• facebook
  • twitter
  • whatsapp
  • telegram

లోహ సంగ్రహణ శాస్త్రం 

బహుళైచ్ఛిక ప్రశ్నలు 

1. కిందివాటిలో సాధారణంగా సహజస్థితిలో లభించే లోహం కానిది 
    A) Cu       B) Au       C) Na       D) Ag

 

2. సిన్నబార్ ధాతువు  
    A) ZnO       B) NaCl       C) PbS       D) HgS

 

3. గెలీనా అంటే 
    A) ZnO       B) ZnS       C) PbS       D) HgS

 

4. జతపరచండి.  
1) జింగ్ బ్లెండ్        a) ZnO

2) మాగ్నసైట్         b) ZnS

3) జింకైట్              c) KCl. MgCl2. 6 H2O

4) కార్నలైట్          d) MgCO3

   A) 1-b, 2-d, 3-a, 4-c     B) 1-a, 2-b, 3-c, 4-d    C) 1-c, 2-d, 3-a, 4-b     D) 1-c, 2-a, 3-d, 4-b
 

5. సిన్నబార్ దేని ధాతువు?  
      A) Zn       B) Cu       C) Mg       D) Hg

 

6. కిందివాటిలో మెగ్నీషియం ధాతువు
   A) కార్నలైట్       B) మాగ్నసైట్       C) ఎప్సమ్ లవణం      D) అన్నీ

 

7. కింది ధాతువుల్లో ప్లవన ప్రక్రియ ద్వారా గాఢత పరచని ధాతువు
   A) కాపర్ పైరటీస్      B) జింక్‌బ్లెండ్     C) గెలీనా     D) కార్నలైట్

 

8. కార్నలైట్‌లో ఉన్న లోహం అయాన్‌లు 
      A) Na, Mg       B) Zn, Mg       C) K, Mg       D) Al, Na

 

9. హెమటైట్ ఫార్ములా
      A) Fe2O3       B) Fe3O4       C) FeCO3       D) FeS2

 

10. థర్మైట్ దేని మిశ్రమం?  
      A) ఒక భాగం Al పొడి, ఒక భాగం Fe2O3          B) ఒకభాగం Al పొడి, 3 భాగాలు Fe2O3
      C) 2 భాగాలు Al పొడి, ఒకభాగం Fe2O3           D) 3 భాగాలు Al పొడి, ఒకభాగం Fe2O3

 

11. థర్మైట్ విధానంలో క్షయకరణ కారకం  
      A) Al       B) Si       C) Mg       D) Fe

 

12. లోహాలను వాటి చర్యాశీలతల అవరోహణ క్రమంలో అమర్చడాన్ని ............ అంటారు.  
   A) క్రియాశీల శ్రేణి     B) క్షయకరణ శ్రేణి   C) క్రియాశీల శ్రేణి, క్షయకరణ శ్రేణి    D) ఏదీకాదు

 

13. అల్పభాష్పీభవన స్థానాలున్న లోహాలను శుద్ధిచేయడానికి అనువైన పద్ధతి
      A) స్వేదనం       B) విద్యుత్‌శోధనం      C) పౌలింగ్       D) గలనం

 

14. గాలి అందుబాటులో లేకుండా లోహధాతువును వేడిచేసే ప్రక్రియ   
      A) భస్మీకరణం       B) భర్జనం       C) ప్రగలనం       D) పౌలింగ్

 

15. ధాతువును గాలి లేదా ఆక్సిజన్ సమక్షంలో వేడిచేసే ప్రక్రియ  
      A) భస్మీకరణం       B) భర్జనం       C) ప్రగలనం       D) పౌలింగ్

 

16. ఇనుప వస్తువుల మీద జింక్ పూత పూయడాన్ని ....... అంటారు.
      A) ఎలక్ట్రోప్లేటింగ్       B) గాల్వనైజేషన్       C) పెయింటింగ్       D) ఏదీకాదు

 

17. డై సైనార్జియేట్ అయాన్‌లను ఈ చూర్ణంతో చర్యనొందించి Ag లోహాన్ని అవక్షేప రూపంలో పొందుతారు.  
   A) అల్యూమినియం చూర్ణం           B) రాగి చూర్ణం    
  C) మెగ్నిషియం చూర్ణం       D) జింక్ చూర్ణం

 

18. మట్టి కుండలు, ఇటుకలను కాల్చడం 
   A) భస్మీకరణం       B) భర్జనం       C) వాలెంగ్       D) అన్నీ

 

19. ఆర్నమెంటల్ బంగారం అనేది  
  A) 20 క్యారెట్‌లు       B) 24 క్యారెట్‌లు       C) 22 క్యారెట్‌లు       D) ఏదీకాదు

 

20. ఒక లోహ పదార్థం తీగలుగా సాగే ధర్మం
  A) స్తరణీయత       B) తాంతవత       C) ధ్వనిగుణం       D) ఏదీకాదు

 

21. కార్నలైట్ ఫార్ములా 
 A) KCl. MgCO3       B) MgCl2. MgCO3      C) KCl. MgCl2. 6 H2O       D) CaCO3. MgCO3

 

22. గాలితో చర్య జరపని లోహం
      A) Na       B) Fe       C) Mg       D) Au

 

23. పాదరసం ధాతువు  
      A) గెలీనా       B) బాక్సైట్       C) హెమటైట్       D) సిన్నబార్

 

24. బ్లాస్ట్ కొలిమిలో వచ్చే లోహమలాన్ని ఏమంటారు?  
     A) కాల్షియం కార్బొనేట్          B) కాల్షియం ఎసిటేట్      
    C) కాల్షియం సిలికేట్       D) కాల్షియం ఫార్మేట్

 

25. ఇనుము, మెగ్నీషియం, సోడియం, జింక్‌ల పరంగా వాటి చర్యాశీలత వరుస క్రమం
      A) Fe > Na > Mg > Zn          B) Zn > Mg > Na > Fe      
      C) Zn > Fe > Na > Mg          D) Na > Mg > Zn > Fe

 

26. లోహాల చర్యాశీలత శ్రేణి పరంగా ఉండే అమరిక 
      A) Na > Cu > Zn > Ca           B) Ca > Na > Zn > Cu
      C) Na > Ca > Zn > Cu           D) Na > Cu > Ca > Zn

 

27. భర్జనం సాధారణంగా ........ల్లో సాధ్యపడుతుంది. 
  A) కార్బొనేట్ ధాతువు     B) ఆక్సైడ్ ధాతువు    C) సిలికేట్ ధాతువు    D) సల్ఫైడ్ ధాతువు

 

28. ప్రగలనం .........లో సాధ్యపడుతుంది.  
  A) బ్లాస్ట్ కొలిమి     B) ఓపెన్ హెర్త్ విధానం    C) విద్యుత్ కొలిమి     D) ఏదీకాదు

 

29. థెర్మిట్ వీటి మిశ్రమం?  
   A) Mg, BaO2       B) Fe2O3, Al చూర్ణం      C) Al2O3, Fe       D) Al2O3, Mg

 

30. ఇనుమును తుప్పు నుంచి రక్షించడం కోసం జింక్ పూత పూయడాన్ని ...... అంటారు.  
      A) భస్మీకరణం       B) భర్జనం       C) ప్రగలనం       D) గాల్వనైజింగ్

 

31. ధాతువు నుంచి ఉపయోగపడని మలినాలను తొలగించే ప్రక్రియ                                                     
   A) శుద్ధిచేయడం     B) గాఢత చెందించడం    C) భర్జనం    D) భస్మీకరణం

 

32. గాల్వనైజింగ్ చేసిన ఇనుము తుప్పు నుంచి రక్షంచబడుతుంది. ఎందుకంటే అది ......... పై పొరను కలిగి ఉంటుంది. 
    
  A) Cr       B) Mn       C) Mg       D) Zn

 

33. ఇనుముకు దేన్ని కొద్ది పరిమాణంలో కలపడం వల్ల గట్టిగా, దృఢంగా మార్పు చెందుతుంది?
      A) ప్లాటినం       B) కాపర్       C) సల్ఫర్       D) కార్బన్


34. ఇనుము తుప్పు పట్టడంలో జరిగే మొత్తం చర్య
 A) Fe + 6 CO 

 Fe(CO)6        B) 3 Fe + 3 O2  3 FeO2
 C) 2 Fe + O2 + 4 H+  2 Fe+2 + 2 H2O     D) Fe + 3 H2 Fe(OH)3 +  H2


35. స్టెయిన్‌లెస్ స్టీల్ తుప్పు పట్టదు కారణం
   A) దీనిలో ఉన్న నికెల్ తుప్పు పట్టదు
   B) ఇనుము క్రోమియంతో గట్టిగా ఉన్న రసాయన సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది.
   C) క్రోమియం, నికెల్‌లు ఇనుముతో సంయోగం చెందుతాయి.
   D) క్రోమియం ఆక్సైడ్ పొరను ఏర్పరచడం వల్ల ఇనుము తుప్పు పట్టకుండా రక్షిస్తుంది.

 

36. ప్లవన ప్రక్రియను ఏ రకం ధాతువు సాంద్రీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు?  
      A) సల్ఫైడ్       B) ఆక్సైడ్       C) కార్బొనేట్       D) నైట్రేట్


37. ప్లవన ప్రక్రియలో వాడే నూనె
  A) కొబ్బరి నూనె    C) ఆలివ్ నూనె    C) పైన్ నూనె    D) సన్‌ప్లవర్ నూనె


38. లోహ క్షయం ........ సమక్షంలో జరుగుతుంది. 
   A) నీరు     B) గాలి     C) నీరు, గాలి     D) ఉష్ణం


39. స్టెయిన్‌లెస్ స్టీల్ మిశ్రమలోహంలో ఇనుముతో కలిపే లోహాలు
     
A) Cr, Ni       B) Cu, Cr       C) Zn, Cu       D) Zn, Ni

 

40. సల్ఫైడ్ ధాతువు స్వయం క్షయకరణం ద్వారా ఈ లోహాన్ని సంగ్రహిస్తారు.
     
A) Zn       B) Mg       C) Pb       D) Cu

 

41. కిందివాటిలో అధిక క్రియాశీలత ఉండే లోహం ఏది? 
    
  A) Hg       B) Pt         C) Zn       D) K

 

42. కిందివాటిలో ఏ లోహం క్రియాశీలత మధ్యస్థంగా ఉంటుంది?   
       A) Na       B) Pt         C) Al      D) Fe


43. కిందివాటిలో ఏ చర్యను వినియోగించి విరిగిన రైలు కమ్మీలను అతికిస్తారు? 
   A) థర్మైట్ చర్య      B) క్షయకరణ చర్య     C) ఆక్సీకరణ చర్య     D) ఏదీకాదు


44. భర్జన ప్రక్రియలో సల్ఫైడ్ ధాతువులు ఏ విధంగా మార్పు చెందుతాయి? 
   A) ఆక్సైడ్      B) సల్ఫేట్    C) కార్బొనేట్    D) ఏదీకాదు


45. భస్మీకరణ ప్రక్రియలో కార్బొనేట్‌లు ఏ విధంగా మార్పు చెందుతాయి?  
  A) ఆక్సైడ్‌లు     B) లోహాలు    C) ఆక్సైడ్‌లు, లోహాలు      D) ఏదీకాదు


46. స్వేదనం ద్వారా శుద్ధి చేసే లోహం ఏది?  
  A) Zn       B) Hg     C) Zn, Hg     D) Cu


47. గలనం చేయడం ద్వారా శుద్ధి చేసే లోహం  
 
A) Sn         B) Fe           C) Zn      D) Cu


48. కిందివాటిలో ఏ లోహాన్ని తడిగాలి (తేమ)లో ఉంచినప్పుడు క్షయం చెందుతుంది? 
   
    A) Pt           B) Fe          C) Ag          D) Au


49. బ్లిస్టర్ కాపర్‌ను ఏ పద్ధతిలో శుద్ధి చేస్తారు? 
   A) స్వేదనం      B) పోలింగ్       C) గలనం చేయడం       D) విద్యుత్ శోధనం

 

50. అల్ప భాష్పశీల లోహాలను ఏ పద్ధతిలో శుద్ధి చేస్తారు?  
   A) స్వేదనం     B) పోలింగ్     C) గలనం చేయడం        D) విద్యుత్ శోధనం


51. ద్రవస్థితిలో ఉన్న లోహాన్ని పచ్చికర్రలతో బాగా కలపడం ద్వారా ముడిలోహాన్ని శుద్ధిచేసే ప్రక్రియను ఏమంటారు?  
    A) స్వేదనం    B) పోలింగ్       C) గలనం చేయడం     D) విద్యుత్ శోధనం


52. టిన్ లాంటి అల్ప ద్రవీభవ స్థానాలున్న లోహాలను ఎలా శుద్ధి చేస్తారు?  
   A) స్వేదనం    B) పోలింగ్       C) గలనం చేయడం     D) విద్యుత్ శోధనం


53. జింక్, పాదరసం లాంటి అల్ప భాష్పశీల లోహాలను లోహశోధనం చేసే ప్రక్రియను ఏమంటారు?
   A) స్వేదనం     B) పోలింగ్       C) గలనం చేయడం      D) విద్యుత్ శోధనం


54. ఖనిజాన్ని ధాతువు అని ఎప్పుడు అంటారు?  
  A) ఖనిజం నుంచి లోహాన్ని సంగ్రహించడానికి వీలున్నప్పుడు 
  B) ఖనిజం నుంచి లోహాన్ని సంగ్రహించడానికి వీలులేనప్పుడు
  C) లోహం ఖరీదు ఎక్కువైనప్పుడు 
  D) ఖనిజం నుంచి లోహాన్ని లాభసాటిగా, సులభంగా పొందడానికి వీలున్నప్పుడు

 

55. కిందివాటిలో సరైంది? 
  A) ఖనిజం ధాతువు కాదు           B) ధాతువు ఖనిజం కాదు 
  C) ఖనిజాలన్నీ ధాతువులే           D) ధాతువులన్నీ ఖనిజాలే


56. కిందివాటిలో స్వేచ్ఛా (స్వాభావిక) స్థితిలో లభించని లోహం?
   A) Ag         B) Au       C) Na        D) Cu


57. బంగారం ఎందుకు స్వేచ్ఛాస్థితిలో లభిస్తుంది?  
 A) అధిక పరమాణు సంఖ్య వల్ల            B) అధిక పరమాణు భారం వల్ల
 C) అధిక చర్యాశీలత వల్ల              D) అల్ప చర్యాశీలత వల్ల


58. మాంగనీస్ యొక్క ప్రధాన ధాతువు? 
  A) పైరోల్యూసైట్    B) డోలమైట్      C) సెడిరైట్       D) గెలీనా


59. సిన్నబార్ ఏ లోహం యొక్క ధాతువు? 
 
 A) Ag      B) Au      C) Hg       D) Pb


60. సిల్వర్ యొక్క ధాతువు  
   A) హెమటైట్     B) మాగ్నసైట్        C) హర్న్‌సిల్వర్       D) గెలీనా

 

61. మలినాలను తొలగించడానికి ఉపయోగించే పదార్థం?   
    A) ఉత్ప్రేరకం     B) గాంగ్       C) ద్రవకారి      D) లోహమలం


62. ప్లవన ప్రక్రియలో ధాతు కణాలు పైకి తేలడానికి కారణం
A) అవి తేలికగా ఉంటాయి    B) వాటి ఉపరితలానికి సులభంగా తడి తగలకపోవడం
C) వాటి మధ్య స్థిర విద్యుదాకర్షణ ఉంటుంది    D) అవి నీటిలో కరగవు


63. గలన (ద్రవ) స్థితిలో లోహం లభించే ప్రక్రియ  
   A) ప్లవన ప్రక్రియ     B) ప్రగలనం       C) భర్జనం        D) భస్మీకరణం


64. కిందివాటిలో పోలింగ్ ద్వారా శుద్ధి చేసే లోహం ఏది?  
   A) Al       B) Fe        C) Cu         D) Mg


65. ఐరన్ (ఇనుము) ధాతువును గాఢత చెందించే విధానాన్ని ఏమంటారు?  
  A) ప్లవన ప్రక్రియ    B) విద్యుత్ విశ్లేషణ      C) భర్జనం      D) అయస్కాంత వేర్పాటు


66. బ్లిస్టర్ కాపర్ అంటే? 
   A) శుద్ధ కాపర్    B) కాపర్ యొక్క ధాతువు     C) కాపర్ మిశ్రమ లోహం    D) అపరిశుద్ధ కాపర్


67. ఐరన్ యొక్క ప్రధాన ధాతువు 
   A) సల్ఫేట్       B) ఆక్సైడ్      C) క్లోరైడ్      D) కార్బొనేట్

 

68. బ్లాస్ట్ కొలిమిలో సున్నపురాయిలోని Ca చివరకు ఏ విధంగా మారుతుంది?  
   
A) CaO        B) CaFeO2      C) CaSiO3      D) CaC2


69. కిందివాటిలో అధిక క్రియాశీలత ఉన్న లోహానికి ఉదాహరణ 
       
A) Hg        B) Fe       C) Zn          D) Na


70. కిందివాటిలో అల్ప క్రియాశీలత ఉన్న లోహానికి ఉదాహరణ 
     
  A) K          B) Al          C) Pb            D) Pt


71. లోహాల చర్యాశీలత శ్రేణి పరంగా కిందివాటిలో సరైన అమరిక 
   A) A> K > Au > Cu > Hg          B) Na > Ca > Zn > Cu > Ag
   C) Pt > Pb > Zn > A> Cu          D) Mg > Zn > Fe > Au > Cu


72. కిందివాటిలో Mg, Zn, Al, Cu, Pt, K లోహాల చర్యాశీలతను తగ్గుదల క్రమంలో ఏ విధంగా రాస్తారు? 
   
A) K, Al, Mg, Zn, Pt, Cu                 B) Al, Mg, K, Pt, Zn, Cu 
      C) Pt, Cu, Zn, Al, Mg, K                 D) K, Mg, Al, Zn, Cu, Pt

 

73. కిందివాటిని జతపరచండి.  
       ధాతువు                 ఫార్ములా
     
1) హర్న్ సిల్వర్        a) MnO2
         2) పైరోల్యూసైట్               b) PbS
         3) హెమటైట్                    c) AgCl
         4) గెలీనా                          d) Fe2O3
       A) 1-b, 2-c, 3-d, 4-a           B) 1-a, 2-b, 3-d, 4-c
       C) 1-c, 2-a, 3-d, 4-b           D) 1-c, 2-d, 3-a, 4-b


74. కిందివాటిని జతపరచండి.  
             ఫార్ములా                 ధాతువు
        
1) CaSO4 . 2 H2O                a) బాక్సైట్
      
   2) MgSO4 . 7 H2O                b) కార్నలైట్
       
  3) KCl.MgCl2 . 6 H2          c) జిప్సం
       
  4) Al2O3 . 2 H2O               d) ఎప్సం లవణం
A) 1-c, 2-b, 3-d, 4-a            B) 1-d, 2-b, 3-a, 4-c 
C) 1-a, 2-b, 3-c, 4-d             D) 1-c, 2-d, 3-b, 4-a

 

75. కిందివాటిని జతపరచండి.  
                ధాతువు                 సంగ్రహించబడే లోహం
             1) పైరోల్యూసైట్                  a) Hg
             2) మాగ్నసైట్                     b) Mn
             3) సిన్నబార్                       c) Ca
             4) సున్నపురాయి                   d) Mg 
    
A) 1-b, 2-d, 3-c, 4-a              B) 1-b, 2-a, 3-c, 4-d 
       C) 1-b, 2-d, 3-a, 4-c              D) 1-b, 2-c, 3-a, 4-d


76. కిందివాటిని జతపరచండి.    
          
క్రియాశీలత                                   లోహాలు
            1) అధిక క్రియాశీలత                       a) Zn, Fe, Pb, Cu
            2) మధ్యస్థ క్రియాశీలత                    b) Hg, Ag, Pt, Au
            3) అల్ప క్రియాశీలత                        c) K, Na, Ca, Mg, Al
       A) 1-a, 2-b, 3-c                         B) 1-c, 2-b, 3-a 
       C) 1-b, 2-a, 3-c                         D) 1-c, 2-a, 3-b

 

జవాబులు:  1-C;   2-D;   3-C;   4-A;  5-D;   6-D;   7-D;   8-C;   7-D;   8-C;   9-A;   10-B;   11-A; 12-A;   13-A;   14-A;   15-B;   16-B;   17-D;   18-B; 19-C;   20-B;   21-C;   22-D;   23-D;   24-C;   25-D; 26-C;   27-D;   28-A;   29-B;   30-D;   31-B;  32-D;   33-D;   34-C;   35-D; 36-A;   37-C;   38-C;   39-A;   40-D,  41-D;  42-D;  43-A; 44-A; 45-A; 46-C; 47-A; 48-B; 49-B;  50-A; 51-B; 52-C; 53-A; 54-D;  55-D; 56-C; 57-D; 58-A; 59-C; 60-C;  61-C; 62-B; 63-B; 64-C; 65-D; 66-D; 67-B; 68-C; 69-D; 70-D; 71-B; 72-D; 73-C; 74-D; 75-C; 76-D.

Posted Date : 26-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం