• facebook
  • whatsapp
  • telegram

గ్రూపు- 1, 2ల సన్నద్ధత... ఏక కాలంలోనా? వేర్వేరుగానా?

అభ్యర్థుల సందేహాలకు నిపుణుల సూచనలు

 

 

త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో  గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండింటికీ కలిపి ఒకేసారి సన్నద్ధం కావాలా? ఒకదాని తర్వాత మరో దానికి ప్రిపరేషన్‌ కొనసాగించాలా?... ఉద్యోగ నియామక పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అధిక శాతం అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్న సందేహమిది. 

 

సన్నద్ధత విషయంలో అభ్యర్థులను కలవరపెడుతున్న ప్రశ్ననే పలువురు పోటీ పరీక్షల నిపుణుల వద్ద ‘ఈనాడు’ ఉంచింది. ఒకేసారి సన్నద్ధం కావొచ్చనీ, కాకపోతే తమ శక్తి సామర్ధ్యాలను సరిగా అంచనా వేసుకోవడం ముఖ్యమనీ బోధన నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అందుకే చాలాచోట్ల గ్రూపు-1, 2కు కలిపే కోచింగ్‌ తరగతులు జరుపుతున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం ఒకదాని తర్వాత మరో దానికి సన్నద్ధమైతేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

 

అయోమయానికి దారితీయొచ్చు

గ్రూపు-1 ప్రిలిమ్స్, గ్రూప్‌-2 సిలబస్‌ దాదాపు ఒకటే. సన్నద్ధత మాత్రం తేడా ఉంటుంది. గ్రూపు-1లో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలతో కూడిన ప్రిలిమినరీతోపాటు వ్యాసరూప ప్రశ్నలతో ప్రధాన పరీక్ష (మెయిన్‌) ఉంటుంది. 

అదే గ్రూపు-2లో మెయిన్‌ ఉండదు. గ్రూపు-1లో 150 మార్కులతో ఒకటే ఆబ్జెక్టివ్‌ పేపర్‌ ఉంటుంది. ఇంకా మెయిన్‌లో ఆంగ్లంతోపాటు మరో ఆరు పేపర్లు రాయాలి. అంటే విస్తృతంగా చదవాలి....రాయడం సాధన చేయాలి. అదే గ్రూపు-2లో ఒక్కో పేపర్‌ 150 మార్కుల చొప్పున నాలుగు పరీక్షలు రాయాలి. అంతవరకు బాగానే ఉన్నా గ్రూపు-1 ప్రిలిమినరీలో కాన్సెఫ్ట్‌ ఆధారంగా, కొంచెం సంక్లిష్టంగా, గందరగోళంలో పడేసేలా ప్రశ్నలు ఇస్తారు.

గ్రూపు-2లో మాత్రం జ్ఞాపకశక్తిని పరీక్షించే...వాస్తవాల ఆధారంగా ప్రశ్నలుంటాయి. ఇక్కడ సిలబస్‌కు పరిమితి ఉంటుంది. అందువల్ల రెండిటికీ ఒకేసారి సన్నద్ధమవ్వడం అయోమయానికి దారితీస్తుంది. విజయావకాశాలను దెబ్బతీయొచ్చు. అందుకే వేర్వేరుగా సన్నద్ధం కావడం మంచిది.

- కృష్ణ ప్రదీప్, ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ

 

ఒత్తిడికి గురికాకుండా..

సిలబస్‌ ఒకటే అయినందున శాస్త్రీయపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా రెండిటికీ సన్నద్ధం కావడానికి అవకాశం ఎక్కువ. అయితే అభ్యర్థి తన శక్తి సామర్థ్యాలను నిజాయితీగా అంచనా వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గ్రూపు-1లో విశ్లేషణ సామర్ధ్యం, విస్తృత అవగాహన, సబ్జెక్టుపై పట్టు, రాత సాధన తప్పనిసరి. గ్రూపు-2 ఆబ్జెక్టివ్‌ విధానం కాబట్టి మెమరీ టెక్నిక్‌లు, సమాచార సేకరణ, పునశ్చరణ, నిరంతరం నమూనా పరీక్షలను రాయడం అవసరం. దీన్ని గమనంలో ఉంచుకొని అయోమయానికి గురికాకుండా...ఒత్తిడికి లోనుకాకుండా సన్నద్ధమవుతామా? అని ఎవరికివారు నిజాయితీగా అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది.

- నూతనకంటి వెంకట్, పోటీ పరీక్షల నిపుణులు

 

అదనంగా కష్టపడితే చాలు

రెండు పరీక్షల పాఠ్య ప్రణాళిక ఒకటే అయినా... గ్రూపు-1లో ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. అదే గ్రూపు-2లో నేరుగా జవాబు ఉండే ప్రశ్నలిస్తారు. కొంచెం అదనంగా కష్టపడితే ఒకేసారి గ్రూపు-1తోపాటు గ్రూపు-2 సన్నద్ధత కూడా పూర్తవుతుంది.

- శ్రీకాంత్‌ విన్నకోట, అనలాగ్‌ ఐఏఎస్‌ అకాడమీ

 

గత అనుభవాలను బట్టి...

సిలబస్‌ ఒకటే అయినందున గ్రూపు-1కు చదివితే గ్రూపు-2 కూడా రాయగలుగుతారు. కాకపోతే గ్రూపు-1 ప్రిలిమినరీ కంటే గ్రూపు-2 పరీక్షలు (అంతా ఆబ్జెక్టివ్‌ విధానం) కష్టం. గ్రూపు-1లో 1: 50 నిష్పత్తి చొప్పున మెయిన్‌ పరీక్షకు అర్హత కల్పిస్తారని అనుకుందాం. తెలంగాణ గ్రూపు-1లో 503 ఖాళీలకు నోటిఫికేషన్‌ రానున్నందున 25,150 మంది మెయిన్‌ పరీక్ష రాయడానికి వీలవుతుంది. అంటే ఇక్కడ ఆ పరీక్షే అంతిమం అవుతుంది. అదే గ్రూపు-2లో మెయిన్‌ పరీక్ష ఉండదు. ఈసారి ఇంట ర్వ్యూలు కూడా తొలగించారు. అంటే ఒకే ఒక పరీక్ష...అదే అంతిమం. ఎన్ని ఖాళీలుంటే అంత మందిని ఎంపిక చేస్తారు. గ్రూపు-1లో నియామక పత్రం చేతిలో పెట్టేవరకూ సందిగ్ధత ఉంటుందని గత అనుభవాలను బట్టి అర్థమవుతోంది. అందుకే రెండు పరీక్షలకూ సన్నద్ధం కావాలని శిక్షణకు వచ్చే అభ్యర్థులకు చెబుతున్నా.   

- దుంపల మల్లేశ్వరిరెడ్డి, లా ఎక్స్‌లెన్స్‌ ఐఏఎస్‌ అకాడమీ.
 

********************************************************

స్టడీమెటీరియల్
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం
8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ
9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు
10. తెలంగాణ రాష్ట్ర విధానాలు
11. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12 .సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు
13 .లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రెండు డిగ్రీలతో రెట్టింపు లాభం!

‣ ఎంత పరిధి? ఏవి ముఖ్యం?

‣ ఆర్థిక.. గణాంక.. వైద్య సేవల్లోకి కేంద్రం ఆహ్వానం!

‣ ఏ సైన్స్‌ ఎంచుకుందాం!

‣ వాయిదాలు వద్దు!

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌