• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వీర తెలంగాణ

ప్రాజెక్టు పని

అ. తెలంగాణా పోరాట నేపథ్యంలో వచ్చిన ఏవైనా రెండు మూడు పాటలు సేకరించండి. వాటిని పాడి వినిపించండి.
                   
  లేదా
ఆ. దాశరథి రాసిన ఏదైనా ఒక పుస్తకం/ పాట/ కవిత చదవండి. దాని ఆధారంగా నివేదిక రాసి చదివి వినిపించండి.
జ: అ) తెలంగాణా పోరాట నేపథ్యంలో వచ్చిన పాటలు

పాట - 1
పల్లవి: కొమ్మాలల్లో కోయిలమ్మా పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది
          అలసిపోయిన లేడీ కూన గంతులేస్తనన్నది కాలి గజ్జె కడుతునన్నది
          పాణం పోయే మేకపిల్ల డప్పునైతనన్నది దండోర వేస్తనన్నది
          ఇప్పుడు పుట్టిన లేగదూడ దుంకులాడుతన్నది
          ధూం... దాం... చేస్తానన్నది ||కొమ్మ||

చరణం 1: గొర్కోళ్లు వొడవంగ కూత వడుతనన్నది
               కోడి నిదుర లేపుతున్నది
 పిడికేడంత లేని పిచ్చుక పోరు జేస్తనన్నది
               పోరుబాటనైతనన్నది
               చెట్టుచేమలన్ని ఊగి ఊపిరి పోస్తమన్నయి
               ఉద్యమాలు జేస్తమన్నయి
               పోడిసేటి పొద్దుగూడ పొత్తుగూడుతనన్నది
               పోరుకు సై అన్నది || కొమ్మాలల్లో ||

చరణం 2: నక్క బావా జిత్తులతో చిత్తుజేస్తనన్నది
                పేద్ద ప్లాను గీస్తనన్నది
                తెలంగాణ సమరానికి సాల్ల సై అన్నది
                అది సవాల్ జేస్తనన్నది
                పావురాలు ఏకమయి కబురు తెస్తమన్నయి
                కాపాడుకుంటమన్నయి
                జీవరాశులు ఒక్కటై జండా వట్టుతున్నయి
                జేజేలు వలుకుతున్నయి || కొమ్మలల్లో ||

చరణం 3: నారుమడిలో నీరునైతే వాటా వంచమన్నయి
               వాగు వంకలడుగుచున్నయి
కృష్ణమ్మా గోదారమ్మా కదిలి వస్తనన్నది
               కన్నీరొద్దంటున్నది
               చల్లగాలి వీచి పోరుకు ఊపిరైతానన్నది
               అది పురుడు పోస్తనన్నది
               పండూ వెన్నెల కాసి పల్లె
               నడుగుతున్నది తెలంగాణ కావాలన్నది || కొమ్మలల్లో ||

చరణం 4: అడవిలున్న ఆకులన్ని అలకిడి జేస్తున్నయి
               అలాయ్ భలాయ్ తీసుకున్నయి
               చీమలన్ని జంట వట్టి ర్యాలి తీస్తనన్నయి
               మేం రణం జేస్తనన్నయి
               చెట్టుకొమ్మలన్ని తీసి చాకులౌతమన్నయి
               బందూకులెత్తమన్నయి
               వడ్లపిట్ల ముక్కుతోటి గన్నుజేస్తనన్నది
               తెలంగాణను దెమ్మన్నది ||కొమ్మలల్లో ||

 

పాట - 2
పల్లవి: అస్సైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి
          తెలంగాణ లడాయికి కదులుతున్న యిమ్మతి
          మా ఆకలి కేకలే తెలంగాణ పిలుపులే
          రాష్ట్రమొచ్చెదాక ఇక ఆగవు పొలికేకలే ''అస్సై"

చరణం 1: పోరాటం పొత్తులై ఎరుకండ్ల పలుగులై
               కుట్రదారు ఎత్తులను చిత్తుజేసె శక్తులై
               పొక్కిన వాకిళ్లల్లా దు:ఖాలను చూడరా
               ఎక్కిపడే పల్లెలను ఎదల కట్టి కదలరా 'అస్సై'

చరణం 2: ఎన్నాళ్లీ సహింపులు తెగదెంపుల ఒప్పుకొరకు
               ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ
               ఆంధ్రవలస వాదులార ఎల్లకుంటే పాతరే
               పల్లెపల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే - 'అస్సై'

చరణం 3: ఆధిపత్య అహంకార రియల్ ఎస్టేట్ కబ్జదార్లు
               మనమీద ఆంధ్రోడేంది ఎల్లగొట్టి పలుకుందాం
               అటుఇటుగాని కొజ్జాలు సమైక్యాంధ్ర వాసులు
               రాజకీయ నేతలు నాచులున్న కప్పలు - 'అస్సై'

చరణం 4: పిడికిలెత్త నేర్సినోల్లం బడిసెలిసర ఉరికినోల్లం
               నైజాముల తరిమినోళ్లం నాజీలను వంచినోళ్లం
               అరె పరాయోన్ని తరుమనికి పెద్ద పనికాదురా
               పంపకము జరగకుంటే అంతపని జరుగురా - 'అస్సై'

ప్రాజెక్టు - 2

జ: ఆ) దాశరథి పాట
       మనసే కోవెలగా
       మమతలు మల్లెలుగా
       నిన్నే కొలిచెదరా నన్నెన్నడు
       మరువకురా కృష్ణా...
       కన్నీరొలికే కన్నులతో... ఆ...
       నిన్నే అంతట వెదికాను      (2)
       ప్రతిరేయీ చీకటిగా
       బ్రతుకు బరువుగా గడిపేను - 'మనేసే'
నా పిలుపే వినలేవా
       నా వేదన కనలేవా
       నిన్నే నిన్నే తలచే నన్ను
       నీచెంతకు రమ్మనలేవా - 'మనసే'

నివేదిక:

* దాశరథి తన పాటలో కృష్ణుడిని కొలిచారు
* తన కన్నీళ్లల్లో సైతం ఆయననే వెతికారు
* తన పిలుపులోని వేదనను కనలేవా అని అడిగారు
* కృష్ణుడినే తలచే తనను చెంతకు రమ్మనవా అని అడిగారు.

దాశరథి కవిత

జయభారతీ
    ఓ జనతా!
    నతాంజలి పుటోజ్జ్వల
    దివ్య కవోష్ణ రక్తధారా జలసిక్త
    పాదకమల ద్వయ శోభి మనోజ్ఞ దేహరేఖా
    జయభారతీ!
యుగ యుగమ్ముల పున్నెపుపంట నీవు
    నీ పూజకు తెచ్చినాడ నిదె
    పొంగిన గుండియ నిండు పద్దెముల్
    జండా ఒక్కటె మూడు వన్నెలది
    దేశంబొక్కటే భారతాఖండా సేతు హిమాచలోర్వర
    కవీట్కాండమ్ములోనన్ రవీంద్రుండొక్కండె కవీంద్రుండు
    ఊర్జిత జగుద్యుద్ధాలలో శాంతి కోదండోద్యద్విజయుండు
    గాంధీ ఒక్కడే తల్లీ! మహాభారతీ!

నివేదిక
* దాశరథి తన 'జయభారతి' కవితలో దేశాన్ని కీర్తించాడు.
* దేశాన్ని పున్నెపు పంట యని కొనియాడాడు
* రవీంద్రనాథ్ ఠాగూర్‌ను గొప్ప కవిగా గుర్తించాడు
* శాంతినే కోదండంగా స్వీకరించి జయం చేకూర్చిన వ్యక్తి 'గాంధీ' అని తెలియజేశాడు.    


రచయిత: జి. అంజా గౌడ్
 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం