరమాణువుల సంఖ్యను లెక్కించవచ్చు. ఇది క్రియాజనకాలు, క్రియాజన్యాల సాపేక్ష ద్రవ్యరాశుల గురించిన సమాచారం ఇస్తుంది. రసాయన సమీకరణం కింది సంబంధాలను తెలుపుతుంది.
      ఎ) ద్రవ్యరాశి - ద్రవ్యరాశి సంబంధం
      బి) ద్రవ్యరాశి - ఘనపరిమాణం సంబంధం
      సి) ఘనపరిమాణం - ఘనపరిమాణం సంబంధం
      డి) ద్రవ్యరాశి - ఘనపరిమాణం, అణువుల సంఖ్యల మధ్య సంబంధం 

10 .         

(పరమాణు ద్రవ్యరాశులు Al = 27 U, Fe = 56 U, O = 16 U)
   అయితే 336 కి.గ్రా. ఇనుమును రాబట్టేందుకు ఎంత పరిమాణం ఉన్న అల్యూమినియం అవసరమవుతుందో పై సమీకరణం ఆధారంగా లెక్కించండి. 

జ:   

 

 

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

భౌతిక రసాయన శాస్త్రం

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌