• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మానవుని కన్ను- రంగుల ప్రపంచం

బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. కంటిలోకి ప్రవేశించే కాంతిని సరిచేసే కంటి భాగం-                                                                   
A) ఐరిస్       B) కంటిపాప       C) కార్నియా       D) రెటీనా

 

2. కిందివాటిలో కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యం                                     
A) దృష్టి స్థిరత       B) సర్దుబాటు     C) స్పష్ట దృష్టి కనీస దూరం       D) ఏదీకాదు

 

3. కంటి కటక నాభ్యంతరంలో మార్పు కిందివాటిలో దేని వల్ల కలుతుంది?                                      
A) కంటిపాప       B) ఐరిస్       C) సిలియరి కండరాలు       D) కార్నియా

 

4. కాంతిని నియంత్రించే కంటిలోని భాగం-                                                                                 
A) సిలియరి కండరాలు       B) రెటీనా       C) కార్నియా       D) ఐరిస్

 

5. కిందివాటిలో కంటి కటక నాభ్యంతరం తగ్గడం వల్ల ఏర్పడేది -                                                 
A) హ్రస్వదృష్టి       B) దూరదృష్టి       C) చత్వారం       D) దృష్టిలోపం

 

6. సాధారణ మానవుడి స్పష్ట దృష్టి కనీస దూరం -                                                                      
A) 20 సెం.మీ.       B) 25 సెం.మీ.       C) 30 సెం.మీ.       D) ఏదీకాదు



7. సాధారణ మానవుడి దృష్టి కోణం                                                                                        
A) 30
°       B) 50°       C) 60°       D) ఏదీకాదు

8. కంటి కటక నాభ్యంతరం                                                                                                     
A) 2.0 - 2.20 సెం.మీ.       B) 2.0 - 2.27 సెం.మీ.
C) 2.27 - 2.5 సెం.మీ.        D) 2.27 - 2.8 సెం.మీ.

 

9. పెరిగే వయసుతోపాటు వచ్చే దీర్ఘదృష్టి లోపం...........                                                            
A) హ్రస్వదృష్టి       B) దీర్ఘదృష్టి       C) చత్వారం       D) ఏదీకాదు

 

10. కంటి అద్దాలు ఉపయోగించి సరిచేయలేని కంటి దోషం                                                         
A) హ్రస్వదృష్టి       B) దూరదృష్టి       C) చత్వారం       D) శుక్లాలు

A) హ్రస్వదృష్టి       B) దీర్ఘదృష్టి       C) చత్వారం       D) ఏదీకాదు
 

12. VIBGYOR లో తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న రంగు                                                              
A) ఎరుపు       B) ఊదా       C) ఆకుపచ్చ       D) పసుపు


 

13. దూరదృష్టి కనిష్ఠ దూర బిందువు 1 మీ. అయితే దృష్టి దోషం సరిచేయడానికి కావాల్సిన కటక సామర్థ్యం- 
A) 2 D       B) 3 D       C) 1 D       D) 4 D

 

14. వర్ణాంధత్వానికి కారణం-                                                                                                              
A) దండాలు       B) శంకువులు       C) ఐరిస్       D) ఏదీకాదు

 

15.  తెలుపు కాంతి వర్ణ పటంలో చివరిలో కనిపించే రెండు రంగులు                                                      
A) ఆకుపచ్చ, పసుపుపచ్చ     B) నీలం, ఎరుపు    C) ఎరుపు, నారింజ     D) ఎరుపు, ఊదా

 

16. గడ్డి ఆకుపచ్చగా ఉండటానికి కారణం                                                                                           
A) ఆకుపచ్చ కాంతి పరావర్తనం        B) ఆకుపచ్చ కాంతి శోషణ
C) ఆకుపచ్చ కాంతి వక్రీభవనం         D) ఏదీకాదు

 

17. చత్వారాన్ని నివారించడానికి కింది ఏ కటకాన్ని ఉపయోగిస్తారు?                                                     
A) ద్వి కుంభాకార       B) ద్వినాభ్యంతర       C) ద్విపుటాకార       D) కుంభాకార

18.  పటంలో i1 సూచించేది 

               
A) పరావర్తన కోణం       B) పతన కోణం   
C) బహిర్గత కోణం         D) పట్టక కోణం

19.   పటంలో 'D' సూచించేది 

                                      
A) విచలన కోణం         B) పరావర్తన కోణం  
C) వక్రీభవన కోణం       D) పట్టక కోణం

20. ఆకాశం నీలిరంగుగా కనిపించడానికి కారణం                    
A) O2, H2 అణువులు       B) N2, He అణువులు
C) O2, N2 అణువులు       D) N2, Cl2 అణువులు

 

21. కిందివాటిలో సరికానిది ఏది?                                        
A) దృష్టి కోణం - 60
°
B) స్పష్ట దృష్టి కనిష్ఠ దూరం - 25 సెం.మీ.
C) కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం - 1 సెం.మీ.
D) కంటి కటక గరిష్ఠ నాభ్యంతరం - 2.5 సెం.మీ.

22. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.                         
A) 10 ఏళ్లలోపు వయసు వారి స్పష్ట దృష్టి కనీస దూరం 7 - 8 సెం.మీ.
B) వయసు మళ్లినవారి స్పష్ట దృష్టి కనీస దూరం 1 మీ. లేదా ఎక్కువ
C) స్పష్ట దృష్టి కోణం 60
° మించితే వస్తువును కొంత భాగం మాత్రమే చూడగలం
D) స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టి కోణం అందరికీ ఒకేవిధంగా ఉంటుంది



23. ఒక వ్యక్తికి వైద్యుడు 2D కటకాన్ని వాడాలని సూచించారు, ఆ కటక నాభ్యంతరం-                            
A) 20 సెం.మీ.       B) 50 సెం.మీ.       C) 100 సెం.మీ.       D) 150 సెం.మీ.

24. ఒక వ్యక్తికి వైద్యుడు 2D (-ve) కటకాన్ని వాడాలని సూచిస్తే కటక నాభ్యంతరం ఎంత? అది ఏ రకమైన కటకం? 
A) 50 సెం.మీ., కుంభాకార       B) 50 సెం.మీ., పుటాకార
C) 25 సెం.మీ., కుంభాకార       D) 25 సెం.మీ., పుటాకార

 

25. త్రిభుజాకార పట్టకాన్ని ఆవరించి ఉండే ఉపరితలాల సంఖ్య                                                              
A) 3       B) 4       C) 5       D) 6

 

26. కనుపాప దాని పరిమాణాన్ని సరిచేసుకుంటుంది. ఎందుకు?                                                           
A) వివిధ దూరాల వద్ద వస్తువులుండటం వల్ల
B) వివిధ పరిమాణాల వస్తువుల కోసం
C) వివిధ పరిమాణాలను కలిగిన కాంతి కోసం
D) వివిధ రంగుల కోసం

 

27. కంటి రెటీనాపై పడిన ప్రతిబింబపు సంకేతాలను మెదడుకు చేరవేసేది/చేరవేసేవి-                            
A) కార్నియా       B) దృక్ నాడులు       C) సిలియరి కండరాలు       D) ఏదీకాదు

28. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు ఎరుపుగా కనిపించడానికి కారణమైన దృగ్విషయం 
A) కాంతి సంపూర్ణాంతర పరావర్తనం       B) కాంతి పరిక్షేపణం
C) కాంతి విక్షేపణం                                D) కాంతి పరావర్తనం

29. ఎత్తయిన భవనాలపై ప్రమాదకర గుర్తుల (డేంజర్ సిగ్నల్స్)ను అమరుస్తారు. అవి ఎరుపు రంగుని మాత్రమే కలిగి ఉంటాయి. ఇవన్నీ చాలా దూరం నుంచి కనిపిస్తాయి. కారణం ఎరుపు రంగు మిగిలిన వాటి కంటే 
A) గాలిలో వేగంగా కదులుతుంది
B) పొగ లేదా మంచును ఎక్కువగా గ్రహిస్తుంది
C) పొగ లేదా మంచుల్లో ఎక్కువగా పరిక్షేపణం చెందుతుంది
D) పొగ లేదా మంచుల్లో తక్కువగా పరిక్షేపణం చెందుతుంది


30. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు ఎర్రగా, మిట్ట మధ్యాహ్నం తెల్లగా కనిపించడానికి కారణమేంటి?
A) సూర్యోదయ లేదా సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుడు చల్లగా ఉండటం
B) వక్రీభవనమే ఈ దృగ్విషయానికి కారణం
C) ధూళి కణాలు, గాలి అణువుల వల్ల కాంతి పరిక్షేపణం
D) ఈ సమయంలో వక్రీభవనం ఎర్రని కిరణాలను భూమిపైకి పంపుతుంది

 

31. మధ్యాహ్నవేళ జలపాతం ఏ బిందువు వద్ద నిల్చొన్న వ్యక్తి ఇంధ్రధనస్సును చూడగలడు. 
A) ఏ బిందువు నుంచైనా
B) జలపాతంపై నుంచి
C) జలపాతం పక్కల నుంచి
D) జలపాతం కింద నుంచి


32. కిందివాటిలో ఇంద్రధనస్సు ఏర్పడటంలో ఇమిడి ఉన్న దృగ్విషయం 
A) వక్రీభవనం, విక్షేపణం
B) వక్రీభవనం, విక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం
C) పరావర్తనం, వక్రీభవనం, విక్షేపణం
D) కాంతి విక్షేపణం, పరిక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం


33. సిలియరి కండరాలు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు
A) నాభ్యంతరం గరిష్ఠమవుతుంది
B) దూరంగా ఉన్న వస్తువును చూడొచ్చు
C) సమాంతర కాంతి కిరణ పుంజం కంటిలోకి ప్రవేశిస్తుంది
D) పైవన్నీ సరైనవే

34. ఎలాంటి ఒత్తిడి లేకుండా కన్ను స్పష్టంగా చూసే దూరం
A) దృష్టి స్థిరత     B) స్పష్ట దృష్టి కనీస దూరం    C) సర్దుబాటు   D) అన్నీ


35. ఒక యువకుడి స్పష్ట దృష్టి కనీస దూరం
A) 7 సెం.మీ.    B) 10 సెం.మీ.    C) 25 సెం.మీ.    D) 1 మీ.


36. సాధారణ దృష్టికి గరిష్ఠ దూరబిందువు
A) 7 సెం.మీ.   B) 10 సెం.మీ.   C) 25 సెం.మీ.    D) అనంతం


37. హ్రస్వదృష్టి లోపంతో బాధపడే వ్యక్తి ఏ వస్తువులు స్పష్టంగా చూడలేడు?
A) దగ్గర    B) దూరం    C) దగ్గర, దూరం    D) ఏదీకాదు


38. హ్రస్వదృష్టి వల్ల
A) గరిష్ఠ నాభ్యంతరం 2.5 సెం.మీ. కంటే ఎక్కువ అవుతుంది
B) గరిష్ఠ నాభ్యంతరం 2.5 సెం.మీ. కంటే తక్కువ అవుతుంది
C) గరిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువ అవుతుంది
D) గరిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే తక్కువ అవుతుంది


39. కిందివాటిలో ఏ కంటి దోషంలో దూరంగా ఉన్న వస్తువు ప్రతిబింబం రెటీనాకు ముందు ఏర్పడుతుంది?
A) హ్రస్వదృష్టి    B) దూరదృష్టి      C) చత్వారం    D) దృష్టిలోపం

 


40. హ్రస్వదృష్టి లోపాన్ని సవరించడానికి ఉపయోగించే కటకం
A) కుంభాకార     B) పుటాకార     C) ద్వినాభ్యంతర     D) స్తూపాకార


41. దూరదృష్టి లోపంతో బాధపడే వ్యక్తి కింది వస్తువులను స్పష్టంగా చూడలేడు. 
A) దగ్గర    B) దూరం    C) దగ్గర, దూరం    D) ఏదీకాదు


42. దూరదృష్టి లోపాన్ని సవరించడానికి ఉపయోగించే కటకం- 
A) కుంభాకార     B) పుటాకార     C) ద్వినాభ్యంతర     D) స్తూపాకార


43. ఒక వ్యక్తి హ్రస్వదృష్టి, దీర్ఘ దృష్టితో బాధపడుతుంటే అతడు ఉపయోగించే కటకం 
A) కుంభాకార       B) పుటాకార       C) ద్వినాభ్యంతర       D) స్తూపాకార


A) హ్రస్వదృష్టి       B) దీర్ఘదృష్టి       C) చత్వారం       D) ఏ కంటి దోషం లేదు


45. రెటీనాకు కంటి కటకానికి మధ్య దూరం ఎన్ని సెంటిమీటర్లు?
A) 2.5       B) 2       C) 1.75       D) 7


46. కటక సామర్థ్యం

జవాబులు: 1-A;  2-B;  3-C;  4-C;  5-A;  6-B;  7-C;  8-C;  9-C;  10-D;  11-A;  12-B;  13-B;  14-A;  15-C;  16-A;  17-B;  18-B;  19-A;  20-C;  21-C;  22-C;  23-B;  24-B;  25-C;  26-C;  27-B. 28-B;   29-D;   30-C; 31-B;   32-B;   33-D; 34-B;   35-C;   36-D;   37-B;   38-B;   39-A; 40-B;   41-A;   42-A;   43-C;   44-B;   45-A;   46-B

Posted Date : 26-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం